ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలో వివేకవర్ధిని హై స్కూల్ విద్యాసంస్థల అధినేత, టస్మా జిల్లా అధ్యక్షుడు, కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాలెండర్‌ను ఆయన తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైందని తెలిపారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. నూతన సంవత్సరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విద్యారంగంలో మరిన్ని విజయాలు తీసుకురావాలని, ప్రతి పాఠశాల నాణ్యమైన విద్యకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రైమరీ క్యాంపస్ ఇన్‌చార్జి చిర్ర విజయ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ఐక్యతతోనే విద్యాసంస్థల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ బోధనా విధానాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చీకటి బీరయ్య, మహమ్మద్ గౌస్, డెక్క లక్ష్మణ్, సతీష్, ప్రవళిక, హారతి ఠాగూర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అలాగే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గండు మురళి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయ బృందం సభ్యులు హాజరై, నూతన సంవత్సరంలో ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నూతన సంవత్సర శుభాకాంక్షలతో సార్థకంగా కొనసాగింది.
