మొగిలిపేట్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామంలో నేతాజీ యూత్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సర్పంచ్ ఉప సర్పంచ్ నేతాజీ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ మహనీయుడు కి ఘననివాళులు ఆర్పీస్తూ
జాతి గర్వించదగిన గొప్ప దేశభక్తుడు , భారత జతి కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావులు స్వాతంత్ర్యం
అంటే అడిగి తిసుకొనే బిక్ష కాదు
పోరాడి సాధించుకునే హక్కు అని ఆజాద్ హిందు పౌజ్ స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అంటూ చలో ఢిల్లీ జైహింద్ అంటూ నినాదాలతో భరతమాత స్వతంత్ర తెచ్చిన మహానుభావులు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళా రమేష్, ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, వీడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్, బిజెపి మొగిలిపేట గ్రామ అధ్యక్షుడు శివరాత్రి వెంకటేష్ నేతాజీ యూత్ సభ్యులు ఎస్పి రమణ, ఎండి మహబూబ్ ఖాన్, దరిపెల్లి అశోక్, గ్రామ ప్రజలు ఎస్పీ బాపు స్వామి సామ శ్రీనివాస్ నైనే ని రాజేందర్, దూలురి సుధాకర్, చిన్న అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
