స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక

మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )

 

స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

శాశ్వతంగా ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలి

 

మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ వికేసి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలను శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యాను మెరుగుపరచాలని పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలను పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల పక్షాన ప్రభుత్వ కళాశాల పక్షాన ప్రభుత్వ పాఠశాలల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ కళాశాలల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలు పరిష్కరించక పోతే విద్యార్థులను భారీ ఎత్తున ఏకం చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ధర్నాలు రాస్తరోకలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ విద్యార్థి నాయకులు అనిల్ రాజశేఖర్ నిఖిల్ జానీ అఖిల్ అభిషేక్ రాజు తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేయాలి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేయాలి

సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జెడి, ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

 

వరంగల్ దేశాయిపేటలోని చందాకాంతయ్య ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను శనివారం నాడు, కళాశాల విద్య సంయుక్త సంచాలకులు (జేడీ), ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, అధ్యాపక బృందం స్వాగతం పలికారు.

కళాశాల లోని గ్రంథాలయం, ప్రయోగశాలలు, లేడీస్ హాస్టల్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేడీ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు తీసుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

 

CKM Government Degree College.

 

 

సీకేఎం డిగ్రీ కళాశాలలో నెట్, సెట్, పీహెచ్డీ వంటి అత్యున్నత విద్యార్హతలు, బోధన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్సిసి లో విద్యార్థులు శిక్షణ పొందినట్లయితే సాధారణ డిగ్రీతో పాటు మిలిటరీ డిగ్రీ కూడా వస్తుందని, అది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ విభాగాలలో ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవుతారని తెలియజేశారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ముందుకు తగిన విధంగా శ్రమించాలని అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని కళాశాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

సికేఎం కళాశాల అభివృద్ధి కోసం కళాశాల విద్య కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వపరంగా సహాయ సహకారం అందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.

 

CKM Government Degree College.

 

గెస్ట్ అధ్యాపకులు తమ సేవలను ఆటో రెన్యువల్ చేసి ప్రతి నెల కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని, 12 నెలల వేతనం ఇవ్వాలని జేడీ కి వినతిపత్రం అందజేశారు.

అనంతరం జెడి ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఎల్ వి వరప్రసాదరావు, పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ జి శశిధర్ రావు, ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ పి .సతీష్ కుమార్, లైబ్రేరియన్ ఎస్. అనిల్ కుమార్, సి సి ఈ సూపరిండెంట్లు కృష్ణారెడ్డి, ఖుర్షీద్, కళాశాల సూపరిండెంట్ జి.శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాష,బోధన , బోధనేతర సిబ్బంది , విద్యార్థులు, ఎన్సిసి క్యాడేట్స్ తదితరులు పాల్గొన్నారు.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్ జాతీయ ర్యాంకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

తవక్కల్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతీ సంవత్సరం ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. గత విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పలువురు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని ఆయన అన్నారు. మందమర్రిలోని ఫోర్త్ క్లాస్ తన్విశ్రీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్, రామకృష్ణాపూర్ లోని తొమ్మిదవ తరగతి అబూ హురైరా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్, నాల్గవ తరగతి విధిషా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, ఐదవ తరగతి సాయి సృజన్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ లు సాధించారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి అవార్డ్ గ్రహీత అనూప్ కుమార్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం నగదు పురస్కారాలతో విద్యార్థులను సన్మానించారు.విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

గ్రామా ల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి

నర్సంపేట నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించాలని ఎం సిపిఐ( యు)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా , నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.
ఈ మేరకు నర్సంపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి రెండు తప్ప మిగతా హామీలు ఏవి కూడా అమలు కావడం లేదన్నారు.సీజనల్ వ్యాధులు విజ్రింబిస్తున్న క్రమంలో గ్రామాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు .ప్రజాస్వామిక హక్కులపై గత పాలకుల వలె నిర్బంధాలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకుడు కర్నె సాంబయ్య ,జన్ను విజయ,దొమ్మాటి విమల,గొడిశాల లక్ష్మి,సోలంకి భాగ్య,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని నిర్దిష్ట సమయంలో ఇండ్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అల్లనా వలన లాభం ఎవరికి?….

అల్లనా వలన లాభం ఎవరికి?….టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

◆ యాజమాన్యానికి లాభాలు..

◆ అధికారులకు లంచాలు

◆ నాయకులకు మామూళ్లు

◆ ప్రజలకు కాలుష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

 

అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో IDA ద్వారా బుల్లెట్ కర్మాగారం అని చెప్పి పేద రైతుల దగ్గర నుండి ఫుడ్ ప్రాసింగ్ పేరిట సుమారు 150 ఎకరాలు కేటాయించారు కానీ అందులో అల్లనా పశువదశాలను నిర్మించారు, ప్రక్కనే ఉన్న ఆచార్య వినోబా సేకరించిన భూదాన్ భూములను కూడా ఆక్రమించుకొన్నారు,ఈ పరిశ్రమ పర్యవేక్షణ పశుసంవర్ధక శాఖ,కాలుష్య నియంత్రణ మండలి,మరియు APEDA,లు పర్యవేక్షించాలి కానీ ఎక్కడా కూడా సరైన పర్యవేక్షణ జరగడం లేదు,గతంలో ఈ పశువదశాలలో రోజుకు 3000ల వరకు పశువులను వదించేవారు ఇప్పుడు రోజుకు సుమారు 1000 వరకు వదిస్తున్నారు దీని వలన చుట్టు ప్రక్కల ప్రాంతంలో పశువుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఒక పశువును వదించాలంటే పశుసంవర్ధక శాఖ డాక్టర్ పశువులను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది వ్యర్థాలను నిబంధనల ప్రకారం వదలాల్సి ఉంటుంది,ఇప్పుడు అక్కడ కనుగొంటే కేవలం ఇద్దరు మాత్రమే 1000 పశువులను పరిశీలించి దృవీకరిస్తారు ఇది ఎలా సాధ్యం.దీనిపైన పశుసంవర్ధక శాఖ అధికారులను అడగగా ఇప్పటివరకు స్పందన లేదు అంటే అధికారులు కర్మాగార యాజమాన్యంతో లంచాలు తీసుకొని కుమ్ముక్కైనట్లు తెలుస్తున్నది.
కాలుష్యం..వ్యర్థాలను సరిగ్గా పారపోయకుండా కర్మాగారంలో వెలువడిన కాలుష్య జలాలతో వర్షం వచ్చినప్పుడు రాత్రి వేళల్లో వర్షపు నీటిలో వదులుతున్నారు దీని వలన చుట్టు ప్రక్కల గ్రామాలలో భూగర్భజలాలు మరియు ప్రక్కనే ఉన్న నారింజ ప్రాజెక్టు నీరు కలుషితమవుతున్నది పంట పొలాలు పంటలకు పనికి రాకుండా పోతున్నాయి కర్మాగారం నుండి వెలువడే వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు దీనిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ అధికారులది,ఎన్నో సార్లు పిర్యాదు చేసిన అధికారులు కర్మాగార యాజమాన్యంతో కుమ్ముక్కై లంచాలు తీసుకొంటు చర్యలు తీసుకోవడం లేదు,జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గల అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారు,నారింజ జలాలు కలుషిo ఆవుతున్నాయి దీనిపై ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకివాలి కానీ ఎలాంటి చర్యలు కనబడటం లేదు.కర్మాగారం మొత్తం పరిధి విస్తీర్ణం లెక్క గట్టి మున్సిపల్ అధికారులు ట్యాక్స్ విధించాలి కానీ అది కూడా సక్రమంగా జరగడం లేదు ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.ప్రతి కర్మాగార యాజమాన్యం తమకు వచ్చిన లాభాలలో 2% సియస్ఆర్ నిధులు కేటాయించి ప్రజల అభివృద్ధికి కేటాయించాలి కానీ అది ఎక్కడ కనబడటం లేదు.కర్మాగారంలో సుమారు 2000 వరకు కార్మికులు పనిచేస్తున్నారు అందులో 200 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు నిబంధనల ప్రకారం 80% స్థానికులు ఉండాలి స్థానిక భూమి,స్థానిక నీళ్లు,స్థానిక విద్యుత్ వాడుకొంటు వందల కోట్లు సంపాదిస్తు స్థానిక పశు సదంపదను తగ్గించే, కాలుష్యాన్ని వేదజేల్లే, స్థానికులకు ఉపాధి కల్పించని కర్మాగారాలు మనకు అవసరం లేదు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి,లు ఉన్నారు.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం

వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం
జమ్మికుంట నేటిధాత్రి:

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగిణి జమ్మికుంట శాఖ వారు జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆరు నెలల నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు ఈరోజు ఉదయం 7 గంటల నుండి 10 30 నిమిషాల వరకు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమంలో 210 మందికి డ్రాప్స్ వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వికాస్ తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ వచ్చు వీర లింగం ముక్క శివకుమార్ దేవాలయం ప్రధాన చార్యులు లింగరి హరికృష్ణ మాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ ముక్క జితేందర్ గుప్తా ట్రెజరర్ అంతం రాజిరెడ్డి పుల్లూరు ప్రభాకర్ రావు మరియు కమిటీ సభ్యులు మహిళా వికాస్ తరంగణి సభ్యులు 50 మంది పాల్గొన్నారు

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

భూభారతి లోని లోపాలను వెంటనే సవరించాలి

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలం చెందిందని, తక్షణమే పూర్తిస్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకోవాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య)- ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు అన్నారు.ఆ పార్టీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కుసుంబ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలోని లోపాలను తక్షణమే సవరించి పేద ప్రజలకు అండగా నిలవాలని, పెంచిన విద్యుత్ బస్ చార్జీలను తగ్గించాలని అంతేకాకుండా గ్రామాలలో కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తద్వారా పేద బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలను అమలు సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేనియెడల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాఉద్యమాలను నిర్మిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, పేరబోయిన చేరాలు,మేరుగు సుధాకర్, ఐలోని, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు-కె. యూ విద్యార్థి సంఘాలు

నేటిధాత్రి :హన్మకొండ

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటని కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు అన్నారు.

శనివారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్న విద్యార్థి సంఘాల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు డా.సయ్యద్ వలి ఉల ఖాద్రి(ఏ.ఐ.వై.ఫ్)దుర్గం సారయ్య (పి.డి.యస్. యూ) గుగులోతు రాజు నాయక్( గిరిజన శక్తి) మెడ రంజిత్ (టి.జి.వి.పి) మట్టెడ కుమార్ (పరిశోధక నాయకులు) కన్నం సునీల్ (టి.యస్. ప్) దుప్పటి కిషోర్ కడాపాక రాజేందర్ ,బొట్ల మనోహర్ (బి.యస్.ఫ్) హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందాలని మంచి ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం చేసింది దానిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభించడానికి యూనివర్సిటీని సంప్రదిస్తే యూనివర్సిటీ అధికారులు పోలీస్ క్యాంపు ని తీసేసి ఆ క్యాంపు స్థలాన్ని కేటాయించారని

ఈ నిర్ణయాన్ని అన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు స్వాగతించాయని కానీ కొన్ని విద్యార్థి సంఘాలు సొంత రాజకీయ ఎజెండా తో కుట్రలతో దీన్ని అడ్డుకోవాలని చుస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందుతుందని నగరంలో మంచి వాతావరణం లో విద్య అందే అవకాశముంటుందని యూనివర్సిటీ పరిధిలో పెడితే రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉంటుందని కావున వెంటనే స్కూలు ప్రారంభించి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము.

అదే విధంగా కొందరు కావలసికొని కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం స్కూలు నిర్మాణం చేపట్టి స్కూల్ ప్రారంభించాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో పి.డి. యస్. యూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణ సౌరవ్ రాహుల్ వర్ధన్ శివ రెడ్డి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్.

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్ నవీన్ ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ మల్లం నవీన్ ను కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డీ గైడ్ షిప్ ను అందించింది.కాగా
వీరు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి,రిజిస్ట్రార్, ఆర్ట్స్ డీన్ ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును,ఏల్టాయి నుండి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అప్రిసియేషన్ అందుకుని,వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లలో దాదాపు 59 పరిశోధన పత్రాలను, వివిధ జర్నల్ మరియు పుస్తకాలలో దాదాపు 30 వ్యాసాలను ఇప్పటివరకు ఆయన సంపర్పించారు.ఈ సందర్భంగా జరిపిన సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు మెంటారుగా ,సూపర్వైజర్ గా తన యొక్క విద్యార్థులు పరిశోధన గ్రంథం సమర్పించడంలో తగు సలహాలు సూచనలు ఇస్తూ పరిశోధక విద్యార్థుల యొక్క అత్యున్నత డిగ్రీ( పీహెచ్డీ పట్టా) పొందడంలో పారదర్శకంగా, నిజాయితీగా నాణ్యమైన పరిశోధనలు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి, రిజిస్టర్, ఆర్ట్స్ డీన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఉన్నత గౌరవం దక్కడంతో కళాశాల యొక్క కీర్తి మరో మైలురాయి దాటినట్టు అధ్యాపక మిత్రులు సిబ్బంది, విద్యార్థులు సంతోషాన్ని ప్రకటించారు.

పేద ప్రజల వద్ద నుండి అక్రమ వసూలు.

పేద ప్రజల వద్ద నుండి అక్రమ వసూలు

జైపూర్ నేటి ధాత్రి:

మండలంలోని ముదిగుంట గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా అందే పథకాలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినికిడి. గ్రామంలోని తోటి కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.ఎవరైతే పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో వారిని గుర్తించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో వసతుల పట్ల నివేదిక.

*ప్రభుత్వ ఆసుపత్రులు,
వైద్యకళాశాలల్లో వసతుల పట్ల నివేదిక*

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాల, నర్సంపేట ఆసుపత్రులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన డాక్టర్ సంగీత సత్యనారాయణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వైద్య విద్య కళాశాలలకు ఎన్ఎంసి నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కేఎంసి,నర్సంపేట,జనగామ వైద్య కళాశాలల పర్యవేక్షణ కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.శనివారం నర్సంపేట మెడికల్ కళాశాలలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కళాశాల పిన్సిపాల్ ,కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ దాస్, వివిధ విభాగాధిపతులు, అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లతో ఆస్పత్రి వసతుల కల్పనకు కావలసిన వివిధ అంశాలపై కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

 

ముందుగా నర్సంపేట మెడికల్ కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతులపై సమీక్షించారు.

వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అందుకు గురించిన వివరాలను ప్రిన్సిపల్ డాక్టర్ మోహనదాస్ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిఎమ్సి నర్సంపేటలో ఉన్న ఆసుపత్రిలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి కమిషనర్ సందర్శించి అక్కడున్న వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిని సందర్శించి ఓపి విభాగం, ఆరోగ్యశ్రీ, సందర్శించి ఆయా వార్డుల వివరాలు, ఓపి సేవలు, రిఫరల్స్, ఫాలో అప్, ఇతర సేవల గురించి, వైద్యులు సిబ్బంది, తదితర వివరాలను వైద్యాధికారులను కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎన్ఎంసి నిబంధన ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి కూలంకషంగా చర్చించారు.

 

Dr. Sangeetha Satyanarayana

 

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.

కావలసిన పరికరాలు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర వివరాలు కమిషనర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నర్సంపేట వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సాంబశివరావు, టీజీఎంఐడిసి ఈఈ ప్రసాద్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. కిషన్ , వైస్ పిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ శ్రీదేవి , పలు విభాగాల అదిపథులు,బోధన, బోధనేతర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ.

బాధిత కుటుంబాలకు పరామర్శ.

చిట్యాల నేటిధాత్రి:

చిట్యాల మండలంలో వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏ డు నూతల నిశీధర్ రెడ్డి ,నవాబ్ పేట గ్రామానికి చెందిన మహమ్మద్ హకీం గత మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం నవాబ్ పేట గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బిల్ల సత్యనారాయణ రెడ్డి కి ఆక్సిడెంట్ జరగగా వారిని పరామర్శించడం జరిగింది
అదేవిధంగా కైలా పూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది
అదేవిధంగా చిట్యాల మండల కేంద్రానికి చెందిన అల్లం ఐలయ్య గత పది రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు
బిజెపి బూత్ అధ్యక్షుడు పందుల రాకేష్ గారు నానమ్మ పందుల రామక్క వారం రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించినారు,
ఆయన వెంట వరంగల్ పార్లమెంట్ లింగంపల్లి లింగంపల్లి ప్రసాద్ రావు బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు మండల రాఘవరెడ్డి సుద్దాల వెంకటరాజ వీరు అనుప మహేష్ గో పగాని రాజు లక్ష్మణ్ శ్రీ పెళ్లి సతీష్ చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు.

మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దేశిని కోటి మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మన మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధి చేశారు 13 భాషలు స్పష్టంగా మాట్లాడే ఏకైక వ్యక్తి మన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారు అని చెప్పక తప్పదు తన ఆశ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మారపల్లి బిక్షపతి. పిట్టల శ్వేత రమేష్.శ్రీపతి నరేష్. మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ .దేవస్థాన డైరెక్టర్ మర్రి రామిరెడ్డి. మాజీ amc డైరెక్టర్ ఎండి సలీం పాషా. మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న .పిడుగు భాగ్యలక్ష్మి. పూదరి శివ. మైస మహేందర్. ముద్దమల్ల రవి. పంజాల అజయ్. శ్రీ పాల్. కిరణ్. శ్రీను. ప్రవీణ్. రాజు. సురేష్ తదితరులు పాల్గొన్నారు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన సుజిత్ రావు

మెట్ పల్లి జూన్ 28 నేటిదాత్రి

 

 

 

కోరుట్ల నియోజవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు

ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, ఏఎంసి డైరెక్టర్,కోరుట్ల నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందే భవిత రాణి, పాషా,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెన్న మమత,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉప అధ్యక్షురాలు మైస లక్ష్మీ,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు అందే లలిత,మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు చిప్ప సుభద్ర,కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల ఫిషర్మాన్ అధ్యక్షులు రోడ్డ రాజు, ఇబ్రహీంపట్నం మండల సేవాదళ్ అధ్యక్షులు గూడా సొల్లు ,ముత్యం రెడ్డి,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటాల వికాస్,కాంగ్రెస్ నాయకులు వెంకటగిరి,కల్లెడ గంగాధర్ మామిడి ,రాజశేఖర్ రెడ్డి ఇప్పపెల్లి గణేష్,మొగలి రాజేందర్ గోపిడి నరేశ్, మిట్ట పెల్లి మహేష్, మసూల చిన్నయ్య,బైండ్ల శ్రీకాంత్,పిట్టల వెంకటేష్ ,కోరే రాజ్ కుమార్, ముద్దం ప్రశాంత్,మజ్జు,వేల్పుల దాస్,కనుక దినేశ్,రెబ్బాస్ మల్లేష్ రమేష్,దాస్,బద్దం సుధాకర్ రెడ్డి, ఉప్పులుటి రమేశ్,బద్దం ఎల్లా రెడ్డి,పన్నాల జీవన్ రెడ్డి, నల్లపోతురాజు శ్రీకాంత్, జాకీర్,జగన్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

బ్రేకింగ్ న్యూస్

నేటిధాత్రి, హైదరాబాద్.._

కొండా మురళీ పిర్యాదు లేఖ..

హైదరాబాదులోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

హైదరాబాద్ నేటిధాత్రి:

2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు.

నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది.

వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాను. ఎందుకంటే, అట్టడుగువర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని.

వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్నవర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర.

వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఒక దాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేసిన.

కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వరంగల్ లో మాత్రమే సాధ్యం అయింది. అందు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను.

సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా… ఈ ప్రక్రియతో తాను సీటును కోల్పోయానని… అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి…. అందుకు నేనే(కొండా మురళీయే) కారణమని చెబుతూ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది.

అయితే, నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వరంగల్ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నది.

వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా, మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు.

ఇదే బస్వరాజు సారయ్య, మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు.

ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిలుచున్నాము.

ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ, నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము(నేను నా సతీమణి) వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇదీ వరంగల్ లో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన. అది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరి పార్టీ మారినా… పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగింది.

వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు

ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.

వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాక మునుపు… ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడినందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు అంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకు రమ్మని పిలిచినా వచ్చి వెళతారు.
మాతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి.

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను (కొండా మురళీ) నిలుచోవాలని అక్కడి ప్రజల నుంచే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి.

కానీ, ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండా సురేఖ వరంగల్ ఈస్టు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచే రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు.

ఈ నియోజకవర్గంతో నాకు (కొండా మురళికి) చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే.

గతంలో మదుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను.

వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్టు చేసినం. ఆ సమయంలో మా సపోర్టును ఆయన అడిగారు. మేము కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశాము.

అయితే, ఈయన ప్రస్తుతం మా మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోచనీయం.

అయితే, ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

ములుగు సీతక్క

మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే, కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖకు…. మంత్రి సీతక్క కు గ్యాప్ వచ్చిందని, కావాలని కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.

పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే (కొండా సురేఖ, కొండా మురళి దంపతులదే). గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కొనసాగిన విషయంలో అందరికీ తెలిసిందే.

ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో కొండా మురళి, కొండా సురేఖకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలున్నారు. ఇది జగమెరిగిన సత్యం.

ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి మా మద్దతు అడిగారు. మేము నిస్వార్ధంగా ఆయనకు సపోర్టు చేసినం. మా మద్దతుతోనే గెలిచారు.

ఈరోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గుడుపుఠాణి కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే… వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేయిస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు… ఇతర నియోజకవర్గంలోనే నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్ కి నష్టం. ఇది జిల్లాలో అందరికి తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపరు.

ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు. కానీ, ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.

ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఎదురైతే ఎవరిది బాధ్యత?

వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి

నాయిని రాజేందర్ ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ, ఎన్నికల ముందు వచ్చి మా (కొండా దంపతుల) మద్దతు అడిగారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ఎన్నికల కదనరంగంలో తట్టుకోవాలంటే తనకి మా మద్దతు కావాలని ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు.

వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు మా ప్రమేయం లేకుండానే, ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు.

తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టింగులు ఇచ్చుకోవడం ఏంటి?

ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి…. మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకురావడం సహేతుకం కాదు కదా.

జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతో బాగానే ఉంటున్నరు.

స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి మన పార్టీలోకి వచ్చిండు. స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జీ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నడు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నడు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా… నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుస్తున్నది.

పాలకుర్తి యశశ్వినీ రెడ్డి:

ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్టు చేసిన. అన్ని విధాలుగా అండగా నిలిచిన. నన్ను ఇక్కడి నుంచి నిలబడాలని చాలామంది చెప్పినా… నిలబడకుండా వారికే మద్దతు ఇచ్చి గెలిపించినం.

డోర్నకల్: రాంచంద్రనాయక్: ఈ నియోజకవర్గంలో మనకు పెద్దగా పట్టు లేదు. కానీ, ఏజెన్సీ ఏరియా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉన్నది. నేను కూడా అక్కడి వారు ఎవరు వచ్చినా వారి పనులు చేయడం జరుగుతున్నది.

మహబూబాబాద్: ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆయనకు కేవలం 2 వేల ఓట్లు వచ్చాయి. డిలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయిందని… అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టు ఉన్నారు వేం నరేందర్ రెడ్డి.

రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన.

— రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన
• ఎమ్మార్వో
శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ మెరకు నిజాంపేట లో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల సమస్యల పరిశీలన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల సమస్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలోని గాంధీనగర్ వాస్తవ్యులు ఎలిగేటి సంధ్యారాణి మురళి ఆర్టిసి డ్రైవర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి పూజ అనంతరం ఆలయానికి 5,000 రూపాయలతో నక్షత్ర హారతిని ఇతర పూజ సామాగ్రిని ఆలయానికి అందజేశారు పూజ అనంతరం ఆలయ అర్చకులు మురళి సంధ్యారాణి దంపతులకు తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కమిటీ సభ్యులు మూల శ్రీనివాస్ గౌడ్ బండారు శంకర్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మాదాసు మొగిలి పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్ రేవూరి.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్, రేవూరి

భూపాలపల్లి నేటిధాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కింటుకూరు మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో ఈనెల 18వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, వారి సంస్మరణ సభ శనివారం గాజర్ల స్వగ్రామం వెలిశాలలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి లు పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలిద్దరూ పరామర్శ తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి యువకుడిగా ఉన్న రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి, అడవి బాట పట్టి సుమారు 33 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్లో మృతి చెందారు. కాగా, వారి స్వగ్రామం వెలిశాలలో జరుగుతున్న సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో గాజర్ల అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో , పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version