కృష్ణార్జునులు కేటీఆర్, హరీష్ ల స్నేహానికి నిదర్శనం.
ఖమ్మం గుమ్మానికి రవి,చంద్రుడు వద్దిరాజు.
`ఖమ్మం గులాబీ పార్టీకి వద్దిరాజు అరుదైన సైనికుడు.

`కార్యకర్తలను కాపాడుకునే గొప్ప మనసున్న నాయకుడు.
`ఖమ్మం గులాబీ మయం చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు.
`పార్టీ అధికారంలో లేకున్నా ప్రజల కోసం నేనున్నాననే దైర్యం ఇస్తున్నాడు.
`ఖమ్మం లో వరదలోచ్చినప్పుడు ప్రజలను ఆదుకున్న మనసున్న మారాజు.
`వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడి ప్రాణాలు నిలబెట్టిన దేవుడు.
`అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన వారికి నెలల పాటు సర్వం సమాకూర్చిన నాయకుడు.
`వరద సమయంలో రాత్రికి రాత్రి సహాయక కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.
`కరోనా కాలం నుంచి మొన్నటి వరదల దాకా ప్రజలను ఆదుకున్న ఒకేఒక్కడు వద్దిరాజు.
`పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు.
`ఖమ్మం జిల్లాను గులాబీ కంచు కోట చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నాడు.
`ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆరఎస్ కు బలం చేకూర్చుతున్నాడు.
ప్రజలంటే వద్దిరాజుకు ప్రాణం.. వారి యోగ క్షేమలే లక్ష్యం.
బీఆరఎస్ ను అధికారంలోకి తేవడమే తన ముందున్న గమ్యం.
`నిస్వార్థ సేవకు నిదర్శనం వద్దిరాజు రవిచంద్ర.
అభిమానులకు ఆపద్బాంధవుడు వద్దిరాజు.
`ఆపన్నులకు ఆకలి తీర్చే నిండైన మానవతా మూర్తి వద్దిరాజు.
వచ్చే ఎన్నికలలో వద్దిరాజు ఎమ్మెల్యే కావాలన్నది అభిమానుల కోరిక.
కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా జిల్లాను నెంబర్ వన్ చేయాలన్నది అందరి కోరిక.
వద్దిరాజుకు అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు.పార్టీ నాయకుల అభినందనలు.బీఆరఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులు
హైదరాబాద్, నేటిధాత్రి: :
సమాజంలో అందరూ నాయకులు కాలేరు. నాయకులైనందరూ ప్రజా సేవకులు కారు. ప్రజల్లో నుంచి వచ్చి, ప్రజలను ప్రేమించి, ప్రజలకోసం పనిచేసి, ప్రజా సేవే పరమావదిగా సేవలందించేవారు నాయకులైతే ఆ ప్రజలకు ఏంతో మేలు. వారి జీవితాలకు వెలుగు. అలా ప్రజలంటే ప్రాణమిచ్చే నాయకుల్లో వద్దిరాజు రవిచంద్ర ఒకరు. ఆయన ప్రజల కోసం చేసే సేవ అంతా ఇంతా కాదు. తన జీవిత పర్యంతం ప్రజలకు సేవ చేస్తూనే వున్నారు. అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూనే వున్నారు. చిన్న అవసరాల నుంచి మొదలు, పెద్ద అవసరాలను కూడా ప్రజలకు తీర్చుతూ, వైద్య సేవల విషయంలో ఎంతో చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఎంతో మంది జీవితాలు నిలబెట్టారు. వారి జీవితాలను కాపాడారు. అంత గొప్ప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. వ్యాపారంలో వచ్చే లాభాలను సహజంగా ఎవరైనా ఆస్ధులు కూడబెట్టుకుంటారు. కాని వద్దిరాజు రవిచంద్ర తన ఆదాయాన్ని ప్రజలకు పంచుతూ వుంటారు. ప్రజల కోసం ఖర్చు చేస్తుంటారు. ప్రజాభిమానం కూడబెట్టుకుంటారు. ఇదీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గొప్పదనం. గొప్ప గుణం. అందుకే ఆయనను ఆదర్శవాది తోపాటు అజాతశత్రువు అని కొనియాడుతారు. పార్టీలకు అతీతంగా ఆయనను వ్యక్తిగా గౌరవిస్తారు. ఆయనను అభిమానిస్తారు. వద్దిరాజు రవిచంద్రకు ప్రజలంటే ఎంత ప్రాణమో, బిఆరఎస్ అధినేత కేసిఆర్ అంటే అంత దైవసమానం. కేసిఆర్ అంటే కూడా వద్దిరాజుకు ఎంతో గౌరవం. గురుసమానం. దైవ సమానం. అంతగా కేసిఆర్‌ను ఆరాదిస్తుంటారు. ఆయన బిఆరఎస్‌లో చేరిన నాటి నుంచి పార్టీ కోసం ఆయన అహర్నిషలు కషి చేస్తూనే వున్నారు. ఈసారి ఆయన నిర్ధేశి ంచుకున్న లక్ష్యం ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీని అధికారంలోకి తేవడం మళ్లీ కేసిఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడడం, ఖమ్మం జిల్లాను బిఆరఎస్ కంచుకోటగా మార్చడం. ఖమ్మం జిల్లాలో బిఆరఎస్‌ను తిరగులేని శక్తిగా మార్చడం కోసం ఆయన ఎంతో కషి చేస్తున్నారు. రాజకీయంగా బిఆరఎస్‌ను ఎదురులేని శక్తిగా మార్చి, భవిష్యత్తులో బిఆరఎస్ మీద పోటీ చేయాలంటే ఇతర పార్టీలు వెనుకడగు వేసేంత బలంగా మార్చాలన్న కసితో పనిచేస్తున్నారు. ప్రజా సేవ తర్వాతే రాజకీయాలను ప్రాదాన్యతనిచ్చే వద్దిరాజు రవిచంద్ర అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలకు ప్రాణం. ఆయనతో ప్రత్యక్షంగా సేవలు అందుకోని వారు చాల తక్కువగా వుంటారు. అంతలా ఆయన ప్రజలకు సేవ చేశారు. ఆ సేవను ప్రజలు కూడా మర్చిపోలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీని గెలిపించే బాద్యతతోపాటు, తాను కూడా ఎమ్మెల్యేగా నిలిచి, గెలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వ్యక్తిగతంగానే ఎంతో సేవ చేసే వద్దిరాజు రవిచంద్ర ప్రజా ప్రతినిధి అయితే ఎంత సేవ చేస్తారో ఊహించుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని ప్రజలు ఎంతో బలంగా కోరుకుంటున్నారు. సహజంగా ఏ సామాజిక సేవకుడైనా సరే తన ప్రాంతం, తన జిల్లా వరకు మాత్రమే సేవ చేయడం కనిపిస్తుంది.. కాని వద్దిరాజు రవిచంద్ర అంటే అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన చేసినన్ని సామాజిక సేవలు ఎవరూ చేయలేదు. ఆయన పుట్టిపెరిగింది వరంగల్ జిల్లా అయితే, ఆయన వ్యాపార సామ్రాజ్యం ఖమ్మం జిల్లా. అందుకే ఆయన ఏ జిల్లాను విస్మరించలేదు. పుట్టిన జిల్లాకు సేవలందించారు. ఆదరించిన జిల్లాను కడుపులో పెట్టుకున్నారు. ఇలాంటి నాయకుడు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా వుండరేమో అంటే అతిశయోక్తి కాదు. అటు ఉమ్మడి వరంగల్, ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చేసిన ఆద్యాత్మిక సేవలు కూడా అన్నీ ఇన్నీ కావు. రెండు జిల్లాలో కలిసి ఎన్ని దేవాలయాల నిర్మాణాలకు ఆయన సహకరించారో లెక్కేలేదు. అంతగా ఆయన దైవ సేవలో కూడా పాలు పంచుకున్నారు. ఏ ఊరి నుంచి ఎవరు వచ్చి, గుడి కుడుతున్నామంటే చాలు, వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వడం అనేది ఒక్క వద్దిరాజు రవిచంద్రకే చెల్లింది. అంతలా దైవసేవతోపాటు, ఆయన చేసిన వైద్య సేవలు కూడా అనేకం వున్నాయి. లెక్కలేనన్ని సార్లు హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేశారు. ఎంతో మందికి వ్యక్తిగతంగా వైద్య సాయం అందించారు. అలా ఆయనతో సాయం పొందిన వారు ఎంతో మంది వున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా ప్రజలు గుర్తు చేసుకునేది వద్దిరాజు రవిచంద్రనే అంటే అతిశయోక్తికాదు. అంతలా ప్రజలకు చేరువయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. వారికి సేవ చేయడంలోనే వద్దిరాజు తరిస్తున్నాడు. పదవుల కోసం, రాజకీయాల కోసం ఆయన ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అలా అటు ఉద్యమకారులు, ఇటు ప్రజలు, సామాజిక బాధ్యతలు, అన్నీ ఏక కాలంలో నిర్వర్తించిన మనసున్న మారాజు వద్దిరాజు రవిచంద్ర అని ప్రజలు చెబుతుంటారు. నిస్వార్ధ సేవకు నిదర్శనం వద్దిరాజు రవిచంద్ర. ఆపన్నులకు అన్నం పెడుతూ, వారి ఆకలి తీర్చే నిండైన గొప్ప మానవతా మూర్తి వద్దిరాజు రవిచంద్ర. ఆయన చేసిన సేవలల్లో ప్రపంచమంతా చూసిన సేవలు అనేకం వున్నాయి. అందులో గత వర్షాకాలంలో వచ్చిన వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని వ్యక్తిగతంగా ఆదుకున్న ఏకైక నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. అకాల వర్షానికి ఖమ్మం జిల్లా కేంద్రంలోని అనేక కాలనీలు నీల మునిగాయి. రాత్రికి రాత్రే కురిసిన వర్షానికి అనేక కాలనీలు జలమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అప్పటికప్ప్పుడు షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి వసతీ సౌకర్యాలు కల్పించారు. వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాలకు దగ్గరుండి తరలించారు. ఇంతటి ప్రయత్నం ప్రభుత్వంలో వున్న పెద్దలు కూడా చేయలేదు. అంతే కాకుండా వరద నీళ్లు పోయిన తర్వాత ప్రతి కుటుంబానికి నెలకు అవసరమైన సామాగ్రిని ప్రతి ఇంటికి అందించిన ఏకైన నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఇదిలా వుంటే వరదల్లో చిక్కుకొని ఆర్తనాలు పెడుతున్న వారిని అప్పటికప్ప్పుడు జేసిబిలను పంపించి ప్రాణాలతో సురక్షింగా రక్షించారు. ప్రాణ హాని జరకుండా ఆ కుటుంబాలలో వెలుగులు నింపారు. ఇక కరోనా సమయంలో ఖమ్మం జిల్లా ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు వద్దిరాజు రవిచంద్ర చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు అప్ప్పుటి బిఆరఎస్ ప్రభుత్వం చేసిన సాయానికి తోడుగా వద్దిరాజు ఎంతోమందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. వేలాది కుటుంబాలకు బియ్యం, ఇతర సామాగ్రిని సరఫరా చేసి ఖమ్మం ప్రజల చేత దేవుడనిపించుకున్నారు. ఇప్పటికీ ఆయనను ప్రజలు కొలుస్తూ వుంటారు. అంతలా ప్రజలకు సేవ చేసిన వద్దిరాజు రవిచంద్రను ప్రజలు ఎమ్మెల్యే కాలనుకుంటున్నారు. మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిసి ్దతుల్లోనూ ఖమ్మం జిల్లాను బిఆరఎస్ కంచుకోటగా మార్చాలని వద్దిరాజు ఎంతో కషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో అందరికంటే ముందున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను బిఆరఎస్ స్వీప్ చేసేందుకు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఖమ్మం అడ్డా, గులాబీ గడ్డగా మార్చేందుకు ఆయన పడుతున్న శ్రమం అంతా ఇ ంతా కాదు. అలాంటి వద్దిరాజు రవిచంద్ర భవిష్యత్తులో మంచి ఉన్నత స్దానానికి చేరుకోవాలని, ప్రజలకు , పార్టీకి మరింత సేవ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నేడు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టిన రోజు. ఆయనకు అభిమానులు, బంధువులు, శ్రేయోబిలాషులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పార్టీ నాయకులు పెద్దఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. బిఆరఎస్ పార్టీ అదినేత కేసిఆర్ పుట్టిన రోజు జరుపుకుంటున్న వద్దిరాజుకు ఆశీస్సులు అందించారు. వద్దిరాజు రవిచంద్ర ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాయలతో జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, రాజకీయంగా ఉన్నత స్దానాలు పొందాలని నేటిధాత్రి ప్రత్యేకంగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు, అభినందనలు అందిజేస్తోంది.