సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
* ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర సీపీఐ పార్టీది
* చేవెళ్లలో త్వరలో 700 వందల గుడిసెలకు పట్టాలు
* సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ మండల పార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి అధ్యక్షతన సీపీఐ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ ఎన్నికల బరిలో సిపిఐ పార్టీ నుండి 10వ వార్డులో పోటీచేస్తున్న ఎండి.మక్బూల్ ను 17వ వార్డులో పోటీలో ఉన్న సార్ల వెంకటేష్ లను కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే విదంగా నాయకులు శ్రమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ నాయకులకు సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించిందని, ఇండ్లు లేని నిరుపేదల కోసం భూ పోరాటాలు నిర్వహించి చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ వెనకాల 200 ఇండ్ల స్థలాలు ఇప్పించి వారికి పట్టాలు ఇప్పించడం జరిగిందని, అదేవిధంగా భగత్ సింగ్ నగర్, రామన్నగూడలో, మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గేటు దగ్గర భూ పోరాటాలు నిర్వహించి ఎంతోమంది ఇండ్లు లేని నిరాశ్రయులకు ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని 75వ సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల స్థలములో 700 వందల గుడిసెలు వేసి భూ పోరాటం నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో వారికి పట్టాలు వచ్చేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి కె రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం ప్రబు లింగం ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు 10వ వార్డు అభ్యర్థివి ఎండి మక్బుల్ 17వ వార్డు అభ్యర్థి సార్లా వెంకటేష్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, బి కే యం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య, గీత పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ , పాపయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
