`కమిషన్ల మీద కమిషన్లు.. “డిఆర”. “నేటిధాత్రి” మీద చిందులు?
`నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని “డిఆర”. “నేటిధాత్రి”ని హెచ్చరిస్తున్నాడు?

`”డిఆర” కు తెలిసిన పెద్దవాళ్ళు పేదలకు అన్యాయం చెయ్యమని చెప్పారా?
`బాధితుల సొమ్ము కనక దుర్గ చిట్ కంపెనీకి ఇవ్వమని చెప్పారా?
`ఓ నలుగురు బాధితులకు ఎంతో కొంత ఇచ్చి, మిగతా సొమ్ము మింగమని చెప్పారా?
`”డిఆర” కు దైర్యముంటే మీ వెనకాల వున్న పెద్దలేవరో చెప్పండి?
`ఆ పెద్ద నాయకుడినే “నేటిధాత్రి” అడుగుతుంది.
`”డిఆర” వెనకాల ఉన్నది మీరేనా అని నిలదీస్తుంది?
`నాయకుల పేరు చెప్పి తప్పించుకోవాలనుకుంటే “నేటిధాత్రి” విడిచి పెట్టే మీడియా కాదు
`బాధితులందరికీ న్యాయం జరిగేదాకా పోరాటం ఆపదు?
`”నేటిధాత్రి” మీద కేసు వేస్తామంటే బెదిరిపోయే రకం “నేటిధాత్రి” కాదు
`బాధితులకు న్యాయం చెయ్యమంటే “నేటిధాత్రి” అంతు చూస్తానంటే వణికిపోరు?
`బాధితుల పక్షాన కాకుండా, మోసగాళ్ల న్యాయం చేస్తూ గురువింద నీతులా ?
`మున్సిపల్ ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని బాధితుల చేత తిట్టిస్తావా?
`బాధితులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తావా?
`కాంగ్రెస్ పార్టీ నాయకులారా “డిఆర” ఏం చేస్తున్నాడో గమనించండి?
`”నేటిధాత్రి” వార్తను చదవండి?
`బాధితులకు “డిఆర” చేస్తున్న మోసం తెలుసుకోండి?
`బాధితులందరికీ న్యాయం జరగాలని ప్రభుత్వం “జీవో” జారిచేసింది?
`సీఎం. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధితుల కోసం ఆలోచించారు
`అధికారులు మోసగాళ్ళకు అండగా నిలుస్తున్నారు?
`బాధితులు ఇప్పటికే అన్యాయమై పోయారు?
`8 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నారు?
`బాధితులు కడుపు కట్టుకొని చిట్ వేస్తే అన్యాయం చేసారు?
`పేదలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము చిట్ కంపెనీ మింగింది?
`పేదలకు అన్యాయం జరగొద్దని ప్రభుత్వం “జీవో” తెచ్చింది?
`బాధితులకు న్యాయం చేస్తే కమిషన్ రాదు?
`బాధితుల చెక్కులు చింపిండు! దొంగలకు చెక్కులు ఇచ్చిండు!?
`ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అసలు మోసం తెలుస్తుంది?
హైదరాబాద్, నేటిధాత్రి:
మంచి చెబితే ఈసమాజంలో కొంత మంది వనరు. చెడు మాటలే ఎక్కువగా వుంటారు. కాసులకు కక్కుర్తి పడేవారికి మంచి మాటలు అసలే చెవికెక్కవు. కనÅ£దుర్గ చిట్‌పండ్ విషయంలో నేటిధాత్రి బాధితులకు న్యాయం చేయాలని కోరుతోంది. వారిని ఆదుకోవాలని సూచిస్తోంది. కాని డీఆర్ ఏం చేస్తున్నారు. బాధితుల పక్షాన కాదని, చిట్ కంపనీకి మేలు చేసే దారిలో వున్నారు. అది తప్పని నేటిధాత్రి చెబుతోంది. ఎందుకంటే 8 సంవత్సరాలుగా బాధితులు వాళ్లు పెట్టిన సొమ్ముకోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో నమ్మకంతో కనకదుర్గ చిట్ ఫండ్ కంపనీలో చిట్లు వేసుకున్నారు. కంపనీ ఏజెంట్లు చెప్పిన మాటలు విన్నారు. కంపనీపై న మ్మకం పెంచుకున్నారు. కష్టపడి సంపాదించి, రూపాయి, రూపాయి కూడబెట్టుకొని చిట్టిలు కట్టారు. అవసరానికి అక్కరకొస్తాయని ఆశపడ్డారు. కాని ఏం జరిగింది. కంపనీ దివాళా తీసిందని చేతులెత్తేసి చిట్టిలు కట్టిన వారిని శఠగోపం పెట్టాలని చూశారు. బాదితులు లబోదిబోమన్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, చిట్స్ పంకనీ దోచేస్తుంటే కడుపు నిండా తిండి తినలేక, కంటి నిండా నిద్ర రాక 8 సంవత్సరాలుగా ఏడుస్తున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి సర్కారు పుణ్యమా అని వారి ఆశలు తీరే దారి కనిపించింది. చిట్టిలు కట్టిన వారు ఎవరూ తెలంగాణలో మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో వున్న అన్ని చిట్ ఫండ్ కంపనీలకు ఈ జీవో వర్తిస్తుందని, ఏ కంపనీ బాధితులను మోసం చేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధితుల పక్షాన నిలిచారు. ప్రజల సొమ్ము ఎగవేయాలని చూసిన కంపనీలకు హెచ్చరికలు జారీ చేశారు. కనకదుర్గ చిట్ కంపనీ నుంచి బాదితులకు సొమ్ములు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. కాని ఏమైంది? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాదితుల పక్షాన కాకుండా చిట్ కంపనీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాదితులు అనేక మంది నేటిధాత్రిని ఆశ్రయించారు. ప్రభుత్వం పేదల పక్షాన నిలిస్తే అదికారులు మోసగాళ్లతో చేతులు కలుపుతున్నారు. ఆశలు నెరవేరే సమయంలో ఆ ఆశలు అడియాసలయ్యేలా వున్నాయి. మా సొమ్ము మొత్తం ఆవిరయ్యే పరిస్దితులు కనిపిస్తున్నాయని నేటిధాత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దానిపై నేటిధాత్రి దినపత్రిక కథనం రాసింది. బాదితుల పక్షాన నిలిచింది. బాధితులు చెప్పిన విషయాలను చెప్పింది. అంతే డిఆర్‌కు కోపం వచ్చింది. నేటిదాత్రి మీద చిందులేసినట్లు తెలిసింది. నేటిధాత్రి మీద కేసు నమోదు చేస్తానని బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సమాచారం అందింది. అసలు నేటిధాత్రి అడిగిందేమిటి? రిజిస్ట్రార్‌వా..లేక రింగ్ మాస్టర్‌వా? అని ఫ్రశ్నించింది. బాధితులను మోసం చేస్తుంటే నేటిధాత్రి చూస్తూ ఊరుకోవాలా? లేక చాల మంచి పని చేస్తున్నావని శభాష్ అని పొగడాలా? డిఆర్ కమీషన్లకు ఆశపడి బాదితులకు అన్యాయం చేయొద్దని సూచించింది. అది తప్పెలా అవుతుంది? ప్రభుత్వ లక్ష్యానికి గండికొడతావా? ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా వ్యవహారం నడుపుతావా? అని అడగడం తప్పైపోయిందా? ప్రజలకు అండగా వుంటే ఆ డిఆర్‌ను ప్రజలు జేజేలు కొడతారు. ఎందుకంటే 8 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొమ్ములో కనీసం దాచుకున్నదైనా చివరకు చేతికొస్తుందని బాదితులు సంతోషపడతారు? తమకు చెక్కులు అందించినందుకు డిఆర్‌కు ప్రజలే కత్పు్ఞతలు తెలుపుకుంటారు. బతికున్నంత కాలం మొక్కుతారు. వందల మంది కుటుంబాలలో వెలుగులు నిండుతాయి. వాళ్లంతా డిఆర్‌ను దీవిస్తారు. అది కాదనుకొని కాసుక కోసం కక్కుర్తి పడితే తిడతారు? శపిస్తారు? నిందిస్తారు? నిందలు వేస్తారు? వాళ్ల ఉసురు తగిలేంతగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తారు? బాదితుల జేజేలు కావాలా? వారి శాపాలు కావాలా? కమీషన్లు అందితే చాలనుకుంటున్నారా? అని గుర్తు చేసింది. ఇది కూడా డిఆర్‌కు తప్ప్పుగా తోచింది. నాకు పెద్ద పెద్ద వాళ్లు తెలుసు. నేటిదాత్రిని ఏం చేస్తానో చూడండి? అంటూ గాండ్రిస్తున్నాడట? డిఆర్ నిజంగానే మీకు ధైర్యం వుంటే ఆ పెద్ద వాళ్ల పేర్లు చెప్పండి? ఆ పెద్ద వాళ్ల వద్దకే నేటిధాత్రి వెళ్లి ప్రశ్నిస్తుంది. డిఆర్ వెనుక మీరున్నారట? అది నిజమేనా? బాదితులకు అన్యాయం చేయమని మీరే చెప్పారా? అని నిలదీయడానికి నేటిధాత్రికి పెద్ద సమస్య కాదు? అప్ప్పుడు ఆ పెద్దల పేర్లనే బైటపెడతాం? బాదితులకు న్యాయం జరిగేలా చేస్తాం? డిఆర్ ఎవరి పేరు చెబితే వాళ్ల వద్దకు నేటిధాత్రి వెళ్తుంది. పేదలకు అన్యాయం చేయమని ఎలా చెప్పారో నిలదీస్తుంది? డిఆర్ వెనకాల వున్న ఆ పెద్దలు బాధితులకు అన్యాయం చేసి, చిట్ కంపనీని అండగా నిలబడమని ఎలా చెప్పారో కడిగేస్తాం? నాయకుల పేరు చెప్పి నాటకాలాడితే, కేసులు పెట్టి బెదిరిస్తామంటే నేటిధాత్రి అదిరిపోయే మీడియా కాదు? బాదితులందరికీ న్యాయం జరిగేదాకా నేటిధాత్రి పోరాటం ఆగదు. బాధితులకు న్యాయం చేయమంటే నేటిధాత్రి అంతు చూస్తామంటే బెదిరిపోయేవారు ఎవరూ లేరు? ఇలాంటి బెదిరింపులు మీడియాకు కొత్తకాదు. నేటిదాత్రికి అసలే కొత్త కాదు. అలా బెదిరించి, అక్రమాలు చేసిన వారు ఎంతో మంది ఊచలు లెక్కించారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. చేసిన పనికి ఇప్ప్పుడు సిగ్గుపడుతున్నారు. జనం చేత చీకొట్టించుకున్నారు. పైగా ప్రజలకు ఎక్కడా అన్యాయం జరగొద్దన్న సదుద్ధేశ్యంతో 8 సంవత్సరాలుగా గత పాలకులు చేయలేని మంచి పనిని రేవంత్ రెడ్డి సర్కారు చేసింది. బాదితులకు న్యాయం జరగాలని కోరుకుంటోంది. కాని మధ్యలో సైందువుల్లాగా కొంత మంది అదికారులు అడ్డుపడుతుంటే ఆగుతుందా? కురుక్షేత్ర యుద్దం ఆనాడు ఆగిందా? బాధితుల పక్షాన నేటిధాత్రి చేసే అక్షరపోరాటం ఆగుతుందనుకుంటున్నారా? అక్షరాలు నిప్ప్పు కణికలై మండుతాయి. తప్ప్పు చేసిన వారిని నిప్ప్పులతో కడిగేసేలా అక్షరాలు మండుతాయి. బాదితులే కాదు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్కసారి డిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నారో చూడండి. ప్రతిపక్షాలకు మేలు జరిగేలా ఎలా వ్యవహరిస్తున్నారో గమనించండి? 8 ఎనమిది సంవత్సరాలుగా జరగని న్యాయం, బాదితులుకు ఇప్ప్పుడు జరుగుతుంటే డిఆర్ అడ్డుపడుతుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టమౌతుంది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు చెడ్డ పేరు వస్తుంది. అదును చూసి డిఆర్ ఎలాంటి ఎత్తుగడ వేశారో తెలుసుకోండి. బాదితులు కాంగ్రెస్ ఫ్రభుత్వాన్ని నిందించేలా డిఆర్ వ్యవహర శైలిని అర్దం చేసుకోండి. పైగా నా వెనుకు పెద్ద పెద్ద వాళ్లు వున్నారంటూ చూపించేంది కూడా కాంగ్రెస్ నాయకులనే…అంటే కాంగ్రెస్ నాయకుల చేతనే, కాంగ్రెస్ కన్ను పొడవాలని డిఆర్ చూస్తున్నారు. డిఆర్ చిట్ కంపనీకి అనుకూలంగా వుంటే కమీషన్ల మీద కమీషన్లు వస్తాయి. కాని అదే డిఆర్ బాదితుల పక్షాన నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు వస్తాయి? ఇదైనా కాంగ్రెస్ నాయకులు తెలుసుకుంటే ఎంతో మంచిది. లేకుంటే బాధితులు చేసే ప్రచారం మూలంగా కాంగ్రెస్‌కు నష్టం వస్తుంది. 8 సంవత్సరాలు ఏమీ చేయని పార్టీకి సానుభూతి పెరుగుతుంది. మంచి చేయాలకున్న కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతంది. ఇలా కొంత మంది అధికారులు తమ సొంత లాభం కోసం ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తున్నారు. ఈ డిఆర్ బాధితులకు చెందిన చెక్కులు చింపేశారని తెలుస్తోంది. చిట్ కంపనీలు చెప్పిన వారికి చెక్కులు జారీ చేసినట్లు కూడా సమాచారం వుంది. ఇలా బాధితులకు అడుగడుగునా అన్యాయం చేసే డిఆర్ చర్యలపై ప్రభుత్వం దష్టి సారించాలి. జరుగుతున్న అక్రమ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలి. బాధితులకు న్యాయం జరగాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి. బాదితుల కళ్లలో ఆనందం నిండాలి. అందుకోసం నేటిధాత్రి ఎంత దూరమైనా వెళ్తుంది. నేటిధాత్రి మీద పెంచుకోవాల్సింది కోపం కాదు..జరగాల్సింది బాధితులకు న్యాయం. ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే ఆ కథే వేరుగా వుంటుంది. బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది. చిట్ మోసాలు, డిఆర్ సహకారాలు అన్నీ వెలుగులోకి వస్తాయి?