సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి…

సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

* ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర సీపీఐ పార్టీది
* చేవెళ్లలో త్వరలో 700 వందల గుడిసెలకు పట్టాలు
* సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ మండల పార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి అధ్యక్షతన సీపీఐ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ ఎన్నికల బరిలో సిపిఐ పార్టీ నుండి 10వ వార్డులో పోటీచేస్తున్న ఎండి.మక్బూల్ ను 17వ వార్డులో పోటీలో ఉన్న సార్ల వెంకటేష్ లను కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే విదంగా నాయకులు శ్రమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ నాయకులకు సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించిందని, ఇండ్లు లేని నిరుపేదల కోసం భూ పోరాటాలు నిర్వహించి చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ వెనకాల 200 ఇండ్ల స్థలాలు ఇప్పించి వారికి పట్టాలు ఇప్పించడం జరిగిందని, అదేవిధంగా భగత్ సింగ్ నగర్, రామన్నగూడలో, మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గేటు దగ్గర భూ పోరాటాలు నిర్వహించి ఎంతోమంది ఇండ్లు లేని నిరాశ్రయులకు ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని 75వ సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల స్థలములో 700 వందల గుడిసెలు వేసి భూ పోరాటం నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో వారికి పట్టాలు వచ్చేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి కె రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం ప్రబు లింగం ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు 10వ వార్డు అభ్యర్థివి ఎండి మక్బుల్ 17వ వార్డు అభ్యర్థి సార్లా వెంకటేష్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, బి కే యం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య, గీత పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ , పాపయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, ముల్కలపల్లి జాతరలో, జిల్లా కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొగుళ్లపల్లి ఎంపీడీవో పోస్టర్ ఆవిష్కరించారు. మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. జెండర్ స్పెషలిస్ట్ శ్రీమతి అనూష బాలికల రక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రజలతో బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం కింద అవగాహన పంప్లేట్లను పంపిణీ చేశారు. జాతరలో సుమారు 5,000 మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా బలపరిచిన నలుగురు అభ్యర్థులతో పాటు 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపీఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన సందర్భంగా స్థానిక కొమురయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు.. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధికార పార్టీతో పొత్తుపెట్టు కోవడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపల్ అభివృద్దిని కోరి ఉమ్మడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టు కోవడం జరిగిందని స్పష్టం చేశారు. నాలుగు వార్డులలో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థులతో పాటు పొత్తు దర్మాన్ని పాటిస్తు 30 వార్డులలో అధిక కౌన్సిలర్ అభ్యర్ధులను గెలిపించుకొని మున్సివల్ చైర్మన్ వడవిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని రాజ్ కుమార్ తెలిపారు.

సిపిఐ నుండి నామినేషన్ వేసిన కౌన్సిలర్ అభ్యర్థులు వీరే :

భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు 2వ సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.ఈ మున్సిపల్ ఎన్నికలో ఉమ్మడి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పొత్తు కుదిరి సిపిఐకి 5,7,24,28 నాలుగు వార్డులు, సిపిఎంకి 27 ఒక్క వార్డును కేటాయించారు.అందు భాగంగా సిపిఐ నుండి 5వ వార్డులో గంగ సరం శ్రీనివాన్, 7వ వార్డులో నూకల భూలక్ష్మీచంద్రమౌళి, 24 వార్డు వేముల జ్యోతి శ్రీకాంత్,28 వార్డు సౌత్కు ప్రవీణ్ కుమార్ లు శుక్ర వారం నాలుగు వార్డుల్లో నామినేషన్ వేశారు. అట్లాగే 27 వార్డు సీపీఎం నుండి ఎర్రం అనూష సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వీరుపార్టీకోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.గత మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులు సిపిఐ గెలుచుకోగా, ఈ సారీ మున్సిపల్ ఎన్నికల్లో 4 వార్డులు ఖచ్చితంగా సిపిఐ గెలుచుకునే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version