అప్పుడు జర్నలిస్ట్ గా ఇప్పుడు ప్రజా సేవకుడిగా…

అప్పుడు జర్నలిస్ట్ గా ఇప్పుడు ప్రజా సేవకుడిగా

* డబ్బుకు కాదు అభివృద్ధికి ఓటు వెయ్యండి
* భగత్ సింగ్ నగర్, రంగారెడ్డి, సీపీఐ కాలనీలు
అభివృద్ధిలో 20 ఏళ్లు వెనకబడ్డాయి.
* ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చూపిస్తా
* మీ కుటుంబంలో బిడ్డగా ఉంటా పిలిస్తే పలుకుతా
* ప్రజల ముందుకు 17వార్డు అభ్యర్థి జర్నలిస్ట్ ఆనంద్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఒకప్పుడు ఎన్నికలు నిజాయితీగా ప్రజాపక్షపాతంగా, చదువుకున్న విజ్ఞానవంతులు, సామజిక స్పృహ కలిగిన వ్యక్తుల మధ్య జరిగేవని, కాని ఇప్పుడున్న రాజకీయం డబ్బులు ఉన్నవాడికే సొంతం అన్నవిదంగా రాజకీయాలు మారిపోయాయని సీనియర్ జర్నలిస్ట్ 17వ వార్డు బిఆరెస్ అభ్యర్థి కడమంచి ఆనంద్ అన్నారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు డబ్బుకు లిక్కర్ కు లొంగి 5 ఏళ్ళ మీ
పవిత్రమైన ఓటును అమ్ముకోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఒకప్పుడు రాజకీయాలు మంచికి, మమకారానికి అభివృద్ధి
పతానికి మధ్య జరిగేవని కాని ఇప్పుడు డబ్బుకు – అభివృద్ధికి నిజాయతికి మధ్య ఎన్నికలు జరుగుతు న్నాయని అన్నారు. బుధవారం సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి మల్గారి విజయ్ భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు వార్డు ప్రజలతో కలిసి 17వార్డులోని భగత్ సింగ్ నగర్, రంగారెడ్డి, సీపీఐ కాలనీలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఒక్కరోజు మీ ఓటు తీర్పు, ఐదేళ్ల మీ అభివృద్ధికి బాటలు వేస్తానని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్న మీ ఇంటి బిడ్డగా పిలిస్తే పలుకుతానని అన్నారు. తాను జర్నలిస్టుగా 20 ఏళ్ళు సమాజానికి సేవచేసానని, ఇప్పుడు చేవెళ్ల పట్టణ అభివృద్ధిలో భాగస్వామిగా సేవ చేసేందుకు పోటీ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చేది కెసిఆర్ ప్రభుత్వమని తాను గెలిచిన వెంటనే వార్డులల్లో ప్రధాన సమస్యలను పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించమని ఓటర్లను కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని
తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తనకు వార్డు ప్రజల మద్దతు బాగుందని తెలిపారు. ఆయన వెంట బిఆరెస్ నాయకులు వార్డు ప్రజలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version