ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన..

ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నర్సంపేట బ్రాంచ్ ఆఫీస్ ముందు ఎల్ఐసి ఏఓఐ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు,ఏజెంట్లు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపెళ్లి రాంనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి,నరేందర్,చంద్రమౌళి,సదానందం,రవీందర్,నర్సంపేట బ్రాంచి అధ్యక్షులు పొనుగొటీ సుధాకర్ రావు, నర్సంపేట బ్రాంచ్ సెక్రటరీ ఎండి సుభానుద్దీన్, జోనల్ నాయకులు మొద్దు రమేష్,గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాంబరాతి శ్రీనివాస్,కోశాధికారి కందికొండ రవికుమార్, క్లియర్ అధ్యక్షుడు ఆర్ చంద్రమౌళి ప్రచార కార్యదర్శి అల్లి రవి, డివిజన్ నాయకులు బూర రమేష్, చందు,అమృ, రఘుపతి, కుసుంబ బాబూరావు,కడారి వెంకటేశ్వర్ రావు,ఆనంతుల రమేష్ ముఖ్య సలహాదారుడు నాంపల్లి కొమురయ్య తదితర ఏజెంట్లు పాల్గొన్నారు.

4లేబర్ కోడ్స్, జిబి జీ రామ్ జి చట్టం రద్దు చేయాలి…

4లేబర్ కోడ్స్, జిబి జీ రామ్ జి చట్టం రద్దు చేయాలి

విజయవంతం అయిన జాతీయ సమ్మె

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

4 లేబర్ కోడ్స్,జిబిజి రామ్ జి చట్టం, విత్తన చట్టం రద్దు చేయాలని,8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని పిలుపు నిచ్చిన జాతీయ సమ్మె విజయవంతం అయ్యిందని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్,ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ( ఎఐసిసిటియు )జిల్లా కార్యదర్శి కన్నూరి దానియెల్ కోరారు. ఈ సందర్బంగా వారు టేకుమట్ల మండల కేంద్రంలో మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన 4లేబర్ కోడ్స్ రద్దు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జిబిజి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించు కోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ సంపూర్ణ మద్దతు తెలిపారు.కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు మచ్చ రాజయ్య, మారపెల్లి కొమురయ్య, రామ్ కుమారస్వామి, రాం వర్ధన్, తిప్పనవేని యుగేందర్,సముద్రాల సరోత్తమ్, ఎలుకటి జంపయ్య, ఎలుకటి కుమార్, జీడీ ఈశ్వర్, మల్లా రెడ్డి, కనుమల్ల సారయ్య,ఇచ్చాంతుల కృష్ణ, ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు ఐరెడ్డి తిరుమల, సరిత, శాంత, రమ, విజయ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి…

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి

భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాలను రక్షించుకుందాం. యావత్తు కార్మికుల ఐక్యతను చాటుదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ఫిబ్రవరి 12 తేదీ 2026 న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐసిసిటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దనియల్ పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగిస్తూ అమలు చేయాలి.
8 గంటల పని విధానం షరతులు లేకుండా అమలు చేయాలి.
కార్మికులు అంటే బానిసలు కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పని భద్రత ఇవ్వాలి.
అభివృద్ధి అంటే కార్పొరేట్ పెట్టుబడుదారులే కాకుండా కార్మికులందరి అభివృద్ధికి ఉపయోగపడాలి. జిబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి.
జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి.బిజెపి ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధనాలు ఉపసంహరించుకోవాలి. వారు డిమాండ్ చేశారు

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

గుండాల,నేటిధాత్రి:

 

నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా
ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న మాట్లాడుతూ 12 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రజా అనుకూల చట్టాలను లేకపోగా ప్రజలు వివిధ పోరాటాల రూపంలో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడమే గొప్ప విజయంగా చెప్పుకుంటుందన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా బిజెపి ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికుల శ్రమదోపిడిని అరికట్టాలని గుండాలలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నగేష్,మెంతిని నగేష్, తాటి కృష్ణ,చేబోతు రవి, సత్తు, ధనరాజ్,గడ్డం లాలయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతా నరసయ్య చిరంజీవి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి…

తేదీ. 4.2.2026.
ప్రచురణార్థం…

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బుధవారం బొమ్మకల్ గ్రామంలోని సిమెంట్ గోదాముల వద్ద కార్మికులు సమ్మె వాల్ పోస్టర్ ను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించడం జరిగినది. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు జంగము తిరుపతి యాదవ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వాటాల అమ్మకం అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ఇతర రంగాల కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని,
తదితర డిమాండ్లకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో సిమెంట్
హమాలి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిమెంటు గోదాం హమాలి సంగం ఏఐటీయూసీ నాయకులు బాగోతం వీరయ్య, కొమురయ్య, శ్రీనివాస్, ఐలయ్య, రాములు గౌడ్, శ్రీనివాస్ కొమురయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చేది ఎప్పుడు…

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చేది ఎప్పుడు

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణి కార్మిక సమస్యలపై అనేకసార్లు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా పలు మార్లు స్ట్రక్చర్ మీటింగ్ లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కరించడంలో యాజమా న్యం విఫల మైందని, కార్మిక సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కార్మిక సమస్యలపై అనేకసార్లు ఇన్కమ్ టాక్స్, మెడికల్ బోర్డు, సొంతింటి పథకం మారుపేర్ల, డిస్మిస్ కార్మికుల, మైనింగ్ స్టాప్ సమస్యలను పరిష్కరించాలని అనేక అంశాలపై స్ట్రక్చర్ మీటింగ్లలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ అంగీకరించిన ఏ సమస్యను పరిష్కరించలేదని దాటవేసే ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందన్నారు. అట్లాగే ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అనేక అంశాలపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కార్మికుల సొంతింటి పథకం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అట్లాగే పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ తగ్గించాలని, మైనింగ్ స్టాప్ సమస్యలు తోపాటు ఎన్నికల డ్యూటీలో విధులు నిర్వహించిన కార్మికుల ఆన్ డ్యూటీ గా పరిగణించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని,వాటిని పెడచెవిన పెట్టిన యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి రెండో వారంలోపు సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణిలో సమ్మె చేయడం తప్పదని రాజ్ మార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గురిచేపల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి…

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో జాతను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.
సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ కారల్ మార్క్స్ కాలనీలో జిల్లా జాతను సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాలు 302 కిలోమీటర్ల వరకు ఈ జాత తిరుగుతుంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంటులో తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను ఆదరించి జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా చేసి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా ఈ చట్టం తెచ్చి అమలుపరచటం అన్యాయం. దీని ఫలితంగా హైలాండ్ ఫైర్ సిస్టం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కార్మికుల కనీస వేతనాలు పడిపోవడం, 12 గంటల పని విధానం అమలు చేయటం, లేబర్ అధికారులకు అధికారాలు లేకుండా చేయటం, యజమానులకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వటం, కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి.
2005లో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ మార్చి బీబీ రాంజీ చట్టం తెచ్చారు. దీనితో వ్యవసాయ కూలీలకు నష్టం. గతంలో 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇస్తే, రాష్ట్రాలు పది శాతం నిధులు చెల్లించేది, కానీ మారిన చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని చట్టంలో ఉంది. ఇప్పటికే జీఎస్టీ, శేషు ల పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులను వసూలు చేసుకుని పనులన్నీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాలకు ఇవ్వకుండా బలహీన పరుస్తుంది. 40 శాతం నిధులు ఉపాధి హామీకి పెట్టాలంటే రాష్ట్రాలు పెట్టలేని పరిస్థితి దీనితో ఉపాధి హామీ పథకం నిర్విర్యమై నీరు గారి పోతుంది. యధావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈనెల 19 తారీఖున జిల్లా కేంద్రంలో మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.
ఈ జీబు జాతకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు శ్రీకాంత్, నాయకత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బి క్రాంతి, ఎం రాజేందర్, సిహెచ్ రవికుమార్, మహేందర్, కే రవికుమార్, జాడి కిష్టయ్య, పగిడి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version