దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: కార్మిక సంఘాలు

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు

నర్సంపేట, నేటిధాత్రి:

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టం జరిగే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలైన బిఆర్టియు,ఏఐటియుసి, ఐఎఫ్టియు, మాస్ లైన్ ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కమిటీ కార్యదర్శి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సింగరకొండ మాధవ శంకర్ లకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈసందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు,హమలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ.ఏ ఐ టి యు సి సివిల్ సప్లై రాష్ట్ర నాయకులు గుంపెల్లి మునీశ్వర్,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బడా కార్పోరేట్ శక్తులు దోపిడీ చేసుకోవడానికి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని సాకుతో కేంద్ర ప్రభుత్వంతో మికకత్ ఆయ్యి కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని ఆరోపించారు.కార్మిక వర్గం ఒకటై ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరమండ్ల రవి, రాములు, జనార్ధన్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version