హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు…

హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు

 

హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ బుధవారం నాడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

 హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ.. బుధవారం నాడు నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘ఆది శంకరుల అద్వైతం. నేను పరమాత్మను నమ్ముతాను. హిందుత్వం అనేది ఒక ధర్మం. ఇది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఈ పుణ్య భూమిలో పుట్టిన ప్రతిఒక్కరూ హిందువే. నా ధర్మాన్ని గౌరవిస్తూ.. ఇతరులను కించపరచకుండా బతుకుతాను. అలానే అర్చకుల జీతభత్యాల గురించి నేను శాసనమండలిలో మాట్లాడాను’ అని నాగబాబు తెలిపారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణ ఘటనలను నాగబాబు ప్రస్తావించారు. ‘2020 సెప్టెంబర్ 6న అంతర్వేది రథం దగ్ధమైన రోజు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలకు తలొగ్గి కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పింది. 2023లో ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే.. అంతర్వేది కేసును అసలు తాము విచారణ చేయలేదని సీబీఐ వివరించింది. అంటే వైసీపీ నేతలు చేసిన ప్రకటనను అమలు చేయకుండా మోసం చేశారని తేలిపోయింది. మసి పూసి మారేడు కాయ చేయడంలో నిపుణులైన వైసీపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడరు. అవతలి వారి వ్యక్తిగత జీవితాలపై వారికి ఉన్న ఆసక్తి.. హిందూ ఆలయాలపై ఎందుకు ఉంటుంది. రామతీర్ధం రాముడు మనకు దైవం.. డిసెంబర్ 2020లో రాముడు తల నరికినా వైసీపీ ప్రభుత్వంలో చర్యలు లేవు. నామ్ కే వాస్త్‌గా కేసులు పెట్టి.. చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో దోషులను శిక్షించలేదు. మీరు, మీ మంత్రులకు ఇతర వ్యక్తుల సినిమాలపై రివ్యూలు ఇచ్చే శ్రద్ధ రాముడిపై ఎందుకు ఉంటుంది’ అని ఆయన అన్నారు.

‘అయోధ్యలో రామమందిరం కల సాకారం అయితే.. చంద్రబాబు, పవన్ వెళ్లి పాలు పంచుకున్నారు. నేడు హిందువులపై ఎక్కడ లేని ప్రేమ వలక పోస్తున్న ఆ నాయకుడు అయోధ్యపై ఒక్క పోస్టు అయినా పెట్టారా?. వెళ్లలేక పోయినా కనీసం స్పందిస్తూ.. ప్రకటన అయినా విడుదల చేశారా?. పేదల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోవాలని చూస్తారు. అటువంటి కొండపై వసతుల ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇది సామాన్యులకు భగవంతుడిని దూరం చేయడం కాదా?. మాఫియా కోసం పేద ప్రజలను వెంకన్న స్వామికి అందకుండా చేస్తారా?. కూరగాయలు బేరమాడినట్లు సేవల పెంపులో వైసీపీ నేత సుబ్బారెడ్డి బేరం ఆడిన విధానం అందరూ చూశారు. తిరుమలపై నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు.. టీటీడీ కామన్ గుడ్ ఫండ్ ఇచ్చే కంట్రిబ్యూషన్ రూ.2.50 కోట్లు ఉండేది.. రూ.50 కోట్లకు ఒకేసారి పెంచేశావు’ అని నాగబాబు విమర్శించారు.

‘తిరుపతిలోనే కాదు.. ఎక్కడ కొండ కనిపించినా గుండు కొట్టేయడమే మీకు అలవాటు. డిక్లరేషన్ ను గౌరవించడం మన సంప్రదాయం. అయినా బాధ్యత గురించి వైసీపీ నేతలకు చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లే. పవన్ కల్యాణ్ తన సతీమణి, పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అలానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం కంటే నువ్వు గొప్పోడివా.. నీ మంత్రి వచ్చి తిరుమల నీ అమ్మ మొగుడు కట్టాడా అంటాడా..?. అలా తలపొగరుతో మాట్లాడినందుకే 151 మధ్యలో 5 తీసేసి 11 సీట్లే ఇచ్చారు. అయినా నువ్వేమైనా మారావా.. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన మానుకున్న చరిత్ర నీది. సెక్యులర్, రిలీజియస్ ప్లేస్‌లకు తేడా తెలియని వ్యక్తివి నువ్వు. తిరుమల కల్తీ ఉదంతంలో అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ వైసీపీపై నాగబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version