కార్మిక సంఘాల సమ్మె: కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
జహీరాబాద్ నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో కార్మికులు గురువారం అంబేద్కర్ విగ్రహం నుండి సమ్మె చేపట్టారు. హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో భారీ ర్యాలీ నిర్వహించారు. అల్ఫ్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాకుల్, గోవర్ధన్ రెడ్డి, షుగర్ శ్రీనివాస్, అల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయికోటి నర్సింలు అధ్వర్యంలో రాగిజావ పౌష్టికరాన్ని ఉపాధి హామీ కూలీలకు పంపిని చేయడం జరిగింది…సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతు యెండ తీవ్రత పెరుగడంవల్ల తనవంతు సహకారంగా ఎనర్జిటిక్ ఆహారమైన రాగిజావా యొక్క లాబాలు తెలియచేసి ప్రతి గురువారం ఈ యొక్క రాగిజావను నా గ్రామ ప్రజలైన మీకు మీ ఆరోగ్యం కాపాడుకోవడం నా బాధ్యతగా భావించి ఈ యొక్క పౌష్టికాహారమైన రాగిజావను అందచేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని అందరు వినయోగించుకోవాలని ఆయన వారికి తెలియజేసారు…ఈ కార్యక్రమములో గ్రామ వార్డు సభ్యులు సి హెచ్ పాారమ్మ మాణయ్య, చింతలగట్టు ప్రకాష్,శారదమ్మ,,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,,గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య,బీరయ్య,మాణయ్య,రమేష్,బాలప్ప,సిద్ధప్ప,దేశరత్,పత్రిక మిత్రులు చింతలగట్టు నర్సింలు,గ్రామ యువనాయకులు సాయి గౌడ్, సి హెచ్ సంగమేష్,హరి,గ్రామ ప్రజలు హనుమంత్, దేవదాస్, నర్సింలు,కాశీనాథ్,ఉమాకాంత్, అనిల్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయికోటి నర్సింలు అధ్వర్యంలో రాగిజావ పౌష్టికరాన్ని ఉపాధి హామీ కూలీలకు పంపిని చేయడం జరిగింది…సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతు యెండ తీవ్రత పెరుగడంవల్ల తనవంతు సహకారంగా ఎనర్జిటిక్ ఆహారమైన రాగిజావా యొక్క లాబాలు తెలియచేసి ప్రతి గురువారం ఈ యొక్క రాగిజావను నా గ్రామ ప్రజలైన మీకు మీ ఆరోగ్యం కాపాడుకోవడం నా బాధ్యతగా భావించి ఈ యొక్క పౌష్టికాహారమైన రాగిజావను అందచేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని అందరు వినయోగించుకోవాలని ఆయన వారికి తెలియజేసారు…ఈ కార్యక్రమములో గ్రామ వార్డు సభ్యులు సి హెచ్ పాారమ్మ మాణయ్య, చింతలగట్టు ప్రకాష్,శారదమ్మ,,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,,గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య,బీరయ్య,మాణయ్య,రమేష్,బాలప్ప,సిద్ధప్ప,దేశరత్,పత్రిక మిత్రులు చింతలగట్టు నర్సింలు,గ్రామ యువనాయకులు సాయి గౌడ్, సి హెచ్ సంగమేష్,హరి,గ్రామ ప్రజలు హనుమంత్, దేవదాస్, నర్సింలు,కాశీనాథ్,ఉమాకాంత్, అనిల్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు
మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
ఈ నెల 10 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ లతో గురువారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలలో విజయం కోసం పోరాటం చేసినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు,కార్యకర్తలకు,శ్రేణులకు,నాయకులకునా అభినందనలు తెలిపారు.ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఏజెంట్లు నిర్ణిత సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని,ఓట్ల లెక్కింపు వద్ద అభ్యర్థులు,ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు,అభ్యర్థులు పాల్గొన్నారు.
విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని వామ పక్షాల నేతలు అన్నారు. భారతదేశ కార్మిక, రైతాంగ, పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగిన ట్రంపు నాయకత్వాన్ని సమర్థించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ ను నోటిఫై చేసింది. అభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రజా ఆమోదం లేని విధివిధానాలను చట్ట రూపంలో తీసుకురావాలని ఆలోచనతో, అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, జాతీయస్థాయి కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను శామీర్ పేట్ రాజీవ్ రహదారి పై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి, డి.జి నరేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సి.పి.ఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు డి.జి.సాయిలు గౌడ్ మాట్లాడుతూ విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యున్నత భాగం కార్మిక, రైతాంగం, అలాంటి నాయకత్వాలను సంప్రదించకుండా వారితో చర్చలు జరగకుండా విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని వామ పక్షాల నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ దశరథ్, జిల్లా కార్యదర్శి నిమ్మల నరసింహ, జిల్లా అధ్యక్షులు డి.జంగయ్య, గౌరవ అధ్యక్షులు సామల వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రాజిరెడ్డి, సి.పి.ఐ మండల సహాయ కార్యదర్శి సోగ్గాడ రమేష్, సి.పి.ఐ సీనియర్ నాయకులు గొలుసుల మల్లయ్య, మహిళా సమైక్య నాయకురాలు పుట్ట మనెమ్మ , నరసింహ, ఎం.కొండయ్య, జిల్లా సి.ఐ.టి.యు ఎం. కిష్టప్ప, సిపిఎం మండల కన్వీనర్ గోపాల్ , సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎల్లన్న , ఏ.ఐ.టి.యు.సి పారిశ్రామిక కార్మికులు సి.ఐ.టి.యు, పారిశ్రామిక కార్మికులు, పెద్దమ్మ కాలనీ ఇళ్ల పోరాట కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పోలీసులు 26 మంది నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు.
హోమ్ గార్డ్‌లను దూషిస్తే సహించేది లేదు జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి! రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ డిమాండ్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జగ్గారెడ్డి పోలీసు అధికారులపై, ముఖ్యంగా హోమ్ గార్డ్ సిబ్బందిపై ప్రదర్శించిన వైఖరిపై తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ సంఘం నిప్పులు చెరిగింది. విధుల్లో ఉన్న సిబ్బందిని అత్యంత అసభ్యకర పదజాలంతో దూషించడం అమానవీయమని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు.సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు నియంత్రిస్తున్న క్రమంలో జగ్గారెడ్డి అక్కడకు చేరుకుని తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌ను దూరం తోసేస్తూ, ఒక హోమ్ గార్డును ఉద్దేశించి “అమ్మకు అయ్యకు పుట్టి ఉంటే రారా..” అంటూ అత్యంత దారుణమైన పదజాలంతో దూషించారు. “నిన్ను చూస్తా.. పోలింగ్ ఆపేస్తా” అంటూ విధులకు ఆటంకం కలిగిస్తూ జగ్గారెడ్డి చేసిన హెచ్చరికల వీడియోలు సోషల్ మీడియాలో దావాగ్నంలా వ్యాపించాయి.ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం: ఈ ఘటనపై స్పందించిన అశోక్ కుమార్.. “సమాజ భద్రత కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే హోమ్ గార్డులను గౌరవించాల్సింది పోయి, ఇలా బహిరంగంగా బూతులు తిట్టడం రాజకీయ నాయకులకు తగదు. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, మొత్తం హోమ్ గార్డుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి” అని ఆవేదన వ్యక్తం చేశారు.జగ్గారెడ్డి తన ప్రవర్తనకు తక్షణమే హోమ్ గార్డులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోమ్ గార్డ్స్ సంఘాలన్నింటినీ ఏకం చేసి, ప్రభుత్వంపై మరియు జగ్గారెడ్డిపై బలమైన పోరాటం చేస్తామని, ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు సిబ్బందిని కించపరచడం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల: సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది. ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు. కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి. ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
పట్టణంలో కార్మిక వర్గం భారీ ప్రదర్శన
నర్సంపేట,నేటిధాత్రి:
కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలో బిఆర్టియు, ఏఐఎఫ్టియు (న్యూ), ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, టియుసి సంఘాల ఆధ్వర్యంలో* వరంగల్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేష్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపేల్లి మునీశ్వరు,హమాలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేటు బహుళ జాతి యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడులను తీసుకువచ్చారని కనీస వేతనం అమలు చేయాలని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సవరణలు చేయడం సరికాదని రైతాంగం హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విధంగా కార్మికుల కూడా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువల లలిత కార్యదర్శి సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి కందికొండ రాజు, ఆయా సంఘాల నాయకులు రాజు, నాగులు,మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా కోటగుళ్లను సందర్శించిన జిల్లా ఎస్పీ
రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ప్రసిద్ధ కోటగుళ్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీస్సులు పొందారు.మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు బందోబస్తు పై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు,సీఐ కరుణాకర్ రావు,ఎస్సై రేఖ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు._
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండల జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఉపాధి హామీని వెంటనే కొనసాగించాలని. ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని. రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని.2025.వ. విద్యుత్ సవరణ .బిల్లురద్దుకై. ప్రభుత్వ రంగ పరిశ్రమల .పరిరక్షణకై కనీసవేతనాల .పెంపుకై. మతోన్మాద. కార్పోరేట్ రాజకీయాలకు .వ్యతిరేకంగా అమాలి కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని. ప్రధానంగా. ఉపాధి హామీ పథకంలో. దేశవ్యాప్తంగా 12 కోట్లమంది.పనిచేసుకునే. జీవనోపాధి .పొందుతున్నారని. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 వేల మంది ఉపాధి కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.2005లో వామపక్షాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టగా. గ్రామీణ ప్రాంతంలో వలస నివారణకు పట్టెడు అన్నం దొరికే అవకాశం ఉన్న పథకం ఉపాధి హామీ పథకం అని. ఈ పథకంలో .12 కోట్లమంది. పనిచేయగా. ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం నిర్వీవరం. చేయడానికి ఈ పథకానికి 1,50,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండగా కేవలం 85 కోట్ల బడ్జెట్తో కొనసాగించడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతనాలులేక సమయానికి బకాయిలు పెండింగ్ ఉండడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని. సంవత్సరంలో 200 రోజుల పరిధిలో కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని. తెలియజేస్తూ .బిజెపి ప్రభుత్వం .ఈజిఎస్.పథకాన్ని రద్దుచేసి. కార్పొరేట్ శక్తులకు ఉపయోగ పడే విధంగా చట్టాన్ని .తీసుకువచ్చిందని. ఈ సంవత్సరంలో 125. రోజుల పని కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం డొల్లమాటలు చెబుతుందని. ఒక 100. 25 రోజుల. పని కల్పిస్తామని చెబుతుందని. పని కల్పిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని సంవత్సరంలో 100 రోజులు ఆ పని కల్పిస్తే 1.50.000. కోట్ల బడ్జెట్ పెట్టండి. బీజేపీ ప్రభుత్వం మరియు 125 రోజుల పని దినాలను ఎట్లా .కూర్చుతుందో ఆ బిజెపి మాటలు .డొల్లతనం అని .తెలియజేస్తుందని. కేంద్ర ప్రభుత్వము 90 శాతం నిధులు తోటి ఈజీఎస్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది కానీ. బిజెపి ప్రభుత్వం కొత్త చట్టంలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని దుర్మార్గమైన నిర్ణయం చేస్తుందని. ఉపాధి హామీ చట్టాన్ని .నిర్వీరం చేయడానికి తెలుగు రాష్ట్రాల పైన 2900. కోట్ల భారం పడి ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టు ముట్టాడుతున్న. రాష్ట్రాల పైన మరొక భారం పడడం. ఇది తక్షణమే. వి.పి.జి. రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని. తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గుంటి వేణు. మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్. సిపిఐ మండల నాయకులు బచ్చపల్లి శంకర్. రాజేందర్. బాలయ్య. రాములు. మల్లయ్య. శంకర్. ఆనందు. రవి. నరసయ్య. గోవిందు. తదితరులు పాల్గొన్నారు
ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మత్తులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల అంకుసాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోనీ. చంద్రవంక మొదటి కాల్వ నుండి గడ్డం అంజయ్య పొలం వరకు ఉన్న రహదారికి .మొరం పోయడంతోపనులను ప్రారంభించారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడo తోపాటు రైతులకు వ్యవసాయ కార్యకలాపాలకు. వచ్చే పోయే వారికి అసౌకర్యం లేకుండా ఉండడంతోపాటు వర్షాకాలంలో ఎదురయ్యే రహదారి సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని. ఇట్టి కార్యక్రమాన్ని .అంకుసాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులను ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ అచ్చ శ్రీనివాస్ రెడ్డి. ఉప సర్పంచ్ రాజేశం. గ్రామ సెక్రెటరీ సంతోష్. ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి. గ్రామ వార్డు సభ్యులు.సవా వణపల్లిబాలయ్య. కార్యం పరిస.రాములు. తుమ్మల కనకయ్య. రేగులశ్రీనివాస్. రోడ్లమధు. కోడి కనకయ్య. గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
సార్వత్రిక జాతీయ సమ్మెను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పరకాలలో ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమని,అవి అమలైతే కార్మికుల హక్కులు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు నెరవేరకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ ర్యాలీలో ఏఐసీసీటీయూ తో పాటు ఏఐటియుసి అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. కష్టపడి పనిచేసే కార్మికుల జీవితం ఎలా దుర్బరంగా మారుతోందో తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ, వాటిని వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లేదంటే పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. దానికోసమే ఫిట్‌నెస్ పరంగా, ఫామ్ పరంగానూ అదరగొడుతున్నాడు. మరి ఆ మెగా టోర్నీలో రోహిత్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అనే అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్(Rohit Sharma) వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘నా దేశం కోసం ప్రపంచ కప్ నెగ్గాలని కోరుకుంటున్నాను. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ వంటి టోర్నీలు లేవు. అయితే నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు మాత్రం ఎంతో విలువ ఉంది. ప్రస్తుతం ఆ ట్రోఫీ(2027 ODI World Cup) గెలవాలనేదే నా లక్ష్యం. దాన్ని గెలిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని రోహిత్ శర్మ ఓ ఐసీసీ ఈవెంట్‌లో అన్నాడు. మరోవైపు ఇటీవలే బీసీసీఐ(BCCI) ఆటగాళ్లకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ గ్రూప్ ఏ ప్లస్ నుంచి గ్రూప్ బికి మారిన సంగతి తెలిసిందే. గ్రూప్ ఏ ప్లస్ కేటగిరీని తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు గ్రూప్ ఏ, బి, సి కేటగిరీలను మాత్రమే కేటాయించింది. కాగా గ్రూప్ ఏలో శుభ్‌మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే చోటు దక్కించుకున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా గ్రూప్ బికి మారిన విషయం తెలిసిందే.
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజా విడతతో కలిపి మొత్తం నిధులు రూ. 646.36 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ. 3,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి, కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సమర్పించింది. ఇందుకు అనుగుణంగా విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇంకా సుమారు రూ. 2,400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి దేశ వ్యాపిత్త స్వరత్రిక సమ్మె విజయవంతం చేయాలని, *తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లతో నిరసన కార్యక్రమం తెలపడంజరిగింది*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 లేబర్ కోడులను రద్దు చేయాలి.వి బి జి రామ్ ఈ చట్టాన్ని రద్దు చేయాలి.నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలి,విద్యుత్ {సవరణ} బిల్లు – 2025 ను రద్దు చేయాలి.ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్ డి ఐ ని రద్దు చేయాల,ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరించరాదు,కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి.స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి*. ఎం వి యాక్ట్ – 2019 సవరించాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రమాదేవి. సాయి,వేద, కౌసల్య, సుమలత, రజిత,స్వప్న, ఆదిలక్ష్మి,సుమలత,డి సుజాత, జ్యోతి లక్ష్మి, విశాల, సునీత, విజయ, కృష్ణవేణి, సరోజన,నాగరాణి, కోమల తదితరులు పాలుగోన్నారు.
షన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం…. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్… నిజాంపేట మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ,నస్కల్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందించే ఒక గొప్ప ఆర్థిక బహుమతి అందరూ దీనిని సద్వినియోగం చేసుకోగలరని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం గారు మరియు బ్రాంచ్ మేనేజర్ నాగరాజు అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ మురళి గారు అదేవిధంగా ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది
నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందుతుందనే అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం గర్భిణీలకు, పసిపిల్లలకు పాలు, గుడ్లు, పప్పు దినుసులు పౌష్టికాహారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం వేంపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గుడ్లవత్ రాజేందర్ వెంకట్రావుపేట్ సర్పంచ్ కనుమల వెంకటేష్ పోస్ట్ మాన్ సుమతి మల్లాపూర్ మండల బిపిఎంలు ఈ డీఎంసీలు గ్రామపంచాయతీ పాలకవర్గం స్కూల్ టీచర్లు విద్యార్థినిలు అలాగే వివిధ ఆఫీసర్లు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొండిగా అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక లోకం భగ్గుమంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూపాలపల్లి కెఎల్పి 8 ఇంక్లైన్ వద్ద ఐఎన్టియుసి, ఏఐటియూసి, ఏఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు విధులను బహిష్కరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు కొమ్ముకాసేలా 4 కోడ్ లుగా మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. “ఈ చట్టాలు అమలైతే కార్మికులకు పని గంటల గ్యారంటీ ఉండదని, కనీస వేతనాలు అడిగే హక్కు కూడా కోల్పోతామని” వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు .కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలనీ,కార్మికుల సామాజిక భద్రతను కేంద్రం గాలికొదిలేసిందనీ, అన్నారు .రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మెను సక్సెస్ చేశాయనీ, హక్కులను కాపాడుకునే వరకు విశ్రమించమనే నినాదంతో భూపాలపల్లి గని ప్రాంతం మారుమోగింది. ఈ పోరాటంలో కార్మిక నాయకులు చంద్రగిరి శంకర్, సంగం శీను, గుడుగుల శంకర్, పులి కృష్ణ , గాజర్ల హరికృష్ణ, కృష్ణారెడ్డి, ఈగ శీను,లింగయ్య, రాము, భోగి రాజయ్య, వినోద్ వందలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ 86.23 శాతంగా నమోదు
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ కేంద్రాలలో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాలలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10,526 మంది ఓటర్లలో 9,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. రెండు మున్సిపాలిటీలలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సామగ్రిని సంబంధిత వర్ధన్నపేట మునిసిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా ఏర్పాట్ల నడుమ సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఎన్నికల సిబ్బంది, పోలీసు శాఖ, అధికారులు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా అధిక శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.