హన్మకొండ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అవరణలో మెగా హెల్త్ క్యాంప్…

హన్మకొండ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అవరణలో మెగా హెల్త్ క్యాంప్:-

ప్రారంభించిన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి అపర్ణాదేవి:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

శుక్రవారం అదాలత్ కోర్టు ప్రాంగణంలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, అప్పోలో సౌజన్యంతో హన్మకొండ, వరంగల్ బార్ అసోషియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన మెగా హెల్త్ క్యాంపును జిల్లా జడ్జి శ్రీమతి అపర్ణాదేవి ప్రారంభించారు. ఇట్టి సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా వుంటేనే న్యాయవాదులు ప్రజలకు మంచి సేవలందించ గలరని, వివిధ అనారోగ్య కారణాలతో ఇటీవల కొంతమంది అడ్వకేట్లు అకాల మరణం చెందారని ఆవేదన చెందారు. ముఖ్యంగా గుండె పోటుతో మరణాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో ఉచిత ఈసిజీ, టుడీ ఈకో వంటి పరీక్షలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు.

హన్మకొండ బార్ అసోషియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, అప్పోలో సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్స్ సంక్షేమం కోసం బార్ అసోషియేషన్ అంకితభావంతో పని చేస్తున్నదని అన్నారు. ఈ హెల్త్ క్యాంపులో జూనియర్, సీనియర్ అడ్వకేట్లు పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకొన్నారని సంతోషం వెలిబుచ్చారు. మహిళా అడ్వకేట్ల కోసం గైనకాలజీ స్పెషలిస్టులు వచ్చి సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడ్వకేట్స్ బార్ అసోషియేషన్ అధ్యక్షులతో పాటు రెండు బార్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం…

జహీరాబాద్ 14వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఘన విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే ఎంఐఎం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈ ఎన్నికలు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగాయి.

ప్రజల మనసు గెలిచిన పావుశెట్టి సునీల్…

ప్రజల మనసు గెలిచిన పావుశెట్టి సునీల్

ప్రజల నమ్మకమే నా గెలుపు పునాది

పరకాల,నేటిధాత్రి

పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. 173 ఓట్ల మెజారిటీతో ఆయన సాధించిన ఈ విజయం పట్టణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడిగా సునీల్ తన ప్రజాదరణను నిరూపించుకున్నారు.ప్రజల మనసును గెలుచుకుంటూ 173 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించి విజేతగా నిలవడంతో సునీల్ గెలుపుతో వార్డులో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.తాను ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి హామీలు ఇచ్చిన సునీల్‌కు ఓటర్లు విశ్వాసం వ్యక్తం చేశారు.తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు,వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.మొత్తంగా సునీల్ విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచే ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న సునీల్ కు అదే ఆయనకు ఈ ఘన విజయానికి బలమైన పునాది అయింది.స్పష్టమైన మెజారిటీ సునీల్ పై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

ఈ విజయం కేవలం వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు,ప్రజల అభిమానం,విశ్వాసం,ఆశల ప్రతిఫలంగా భావిస్తున్నారు.ఈ సందర్బంగా ఇది నా విజయం కాదు,నావార్డు కుటుంబం విజయం” అని తెలిపారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని, పారదర్శక పాలన అందిస్తానని ప్రతి సమస్యకు సమయపాలనతో పరిష్కారం చూపిస్తానని చెప్పారు.చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే దిశగా సునీల్ సిద్ధమవుతున్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయడం తన ధ్యేయమని సునీల్ స్పష్టం చేశారు.పరకాల రాజకీయాల్లో సునీల్ విజయం కొత్త అధ్యాయానికి నాంది పలికింది.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 7వ వార్డు ప్రజల తీర్పు సునీల్ నాయకత్వానికి బలమైన మద్దతుగా నిలిచిందని చెప్పవచ్చు.

కోటగుళ్ళకు రూ.80 వేలతో నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగు బహుకరణ..

కోటగుళ్ళకు రూ.80 వేలతో నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగు బహుకరణ

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలోప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు ఆలయానికి నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును రూ 80 వేలతో శుక్రవారం బహుకరించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి అర్ధనారీశ్వర తొడుగును బహూకరించిన భాస్కర్ రెడ్డి, స్వర్ణలత దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో నగరంపల్లి మాజీ సర్పంచ్ మాదాడి సత్యలక్ష్మి నారాయణరెడ్డి, బైరెడ్డి మహేందర్ రెడ్డి ,రమాదేవి, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి శైలజ దంపతులు పాల్గొన్నారు.

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం…

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

కాంగ్రెస్ 13,బిఆర్ఎస్ 6,బిజేపీ 3 స్థానాలు

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.మొత్తం 22 వార్డులలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.దీంతో పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది.ఎన్నికల ఫలితాల ప్రకారం 22 స్థానాల్లో 13 సీట్లు దక్కించుకోవడంతో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం లభించింది. మేజిక్ ఫిగర్ 12 కాగా,కాంగ్రెస్ దానికంటే ఒక సీటు ఎక్కువ సాధించింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు కనిపించాయి.బీఆర్‌ఎస్ పార్టీ 6 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.బీజేపీ 3 సీట్లు సాధించి తమ ఉనికిని చాటుకుంది.మున్సిపల్ పాలనలో ఇకపై కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుంది.

గెలిచిన అభ్యర్థులు వీరే

1వ వార్డు వెంకట స్వామి దుబాసి(బిఆర్ఎస్),2వ వార్డుశ్యామల(బిఆర్ఎస్),3వ వార్డు పోరండ్ల మౌనిక(కాంగ్రెస్),4వ వార్డు ఏకు దివ్య(కాంగ్రెస్),5వ వార్డు గొడుగు రజిత (బిఆర్ఎస్),6వ వార్డు రాణి తుమ్మల(బిఆర్ఎస్),7వ వార్డు – సునీల్ కుమార్ పావుశెట్టి(కాంగ్రెస్),8వ వార్డు నల్లెల కుమార్(కాంగ్రెస్),9వ వార్డు బెజ్జంకి పూర్ణాచారి(బిజెపి),10వ వార్డు లావణ్య పసుల (కాంగ్రెస్),11వ వార్డు గుడెల్లి సాధన్ కుమార్(కాంగ్రెస్),12వ వార్డు ఆకుల లావణ్య (బిజెపి),13వ వార్డు మాధవి లత (కాంగ్రెస్),14వ వార్డు పడిదల దీప్తి (బిఆర్ఎస్),15వ వార్డు విజయ్ కుమార్(బిజెపి),16వ వార్డు బండి శ్రీదర్(కాంగ్రెస్),17వ వార్డు బొచ్చు సుభద్ర(కాంగ్రెస్),18వ వార్డు రేగూరి కరుణ,(బిఆర్ఎస్),19వ వార్డు శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్),20వ వార్డు పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్),21వ వార్డు సూదమల్ల రమేష్ (కాంగ్రెస్),22వ వార్డు అల్లే దశరథం(కాంగ్రెస్) లు గెలుపు బాటలో నిలిచారు.

మహాశివరాత్రికి సర్వం సిద్ధం…

మహాశివరాత్రికి సర్వం సిద్ధం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించుటకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.15వ తేదీ ఆది వారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రా భిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అభిషే కాలు పూజలు నిర్వహిస్తా మని రాత్రి 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగో ద్భవ పూజ శివపార్వతుల పంచులోహ విగ్రహాల ఊరే గింపు నిర్వహిస్తున్నట్లు కావు న భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల రని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు

ప్రామిసరీ నోటు అంటే ఏమిటి….

ప్రామిసరీ నోటు అంటే ఏమిటి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఒకప్పుడు మనిషి మాట తర్వాత అంతగా విలువ ఇచ్చేది ప్రామిసరీ నోటుకే బాండు పేపర్ అంటారు. ఒకసారి మనిషి ఇచ్చే మాట కంటే కూడా ఎక్కువ విలువ దానికే ఉంటుంది ఎందుకంటే.? ఎటువంటి పేపరు లేకుండా అపద వచ్చిన వారికి కేవలం నమ్మకంతో డబ్బులు ఇస్తే తిరిగి నమ్మకంగా ఇచ్చేవారు. బాండు పేపర్ రాయించనిదే డబ్బులు ఇవ్వరంటే అవమానకరంగా భావించేవారు.! ఇప్పుడు “నమ్మకం” అనే మాటకు అర్థం లేదు. అందుకే పెద్ద పెద్ద ఒప్పందాలు ఏమైనా చేసుకునేది ఉంటే ప్రామిసరీ నోటు తప్పనిసరిగా వాడతారు. ఆ నోటు ఉంటే ఇంక తము ఇచ్చిన సోమ్ము వేరే వాళ్ళు చచ్చినా ఎగ్గోట్టలేరు అనుకుంటారు కానీ, ఆ ప్రామిసరీ నోట్ రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. (కోర్టు రూల్స్) ఇప్పుడు చెప్పబోయే రూల్స్ పాటిస్తేనే ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుంది. అప్పు ఇచ్చే వాళ్ళు అప్పు తీసుకునే వాళ్ళు ఇద్దరికీ కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లదు. ప్రామిసరీ నోటు తయారు చేసేటప్పుడు ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు కచ్చితంగా అక్కడ ఉండాలి. ప్రామిసరీ నోట్ చెల్లే వ్యవధి మూడు సంవత్సరాలు. నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపై అడ్డంగా సంతకం చేయాలి. ఆ రెవెన్యూ స్టాంప్ ధర మినిమం ఒక రూపాయి ఉండాలి. ప్రామిసరీ నోట్ పై కోటి రూపాయల వరకు అప్పుగా ఇవ్వచ్చు. అలా ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఉంటే న్యాయవాదిని కచ్చితంగా తీసుకెళ్లాలి. నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ వ్యక్తి కి గాని లేదా తను సూచించిన మరో వ్యక్తి కి గాని అప్పు గా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తాను. అనే పాయింట్ లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ తయారు చేయించినా కూడా ఉపయోగం ఉండదు. మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రామిసరీ నోటు రాస్తే ఆ నోట్లు చెల్లదు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బును ఇవ్వకపోతే ఆ ప్రామిసరీ నోట్ తో డబ్బును తిరిగి వసూలు చేయవచ్చు. ఇవి ప్రామిసరీ నోట్ తయారు చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు.

కోహీర్లో హస్తం హవా…

కోహీర్లో హస్తం హవా…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ : సంగారెడ్డి జిల్లా కోహీర్
మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చాటుకుంది. మొత్తం 16 వార్డుల్లో 8 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 5 సీట్లు దక్కించుకోగా, ఎంఐఎం 1 సీటు, ఒక బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 సీటు, గెలుపొందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

గెలుపొందిన అభ్యర్థుల వివరాలు..

1.అనసూయ కాంగ్రెస్

2.సంపత్ కుమార్ బి ఆర్ ఏస్

3.జాజుల శ్రీకాంత్ కాంగ్రెస్.

4.ఎం అశోక్ కాంగ్రెస్

5.రాజేశ్వరి కాంగ్రెస్

6.మొహమ్మద్ అహ్మద్ కాంగ్రెస్

7.అబ్దుల్ హన్నాన్ కాంగ్రెస్

8.మొహమ్మద్ రఫీ ఎంఐఎం

9.ముద్దడి సుగుణ బీజేపీ

10.యాసీన్ బేగం కాంగ్రెస్

11.కలిమ్ బీఆర్ఎస్

12.శిరీష రాణి కాంగ్రెస్

13.ఎం.డి చాంద్ బీఆర్ఎస్

14.సాబెరా బేగం ఇండిపెండెంట్

15 సనా సిద్ధికి బీఆర్ఎస్

16.ముస్కాన్ బీఆర్ఎస్.

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా…

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా

 

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 (S-400) క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి (AoN) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో (FTP) జరిగే ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి క్షిపణలు, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణలు ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ జరిగిన మరో రెండు ఎస్-400 వ్యవస్థలు ఈ ఏడాది జూన్, నవంబర్‌లో భారత్‌కు అందనున్నాయి
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఉపయోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడం, వాయి రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడం తాజా కొనుగోళ్ల ముఖ్య ఉద్దేశంగా డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదేవిధంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద భారత వాయు రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, 400 కిలోమీటర్ల పరిధిలో వైమానిక ముప్పును సమర్ధవంతంగా ఎస్-400 వ్యవస్థ అడ్డుకుంటుందని పేర్కొన్నాయి.పాకిస్థాన్‌తో గత ఏడాది తలెత్తిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ శత్రువుల వెన్నులో చలిపుట్టించింది. 314 కిలోమీటర్ల దూరంలోని పాక్ యుద్ధ విమానాన్ని కుప్పకూల్చింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో ఈ వ్యవస్థను మోహరించడంతో పాక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ యుద్ధ విమానాలను ఆప్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొనుగోలు చేయనున్న 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు శత్రువుల విమానాలు, డ్రోన్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టగలవు.

శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్….

శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్

 

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారాయన.

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.
వైసీపీ హయాంలో పాలకమండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలకమండళ్లు పని చేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు రూ.10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికీ ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలతం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్‌ పేర్కొన్నారు.

గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్..

అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్‌పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని చెప్పుకొచ్చారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ‘నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా…’ అని కవి శేషేంద్ర చెప్పిన కవితను.. మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కల్యాణ్.

ఆన్లైన్ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండండి…

ఆన్లైన్ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కెనరా బ్యాంక్ హద్నూర్ శాఖ అధికారులు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. అపరిచిత ఫోన్ కాల్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటిపి ఇతర వివరాలను తెలుపకూడదని, అజాగ్రత్త, అప్రమత్తత వల్ల నిరాశ్రయులుగా మారవద్దని బ్యాంక్ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా హద్నూర్ గ్రామ సర్పంచ్ మతంశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ టి పి, ఆన్లైన్ లింకులు, ఆకర్షిత చిత్రాల పట్ల అప్రమత్తంగా ఉండి, ఆన్లైన్ దొంగతనాల బారిన పడకూడదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారి ప్రశాంత్, పంచాయతి కార్యదర్శి ధనరాజ్, ఉప సర్పంచ్ రూబీనా షబ్బీర్ ఖాన్, ప్రజలు పాల్గొన్నారు.

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

◆-: మహిళా సర్పంచ్ స్థానంలో వారి కుటుంబ సభ్యుల పెత్తనం ఏంటి

◆-: ఎంపీడీఓ షగుప్త ఇర్ఫాత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ – నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండల్ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తదితర కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా ప్రోటోకాల్ ను పాటించాలని, ప్రోటోకాల్ ను ఉల్లంఘించి పనులు చేపడితే ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని న్యాల్కల్ మండల పరిషత్ అభివృ ద్ధి అధికారిణి షాగుప్త ఇర్ఫాత్ స్పష్టం చేశారు. ఓ ప్రకటన విడుదలaక్రమాలను చేపట్టాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానంలో వారి వారి కుటుంబ సభ్యులు, అధికార, విపక్ష పార్టీ శ్రేణులు, నాయకులు,తదితరులు తాజాగా ఎన్నికైన సర్పంచులకు బదులుగా ఇతరులు.. ప్రోటోకాల్ ను ఉల్లంఘించి ప్రారంభోత్సవాలు చేపడితే ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులపై శాఖా పరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయ తీరాజ్ శాఖాధికారులకు నివేదికలు పంపనట్లు పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రోటోకాల్ ను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల సర్పంచులు తప్పనిసరిగా నియమావళిని అనుసరించాలని ఆదేశించారుa

బండెడు బకాయిలు.. పిడికెడు వసూలు?

`కమీష్ నర్ చోహన్ బదిలీకి కారణం ఆ నోటీస్ ఏనా?

`సివిల్ సప్లై అధికారుల తీరు…మిల్లర్లకు రివాజు?

`కొండలా పేరుకు పోతున్నా అధికారులు పట్టించుకోరు!

`కోడిగుడ్డంత వసూలు చేసి గొప్పలు చెప్పుకుంటారు?

`జీతాలు లక్షల్లో తీసుకుంటారు… కమీషన్లు కోట్లలో వెనకేసుకుంటారు?

`పై స్థాయిలో జరిగే నిర్ణయాలు మిల్లర్లకు లీక్ చేస్తుంటారు?

`పరోక్షంగా మిల్లర్లను కాపాడుతుంటారు?

`మన్నుతిన్న పాముల్లా అమాయకం వాళ్లబోస్తుంటారు?

`తెలంగాణలో బాయిల్డ్, రా రైస్ మిల్లులు మొత్తం 3309!

`12 సంవత్సరాల కాలంలో 800 మంది మిల్లర్లపై కేసులు నమోదు?

`కేసుల్లో వున్న కిరి కిరి విచిత్రం?

`అధికారులు చెప్పినట్టు అవినీతికి పాల్పడితే కేసులుండవు?

`నిజాయితీ గా ఉంటామనే మిలర్లపై కేసులు నమోదు?

`తిమింగాలాలటువంటి బకాయి మిల్లర్లపై కేసులు తక్కువ?

`చిన్న చిన్న బకాయి మిల్లర్లపై కేసులు ఎక్కువ?

`అధికారులకు సహకరించని వారిపైనే అధికంగా కేసులు నమోదు?

`అవినీతి అధికారులపై మిల్లర్లు వేసిన కేసులపై చర్యలుండవు?

……………….

`2022-2023 సంవత్సరంలో పెద్ద ఎత్తున బకాయి పడిన మిల్లర్లు 314 మంది

`కమీషనర్ చౌహన్ తయారు చేసిన రిపోర్ట్ లో స్పష్టంగా చర్యలకు ఆదేశాలు?

`పర్యవ సానం కమీషనర్ చౌహన్ బదిలీ?

`గతంలోనూ ఇదే జరిగింది..ఇద్దరు కమీషనర్ల కు స్థాన చలనం జరిగింది.

`314 మంది మిల్లర్లు 540000 మెట్రిక్ టన్నుల ప్యాడి మాయం చేసినట్టు చౌహన్ నివేదికలో తెలిపారు.

`వారిపై 25% పెనాల్టీతో రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

`బకాయిలు చెల్లిస్తేనే వడ్లు ఇవ్వాలని సూచించారు?

`నివేదిక తయారుకు కమీషనర్ చౌహన్ కు బహుమానం స్థాన చలనం!

హైదరాబాద్, నేటిధాత్రి: 

 సివిల్ సప్లయ్ శాఖను గాడిలో పెట్టలేరా? పెట్టే అవకాశంలేదా? ఆ శాఖను గాడిలో పెట్టడం పాలకుల వల్ల కావడం లేదా? గత పదేళ్లు అంతే, ఇప్ప్పుడూ అంతేనా? సివిల్ సప్లై శాఖ ఏమైనా తేనె తుట్టెనా? కదిలిస్తే, పాలకులకు ఏమైనా ఇబ్బందా? రైస్ మిల్లర్లు, అదికారుల కలిసి ఆడుతున్న నాటకాలు పాలకులకు తెలియదా? ముఖ్యంగా ఆ శాఖ మంత్రులకు తెలియదా? సివిల్ సప్లై శాఖ అంటే అంత ఉదాసీనత ఎందుకు? రైతులను మోస్తున్నారు? ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు? అయినా పాలకులకు కనిపించడం లేదా? జరుగుతున్న వ్యవహారం చూస్తూ వదిలేస్తున్నారా? ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న uకాయిలు కనిపించడం లేదా? కొండలా పెరుగుతున్నా వసూలు చేయడం ఇష్టం లేదా? ప్రభుత్వానికి జోక్యం చేసుకునే సమయం లేదా? అదికారులు పాలకులను తప్ప్పుదారి పట్టిస్తున్నారా? ఇంతకూ ఏం సివిల్ సప్లైశాఖలో ఏం జరుగుతోంది? ఆరా తీసేవారే లేరా? ఆ శాఖ మీద దష్టిపెట్టిన కమీషనర్లకు ఎందుకు స్ధాన చలనాలు జరగుతున్నాయి. అసలు ఆ శాఖలో వున్న లోతులు తెలుసుకునే లోపే కమీషనర్లను ఎందుకు మార్చుతున్నారు. తాజాగా కమీషనర్ చౌహన్‌ను కూడా ఇదే పరిస్దితుల్లో మార్చారా? ఒకప్ప్పుడు సివిల్ సప్లై శాఖ అంటే ఉద్యోగులకు అంత క్రేజ్ లేదు. పాలకులు అంత దష్టిపెట్టాల్సిన పని లేదు. కాని ఇప్ప్పుడు రెవిన్యూ శాఖను మంచి పోయిన సివిల్ సప్లై గురించి పాలకులు కావాలనే పట్టించుకోవడం లేదా? గతంలో లాగానే అందులో ఏమీ లేదనుకుంటున్నారా? సివిల్ సప్లై మీద లోతుగా అద్యయనం చేయాలన్న ఆలోచన కూడా పాలకులులేదా? ఎందుకంటే గత పదేళ్ల కాలం నుంచి సివిల్ సప్లైశాఖలో బకాయిలు కొండలా పేరుతుకుపోతున్నాయి. సుమారు 25 వేల కోట్ల రూపాయల వరకు బకాయిలున్నట్లు తెలుస్తోంది. ఆ బకాయిలు వసూలు చేస్తే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్‌లోకి వెళ్తుంది. అయినా పాలకులు ఆ దిశగా దష్టిపెట్టడం లేదు? కారణం తెలియడం లేదు? తెలంగాణ వాప్తంగా సుమారు 3వేలకు పైగా రైస్ మిల్లులున్నాయి. అందులో మెజార్టీ రైస్ మిల్లులు పారాబాయిల్డ్ మిల్లులున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పాతుకపోయిన ఆ మిల్లర్లదే హవా. తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన తర్వాత పంటలు విపరీతంగా దిగుబడులు రావడంలో అనేక మిల్లుల ఏర్పాటు జరిగింది. సంవత్సం మొత్తం పని వుండేంత వరి పండుతోంది. అలా అటు ఫ్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూరుతుంది. కాని అది ఖజానాకు చేరడం లేదు. కేవలం మిల్లర్లు, అధికారుల జేబుల్లోకి చేరుతోంది. ఇదంతా బహిరంగ రహస్యమే? అయినా ఎటు వంటి చర్యలు వుండవు. అసలు ఆ దిశగా పాలకుల ఆలోచనలే వుండవు. పంటలు మార్కెట్‌కు రాగానే ప్రభుత్వం రైతులకు సొమ్ము చెల్లిస్తుంది. అక్కడ ఎలాంటి జాప్యం జరగదు. వడ్లు తీసుకునే మిల్లర్లు అందుకు సమానమైన గ్యారెంటీలు చెల్లించాలి. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇదే విధనం అమలు జరుగుతోంది. కాని ఒక్క తెలంగాణ మాత్రం ఈ పద్దతి తూతూమంత్రంగా జరుగుతోంది. కుక్క తోకను ఆడించాలి గాని, తోక కుక్కను ఆడిస్తే వింతగా వుంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుందా? అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు విచిత్రంగా వుంటుంది. మిల్లర్ల వ్యవహారం అంత కన్నా చిత్రంగా వుంటుంది. గత కమీషనర్ చౌహాన్ తెల్చిన కొన్ని లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 341 మంది మిల్లర్లు సుమారు 6వేల కోట్లకు పైగా బకాయిలు వున్నట్లు తేలింది. వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ కమీషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వారిపై చర్యలు తీసుకోవాలనేదానిపై జీవో కూడా జారీ చేశారు. కాని ఏం జరిగింది? మిల్లర్లు బాగానే వున్నారు? కమీషనర్ చౌహాన్ మాత్రం స్దాన చలనం జరిగి వెళ్లిపోయారు? అంటే మిల్లర్ల లాబీయింగ్ ఎంత పవర్ పుల్‌గా వుంటుందో ఈ ఒక్క సంఘటనతో చెప్పొచ్చు. అంటే మిల్లర్ల వ్యవస్ధ ప్రభుత్వాన్ని కూడా శాసించే స్దాయికి చేరుకున్నదా? అందుకు బాధ్యులెవరు? మిల్లర్లు ప్రభుత్వాన్ని బెదించేంత స్ధాయికి చేరుకోవడానికి కారకులెవరు? పాలకులా? లేక అధికారులా? అనేది కూడా తేలాల్సి వుంది. ఇక అదికారుల మరో విచిత్ర వైఖరి విడ్డూరంగా వుంటుంది. తెలంగాణలో చిన్నా చితకా బకాయిలు వున్న ఓ 800లకు పైగా మిల్లర్ల మీద కేసులు నమోదు చేశారు. నిజానికి వాళ్లంతా డిఫాల్టర్లు కాదు. కాని వారిని అదికారులే డిఫాల్లర్లుగా మార్చుతుంటారు? కొంత మంది అదికారుల చేష్టల మూలంగా న్యాయంగా, ధర్మంగా పనిచేసే మిల్లర్లు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారనే వార్త నిజంగానే విచిత్రంగా వుంటుంది. అవునా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కాని ఇది ముమ్మూటికీ నిజమని అలా కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లే అంటున్నారు. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడమని చెప్పడమే వాళ్లు చేసుకున్న పాపమైంది? తాము అడినంత ఇవ్వండి? మేం కేటాయించిన వడ్లు తీసుకోండి? వాటిని ఏం చేసుకున్నా ఫరవాలేదు? మాకు ఇవ్వాల్సింది ఇస్తే చాలు? అని కొంత మంది అధికారులు మిల్లర్ల మీద ఒత్తిడి తేవడం జరుతుందట! తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండాచూసుకుంటామని కూడా మాట ఇస్తారట? కాని అలా చేయడం ఎప్పటికైనా ముప్పే అన్న ఆలోచనతో కొంత మంది మిల్లర్లు ముందకు రారు. దాంతో వారిపై వెంటనే విలిలెన్స్ ఎంకౌరీలు జరుతుంటాయి. వారిపై కేసులు నమోదు చేయబడుతుంటాయి. నిజాయితీగా వ్యహరించినందుకు అలా కేసులు పాలైన చిన్న చిన్న మిల్లర్లు 800 మంది వరకు వున్నారంటే పరిస్ధితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. అదే పెద్ద పెద్ద మిల్లర్లు, యూనియన్ పేరుతో పెత్తనం చేసే మిల్లర్లు అ ంతా కలిసి సుమారు 341 మంది వుంటారు. వారంతా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి uకాయిలు పెడ్డట్లు మాజీ క మీషనర్ చౌహాన్ తేల్చారు. కాని ఆయన రిపోర్టు బుట్ట దాఖలైంది. ఈ 341 మంది సుమారు 15లక్షల టన్నుల బియ్యం ప్రభుత్వానికి బాకీ పడ్డారు. దాని విలువ సుమారు 6 వేల కోట్ల దాక వుండొచ్చని ఓ అంచనా? ఇంత పెద్ద మొత్తంలో వున్న బకాయి దారులను అధికారులు ముట్టుకోరు. ఎందుకంటే పెద్ద పెద్ద మిల్లర్లు పెద్దన లంచాలు ఇవ్వగలరు. అది లక్షలే కాదు, కోట్ల దాకా వుంటుంది. అందువల్ల ఆ మిల్లర్ల జోలికి ఎవరూ వెళ్లరు. ఇలా పెద్దఎత్తున బకాయిలు వున్న మిల్లర్లకు వచ్చే పంటకు వడ్లు కేటాయించొద్దని కూడా చౌీVAన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను అధికారుల బుట్ట దాఖలు చేశారు. మళ్లీ మళ్లీ వారికే వడ్లు కేటాయిస్తూపోతున్నారు. ఆ శాఖకు చెందిన ఉన్నతాదికారి మాటకు, ఆయన ఆదేశాలకు లెక్కలేదంటే ఇక ఈ విషయం ఫ్రభుత్వం దాకా వెళ్తు వెళ్తుంది. గత ప్రభుత్వంలో ఇదే జరిగింది. అప్ప్పుడు కూడా సరిగ్గా మిల్లర్ల రాజకీయం మూలంగా అకున్ సబర్వాల్, సివి. ఆనంద్‌లు కూడా సివిల్ సప్లై శాఖను వదులుకోవాల్సి వచ్చింది. ఎంతో చిత్తశుద్దితో ఆ శాఖను గాడిలో పెట్టాలని ఆ సమయంలో ఇద్దరు అధికారులు ఎంతో కషి చేశారు. ప్రభుత్వానికి బకాయిలు వసూలు చేయించేందుకు కసరత్తు చేశారు. మార్గాలు వేశారు. కాని ఆఖరుకు రాజకీయం పని చేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా ఆనాడు మిల్లర్ల మాట విన్నారు. కమీషనర్ల నివేదికను ఆనాడు పట్టించుకోలేదు. ఇప్ప్పుడూ పట్టించుకోవడ ంలేదు. ఆనాడు ఇద్దరు ఉన్నతాధికారులు, ఇప్ప్పుడు చౌహాన్‌లో ట్రాన్స్‌ఫర్లు అయ్యారు. ఇక ఇప్ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం ఇస్తోంది. ఎక్కడా ఆ పధకానికి ఇబ్బంది ఎదురౌతుందో అని ప్రభుత్వం మిల్లర్లకు భయపడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల మీద బకాయిల కత్తి వేళాడదీస్తే, మొదటికే మోసం వస్తుందన్న భయం ఎందుకు ఎదురౌతోంది? బకాయిలు చెల్లించకున్నా ఫరవాలేదు. వడ్లు ఇస్తాం బియ్యం ఇవ్వమంటే మిల్లర్లు సగం తింటున్నారు. అందులో సగం అధికారులకు పంచుతున్నారు. అరకొర బియ్యం ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇలా సివిల్ సప్లై అధికారుల అవినీతి తీరుతో మిల్లర్లు బలవంతులౌతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలకు ఎగనామం పెడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకోకపోతే మిల్లర్ల బకాయిలు గట్టలు,కొండలను మించిపోతాయేమో!!

సర్వే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయి?

· గతంలో మిశ్రమ ఫలితాలిచ్చిన సర్వేలు

· వార్డు స్థాయిలో ఓటర్ల మనోగతం తెలుసుకోవడం కష్టం

· సర్వేలు సాధారణంగా రాష్ట్రవ్యాప్త ట్రెండ్‌నే సూచిస్తాయి

· మహిళా ఓటింగ్ పెరగడం కాంగ్రెస్‌కు అనుకూలం కావచ్చు

· ఉచితబస్సు, మహిళలను కోటీశ్వరులను చేసే పథకాలు పనిచేసే అవకాశం

· గెలుపు శాతం పెరగకపోతే వచ్చే రేవంత్ జాగ్రత్త పడక తప్పదు

· బీఆరఎస్ రైజింగ్ ఎంతవరకు సాధ్యమో తేల్చనున్న ఫలితాలు

· గత ఎన్నికల్లో 90శాతం బీఆరఎస్ కైవసం

· స్థానిక ఫలితాలు సాధారణంగా అధికార పార్టీకే అనుకూలం

· బీజేపీకి వచ్చేదీ, పోయేదీ ఏమీ లేదు

· అనుకున్న విజయం సాధిస్తే రేవంత్‌కు ఢోకా వుండదు

హైదరాబాద్, నేటిధాత్రి: 

అధికశాతం పోలింగ్ నమోదైనప్పుడు ప్రజల్లో ప్రజాస్వామిక చైతన్యం అత్యధికంగా వున్నట్లు అ ర్థం. ఇదే సమయంలో అధికారంలో వున్న పార్టీ పట్ల వ్యతిరేకత కూడా అధిక పోలింగ్ శాతం నమోదుకు కారణమనేది సాధారణ అంచనా. అంటే తక్కువశాతం ఓట్లు పోలయ్యాయంటే అధికారంలో వున్న ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతప్తి వ్యక్తమవుతున్నట్టు పరిగణించడం సర్వసాధా రణం. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజమవుతుందనుకోవడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో అత్యధికశాతం ఓట్లు పోలయినప్పుడు, అధికార పార్టీ థంపింగ్ మెజారిటీతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన సంఘటనలు మనదేశంలో చాలా సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఫిబ్రవరి 11న తెలంగాణలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 73.01% ఓటింగ్ నమోదైంది. మొత్తం మహిళా ఓటర్లలో 73.39%, పురుష ఓటర్లు 72.63% తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ 70.26% నమోదు కాగా, వీరిలో సుమారు 69.94% మహిళా ఓటర్లు, 70.26% పురుష ఓటర్లు. పోలింగ్‌శాతం పరంగా పరిశీలిస్తే గత ఎన్నికలకంటే ఈసారి సుమారు మూడుశాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక మహిళల ఓటింగ్‌ను పరిశీలిస్తే 3.45% పెరగడం ఇక్కడ కీలకం. అదేవిధంగా పురుష ఓటర్లు కూడా 2.89% అధికంగా గతంతో పోలిస్తే ఓటింగ్‌లో పాý£్గన్నారు. మొత్తంమీద పరిశీలిస్తే ఓటింగ్ పరంగా ప్రజల్లో ప్రజాస్వామ్య చైతన్యం పెరుగుతున్నదనేది సుస్పష్టం! ఇదొక సానుకూల పరిణామం. 

ఎన్నికలు జరిగిన వెంటనే పోల్‌సర్వేలు ప్రకటించడం పరిపాటి. ఎవరి అంచనాలు వారివి. ఎవరు అనుసరించే విధానం వారిది! కొన్ని సందర్భాల్లో సర్వేలన్నీ ముక్త కంఠంతో చెప్పిన అంచనాలు తారుమారైన సందర్భాలు చాలానే వున్నాయి. అందువల్ల సర్వే ఫలితాలను కేవలం ఒక “హెచ్చరిక”గా పరిగణించడం సముచితం. సర్వేలు అనుకూలంగా వచ్చిన పార్టీలు ఆనందం వ్యక్తం చేయడం, ప్రతికూలంగా వచ్చిన పార్టీలు వాటిని తప్పుల తడకలుగా కొట్టిపారేయడం సహజమే.ఉదాహరణకు 2021లో వరంగల్, ఖమ్మం జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన మినీ ఎన్నికల్లో అప్పటి అధికార టీఆరఎస్ (బీఆరఎస్)దే ఆధిపత్యమని చెప్పిన అంచనా నిజమైంది. 2020లో 120 మున్సిపాలిటీల్లో టీఆరఎస్ హవా నడుస్తుందని పేర్కొన్న సర్వే అంచనా ప్రకారం109 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. ఆవిధంగా ఈ రెండు సందర్భాల్లో సర్వే అంచనాలునిజమయ్యాయి. అదే 2020 జీహెచఎంసీ ఎన్నికల్లో వీటి అంచనాలు తల్లక్రిందులు కావడం గమ నార్హం. టీఆరఎస్‌కు తిరుగులేదని ఇవి అంచనా వేయగా, అప్పటివరకు 4సీట్లు మాత్రమే వున్న బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో గెలుపొందడం, బీఆరఎస్ 99 నుంచి 55కు పడిపోవడం చరి త్ర. ఈ సర్వేలు జీహెచఎంసీ ఓటర్లలో వస్తున్న మార్పును పసికట్టలేకపోవడం గమనార్హం. 

ఎందుకని ఈవిధంగా సర్వే అంచనాలు ఒక్కోసారి తల్లక్రిందులవుతాయన్న ప్రశ్న ఉదయించడంసహజమే. తెలంగాణ సమాజంపై నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, ఓటర్లపై మద్యం పంపిణీ 62%, డబ్బు పంపిణీ 32% బలీయమైన ప్రభావం చూపుతున్నాయని వెల్లడైంది. ఇవి సరిగ్గా పోలింగ్‌కు ఒక్కరోజు ముందు చోటుచేసుకోవడం వల్ల సర్వేలు ఓటర్లలో వచ్చే ఈ మార్పును పసికట్టలేవు. ఇక మున్సిపల్ ఎన్నికలు వార్డుల వారీగా జరుగుతాయి. ఒక్కోవార్డు విస్తీర్ణం చాలా తక్కువ. ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీల కతీతంగా వ్యక్తిగతంగా మంచి పలుకుబడి వున్న అభ్యర్థులు, వార్డుల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అదీకాకుండా సర్వేలు నిర్వహించినప్పుడు చాలా మంది పట్టణ ప్రాంత వోటర్లు తమ మనోగతం బయటకు వెల్లడించరు. పైకి ఒకటి చెప్పినా వ్యక్తిగత అభిప్రాయం భిన్నంగా వుండవచ్చు. ఇటువంటి వారి నాడిని పసికట్టడం కష్టం. అందువల్ల సర్వేలను ప్రస్తుత ట్రెండ్ ఏవిధంగా వున్నదనేదాన్ని విశాలదక్పథంతో అవగాహన చేసుకోవాలి తప్ప, ఇవే నిజమని గుడ్డిగా విశ్వసించడం సమంజసం కాదు. గ్రామీణ స్థాయి నుంచి రాజధాని వరకు ఓటర్లకు ఒకేవిధమైన ఆలోచనాధోరణి వుండదు. పల్లెల్లో ఓటర్లపై స్థానిక అభ్యర్థి పలుకుబడితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభావం చూపితే, మున్సిపల్ పరిధిలో ఓటర్లు మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తారు. అదే కార్పొరేషన్లలో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలపై దష్టి కేంద్రీకరి స్తారు. జీహెచఎంసీ స్థాయిలో రవాణా, వైద్యసదుపాయాలు, నీటి సరఫరా వంటి అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి.

2026 మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 73.01% పోలింగ్ జరగడం, ముఖ్యంగా మహిళా ఓటర్ల సంఖ్య గతంలో కంటే 3.45%, ఇదే సమయంలో పురుషులకంటే ఎక్కువ నమోదు కావ డం ఈ సారి ఎన్నికల్లో కీలకం. మొత్తం ఓటింగ్ గతం కంటే మూడుశాతం ఎక్కువ నమోదైంది.సర్వే ఫలితాలు సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న వేవ్‌ను వెల్లడిస్తాయి తప్ప, వార్డు స్థాయిలో ఓడర్ల నాడిలోని గతిశీలతను అంచనా వేయడం కష్టం. ముఖ్యంగా తటస్థ ఓటర్ల నాడిని పట్టడంచాలా కష్టం. గ్రామీణ ఓటర్లతో పోలిస్తే పట్టణ ఓటర్లు తమ అభిప్రాయాలను అంత తేలిగ్గా బ హిర్గతం చేయరు. దీనికి తోడు ధనబలం ఎట్లాగూ వున్నది. చివరిక్షణంలో అప్పటివరకు వున్న గాలివాటును ఒక్కసారిగా మార్చివేయగలదు. ఈసారి యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పýల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 ఓట్లు పోలవగా, నందికొండ మున్సిపాలిటీలో అతి త క్కువ అంటే 59.68% ఓట్లు పోలయ్యాయి. కార్పొరేషన్లలో అతితక్కువ ఓట్లు 59.12% పోల యింది నిజామాబాద్ కార్పొరేషన్‌లో! ఈసారి ఓటింగ్‌లో ఒక విచిత్ర ట్రెండ్ కనిపిస్తోంది. కార్పొ రేషన్ స్థాయిల్లో తక్కువ ఓట్లు పోలయితే, మున్సిపల్ స్థాయిల్లో అత్యధిక ఓటింగ్ నమోదవడం గమనార్హం. 

మొత్తంమీద సర్వేల సారాంశం కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా వుండగా, ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్‌ల్లో బీజేపీకి విజయావకాశాలున్నట్లు తేల్చాయి. 9 కార్పొరేషన్లలో ఏడు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. మున్సిపాలిటీల్లో కూడా 65` 85 వరకు కాంగ్రెస్ కిందికే వెళతాయని సర్వేల అంచనాలు. ఇక బీజేపీ రెండు కార్పొషన్లలో గెలిచే అవకాశముండగా, ఏఐఎంఐఎం కింగ్‌మేకర్ కానున్నదని సర్వేలు తేల్చాయి. బీఆరఎస్‌కు ఒక్క కార్పొరేషన్ కూడా దక్కే అవకాశం లేదని వీటి అంచనా. గత ఎన్నికల్లో దాదాపు 90% సీట్లను ఈ పట్టణ ప్రాంతాల్లో గెలుచుకున్న బీఆరఎస్ ఆ పట్టును ఇంకా కొనసాగించాలని గట్టిగా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆ పార్టీ ఎంతమేర విజయం సాధిం స్తుందనేది 13వ తేదీ కౌంటింగ్‌లో తేలనుంది. ఈసారి పురుషులకంటే అత్యధికంగా మహిళలు అధికంగా ఓటింగ్‌లో పాý£్గనడం రేవంత్ ప్రభుత్వం కల్పించిన ఉచితబస్సు సౌకర్యం, మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో స్వయం సహాయక గ్రూపులకు పెట్రోల్ బంకుల ఏర్పాటు, ఆర్టీసీ అద్దె బస్సుల కొనుగోళ్లలో సహాయం చేయడం వంటివి సానుకూల ఫలితాలిచ్చాయని చెప్పాలి. మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందంటే కచ్చితంగా అది అధికారపార్టీకి సానుకూల సంకేతంగా పరిగణించాలన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అయితే ఇక్కడ ఒక్క సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నపార్టీకే స్థానిక ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వుంటాయి. కాకపోతే ఈ సానుకూలతా శాతా న్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భవితవ్యాన్ని కొంతమేర అంచనా వేయవ చ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రస్తుత ఓటర్ల నాడిని బట్టి భవిష్యత్తులో అది ఏవిధంగా మార బోతున్నదనేది అంచనా వేసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. 

ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలకు చాలా కీలకం. బీఆరఎస్ గెలిస్తే, మరింత ఉత్సాహంతో రేవంత్ ప్రభుత్వంపై తమ దాడులను మరింత పెంచి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లవచ్చు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే, రాష్ట్రంలో క్రమంగా తెలంగాణ సెంటిమెంట్ తగ్గుతోందని, హరీష్, కేటీఆర్‌ల నాయకత్వ పటిమ అధికా రాన్ని కైవసం చేసుకునే స్థాయికి చేరుకోలేదన్న స్పష్టమవుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పరిస్థితి సానుకూలంగా వుంటుంది కనుక అధిక స్థానాలకంటే, ఎన్నిశాతం స్థానాల్లో విజయం సాధించామన్నది ప్రధానాంశంగా వుంటుంది. పంచాయతీల్లో మాదిరిగానే 50`60శాతంగా ఇవి వున్నట్లయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం చేసుకోక తప్పదు. 80`85 శాతం మధ్య విజయం సాధిస్తే, ప్రస్తుతం సానుకూలత ఉన్నదని, దీన్ని ఇలాగే కొనసాగేలా వ్యవహరించాలన్న సూచన ఇమిడి వుంటుంది. రెండు కార్పొరేషన్లలో విజయావకాశాలున్న బీజేపీకి వచ్చింది లేదు పోయిందీ లేదు. ఎంఐఎం కొన్ని కార్పొరేషన్లలో కింగ్‌మేకర్ కావడం, ఆ పార్టీ క్రమంగా ఎదుగుదలను సూచిస్తోంది. ఏ స్థానమైనా ఒక్కసారి ఎంఐఎం సొంతంగా గెలుచుకు న్నదంటే, ముస్లిం అనుకూల విధానాలు అనుసరించే కాంగ్రెస్ కూడా అక్కడ కాలు మోపడం కష్టం. ఇది అర్థం చేసుకోకుండా ఇంకా బుజ్జగింపు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం.

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక…

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

* సమాజానికి సేవలందించడంలో చర్చిల పాత్రను పెంచుతుంది
* అధ్యక్ష, కార్యదర్శిలు నర్సిములు, రాజేందర్

చేవెళ్ల, నేటిధాత్రి:

చేవెళ్ల నియోజకవర్గ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం శంకర్పల్లిలోని షారోని ప్రార్థన మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ నూతన ఫాస్టర్స్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన కమిటీలో నియోజకవర్గ ఫాస్టర్స్ అధ్యక్షులుగా ఆసాపు ( నర్సింలు ), ఉపాధ్యక్షులుగా ఎం. అనంతరావు ( జేమ్స్), కార్యదర్శిగా
డప్పు. రాజేందర్, సహాయ కార్యదర్శి
జి. ప్రేమానందం, కోశాధికారిగా వై.మల్లేష్( ఇస్సాకు)లను
ఎన్నుకున్నారు. సలహాదారులు గా, ఎన్.కృష్ణ పి.యాదయ్య, పి.సంజీవరావు, పిఎం. సామ్యూల్,
పి.అబ్రహం, ఎమ్.ఎమ్. సామ్యూల్, ఎస్.లింగం,
వి. దానియేలు, ఎస్.సంజీవరావు, జి.సామ్యూల్,
డి.జయకర్, వై.రమేష్ లతో నియోజకవర్గ ఫాస్టర్స్ నూతన
కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు నర్సింలు (ఇస్సాకు )మాట్లాడుతూ..పాస్టర్లందరిని ఏకతాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం పోరాడుతుందని, ప్రభుత్వ పథకాలు మరియు ఇతర సదుపాయాలను పాస్టర్లకు అందజేయడంలో కృషి చేస్తుందన్నారు. కమిటీ కార్యదర్శి డప్పు రాజేందర్ మాట్లాడుతూ..ఈ కమిటీ చర్చిల సమస్యలను ఆధ్యాత్మికంగా, సామాజికంగా సమాజానికి సేవలందించడంలో చర్చిల పాత్రను పెంచుతుందని, చర్చిల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాస్టర్ల అవసరాలను తీర్చడంలో చురుకుగా వ్యవహరిస్తుందని, ఇది పాస్టర్ల సమాజానికి ఒక ఆశాకిరణంగా మారుతుందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం కమిటీ సభ్యులుగా పాలకవర్గముగా నియమితులైన ఫాస్టర్లు ఈ నూతన కమిటీని ప్రభువు కృపలో దేవుడు బలపరిచి చేవెళ్ల నియోజకవర్గంలో అనేక కార్యాలు జరిపించాలని దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలాల ఫాస్టర్స్, నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ ఆదర్శ్ సురబి డి ఎస్పీ…

వనపర్తి లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ ఆదర్శ్ సురబి డి ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌన్సిలర్ల ఓట్లు లెక్కింపు కౌంటింగ్ సెంటర్ ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తనిఖీ చేశారు కలెక్టర్ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు అధికారులు ఉన్నారు వనపర్తి జిల్లా లో 5 మున్సిపాలిటీ లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఎదయం 8 గంటల క ప్రారంభ ము అయి.మధ్యాహ్నం వరకు మున్సిపల్ కౌన్సిలర్ల ఫలితాలు వెలువడు తాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి ఒక ప్రకటన లో విలేకరులకు తెలిపారు జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రలను కలెక్టర్ పరిశీలించారు ఓట్ల లెక్కింపు కేంద్రలలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు

దేశవ్యాప్త కార్మికుల సమ్మె…

దేశవ్యాప్త కార్మికుల సమ్మె.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిలో గురువారం దేశవ్యాప్త సమ్మెలో వివిధ సంఘాల నాయకుడు పాల్గొన్నారు. యూనియన్ కల్వకుర్తి జరిగిన సమ్మెలో ప్రగతిశీల రైస్ మిల్ యూనియన్ వర్కర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.ఆంజనేయులు,అధ్యక్షుడు సాయిబాబు, బాలచంద్, శీను వెంకటయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు వివిధ సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. రైతు సంఘ నాయకులు ఆశ వర్కర్స్ అంగన్వాడి గ్రామపంచాయతీ వర్కర్ మధ్యాహ్నం భోజనం వర్కర్స్ కార్మికులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసినటువంటి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి. రద్దు చేయని వేళలో ఈ సమ్మె ఇంతటితో ఆగదు అని వ్యక్తం చేశారు.

ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన..

ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నర్సంపేట బ్రాంచ్ ఆఫీస్ ముందు ఎల్ఐసి ఏఓఐ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు,ఏజెంట్లు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపెళ్లి రాంనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి,నరేందర్,చంద్రమౌళి,సదానందం,రవీందర్,నర్సంపేట బ్రాంచి అధ్యక్షులు పొనుగొటీ సుధాకర్ రావు, నర్సంపేట బ్రాంచ్ సెక్రటరీ ఎండి సుభానుద్దీన్, జోనల్ నాయకులు మొద్దు రమేష్,గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాంబరాతి శ్రీనివాస్,కోశాధికారి కందికొండ రవికుమార్, క్లియర్ అధ్యక్షుడు ఆర్ చంద్రమౌళి ప్రచార కార్యదర్శి అల్లి రవి, డివిజన్ నాయకులు బూర రమేష్, చందు,అమృ, రఘుపతి, కుసుంబ బాబూరావు,కడారి వెంకటేశ్వర్ రావు,ఆనంతుల రమేష్ ముఖ్య సలహాదారుడు నాంపల్లి కొమురయ్య తదితర ఏజెంట్లు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనుల కోసం ప్రజల ఎదురుచూపులు…

ఉపాధి హామీ పనుల కోసం ప్రజల ఎదురుచూపులు.

కారేపల్లి నేటిదాత్రి

 

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామ ప్రజలు రైతులు రైతు కూలీలు ఈ సంవత్సరం వ్యవసాయం ఆశించినంతగా దిగుబడి రాకపోవడంతో గ్రామస్తులు పల్లెలు విడిచి హైదరాబాద్ లాంటి నగరాలకు పనుల కోసం వలస వెళ్లవలసిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు గత డిసెంబర్ నెలలో ప్రతి మిర్చి పనులు అయిపోవడంతోను ఏటువంటి కూలి పనులు దొరకక గ్రామ ప్రజలు 100 రోజుల ఉపాధి హామీ పనులు కోసం పై అధికారులను సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇదివరకే ఉన్న ఉపాధి హామీ పనుల పాత పాస్ పుస్తకాలు పనిచేయడం లేదు కొంతమంది మాత్రమే ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. మిగతా వారికి లిస్టులో మీ పేరు లేదు అని కొత్త ఉపాధి పుస్తకాలు తీసుకొని పనిలోకి రావాలని సలహా ఇస్తున్నారు.
దయచేసి ఈ విషయమై
పై అధికారులు స్పందించి
ఉపాధి హామీ కొత్త పుస్తకాలు మంజూరు చేసి మాకు ఉపాధిహమి పనులు కల్పించి ఆదుకోవాలని రైతులు రైతులు రైతుకూలీలు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేట వాణిజశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు క్షేత్ర పర్యటనలో (జిజ్ఞాస విద్యార్థుల స్టడీ ప్రాజెక్ట్‌లో) భాగంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇండెల్ మనీ నర్సంపేట శాఖను సందర్శించారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన ప్రాయోగిక జ్ఞానం విద్యార్థులకు అందించడమే ముఖ్య ఉద్దేశ్యం అని విద్యార్థులు క్షేత్ర పర్యటన ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని విద్యార్థులను ఇలాంటి పర్యటనలు అవసరమని విభాగాధిపతి ఎం.సోమయ్య తెలియజేశారు.ఇండెల్ మనీ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ శ్యామల రాజు మరియు శాఖ సిబ్బంది విద్యార్థులకు ఆర్థిక సేవలు, రుణాల విధానం, బంగారం రుణాలు, కస్టమర్ సేవలు, మరియు శాఖ నిర్వహణ విధానాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. విద్యార్థులు వాళ్లతో మమేకమవుతూ ఆసక్తిగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా వాణిజ్య విభాగం తరఫున ఇండెల్ మనీ నర్సంపేట శాఖ మేనేజర్ శ్యామల రాజు గారికి మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ విద్యా పర్యటనకు అనుమతి ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గారికి వాణిజ్య విభాగం తరుపున వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం సోమయ్య ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన పెరిగి, భవిష్యత్తులో వారి విద్యా ప్రయాణానికి ఉపయోగపడే విలువైన అనుభవం లభించిందని డాక్టర్ రాజీరు తెలియజేశారు.

error: Content is protected !!
Exit mobile version