నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు కార్మికుల నిరసన

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఫిబ్రవరి 12న సమ్మెను విజయవంతం చేయండి

సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక (జెఎసి)

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి వాటి అమలుకు పూనుకుంది.ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ( ఎస్సిసిడబ్ల్యూ-ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం అధ్యక్షత వహించారు.ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్,హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు కోండ్ర శంకర్, టీఎస్యూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.మణిరామ్ సింగ్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.పోశమల్లు,జిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే.విశ్వనాథ్ పాల్గొని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి,నాలుగు లేబర్ కోడ్ల ను తీసుకురావడం జరిగిందని మండిపడ్డారు.పారిశ్రామిక సంబంధాల కోడ్,వేతనాల కోడ్,పని భద్రత పరిస్థితుల కోడ్,సామాజిక భద్రత కోడ్ లను తెచ్చారని విమర్శించారు.ఈ కోడ్ ల వల్ల కార్మికులు అనేక హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్ లను తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు,సౌకర్యాలు లేకుండా చేయడమేనని ఆరోపించారు.సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టకునే హక్కు లేకుండా చేయడం కొరకు మాత్రమే ఈ కోడ్ లను తీసుకురావడం జరిగిందన్నారు.పరిశ్రమలను ఎప్పుడైనా మూసేయవచ్చు, కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు,కచ్చితంగా ఇవన్నీ చేసేటటువంటి ప్రక్రియని చేపడుతున్నారని మండిపడ్డారు.రాత్రి పూట కూడా మహిళలను డ్యూటీ చేయించే పద్ధతిని కొత్త చట్టంలో తీసుకొచ్చారు.8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయించే విధానాన్ని తీసుకువస్తున్నారు.పిక్సెడ్ టర్మ్,టైంబండ్,ఎంప్లాయిమెంట్ అనేది కొత్త రూపాన్ని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగం అనేది లేకుండా,ఉద్యోగానికి భద్రత లేని పరిస్థితిని చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో కార్మిక వర్గం అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, టీఎస్యుఎస్ రాష్ట్ర నాయకులు సమ్ము రాజన్న, ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జి.రాయమల్లు, 200 మంది వర్కర్స్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version