శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన…

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన

నిజాంపేట, నేటి ధాత్రి

షన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం….
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్…
నిజాంపేట మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ,నస్కల్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందించే ఒక గొప్ప ఆర్థిక బహుమతి అందరూ దీనిని సద్వినియోగం చేసుకోగలరని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం గారు మరియు బ్రాంచ్ మేనేజర్ నాగరాజు అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ మురళి గారు అదేవిధంగా ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు …

మండల కేంద్రంలో క్రీడా దినోత్సవం వేడుకలు 
మహాదేవపూర్ఆగష్టు30 (నేటి ధాత్రి )

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో శనివారం రోజున క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో విద్యార్థులతో క్రీడ ఉపాధ్యాయుని పూర్ణిమ తోటి ఉపాధ్యాయులతో కలిసి క్రీడా స్ఫూర్తినీ నింపేలా పాటలతో, నినాదాలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి ఎంఈఓ ప్రకాష్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు ముందంజలో ఉంటూ జాతీయస్థాయిలో క్రీడ పోటీలలో విజేతలుగా నిలిచి భవిష్యత్ తరాలకు క్రీడలపై స్ఫూర్తిని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అనిల్,ఎస్సై పవన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version