మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు…

మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెల 10 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ లతో గురువారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలలో విజయం కోసం పోరాటం చేసినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు,కార్యకర్తలకు,శ్రేణులకు,నాయకులకునా అభినందనలు తెలిపారు.ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.
శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఏజెంట్లు నిర్ణిత సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని,ఓట్ల లెక్కింపు వద్ద అభ్యర్థులు,ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు,అభ్యర్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version