కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే…

 కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?

 

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్(Virat Kohli) ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి.

పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్..

పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్

 

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్‌దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసుకుని సఫారీల ఓటమిని శాసించారు. ఇటు బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(116*), విరాట్ కోహ్లీ(65*), రోహిత్ శర్మ(75) అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్ ఆసాంతం కోహ్లీ ఫన్, జోష్ అందరిని ఆకట్టుకుంది. ఈ సారి విరాట్ ట్రోలింగ్‌కు పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) బలైయ్యాడు.

కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో..

కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘన స్వాగతం.. వీడియో

https://youtu.be/fzVO52B4mR8?si=NqiYCThZYp7xzidb

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత్(Team India) రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది. ఈ మ్యా్చ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సోమవారం సాయంత్రం భారత జట్టు రాయ్‌పుర్‌కు చేరుకుంది. టీమిండియా ప్లేయర్లు హోటల్‌లోకి వెళ్లే ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చిన్నారుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కోహ్లీని చూసి సంబరపడిన పడిన పిల్లలు అతని చేతికి ఎర్ర గులాబీలు ఇచ్చి(Virat Kohli Raipur Welcome) ఘన స్వాగతం పలికారు.విరాట్ కూడా నవ్వుతూ వాటిని స్వీకరించి నెమ్మదిగా ముందుకు కదిలాడు. కోహ్లీని చూసినప్పుడు పిల్లలు సంబరపడిపోయారు. నక్షత్రాన్ని దగ్గర నుంచి చూస్తే.. ఎలాంటి అనుభూతి వస్తుందో.. పిల్లలకు కూడా కోహ్లీని చూసినప్పుడు అలాంటి అనుభవమే కలిగింది. ఆ విషయం వారి ముఖల్లో స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version