అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సర్పంచ్
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందుతుందనే అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం గర్భిణీలకు, పసిపిల్లలకు పాలు, గుడ్లు, పప్పు దినుసులు పౌష్టికాహారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
