పరకాలలో ఏఐసీసీటీయూ నిరసన ర్యాలీ..

పరకాలలో ఏఐసీసీటీయూ నిరసన ర్యాలీ

పరకాల,నేటిధాత్రి

 

సార్వత్రిక జాతీయ సమ్మెను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పరకాలలో ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమని,అవి అమలైతే కార్మికుల హక్కులు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు నెరవేరకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ ర్యాలీలో ఏఐసీసీటీయూ తో పాటు ఏఐటియుసి అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. కష్టపడి పనిచేసే కార్మికుల జీవితం ఎలా దుర్బరంగా మారుతోందో తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ, వాటిని వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లేదంటే పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం…

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి
దేశ వ్యాపిత్త స్వరత్రిక సమ్మె విజయవంతం చేయాలని, *తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లతో నిరసన కార్యక్రమం తెలపడంజరిగింది*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
4 లేబర్ కోడులను రద్దు చేయాలి.వి బి జి రామ్ ఈ చట్టాన్ని రద్దు చేయాలి.నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలి,విద్యుత్ {సవరణ} బిల్లు – 2025 ను రద్దు చేయాలి.ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్ డి ఐ ని రద్దు చేయాల,ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరించరాదు,కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి.స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి*.
ఎం వి యాక్ట్ – 2019 సవరించాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రమాదేవి.
సాయి,వేద, కౌసల్య, సుమలత, రజిత,స్వప్న, ఆదిలక్ష్మి,సుమలత,డి సుజాత, జ్యోతి లక్ష్మి, విశాల, సునీత, విజయ, కృష్ణవేణి, సరోజన,నాగరాణి, కోమల తదితరులు పాలుగోన్నారు.

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి…

తేదీ. 4.2.2026.
ప్రచురణార్థం…

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బుధవారం బొమ్మకల్ గ్రామంలోని సిమెంట్ గోదాముల వద్ద కార్మికులు సమ్మె వాల్ పోస్టర్ ను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించడం జరిగినది. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు జంగము తిరుపతి యాదవ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వాటాల అమ్మకం అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ఇతర రంగాల కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని,
తదితర డిమాండ్లకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో సిమెంట్
హమాలి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిమెంటు గోదాం హమాలి సంగం ఏఐటీయూసీ నాయకులు బాగోతం వీరయ్య, కొమురయ్య, శ్రీనివాస్, ఐలయ్య, రాములు గౌడ్, శ్రీనివాస్ కొమురయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version