ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ..

ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ

 

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. దానికోసమే ఫిట్‌నెస్ పరంగా, ఫామ్ పరంగానూ అదరగొడుతున్నాడు. మరి ఆ మెగా టోర్నీలో రోహిత్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అనే అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్(Rohit Sharma) వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘నా దేశం కోసం ప్రపంచ కప్ నెగ్గాలని కోరుకుంటున్నాను. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ వంటి టోర్నీలు లేవు. అయితే నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు మాత్రం ఎంతో విలువ ఉంది. ప్రస్తుతం ఆ ట్రోఫీ(2027 ODI World Cup) గెలవాలనేదే నా లక్ష్యం. దాన్ని గెలిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని రోహిత్ శర్మ ఓ ఐసీసీ ఈవెంట్‌లో అన్నాడు. మరోవైపు ఇటీవలే బీసీసీఐ(BCCI) ఆటగాళ్లకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ గ్రూప్ ఏ ప్లస్ నుంచి గ్రూప్ బికి మారిన సంగతి తెలిసిందే. గ్రూప్ ఏ ప్లస్ కేటగిరీని తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు గ్రూప్ ఏ, బి, సి కేటగిరీలను మాత్రమే కేటాయించింది. కాగా గ్రూప్ ఏలో శుభ్‌మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే చోటు దక్కించుకున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా గ్రూప్ బికి మారిన విషయం తెలిసిందే.

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..!

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..!

కటక్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ బుమ్రా మరో ఒక్క వికెట్ తీస్తే.. ఈ ఫార్మాట్‌లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి సౌతాఫ్రికా-భారత్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మంగళవారం కటక్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. బుమ్రా టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 99 వికెట్లు తీశాడు. కటక్‌లో జరిగే మ్యాచ్‌లో మరో వికెట్ తీస్తే.. వికెట్ల సెంచరీ రికార్డు నెలకొల్పనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల(టెస్ట్, టీ20, వన్డే)లో వంద వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్ టీ20లో ఇప్పటికే 100 వికెట్లు తీసినప్పటికీ.. మూడు ఫార్మాట్లలో ఈ రికార్డు అతడికి లేదు.
గణాంకాలు ఇలా..

బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్లలో 100 వికెట్ల మార్క్‌ను దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 52 మ్యాచులు ఆడిన బుమ్రా 234 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 89 మ్యాచుల్లో 149 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 99 వికెట్లతో.. వంద వికెట్ల ఫీట్‌ను అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నాడు.

రాణిస్తాడా?

సౌతాఫ్రికాపై బుమ్రా గత రికార్డులు పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ అతడికి అంతగా కలిసి రాలేదు. ఆఖరిసారి సౌతాఫ్రికాతో 3 టీ20 సిరీస్ ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. అయితే తన టీ20 కెరీర్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియాపై 20 వికెట్లు, న్యూజిలాండ్‌పై 12 వికెట్లు పడగొట్టాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version