డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం…

డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

 

విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని వామ పక్షాల నేతలు అన్నారు. భారతదేశ కార్మిక, రైతాంగ, పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగిన ట్రంపు నాయకత్వాన్ని సమర్థించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ ను నోటిఫై చేసింది. అభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రజా ఆమోదం లేని విధివిధానాలను చట్ట రూపంలో తీసుకురావాలని ఆలోచనతో, అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, జాతీయస్థాయి కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను శామీర్ పేట్ రాజీవ్ రహదారి పై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి, డి.జి నరేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సి.పి.ఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు డి.జి.సాయిలు గౌడ్ మాట్లాడుతూ విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యున్నత భాగం కార్మిక, రైతాంగం, అలాంటి నాయకత్వాలను సంప్రదించకుండా వారితో చర్చలు జరగకుండా విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని వామ పక్షాల నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ దశరథ్, జిల్లా కార్యదర్శి నిమ్మల నరసింహ, జిల్లా అధ్యక్షులు డి.జంగయ్య, గౌరవ అధ్యక్షులు సామల వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రాజిరెడ్డి, సి.పి.ఐ మండల సహాయ కార్యదర్శి సోగ్గాడ రమేష్, సి.పి.ఐ సీనియర్ నాయకులు గొలుసుల మల్లయ్య, మహిళా సమైక్య నాయకురాలు పుట్ట మనెమ్మ , నరసింహ, ఎం.కొండయ్య, జిల్లా సి.ఐ.టి.యు ఎం. కిష్టప్ప, సిపిఎం మండల కన్వీనర్ గోపాల్ , సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎల్లన్న , ఏ.ఐ.టి.యు.సి పారిశ్రామిక కార్మికులు సి.ఐ.టి.యు, పారిశ్రామిక కార్మికులు, పెద్దమ్మ కాలనీ ఇళ్ల పోరాట కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పోలీసులు 26 మంది నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి…

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

పేదల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు

వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లును రద్దు చేయాలి.

వామపక్ష పార్టీ ల డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

వామపక్ష పార్టీలఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దుచేసి పేదల పుట్టగొట్టే చట్టాన్ని నిరసిస్తూ గాంధీ రోడ్డులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద తట్టలు, పారలు చేతబుని నిరసన ధర్నా చేశారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎఫ్బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోగిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకతీతంగా తన ఊపిరిపోయంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావులు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాల్లు లేకుండా చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొడ్డానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని అందులో భాగంగానే ఆమహాత్ముని పేరు తొలగించి వికజిత్ భారత్ జి రామ్ జి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, ఆమహాత్మా గాంధీ ఏంతప్పు చేశాడని పేరు మారుస్తున్నారనివారన్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక సొంత ఊర్లు ఖాళీ చేసి వలసలు వెళ్లే పరిస్థితి దాపరించిందని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి దొరుకుతుంది అని సంతృప్తిపడేలోపే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే కూలీలకు పనులు లేకుండా పస్తులు ఉండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు పనిముట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కొత్త చట్టంలో పేర్కొనడం సిగ్గుచేటన్నారు. పాత చట్టంలో పనులు నిర్ణయించే అధికారం గ్రామ సభలకు ఉండేదని కొత్త చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ స్టాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తద్వారా గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కేంద్రం ఇష్టానుసారం పనులు కేటాయించే అవకాశం ఉందన్నారు. గత చట్టంలో కేంద్ర ప్రభుత్వం తోంభై శాతం నిధులు ఇస్తే కొత్త చట్టంలో కేవలం అరవై శాతం మాత్రమే నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ముప్పై శాతం నిధుల భారం కానుందన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుందన్నారు.
ఓడదాటక ముందు ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ప్రభుత్వం తయారయిందని కొత్త ఉపాధి పరిస్థితి దేవుడేరుగని, కూలీలు ఉపాధి ఎగ్గొట్టేందుకే పేరు మార్పని, నిధులు నిలుపుదల చేయుటకు ఈకుట్ర అని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలను బతకనివ్వండని, అర్ధాకలికి గురి చేయొద్దని వారు పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం తేవడం కోసం 2004 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఎంపీలు ఒత్తిడి తీసుకువచ్చి మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావడం జరిగిందని బిజెపి ప్రభుత్వం పేరు మార్చిన జిరాంజీ ఆనాడు పార్లమెంటులో ఈచట్టాన్ని వ్యతిరేకించాడని వారు తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వo తక్షణమే స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు గుడి కందుల సత్యం,గిట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు,కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యరావు, రాజశేఖర్, మల్లేశం రాజేశం,అజయ్ గజ్జల శ్రీకాంత్, జి.తిరుపతి నాయక్, గామినేని సత్యం, బాకం అంజయ్య, చెంచల మురళి, పుల్లెల మల్లయ్య, రాయి కంటి శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్, శ్రీనివాస్,రాకేష్, సాయికుమార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version