తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండల జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఉపాధి హామీని వెంటనే కొనసాగించాలని. ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని. రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని.2025.వ. విద్యుత్ సవరణ .బిల్లురద్దుకై. ప్రభుత్వ రంగ పరిశ్రమల .పరిరక్షణకై కనీసవేతనాల .పెంపుకై. మతోన్మాద. కార్పోరేట్ రాజకీయాలకు .వ్యతిరేకంగా అమాలి కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని. ప్రధానంగా. ఉపాధి హామీ పథకంలో. దేశవ్యాప్తంగా 12 కోట్లమంది.పనిచేసుకునే. జీవనోపాధి .పొందుతున్నారని. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 వేల మంది ఉపాధి కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.2005లో వామపక్షాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టగా. గ్రామీణ ప్రాంతంలో వలస నివారణకు పట్టెడు అన్నం దొరికే అవకాశం ఉన్న పథకం ఉపాధి హామీ పథకం అని. ఈ పథకంలో .12 కోట్లమంది. పనిచేయగా. ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం నిర్వీవరం. చేయడానికి ఈ పథకానికి 1,50,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండగా కేవలం 85 కోట్ల బడ్జెట్తో కొనసాగించడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతనాలులేక సమయానికి బకాయిలు పెండింగ్ ఉండడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని. సంవత్సరంలో 200 రోజుల పరిధిలో కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని. తెలియజేస్తూ .బిజెపి ప్రభుత్వం .ఈజిఎస్.పథకాన్ని రద్దుచేసి. కార్పొరేట్ శక్తులకు ఉపయోగ పడే విధంగా చట్టాన్ని .తీసుకువచ్చిందని. ఈ సంవత్సరంలో 125. రోజుల పని కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం డొల్లమాటలు చెబుతుందని. ఒక 100. 25 రోజుల. పని కల్పిస్తామని చెబుతుందని. పని కల్పిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని సంవత్సరంలో 100 రోజులు ఆ పని కల్పిస్తే 1.50.000. కోట్ల బడ్జెట్ పెట్టండి. బీజేపీ ప్రభుత్వం మరియు 125 రోజుల పని దినాలను ఎట్లా .కూర్చుతుందో ఆ బిజెపి మాటలు .డొల్లతనం అని .తెలియజేస్తుందని. కేంద్ర ప్రభుత్వము 90 శాతం నిధులు తోటి ఈజీఎస్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది కానీ. బిజెపి ప్రభుత్వం కొత్త చట్టంలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని దుర్మార్గమైన నిర్ణయం చేస్తుందని. ఉపాధి హామీ చట్టాన్ని .నిర్వీరం చేయడానికి తెలుగు రాష్ట్రాల పైన 2900. కోట్ల భారం పడి ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టు ముట్టాడుతున్న. రాష్ట్రాల పైన మరొక భారం పడడం. ఇది తక్షణమే. వి.పి.జి. రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని. తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గుంటి వేణు. మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్. సిపిఐ మండల నాయకులు బచ్చపల్లి శంకర్. రాజేందర్. బాలయ్య. రాములు. మల్లయ్య. శంకర్. ఆనందు. రవి. నరసయ్య. గోవిందు. తదితరులు పాల్గొన్నారు

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి…

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

పేదల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చడం సిగ్గుచేటు

వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లును రద్దు చేయాలి.

వామపక్ష పార్టీ ల డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

వామపక్ష పార్టీలఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దుచేసి పేదల పుట్టగొట్టే చట్టాన్ని నిరసిస్తూ గాంధీ రోడ్డులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద తట్టలు, పారలు చేతబుని నిరసన ధర్నా చేశారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎఫ్బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోగిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకతీతంగా తన ఊపిరిపోయంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావులు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాల్లు లేకుండా చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొడ్డానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని అందులో భాగంగానే ఆమహాత్ముని పేరు తొలగించి వికజిత్ భారత్ జి రామ్ జి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, ఆమహాత్మా గాంధీ ఏంతప్పు చేశాడని పేరు మారుస్తున్నారనివారన్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక సొంత ఊర్లు ఖాళీ చేసి వలసలు వెళ్లే పరిస్థితి దాపరించిందని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి దొరుకుతుంది అని సంతృప్తిపడేలోపే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే కూలీలకు పనులు లేకుండా పస్తులు ఉండే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు పనిముట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కొత్త చట్టంలో పేర్కొనడం సిగ్గుచేటన్నారు. పాత చట్టంలో పనులు నిర్ణయించే అధికారం గ్రామ సభలకు ఉండేదని కొత్త చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ స్టాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తద్వారా గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కేంద్రం ఇష్టానుసారం పనులు కేటాయించే అవకాశం ఉందన్నారు. గత చట్టంలో కేంద్ర ప్రభుత్వం తోంభై శాతం నిధులు ఇస్తే కొత్త చట్టంలో కేవలం అరవై శాతం మాత్రమే నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ముప్పై శాతం నిధుల భారం కానుందన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుందన్నారు.
ఓడదాటక ముందు ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ప్రభుత్వం తయారయిందని కొత్త ఉపాధి పరిస్థితి దేవుడేరుగని, కూలీలు ఉపాధి ఎగ్గొట్టేందుకే పేరు మార్పని, నిధులు నిలుపుదల చేయుటకు ఈకుట్ర అని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలను బతకనివ్వండని, అర్ధాకలికి గురి చేయొద్దని వారు పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం తేవడం కోసం 2004 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఎంపీలు ఒత్తిడి తీసుకువచ్చి మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావడం జరిగిందని బిజెపి ప్రభుత్వం పేరు మార్చిన జిరాంజీ ఆనాడు పార్లమెంటులో ఈచట్టాన్ని వ్యతిరేకించాడని వారు తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వo తక్షణమే స్పందించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు గుడి కందుల సత్యం,గిట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు,కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యరావు, రాజశేఖర్, మల్లేశం రాజేశం,అజయ్ గజ్జల శ్రీకాంత్, జి.తిరుపతి నాయక్, గామినేని సత్యం, బాకం అంజయ్య, చెంచల మురళి, పుల్లెల మల్లయ్య, రాయి కంటి శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్, శ్రీనివాస్,రాకేష్, సాయికుమార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

వీబి జి రామ్ జి బిల్లు – 2025 ను రద్దు చేయాలి..

వీబి జి రామ్ జి బిల్లు – 2025 ను రద్దు చేయాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు తో పునరుద్దరణ చేసి కొనసాగించాలి

ములుగు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ బిల్లు, 2025 (VB-G RAM G) ను రద్దు చేయాలని సిపిఎం ములుగు మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం ములుగు మండల కార్యదర్శి MD. గఫుర్ పాషా మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కల్పనకోసం కమ్యూనిస్టు పార్టీలు తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన జి రామ్ జి బిల్లు ప్రభుత్వం రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని అన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో చేసిన మార్పుల వల్ల కార్మికులు ఉపాధి హామీ కూలీలు చట్టబద్ధమైన హక్కులు కోల్పోతారని అన్నారు.ఈ బిల్లులో పని డిమాండ్‌కు తగినట్లుగా నిధులను కేటాయించాల్సిన బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటుంది అన్నారు. అలాగే పని చేయాలని నిర్ణయించడం చేసిన పనులకు బడ్జెట్ విడుదల చేయడం లాంటి పూర్తి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవడం అలాగే పని కావాలని కోరడం చేసిన పనికి కూలి పెంచాలని హక్కులు కూలీలకు లేకుండా నియంత్రించడం వల్ల అనేక మంది గ్రామీణ ఉపాధి కార్మికులకు నష్టం జరుగుతుందని అన్నారు
వ్యవసాయ పనులు ఉధృతంగా వున్న సమయంలో 60 రోజుల వరకు ఉపాధిని సస్పెండ్‌ చేసేందుకు ప్రభుత్వాలను అనుమతిస్తున్న నిబంధన వల్ల అత్యంత అవసరమైన కాలంలో గ్రామీణ కుటుంబాలకు పనులను నిరాకరిస్తూ, వారు భూస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అన్నారు. పని ప్రదేశాల్లో డిజిటల్‌ హాజరును తప్పనిసరి చేయడం సరికాదని అన్నారు.
వేతనాల చెల్లింపుల కోసం బడ్జెట్లో కేంద్ర రాష్ట్రాల రాష్ట్రాలతో 60:40 నిష్పత్తిలో పంచుకోవాలన్న ఏర్పాటును తీసుకురావడం ద్వారా ఈ బిల్లు కేంద్రం బాధ్యతను తగ్గిస్తోంది అన్నారు.
పైగా ఈ పథకానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎగా వున్న పేరును జి ఆర్‌ఎఎం జి (జి రామ్‌ జి)గా మార్చాలన్న నీచపు ఆలోచన వెనుక బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతిక ధోరణి ప్రతిబింబిస్తోంది. గ్రామీణ పేద మధ్యతరగతి కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న చట్టాన్ని నెమ్మదిగా చిన్న చిన్న మార్పులతో సవరణలు చేస్తూ బాధ్యతల నుండి తగ్గుతూ పూర్తిగా చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు దీనివల్ల అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఈ నేపథ్యంలో విబి-జిఆర్‌ఎఎంజి బిల్లును తక్షణమే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం ములుగు జిల్లా కమిటీ సభ్యులు రత్నం. ప్రవీణ్ ములుగు మండల కమిటీ సభ్యులు కొర్ర రాజు, గుండెబోయిన రవిగౌడ్, కలువల రవీందర్, కొడిపాక చంటి, కదురు వీరాస్వామి, వేణు, సుధాకర్, లింగన్న, సురేష్ తదితరులు 10 మంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version