టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్…

టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

 

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కనబర్చారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి ఈ సిరీస్ నుంచే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచులో కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. అతడి బదులు ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం క్రీజులోకి వచ్చిన వాషీ.. ఇబ్బంది పడుతూనే కనిపించాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో సుందర్ బరిలోకి దిగుతాడా? సిరీస్‌కే దూరమవుతాడా? అనే విషయంలో క్లారిటీ లేదు.

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన…

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన

 

టీమిండియా.. న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్‌కు పలు జాగ్రత్తలు సూచించాడు.

మంచి వన్డే కెప్టెన్ అవుతాడు..

‘కెప్టెన్‌గా శుభ్‌మల్ గిల్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. అతడికి మైదానంలో సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అతడికి అందుబాటులో ఉంటుంది. అతడు క్రమంగా ఎదుగుతాడు. చివరికి మంచి వన్డే కెప్టెన్ అవుతాడు’ అని బంగర్ పేర్కొన్నాడు.

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే…

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే?

 

 

టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్ అనంతరం యశస్వి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతడిని వెంటనే పుణెలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. స్కాన్ల అనంతరం అతడికి అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్(పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం యశస్వి(Yashasvi Jaiswal) ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
కాగా రాజస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయినప్పటికీ..

యశస్వి జైస్వాల్(15) విఫలమైనప్పటికీ.. సూపర్ లీగ్ గ్రూప్ బీ మ్యాచులో అజింక్య రహానే(72*), సర్ఫరాజ్ ఖాన్(73) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాజస్థాన్ జట్టు ముంబైపై మూడు వికెట్ల తేడాతో ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొని 78 సగటుతో 156 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version