ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ..

ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ

 

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. దానికోసమే ఫిట్‌నెస్ పరంగా, ఫామ్ పరంగానూ అదరగొడుతున్నాడు. మరి ఆ మెగా టోర్నీలో రోహిత్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అనే అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్(Rohit Sharma) వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘నా దేశం కోసం ప్రపంచ కప్ నెగ్గాలని కోరుకుంటున్నాను. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ వంటి టోర్నీలు లేవు. అయితే నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు మాత్రం ఎంతో విలువ ఉంది. ప్రస్తుతం ఆ ట్రోఫీ(2027 ODI World Cup) గెలవాలనేదే నా లక్ష్యం. దాన్ని గెలిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని రోహిత్ శర్మ ఓ ఐసీసీ ఈవెంట్‌లో అన్నాడు. మరోవైపు ఇటీవలే బీసీసీఐ(BCCI) ఆటగాళ్లకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ గ్రూప్ ఏ ప్లస్ నుంచి గ్రూప్ బికి మారిన సంగతి తెలిసిందే. గ్రూప్ ఏ ప్లస్ కేటగిరీని తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు గ్రూప్ ఏ, బి, సి కేటగిరీలను మాత్రమే కేటాయించింది. కాగా గ్రూప్ ఏలో శుభ్‌మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే చోటు దక్కించుకున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా గ్రూప్ బికి మారిన విషయం తెలిసిందే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version