ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…

ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని బడంపేట గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్థానిక శాసనసభ్యులు కె.మానిక్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ రాజ, జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కోహీర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోవూరి నర్సింలు పాల్గొన్నారు.

హద్నూర్ ఇష్టర్ గుట్టలో జరిగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరు కాగలరు…

హద్నూర్ ఇష్టర్ గుట్టలో జరిగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరు కాగలరు

◆-: హద్నూర్ ఇష్టర్ గుట్ట

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ క్రైస్తవ హద్నూర్ గ్రామంలో గల ఈస్టర్ గుట్ట వద్ద మార్చి 6, 7, 8 తేదీలలో నిర్వహించనున్న క్రైస్తవ ఉజ్జీవ కూటముల జాతరకు సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు హాద్నూర్ క్రైస్తవ సంఘ పెద్దలు మరియు యువకులు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉజ్జీవ కూటముల్లో పాల్గొని ఆత్మీయంగా బలపడాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసం, ఐక్యత, ప్రేమ మరింత ఆప్యాయత అనురాగాలు, మానవ విలువలు, బలపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాద్నూర్ మెథడిస్ట్ సంఘ కాపరి (సర్కిల్ ఇంచార్జ్) రేవ్. బి, జార్జ్ అబ్రహం తో పాటు సంఘ పెద్దలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ క్రైస్తవ ఉజ్జీవ కూటముల జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.— హాద్నూర్ క్రైస్తవ సంఘం

బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీ…

బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లో వివిధ కుల సంఘాలు నాయకులతో, బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.మొన్న నాగర్ కర్నూల్ లో జరిగిన దాడిని నిరసిస్తూ టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి పిలుపుమేరకు జ్యోతి పండాల్ జహీరాబాద్ నియోజకవర్గం లో వివిధ కుల సంఘాల నాయకుల, రజక సంఘం నాయకుల, రజక సంఘం పెద్దల, వివిధ పార్టీల బీసీ నాయకుల, బీసీ జేఏసీ నాయకుల సమన్వయంతో భారీగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్పీ
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు, బిసి జేఏసీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు తదితరులు భారీగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారని జ్యోతి పండాల్ అన్నారు.ఈ క్యాండిల్ ర్యాలీని జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీ నాయకులు రజక సంఘం నాయకులు అన్ని వర్గాల బీసీ నాయకులు నుంచి మద్దతు లభించడం చాలా చాలా సంతోషంగా ఉందని జ్యోతి పండాల్ అన్నారు మరియు ఈ క్యాండిల్ ర్యాలీ లో పాల్గొన్న అన్ని వర్గాల నాయకులందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు..

ఝరాసంగం రోడ్డు ధ్వంసం: ప్రయాణికుల ఆందోళన..

ఝరాసంగం రోడ్డు ధ్వంసం: ప్రయాణికుల ఆందోళన

*జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రం వరకు వానంపల్లి నుండి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి, కంకర తేలడంతో ప్రయాణికులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు ఈ రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు కొత్తగా రోడ్డు వేసి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు

గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి మారలేదని, సర్పంచ్లు మారుతున్నా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 26 నెలలు పాలించినా పరిస్థితి మారలేదని, జహీరాబాద్ ఎంపీ మరియు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, పనికి వెళ్లే కూలీలు రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బడంపేట్ సర్పంచ్లు కూడా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రింగ్ రోడ్లు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఓట్లు మాత్రమే కావాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ప్రజల ఇబ్బందులను చూడాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.కోహిర్ మండలంలో రోడ్లు బాగుచేయాలని లేదా కొత్త రోడ్లు వేయాలని కోరుతున్నారు.

లావుడియా రాధిక రవీందర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం..

లావుడియా రాధిక రవీందర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం

నందిగామ పందిపంపుల గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఉపసర్పంచి లావుడియా రాధిక రవీందర్ నందిగామ సర్పంచిగా ఎంపీఓ నాగరాజు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నాకు సహకరించిన ఉపసర్పంచి లక్ష్మయ్య వార్డ్ మెంబర్స్ కి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నందిగామ పంది పంపుల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపెడతానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను అని వారు అన్నారు

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ భూపాలపల్లి మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ ఉపసర్పంచి అయినవేని లక్ష్మయ్య వుదయం పత్రిక జిల్లా రిపోర్టర్ సదానందం తదితరులు పాల్గొన్నారు

వనపర్తి ఆర్యవైశ్యలు కాశీ యాత్ర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల బీ ఆర్ ఎస్ నేతలు..

వనపర్తి ఆర్యవైశ్యలు కాశీ యాత్ర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి ఆర్యవైశ్య లు బాలకృష గంధం రాజు, పూర్ణ బ్రదర్స్ కాశి యత్ర కు వెళుతూన్న హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో కాశీ యాత్ర కు వెళ్ళే వారికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి శా లు వతో సన్మానించారు
కొత్తకోట మండలం, కానాయపల్లి
మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్, నిర్విన్ మాజీ సర్పంచ్ బంటు రాములు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరోత్తమ రెడ్డి తదితరులు సన్మానించ చి న రిలో ఉన్నారు.కాశీ యాత్రకు వెళ్ళే భక్తులకు మాజీ ఎంపీ రావుల శుభాకాంక్షలు తెలిపారు

3వ రోజు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో బట్టు కర్ణాకర్

3వ రోజు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో బట్టు కర్ణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం – మూడో రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి విశ్వనాథన్ పాల్గొన్నారు. వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరం పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో శిబిరం సమర్థవంతంగా కొనసాగుతోంది.
ఈ పది రోజుల శిక్షణా శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా & మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపై నిపుణుల ద్వారా సవివరంగా శిక్షణ అందిస్తున్నారు. జిల్లాల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని సూచించారు.

రెండు రాజ్యసభ కాంగ్రెస్ కు సాధ్యమా?

ఊసరవెల్లి రాజకీయాలకు తెరపడనుందా?

ఉత్కంఠంగా మారిన రాజ్యసభ ఎన్నికలు?

`రాజ్యసభ ఎన్నికలో ట్విస్ట్ లే ట్విస్టులు!

`రాజకీయ రంగులు తేలిపోనున్నాయా?

`ఏ పార్టీ పొత్తు ఎవరితో తెలనుందా?

`పది మంది ఎమ్మెల్యే లు పదవులు పోయే సమయం ఆసన్నమైందా?

`కేసీఆర్ విప్ జారీ చేస్తారా! రాజకీయ వ్యూహం రచిస్తారా?

`కేసీఆర్ విప్ జారీ చేస్తే పరిస్థితి ఏమిటి?

`పార్టీ మారిన ఎమ్మెల్యే లు పదవులు కాపాడుకుంటారా?

`విప్ కు విరుద్దంగా ఓటేసి సభ్యత్వాలు కోల్పోతారా?

`ఇప్పుడున్న ఎమ్మెల్యే ల సంఖ్యా బలం కాంగ్రెస్ కు సరిపోదు.

`పార్టీ మారిన ఎమ్మెల్యే లు ఓట్లేసినా కాంగ్రెస్ రెండు సీట్లు గెలవలేదు.

`కేసీఆర్ దైర్యం చేసి ఒక సీటుకు పోటీ పెడతారా?

`పార్టీ మారిన పది మంది కాంగ్రెస్ కు చేయిచ్చి బి ఆర్ ఎస్ కు ఓటేస్తారా?

`వాళ్ళు కూడా గైర్హాజరుతారా?

`ఆలా చేసినా విప్ దిక్కారమే అవుతుంది?

`పది మంది ఎమ్మెల్యే లకు ముందు నుయ్యి వెనుక గొయ్యి కానుందా?

`అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకుంటారా?

`ఏక కాలంలో పది మంది కి అనారోగ్యం సాధ్యమౌతుందా?

`అనేక చిక్కు ముడులలో రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ?

`గొప్యతకు తావులేదు… తప్పించుకునే ఛాన్స్ లేదు!

`కాంగ్రెస్ బలం 66

`సిపిఐ పార్టీకి ఒక్క సీటు వుంది.

`ఒక్క రాజ్య సభ గెలుపుకు 41 మంది ఎమ్మెల్యే లు అవసరం!

`10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే లు కలిస్తే 77 అవుతుంది.

`రెండు సీట్లు గెలుచుకోవాలంటే 82 ఓట్లు కావాలి.

`కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తే లెక్క సరిపోతుంది?

`పార్టీ మారిన ఎమ్మెల్యే లు ఓట్లేస్తేనే సాధ్యమౌతుంది?

`పది మంది జారుకుంటే మొదటికే మోసం వస్తుంది?

`సీఎం రేవంత్ రెడ్డి ని నమ్ముకొని ఓటేస్తారా?

`పదవులు పోయినా సరే అని విప్ దిక్కరిస్తారా?

`పదవులు కాపాడుకోవడమే మేలనుకుంటారా?

 తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ సొంతం కానున్నాయా? ఈ రెండు సీట్లు సాధించుకోవడం సాధ్యమా? కాంగ్రెస్‌కు సంఖ్యా బలం సరిపోతుందా? మిత్రులు కలిసి వచ్చినా రెండు రాజ్యసభ గెల్చుకునే అవకాశం వుందా? అంటే స్పష్టమైన సమాదానం ఎవరూ చెప్పలేరు. ఆఖరు నిమిషం వరకు చెప్పడానికి అవకాశమే లేదు. రెండు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవంగా సాధించుకునే ఎమ్మెల్యేల కాంగ్రెస్‌కు లేదు. అలాగని కనీసం ఒక్క సీటు పొందేందుకు కూడా బిఆరఎస్ బలం సరిపోదు. మరి ఎలా? అనే ప్రశ్నలు అనేకం ఉత్పన్నమౌతున్నాయి. ఇప్ప్పుడే రాజకీయాల అసలు రంగు బైటపడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు బిఆరఎస్ అవకాశం కల్పించినా బిజేపి చేసే ఆరోపణలకు బలం చేకూరుతుంది. బిఆరఎస్‌కు బిజేపి సహకరించినా కాంగ్రెస్ విమర్శలు నిజమని ఒప్ప్పుకున్నట్లౌవుంది. ఒక వేళ కాంగ్రెస్, బిజేపిలు లోపాయి కారి ఒప్పందాలు జరుపుకునే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో సాద్యమే కాదు. ఏ రకంగా చూసిన పాలకపక్షం కాంగ్రెస్ రెండు సీట్లు కైవసం చేసుకోలేదు. ప్రతిపక్ష బిఆరఎస్‌కు ఒక్క సీటు దక్కేందుకు ఆస్కారం లేదు. కాని పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు, బిజేపి కలిస్తే బిఆరఎస్ ఒక్క సీటు సాధ్యమే? కాని ఇది కూడా సాధ్యమయ్యే పని అసలే కాదు. మరి కాంగ్రెస్ ఎలా రెండు సీట్లు సాదిస్తుంది. ఒక వేళ బిజేపి పోలింగ్‌కు గౌర్హాజరైనా సరే కాంగ్రెస్‌కు రెండు సీట్లు దక్కేలా కనిపించడం లేదు. కాని పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మాత్రం కచ్చితంగా రెండు సీట్లు దక్కడానికి ఇబ్బందేమీ లేదు. అయినా అది కూడా సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా వుంది. బిఆరఎస్ వేసే అడుగుýతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇరుక్కుపోయేది మాత్రం కేవలం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలే కీలకం. కాకపోతే మరో ఉపద్రవం ముందు రానున్నది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ మార్చి 16. ఇంకా చాలా సమయం వుంది. కాని ఈ లోపు సుప్రింకోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేల తీర్పు ఎలా వచ్చినా వారికి రాజ్యసభ ఎన్నికల రూపంలో ముప్ప్పు కనిపిస్తూనే వుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే పిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితేనే కాంగ్రెస్‌కు లాభం. ఏ బుజ్జగింపులతో పని వుండదు. సుప్రింకోర్టు అనర్హత వేటు వేయకుండా మరో వాయిదా ఇచ్చినా కాంగ్రెస్‌కు లాభమే? కాని ఎటు చూసినా పిరాయింపు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి కావడం మాత్రం ఖాయం. ఇప్ప్పుడు అసలైన రాజకీయం మొందలౌతుంది. రాజ్యసభ ఎన్నికల్లో బిఆరఎస్ గెలవకపోయినా ఒక అభ్యర్దిని నిలబెడితే మాత్రం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్దితి ఆగమ్య గోచరమే? ఎన్నికలకు దూరంగా వుండేందుకు బిఆరఎస్ నిర్ణయం తీసుకుంటే అది పరోక్షంగా కాంగ్రెస్‌కు మేలు జరుగుతుంది. అప్ప్పుడు కాంగ్రెస్, బిఆరఎస్ చేస్తున్న రాజకీయాలపై బిజేపికి అస్త్రం దొరుకుతుంది. బిఆరఎస్, కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల మూలంగానే రాజకీయ లలాటం జరగుతుందని తేలిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా, అన్ని పార్టీలకు పితలాటకమే. ఇలాంటి సందిర్ఘ పరిస్ధితి గతంలో ఎప్ప్పుడూ లేదు. ఇక్కడ కాంగ్రెస్, బిఆరఎస్‌లు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందే…ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఇబ్బందే? ఇది విచిత్రమైన రాజకీయ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చే అవకాశం వుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆరఎస్ పోటీ చేయనప్ప్పుడు, బిజేపికి సపోర్టు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నది. దేవనపల్లి కవిత చెబుతున్న మాట నిజమౌతుంది. కాంగ్రెస్‌కు సపోర్టు చేసేలా ఎన్నికల బరి నుంచి తప్ప్పుకుంటే కాంగ్రెస్ గెలుపుకు రాజ్యసభలో బిఆరఎస్ సహకరిస్తున్నట్లౌవుతుంది. ఏ రకంగా చూసినా ఇక్కడ బిఆరఎస్ కూడా ఇబ్బందికరమే అవుతుంది. ఇప్ప్పుడు కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు రచించాల్సిన అసవరం లేదు. ఒకటి మాత్రం పక్కా గెల్చుకుంటుంది. పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు సహకరిస్తే రెండో సీటు కూడా కైవసం చేసుకుంటుంది. ఇప్ప్పుడు కేసిఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కాకపోతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు పదవీ త్యాగానికి సిద్దపడాలి. ఏ రకంగా చూసిన వారికి ముందు ముప్పు వున్నట్లే లెక్క. పదవి పోవడం ఖాయంగానే పక్కా!! ఏది జరిగితే అది జరుగుతుందని ఆ పది మంది ఓటు వేస్తారా? అనర్హత వేటు పడినా సరే అని దైర్యం చేస్తారా? సిఎం. రేవంత్‌రెడ్డిని నమ్ముతారా? ఈ విషయంలో సిఎం. రేవంత్‌రెడ్డే కాదు, బ్రహ్మదేవుడు కూడా పిరాయింపు ఎమ్మెల్యేలను ఎవరూ కాపాడలేరు. బిఆరఎస్ పార్టీ విప్ దిక్కరిస్తే పది మంది పదవులు పోవడం అనేది ఖాయం. అప్ప్పుడు మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేస్తారా? పదవులు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ టికెట్ ఇస్తుందన్న నమ్మకం లేదు. అలాగని అందులోనూ కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేస్తారన్న నమ్మకం కూడా లేదు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎట్టిపరిస్దితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆరఎస్ అభ్యర్ధులను గెలిపించారు. ఆయన విప్‌ను అనుసరిస్తే ఆయన పదవి పోదు. కాకపోతే ఇప్పట్లో బిఆరఎస్ చేరదీయదు. కాని ఎమ్మెల్యే పదవి మాత్రం కాపాడుకున్నట్లౌవుంది. అలా పార్టీన వారిలో ఓ నలుగురు విప్‌కు అనుగుణంగా వెళ్లినా కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచే అవకాశం మళ్లీ మొదటికి వస్తుంది. అంతెందుకు ఎమ్మెల్యే పదవులు కాపాడుకోవాలంటే విప్‌ను అనుసరించాలి. కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా వుండాలి. అప్ప్పుడు ఎమ్మెల్యే పదవులు పోవు. కాని కాంగ్రెస్‌కు దూరమౌతారు. అటు, ఇటు ఎటు కాకుండా పోతారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా బిఆరఎస్ విప్‌ను అనుసరిస్తే మరు నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారిని దూరం పెడతారు. పార్టీ కార్యక్రమాలను హజరు కానివ్వరు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నాయకులే ఆ ఎమ్మెల్యేలను తరిమి కొడతారు. ఇప్పటికే జగిత్యాల, పటాన్ చెరువు నియోజకవర్గాలలో చూస్తూనే వున్నాయి. అది పది మందిఎమ్మెల్యేలు ఎదుర్కొవాల్సి వుంటుంది. సహజంగా అదికార పార్టీకి సంఖ్యాబలం పూర్తిగా వుంటేనే ఏకగ్రీవం అవుతారు. లేకుంటే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లకు అవసరమైన సంఖ్యా బలం లేదు. సిఎం. రేవంత్ రెడ్డి రెండు సీట్లకు అభ్యర్దులను నిలబెడతామంటున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సీటుకు కాంగ్రెస్ అదిష్టానం సూచించిన అభిషేక్ సింగ్వీ పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. రెండో దానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఉప రాష్ట్ర పదవికి పోటీ చేసిన జస్టిస్. సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేస్తారని అంటున్నారు. గతంలో ఉప రాష్ట్రపతిగా పోటీ చేసినప్ప్పుడే సంఖ్యాబలం లేకున్నా నిలుచున్నారు. ఇప్ప్పుడు కూడా అదే పరిస్ధితి వుంది. అయినా ఆయన దైర్యం చేస్తారా? అన్నది కూడా ముఖ్యమైపోయింది. అనవసరంగా ప్రతిష్టకు కాంగ్రెస్ పోతుందా? అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఒక్క రాజ్యసభ సీటు కోసం పది మంది ఎమ్మెల్యేల పదవిని బలి చేస్తారా? అని కూడా అనుకుంటున్నారు. ఎలాగూ సుప్రింకోర్టు వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నప్ప్పుడు విప్ దిక్కరించి ఓటు వేయడం మేలనుకుంటున్నారా? అది కాంగ్రెస్ నిర్ణయమా? లేక పార్టీ మారిన పది మంది ఒప్ప్పుకుంటారా? ఇలా రకరకాల చిక్కు ముడులు వున్నాయి. ఇప్ప్పుడు బిఆరఎస్ విప్‌ను అసుసరించినా మళ్లీ బిఆరఎస్ తీసుకునే అవకాశం లేదు. అందులోకి వెళ్లేందుకు దారి లేదు. కేసిఆర్ క్షమిస్తారన్న నమ్మకం లేదు. ఎటు చూసినా గందరగోళమే కనిపిస్తోంది. ఒక వేళ బిజేపి విప్ జారీ చేయకపోతే పరిస్దితి ఎలా వుంటుందో అనే చర్చ కూడా సాగుతోంది. కేంద్రంలో అదికారంలో వున్న బిజేపి విప్ జారీ చేయకపోయినా, గౌర్హాజరైనా సరే ఎంతో కొంత కాంగ్రెస్‌కు మేలు చేసినట్లే…అవుతుంది. ఇలాంటి చిత్రమైన రాజకీయం ఎప్ప్పుడూ రాలేదు.

పనితీరునే “సిద్ధాంతంగా” మార్చుకోకపోతే పార్టీల మనుగడ కష్టం

· ఓటర్ల ఆలోచనా తీరులో వస్తున్న పరిణితి

· ఏ స్థాయి ఎన్నికలకు ఆ స్థాయి సమస్యలకు ప్రాధాన్యత

· బోడిగుండుకు మోకాలకు లంకెపెట్టడం కుదరదు

· లీగల్ కేసులు, ఈడీ దాడుల వల్ల పాలనపై దష్టిపెట్టలేకపోతున్న ప్రభుత్వం

· “టీ4సి” అని ప్రభుత్వానికి బండి సంజయ్ పెట్టిన ముద్దుపేరు

· థర్మల్ టెండర్లలో అవినీతిపై హరీష్‌రావు ఆరోపణలు

· అవినీతిపై క్రూసేడర్లమంటూ రేవంత్ ప్రతిదాడి

· మున్సిపల్ ఎన్నికల్లో అవినీతిపై విపక్షాల ప్రచారం “పాక్షిక” సక్సెస్

· 2029 జమిలి ఎన్నికలు జరిగితే బీఆరఎస్‌కు నష్టం

· అప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు పెరగనున్న ప్రాధాన్యం

హైదరాబాద్, నేటిధాత్రి:

గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ స్థాయిల్లో వోటర్ల ఆలోచనా పద్ధతి జరిగే ఎన్నికలను బట్టి మారుతోందన్నది స్పష్టమవుతోంది. నిజంగా ఇది ఓటర్లలో సానుకూల చైతన్యానికి చిహ్నం. “సైద్ధాంతికత” స్థానాన్ని “పనితీరు” ఆక్రమించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు తమ “పనితీరు”నే సిద్ధాంతంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇందుకు బీజేపీకి పడిన ఓట్లే ఉదాహరణ. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి 35% ఓట్లుపోలవగా, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 15% మాత్రమే రావడం, ఈ పార్టీని జాతీయస్థాయి సమస్యలకు పరిష్కారంగా వోటర్లు పరిగణిస్తున్నారని అర్థమవుతోంది. ఈ కారణంగానే రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ప్రాధాన్యతనిస్తున్నారనుకోవాలి. ఇక బీఆరఎస్ విషయానికి వస్తే ఓట్ల కోసం ఇక ఎంతోకాలం తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం వుండదని తేలిపోయింది. అధికారంలో వున్న పార్టీ మాత్రమే స్థానిక సమస్యలను సత్వరం పరిష్కరించగలుగుతుందన్న విశ్వాసం కూడా ఓటర్లు అధికార పార్టీ వైపునకు మళ్లడానికి మరో కారణం. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని నమోదు చేసిన బీఆరఎస్ ఈసారి ఓటమి పాలవడానికి ప్రధాన కారణమేంటంటే, అధి కారంలో ఉన్న కాంగ్రెస్ వల్లనే సమస్యలు తీరతాయన్న విశ్వాసం. ఇక్కడ వోటర్లలో వున్నది పార్టీ సెంటిమెంట్ కాదు, తమ సమస్యలకు సత్వర పరిష్కారం ఎట్లా లభిస్తుందన్న దానిపై ఏర్పడిన నమ్మకం! ఇవ్వాళ బీఆరఎస్ లేదా బీజేపీ అధికారంలో వున్నా తప్పకుండా ఆ పార్టీలకే ఓటర్లు పట్టం కట్టేవారన్నది తధ్యం. దీన్ని పార్టీలు గుర్తెరిగి, ఏ స్థాయి ఎన్నికలకు అనుగుణంగా తమ వ్యూహాలను, పనితీరు ప్రదర్శనను ప్రజలకు వివరించాలి. లేకపోతే అంతే సంగతులు! ఇదే సమ యంలో తెలంగాణ ఓటర్లలో మరో మార్పును కూడా గమనించాలి. కేవలం కాంగ్రెస్, బీఆరఎస్‌లపైనే ఆధారపడకుండా మూడో పార్టీకి కూడా పోటీలో స్థానం కల్పించడం వీరి అద్భుత పరిణితికి నిదర్శనం. అదే బీజేపీ! ఇప్పటికి స్థానిక ఎన్నికల్లో పూర్తిస్థాయి బలాన్ని ప్రదర్శించలేకపోయినా, స్థిరమైన అభివద్ధిని నమోదు చేయడం, వోటర్లు కాషాయపార్టీని కూడా పోటీలోకి దించుతున్నా రనుకోవాలి. ఈ పరిణితి ఆంధ్ర ఓటర్లలో ఇంకా కనిపించడంలేదు! అందువల్ల వారి రాజకీయాలు కేవలం టీడీపీ, వైసీపీలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈ ట్రెండ్‌నుంచి బయటపడితేఆంధ్రప్రజలు తమకు అవసరమైన రీతిలో పనిచేసేలా పార్టీలను శాసించగలుగుతారు.
ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ చాలా స్థానాల్లో తిరిగి బలం పుంజుకోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రధానంగా ఆరుగ్యారంటీల అమలుపై ఆధారపడి ఎన్నికల్లో పోటీపడగా, వీటి అమలు వైఫల్యాలను చూపుతూ బీఆరఎస్ కాంగ్రెస్‌ను ఎదుర్కొంది. ఫలితంగా పట్టణ ప్రాంత మున్సిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ 29% వరకు ఓట్లను పొందగలిగిందంటే కాంగ్రెస్ అమలు చే స్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇంకా పూర్తి విశ్వాసం కలగడంలేదనే అర్థం. ఈ కారణంగానే చాలా మున్సిపాలిటీల్లో బీఆరఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇదే సమయంలో ఇక్కడ మరో కీలక పరిణామాన్ని కూడా గమనించాలి. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు బీఆరఎస్‌కు పెట్టని కోట లుగా పరిగణించే కరీంనగర్, నిజామాబాద్‌ల్లో బీజేపీ ప్రవేశించడం! ఇదేమాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చాపకింద నీరులా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటూ వెళితే అది బీఆరఎస్ ఆమేరకు క్రమంగా నష్టపోవడం ఖాయం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమైన నా యకులు కాంగ్రెలో చేరిపోవడం బీఆరఎస్‌కు తీరని నష్టం కలిగించింది. ఇక పార్టీ నాయకుడు కేటీఆర్‌కు పట్టణ ప్రాంతాల్లో మంచి పలుకుబడి, అభిమానం వుంది. కాకపోతే గ్రామీణ ప్రాంతా ల ప్రజల్లో కేసీఆర్ పట్ల లోతైన భావోద్వేగపరమైన అనుసంధానత ఇప్పటికీ వుంది. అయితే కేటీఆర్ దీన్ని నిలుపుకోవడంలో ఇంకా ఎంతో కషిచేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కొత్త సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్న కేసీఆర్ స్థానాన్ని, ఆరు గ్యా రంటీల వంటి ఇతర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ఆక్రమించడమే!
గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ సుస్థిరంగా నెలకొల్పిన భావోద్వేగపరమైన సంబంధాన్ని పార్టీ నిల బెట్టుకోలేకపోతే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితమై కేవలం అర్బన్ పార్టీగానే మిగిలిపోయే అవకాశాలున్నాయి. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వంలోని పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అందుకు అతీతమేం కాదు. అందువల్ల 2027 వరకు కేటీఆర్, హరీష్‌రావులు రాష్ట్రంలో పార్టీ పలుకుబడి పడిపోకుండా కాపాడుకోగలగాలి. ఇందుకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరిగే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే రీతిలో గట్టి వ్యూహాలను అమలు చే యాలి. ఒకవేళ 2029లో జమిలి ఎన్నికలు ప్రకటిస్తే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కొనడం బీఆరఎస్‌కు కష్టమవుతుంది. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీల వనరు లు మరింత బలంగా వుండటమే ఇందుకు కారణం. మొత్తంమీద చెప్పాలంటే బీఆరఎస్‌కు సం స్థాగతమైన క్షేత్రస్థాయి బలం బాగా వుంది. కానీ తిరిగి అధికారంలోకి రావడమనేది అనేక కారకాలపై ఆధారపడివుంటుందనేది సుస్పష్టం.
కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రిబండి సంజయ్ కాంగ్రెస్‌ను ఇప్పటికే “టీ4సీ” అని పిలుస్తున్నారు. అంటే “తెలంగాణ కరప్షన్, కలెక్షన్, కమిషన్ కాంగ్రెస” అని ఆయన పెట్టిన ముద్దుపేరు! ముఖ్యంగా కొందరు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు కుమ్మక్కయి యదేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్నది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. థర్మల్ విద్యుత్ కేంద్రం టెండర్లలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తంలో 30% నుంచి 40% వరకు కమిషన్ల రూపంలో మింగేశార న్నది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.250కోట్ల మేర అవినీతి జరిగిందని బీజేపీ ఏకంగా గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసును ఎదుర్కొనేందుకు పార్టీకి అసరమైన నిధులను రేవంత్‌రెడ్డి సమకూర్చి ఇందుకు ప్రతిగా రాజకీయ పదవుల విషయంలో తన ఆధిపత్యం కొనసాగేగా చూసుకున్నారని బీఆరఎస్ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ లేదా బీఆరఎస్‌లు చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలను పట్టణ స్థానిక ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఒకవేళ పూర్తిగా పట్టించుకున్నట్లయితే కాంగ్రెస్‌కు 1537 వార్డులు వచ్చివుండేవి కావు. ఒకవేళ అసలు పట్టించుకోకపోతే ఇంకా మరిన్ని స్థానాలను కైవసం చేసుకొని వుండేది. కేవలం 50% కంటే కొద్దిగా మాత్రమే గెలిచిందంటే విపక్షాల ప్రచారం, ప్రజల్లో కొంతమేర ప్రభావం చూపిందనేగా అర్థం! ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆరఎస్ సమయంలో జరిగిన అవినీతిని ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులపై విమర్శల దాడులకు దిగారు. అంతేకాదు తమ ప్రభుత్వా న్ని “అవినితీపై పోరాటం చేస్తున్న క్రూసేడర”గా ప్రజల్లో ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.
గ్రామీణ ప్రాంత ఓటర్లు సంక్షేమ పథకాల అమలుపై, పట్టణ ఓటర్లు రాజకీయ అవినీతి, కమిషన్లపై ప్రధానంగా దష్టిపెడతారు. బీజేపీ ఈ రెండు అంశాలను బాగా కనెక్ట్‌చేసి ప్రజల్లోకి తీసుకెళ్ల గలిగితే దీని ప్రభావం రాబోయే జీహెచఎంసీ ఎన్నికలపై అదేవిధంగా 2029 జమిలి ఎన్నికలపై తప్పకుండా వుండి తీరుతుంది.
తెలంగాణ ఆదాయం జాతీయ కాంగ్రెస్‌కు “ఏటీఎం” మాదిరిగా ఉపయోగపడుతున్ననదని విప క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిధులను అభివద్ధి పనులకు ఉపయోగిస్తే రాష్ట్ర పరిస్థితి మరో స్థా యిలో వుండేదని అవి స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు రాష్ట్రంలో పడకేసిన మౌలిక సదుపాయాల కల్పనను ఉదాహరణగా చూపుతున్నాయి. పునరుద్ధానం కోసం యత్నిస్తున్న బీఆరఎస్ ఈ అవి నీతిని “తెలంగాణ ఆత్మగౌరవానికి” ముడిపెట్టి బలంగా ముందుకు సాగితే ఫలితం వుండవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విచారణలు, లీగల్ కేసులపై (నేషనల్ హెరాల్డ్ కేసు, ఈడీ దాడులు) ప్రభుత్వం అనివార్యంగా దష్టిపెట్టడంవల్ల పరిపాలన దెబ్బతింటోంది. పాలనాపరమైన ఈ అంతరాన్ని 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి విపక్షాలు ప్రజల్లో బాగా నాటగలిగితే, ప్రభుత్వ వ్యతిరేక తకు ఇది కూడా తోడవడం లాభిస్తుంది.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రేవంత్ దూకుడును అడ్డుకోవడానికి విపక్షాలు అందుకు దీటైన ప్రణాళికలు వేస్తూ ముందుకెళ్లడం తప్ప మరోమార్గంలేదు. దీన్ని ఎంతమేర రాబోయే ఎన్నికల నాటికి విపక్షాలు అందిపుచ్చుకోగలుగుతాయన్నది వేచిచూడాలి.

మౌనిక ఆత్మకి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ..

మౌనిక ఆత్మకి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రం లో అంబేడ్కర్ చౌరస్తా వద్ద
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో.. ఫిబ్రవరి 18 వ తారీఖున అగ్రకుల రెడ్లు… రజక కులస్తులైన నలుగురు సోదర సోదరీమణులపై దాడి చేయడం జరిగింది ఒక మాదిగ స్త్రీపై దాడి చేయడం జరిగింది. అదే క్రమంలో రెండు నెలల పసిపాపని కాలితో తన్ని చంపడం జరిగింది. ఈ ఘోరమైన సంఘటనని ఖండిస్తూ చనిపోయిన మౌనిక ఆత్మ శాంతి కోసం… బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా వివిధ ప్రజాసంఘాలు సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీని భారీ ఎత్తున
నిర్వహించడం జరిగింది…
అదే విధంగా అగ్రకుల రెడ్ల దిష్టిబొమ్మ ను దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ క్యాతం మహేందర్ మాట్లాడుతూ
కుమ్మెర గ్రామంలో దాడి చేసిన రెడ్లoదరిపై బలమైన సెక్షన్స్ అన్ని పెట్టి కేసును బలంగా నడిపించాలని వారికి సరైనటువంటి శిక్ష వేయకుంటే ప్రజల మధ్యన అహంకారపు రెడ్లకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని మౌనిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్సగ్రెషియా చెల్లించాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ కో -కన్వీనర్స్ జోగు బుచ్చన్న చిలుక సమ్మయ్య, పిల్లి క్రాంతి కుమార్, పిక్కల సారయ్య,రఘువరన్ బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ సిపియుఎస్ ఐ వావిలాల లక్ష్మణ్ చంద్రగిరి శంకర్ భూపాలపల్లి రజక సంఘం అర్బన్ అధ్యక్షులు వైనాలా శోభన్ బాబు,గోపరాజు రాజు ప్రధాన కార్యదర్శి, నాంపల్లి కుమార్, చిలకాని రమేష్,ఫైండ్ల రఘు, వైనాలా శంకర్, ఫిట్ సెక్రటరీ సమ్మన్న, , ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు, నాయకులు పుల్ల అశోక్, కొయ్యాడ రమేష్,చెన్నూరి నరసింహ, బోయిని ప్రసాద్, బండారి దశరథం, జేఏసీ నాయకులు బొజ్జపెల్లి మహర్షి, రేణుకుంట్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు

వార్డ్ సభ్యులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు…

వార్డ్ సభ్యులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.సోమవారం టిఓటి ల ద్వారా గ్రామ పంచాయతీ పరిపాలన,స్థానిక సంస్థల బాధ్యతలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం,ఆర్థిక నిర్వహణ, పాలన పారదర్శకత,గ్రామ సభల నిర్వహణ,శానిటేషన్,ప్రభుత్వ పథకాల అమలు వంటి వివిధ అంశాలపై వార్డ్ సభ్యులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.మొదటి విడతగా ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 27 వరకు 10 గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.రెండవ విడతగా మార్చి 4 నుండి మార్చి మూడవ తేదీ వరకు మరో 10 గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు హాజరై,నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.ప్రజలతో సమన్వయం,పారదర్శకత,బాధ్యతాయుత పరిపాలన అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసీల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు,సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి,టిఓటి లు సురేశ్,రమేష్,దేవేందర్,సురేశ్ లు,పంచాయతీ కార్యదర్శులు,మండలంలోని వివిధ గ్రామాల వార్డ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సర్పంచుల.ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్.కి.వినతిపత్రం…..

సర్పంచుల.ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్.కి.వినతిపత్రం…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో .కలెక్టర్కు వినతిపత్రవినతి. ఇట్టి విషయమై తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఉన్న .కాలేశ్వరం 11.వ .ప్యాకేజీ కాల్వ పనులు పూర్తి .చేయనందున. కాలేశ్వరo .ప్రాజెక్టు ఎల్ ఎం సి.11/6.11/5.11/4. సంబంధించిన కాలువ పనులపై కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవనీయులైన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చొరవ తీసుకొని అసంతృప్తిగా ఉన్నకాలేశ్వరం.ప్రాజెక్టు కాలువ .పనులను పూర్తి చేసి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు .కాలేశ్వరం ప్యాకేజీ పనులు పూర్తిచేసి కాలువ నీటి ద్వారా. రైతులను ఆదుకోవాలని. దయచేసి వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ . తీసుకొనికాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ కాలువల ద్వారా రైతులకు నీరు అందించే విధంగా పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో చర్చ జరిపి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని పలు గ్రామాల రైతుల తరఫున సర్పంచులు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల. సర్పంచుల .ఫోరం అధ్యక్షులు పూర్మాని రాజశేఖర్ రెడ్డి. బస్వాపూర్. రామన్న పల్లె సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి. అనిల్. అంకుసాపూర్ సర్పంచి అంచ శ్రీనివాస్ రెడ్డి.లక్ష్మీపూర్ సర్పంచ్ నాయిని సాయి కృష్ణ గౌడ్. పాపాయిపల్లి. సర్పంచ్ చెన్నవేనీ.పరశురాములు. ఉప సర్పంచ్ గణపురం శ్రీనివాస్. రామనపల్లె యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు విద్యార్థులకు. సృజనాత్మకత. న్యాయకత్వ. లక్షణాలు మరియు ఆధునిక ఆలోచనలను వెలికి తీసే కార్యక్రమం ద్వారా. అగ్రి యూత్ ఫెస్ట్. (యువజన ఉత్సవాలు) ఈనెల .18.వ తేదీ నుండి .21.వ. తేదీ వరకు మూడు రోజులపాటు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన. వారిని. గ్రీన్ ఎక్స్కో. స్టోరీ టెల్లింగ్. జానపద గీతాలు. ఒగ్గు కథ. డ్యాన్స్. బీట్ లైవ్ పోటీలలో. ప్రథమ స్థానంలో. నిలవగా. ఉపన్యాసం వ్యాసరచన. దేశభక్తి గీతరచన. స్పెల్ బి. ఏకో రంగోలి. లవ్ పెయింటింగ్ పోటీలలో. ద్వితీయ స్థానంలో నిలిచారు. జానపద .నృత ప్రదర్శనలో. తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల ప్రతిభకు సృజనాత్మకతకు. ఈ యువజన ఉత్సవాలలో. ఓవరాల్ ఛాంపియన్షిప్ లను. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలు సొంతం చేసుకుంది. వీటిని.PJTAU. యువజన ఉత్సవాలలో.BJR. అగ్రికల్చర్ కాలేజీ .ఓవరా ల్. ఛాంపియన్షిప్ గా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ . డా. కె. బి. శ్వేతా దేవి. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు.ఇటువంటి కార్యక్రమాలు. నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తమ కళాశాలకు మంచి పేరు తీసుకోవడానికి కృషిచేసిన విద్యార్థులకు బోధన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శిరిడి సాయిబాబాకు పూజలు చేసిన వైస్ చైర్మన్ శ్రీనివాస్…

శిరిడి సాయిబాబాకు పూజలు చేసిన వైస్ చైర్మన్ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి శాలువాతో సన్మానం చేసి శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు నీపై నీ గెలుపుకు కృషి చేసిన 15వ వార్డు ప్రజలకు ఉండాలని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చన అభిషేకాలు చేపించడం జరిగిందిa

చిన్నారిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి…

చిన్నారిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కేవలం ప్రమాదం కాదని, ఇది అగ్రకుల దౌర్జన్యం, వ్యవస్థాపిత నిర్లక్ష్యం సామాజిక నేరమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ తీవ్రంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బాధితుడు దళిత కుటుంబానికి చెందినవారని తెలిసినా, కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా అధికారుల కనుసన్నల్లోనే అగ్రకులానికి చెందిన నేరస్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం వారు అన్నారు

నా ఇల్లు కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి..

నా ఇల్లు కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి

పొట్టి పోషం ఎస్సీ మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

కాటారం గారెపల్లి పోతులవాయి గ్రామ శివారులోని సర్వే, చెం. 254/2 లో 0.22 పంట భూమి పట్టా కబ్జాకు కలదు. భూమి లావాణి పట్టా ఈ భూమిని పొట్టి పోషము, భర్త, పోచయ్య, వయస్సు, 55 సం॥లు, కులం, ఎస్.సి (మాదిగ), ఆర్/ఓ 25 సం॥లుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను. నాకు ఈ భూమిపైన హైకోర్టు ఆర్డర్ ఉన్నది. ఈ భూమిలో నేను సంవత్సరము క్రింద నాలుగు రూముల ఇల్లును కూడా నిర్మించుకున్నాను. నేను దసరా పండుగకు ఊరికి పోయిన సమయంలో తేది. 10,10, 2024 రోజున అర్ధరాత్రి సుమారు 12గం॥ల ప్రాంతంలో 1) వంగల సుదర్శన్, తండ్రి. నర్సయ్య,ఆర్/ఓ మహదేవ్ పూర్, 2) ఓదెల సదయ్య, ఆర్/ఓ కాటారం, కులం.బి.సి అగ్రకులం వారు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నా ఇంటి పైన ఉన్న సిమెంట్ రేకులను ముక్కలు ముక్కలుగా పగులగొట్టి నేలమట్టం చేసినారు. నా ఇంటి లోని కరెంటు మీటర్ను పగలగొట్టినారు. గోడలకు ఉన్న కరెంటు బోర్డులు పగులగొట్టినారు. నాకు 50వేలు ఆర్ధిక నష్టం చేసినారు. జనగాం శంకరయ్య అను అతని ఇంటిపై నుండి నేను కరెంటు వైరు తీసుకున్నందుకు వంగల సుదర్శన్ అను అతను ఆయన నన్ను కరెంటు వైరు ఎందుకు పోనిచ్చినారని భూతులు తిడుతూ బయబ్రాంతులకు గురిచేసి మరుసటిరోజు ఇంటి పైన రేకులను కూలగొట్టినారు. వారితో నాకు ప్రాణభయం ఉన్నది. ఇట్టి విషయం పై కాటారం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయగా నాయొక్క పిటీషన్ తీసుకోలేదు. కావున జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి నాకు న్యాయం చేయగలరు పొట్టి పోశయ్య విజ్ఞప్తి చేశారు

రచన్న స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు..

రచన్న స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలం బడంపేట గ్రామంలోని ప్రముఖ రచన స్వామి ఆలయంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, నాయకులు ,
కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు,

నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని,

నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని, అగ్రవర్ణ అహంకారం తో రజక కుటుంబం పైన దాడి చేసినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం రజక సంఘం సభ్యులు డిమాండ్ చేసారు.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో 18వ తేది నాడు నాగర్ కర్నూల్ జిల్లాలో రజక కుటుంబం పై జరిగిన హేయమైన చర్యను నిరసిస్తూ. రెండు నెలల పాప, ముక్కుల పచ్చలారని పసికందును చంపడం.గుడిళ్ళోకి వంద రూపాయల రుసుము చెల్లించే దర్శనం చేసుకొని పోవాలని ఒక నియమంని పాటించాల్సిందని రజక కులాస్తురాలైన మూడు నెలల పాపను మరియు ఆ కుటుంబాన్ని విపరితమైన పదజాలంతో తిడుతూ వాళ్లపై చేయి చేసుకున్న సందర్భంలో ఆ యొక్క పాపను కూడా కొట్టి చంపడం జరిగింది. దాని నిరసిస్తూ ఈరోజు చందుర్తి మండల సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే దోషులు ఉన్నారో ఆ రెడ్డిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఇటు పోలీస్ శాఖను అటు న్యాయ శాఖను మరియు హ్యూమన్ రైట్స్ ని ఈ రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క దుండగులను వెంటనే శిక్షించి జైల్లో పెట్టాలని చందుర్తి మండలం రజక సంఘం కోరుకుంటుంది అలాగే ఈ హేయమైన చర్య ఇకపై జరిగితే క్షమించమని తెలియజేస్తూ.
మండల శాఖ అధ్యక్షులు సుద్దాల నరసయ్య ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నరసయ్య సుద్దాల మరియు లింగంపల్లి వెంకటి మరియు శ్రీకాంత్ అలాగే గంగరాజు అలాగే మహేష్ శ్రీకాంత్ లింగంపల్లి రాము మరియు తదితరులు రజక సంఘ సభ్యులు ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది.

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటునని మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు

జమ్మికుంట ప్రతినిధి( నేటి ధాత్రి)

 

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ మరియు ఆయమ్మలతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని, కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, శౌచాలయాల నిర్వహణ, వంటగది పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు ఉంటే వెంటనే నివేదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చుంచు రమ చింతల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు కూడా అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.
పిల్లల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు పట్ల మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల అభివృద్ధికి పునాది వంటివని చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకువస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు చైర్మన్ ఈ పర్యటనను అభినందిస్తూ చిన్నారుల సంక్షేమం పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు…

error: Content is protected !!
Exit mobile version