ఐటీ పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం…

ఐటీ పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం

న్యాయం చేయాలని కలెక్టర్‌ ను ఆశ్రయించిన బాధితుడు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఐటీ పార్క్ భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత రైతు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.తనకి వాస్తవంగా (నక్ష ప్రకారం) ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నప్పటికీ,అధికారుల నిర్లక్ష్యంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు.వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 159/37లో తన కుటుంబం సంవత్సరాలుగా నిరంతరంగా భూమిని సాగు చేస్తోందని,వాస్తవ స్వాధీనంలో ఉన్న మొత్తం విస్తీర్ణం 5 ఎకరాలు 02 గుంటలుగా ఉందని ఆయన పేర్కొన్నారు.అయితే పాస్‌బుక్‌లో ఒక్క ఎకరం 01 గుంట మాత్రమే నమోదై ఉండటాన్ని కారణంగా చూపి,మిగతా భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు.భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని,గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు.కేవలం పత్రిక ప్రకటనకే పరిమితం కావడంతో అభ్యంతరాలు తెలిపే అవకాశం కోల్పోయామని పేర్కొన్నారు.అలాగే ప్రాథమిక విచారణ నివేదికలో కూడా వాస్తవ స్థితిని పక్కనపెట్టి,యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని వివరించారు.ఇదే భూసేకరణలో తమలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర రైతులకు నక్ష ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించగా,తన విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆయన వాపోయారు.భూసేకరణ ‘కాన్సెంట్ అవార్డు’ పేరిట జరిగిందని చెబుతున్నా తన నుంచి స్వచ్ఛంద సమ్మతి తీసుకోలేదని,ఒత్తిడితో సంతకాలు సేకరించారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో మిగిలిన భూమికి కూడా నక్షా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని లేదా స్పష్టమైన కారణాలతో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.జిల్లా స్థాయిలో స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ ఖూనీ చేస్తున్నారు…

ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ ఖూనీ చేస్తున్నారు

అంగబలం,అర్థబలం,అధికార మదంతో దౌర్జన్యంచేస్తున్నా మంత్రి వివేక్ ఖబర్దార్

మంత్రి వివేక్ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ములుగు జిల్లా బిఆర్ఎస్ దళిత నాయకులు

మంగపేట,నేటిధాత్రి

https://youtu.be/RsmS54EeUj0?si=mgFQTkKPYm0-yF76

 

 

చెన్నూరు మున్సి పాలిటీలో ప్రజలు తీర్పు ఇచ్చి కార్పొరే టర్లను గెలిపిస్తే ఆ తీర్పును గౌరవించా ల్సింది పోయి పోలీసుల అండతో అధికార మదంతో ప్రతిపక్ష నాయకులు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేపించ డం అక్రమంగా నిర్బం ధించడం ప్రజాస్వా మ్యానికే గొడ్డలి పెట్టని ములుగు జిల్లా బిఆ ర్ఎస్ దళిత నాయ కులు చీట్టిమల్ల సమ్మయ్య అన్నారు. ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు మంగపేట మండల రాజుపేటలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకుల సమావేశం అయన మాట్లాడుతూ ​తెలంగాణ రాజకీ యాల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ప్రజాస్వామ్యమా?లేక ధనస్వామ్యమా? అనే అనుమానం కలగక మానదు ​అధికారం.. అహంకారం అక్రమ నిర్బంధంతో ​ఉద్యమ నాయకుడు బాల్క సుమన్‌పై జరుగుతున్న దాడులు ఆయనను అక్రమంగా జైల్లో పెట్టడం కేవలం భయాం దోళనలను సృష్టించే పిరికిపంద చర్య మంత్రి వివేక్ తనకున్న వేల కోట్ల ఆస్తుల అహంకా రంతో పోలీసులను పావులుగా వాడు కుంటూ సామాన్యు లపై, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనా యించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కి,ఆర్థిక బలంతో రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు పదవుల కోసం పాకులాట విలువలు లేని రాజకీ యం​పూటకో పార్టీ మారి పదవుల కోసం ఎవరి కాళ్ళకైనా మొక్కే సంస్కృతి మంత్రి వివేక్ ది అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం రాజ కీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పని చేస్తు న్న ఈ కాంగ్రెస్ ప్రభు త్వానికి కాలం దగ్గరప డింది అర్థబ లంతో అధికారాన్ని కొనాలని చూస్తే,అదే ప్రజలు రేపు మిమ్మల్ని కాలగర్భంలో కలిపే యడం ఖాయం అని హెచచ్చరిం చారు.ఈ కార్యక్ర మంలో బిఆర్ఎస్ దళిత నాయకులు బియ్యం శ్రీను,నిమ్మగడ్డ ప్రవీణ్,కర్రీ శ్రీను,బోడ ప్రసాద్,నిట్ట శ్యాం ప్రసాద్,పతేమ్ సందీప్, పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో జాతరలో కలకలం

నాగర్‌కర్నూల్‌లో జాతరలో కలకలం

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

కుమ్మర మల్లన్న జాతర లొ దాడిని నిరసిస్తూ నెక్కొండలో బహుజన సంఘాలు నెక్కొండ సాకలి ఐలమ్మ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు.
నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెర గ్రామంలో జరిగిన కుమ్మర మల్లన్న జాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సందర్భంగా జాతరకు దైవదర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబంపై కొందరు దాడి చేసి దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపించారు.
బాధిత వర్గాల కథనం ప్రకారం, తాము ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, కుల దూషణలకు దిగారని తెలిపారు. అనంతరం జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసిందని, దాడిలో చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ ఘటనకు సంబంధించి కొందరు స్థానిక నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా పోలీసులు ధృవీకరణ ఇవ్వాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలంటూ బాధిత కుటుంబం మరియు బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఎంఆర్‌పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదునూరి యాకయ్య నెక్కొండ మండలంలో మాట్లాడుతూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల రజక సంఘం నాయకులు బొడ్డు పెళ్లి రాజ్ కుమార్, రామారావు రాము, అలాగే ఇతర కుల సంఘాల ప్రతినిధులు కూడా సంఘటనను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల దర్యాప్తు నివేదిక అనంతరం నిజానిజాలు వెలుగులోకి రానున్నాయని ఉన్నారు.

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన: నిదానంగా ప్రయాణించండి..

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన: నిదానంగా ప్రయాణించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలు నడపాలని, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, నిదానంగా ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు సిగ్నల్‌ను అతిక్రమించవొద్దన్నారు. రోడ్డుపై పార్కింగ్‌ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌ మా ట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్‌ పత్రాలు, లైసెన్సులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డైవర్లు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి- కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్..

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి- కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్లను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని, సెస్సు రెండు పర్సెంట్ పెంచాలని, సహజ మరణం కింద ఇచ్చే డబ్బులను ఐదు లక్షలకు పెంచాలని, డెలివరీ పెండ్లి కానుక లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్ 12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు మూడు వందల నలభై ఆరు కోట్లు ప్రైవేటు భీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లేము లకు వెంటనే నిధులు విడుదల చేసి అరవై సంవత్సరాలు పైబడిన కార్మికునికి పెన్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గందె కొమురయ్య మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించి 2009 నుండి రెన్యువల్ కానీ పన్నేండు లక్షలకు పైగా ఉన్నా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు. కార్మిక శాఖలో ఓబీసీకి ప్రత్యేకంగా యంత్రాంగాన్ని నియమించాలని కార్మికశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మీసేవలో అధిక డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణాల్లో ఉన్న లేబర్ అడ్డాల వద్ద తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గందే కొమురయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, గామినేని సత్యం, పుట్ట మహేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

డిసిసిల శిక్షణ శిబిరంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్…

డిసిసిల శిక్షణ శిబిరంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/RsmS54EeUj0?si=mgFQTkKPYm0-yF76

 

హైదరాబాదులో ఏఐసీసీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర డిసిసిల శిక్షణ శిబిరంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని శిక్షణ శిబిరం సమావేశాల్లో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింద

నిందితులను కఠినంగా శిక్షించాలి..

నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మేర గ్రామంలో మూడు రోజుల కిందట 18 -2-26 తేదీన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రజక కుటుంబం ,స్వామివారి దర్శనం కోసం టికెట్టు లేకుండా గుడిలోకి ప్రవేశించారని,గ్రామ సర్పంచ్, మరియు ,అగ్రకుల పెత్తందారులు,రజకులను దుర్భాషలాడుతూ, విచక్షణ రహితంగా దాడి చేసి, అసభ్య పదజాలం తో దూషించి , రెండు నెలలు నిండిన పసిపాపన్ని నిర్దాక్షణంగా, కిరాతకంగా తన్ని, పాపని చంపడం దురహంకార చర్య అని, ఇంత దారుణానికి ఒడి కట్టిన అగ్రకుల పెత్తందారులకు అధికారులు, పోలీస్ లు సహకరిస్తూ, కొమ్ము కాస్తున్నారని,రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుండి దళితులు, బలహీన వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ కరువైందని,ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిందితులపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ,మాలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి..

పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి

భూపాలపల్లి యాదవ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను చూడకుండా కఠినంగా శిక్షించాలి తన చావుకు కారణమైన అగ్రవర్ణ కుల అహంకారాన్ని యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే బిసి కులాలన్నీ ఐక్యంగా ఉద్యమాలు చేయాలని అందులో యాదవుల పాత్ర ముందు వరసలో ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పెంట సదానందం పోలవేణి అశోక్ యాదవ్ నలినీటి సతీష్ యాదవ్ మెరుగుల మహేందర్ యాదవ్ గారవేన సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ బీమా తో కుటుంబాలకు భరోసా..

అందరికీ బీమా తో కుటుంబాలకు భరోసా

ఇబ్రహీంపట్నం నేటిదాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అందరికీ భీమా మన గ్రామానికి ధీమా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆకస్మితంగా జరిగే ప్రమాదాల వలన కుటుంబం రోడ్డు పాలు అవుతుందని అందుకే ప్రధానమంత్రి భీమ యోజన మన గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ పథకం కుటుంబానికి ఎంతో అండగా ఉంటుందని సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకటి మాట్లాడు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జయ నర్సయ్య మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు,

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…?

గణపురం నేటి ధాత్రి

 

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా, కమ్మెర గ్రామంలో రజక (చాకలి )కులస్తులు గుడిలోకి వచ్చారని రెడ్డి కులానికి చెందిన తుకారాం రెడ్డి తన అనుచరులు, రజకులను విచక్షణ రైతంగా కొట్టి రెండు నెలల పసికందును కాలితో తన్ని చంపిన విషయాన్ని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెడ్డి వెలమలకు ఓట్లు వేస్తే గుడికి వెళ్లిన బడికి వెళ్లిన అణగారిన వర్గాలకు చెందిన వారు చనిపోవాలా? ఇదేనా ప్రజా పాలన అంటే? రెడ్డి అగ్ర కులానికి చెందిన వీరిపై మర్డర్ కేస్ నమోదు చేయాలి .సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగం కల్పించిన సమన్యాయం కల్పించాలని పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.

నూతన జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

నూతన జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నూతన జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించి వారిని సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “అందరికి శుభాకాంక్షలు,పదవి అనేది బాధ్యత మాత్రమే కాదు, ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ముందుకు సాగుతారని ఆశిస్తున్నా అని అన్నారు

ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి..

ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
మండల కేంద్రాల్లోనే దరఖాస్తులు స్వీకరణ..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజా సమస్యల నివృత్తి కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నిజాంపేట మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని నేరుగా బాధితుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల దూర భారాలను దృష్టిలో ఉంచుకొని మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వివిధ సమస్యల నిమిత్తం ప్రజలు ప్రజావాణి కార్యక్రమన్నీ సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. సమస్యల సంబంధించి ఆయా శాఖల అధికారులకు దరఖాస్తులు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు

బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర…

బడంపేటలో అంగరంగ వైభవంగా రాచన్న స్వామి జాతర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటలో రాచన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి విభూతి శివరుద్రప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్ద సోమవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో భక్తుల కోలాహలం నెలకొంది.

సమస్యల వలయంలో నర్సంపేట గర్ల్స్ హై స్కూల్..

సమస్యల వలయంలో నర్సంపేట గర్ల్స్ హై స్కూల్

ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో గర్ల్స్ హైస్కూల్ సందర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యల సుడిగుండంలో విలయతాండవం చేస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరోపించారు.ఈ సందర్భంగా సోమవారం పట్టణంలో గల గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జన్ను రమేష్, చుక్క ప్రశాంత్ లు సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థులకు కనీసం క్లాసు రూమ్ లేకపోవడం వలన ఇప్పటికే వారు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారని అన్నారు. క్లాస్ రూములు, టాయిలెట్స్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉన్నవరకు టాయిలెట్స్ శుభ్రం లేకపోవడం వాటికి డోర్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నది తెలిపారు.నీళ్లు వృధాగా పోవడం వలన ఆటస్థలం మొత్తం బురదమయంగా ఉన్నది పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా ఫ్యాన్లు లేవని, ఏడో తరగతి విద్యార్థులకు డిజిటల్ ప్రొజెక్టర్ ఉన్నా కూడా అది ఉపయోగంలో లేదని ఇప్పటికైన సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్, తరుణ్,చరణ్, జాన్, వర్షిత్, పల్లవి,సుగుణ,మానస, అఖిల తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

మల్యాల గ్రామపంచాయతీకి వైకుంఠ రథాన్ని అందజేసిన మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ…

మల్యాల గ్రామపంచాయతీకి వైకుంఠ రథాన్ని అందజేసిన మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ – దుబాయ్ గ్రూపు సభ్యులు.

చందుర్తి, నేటిధాత్రి:

 

విదేశాల్లో ఉండి కూడా గ్రామాభివృద్ధికి సహాయం చేయవచ్చని చందుర్తి మండలం మల్యాల గ్రామ వాస్తవ్యులు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వాట్సప్ గ్రూపు సభ్యులుగా ఏర్పడి దాదాపు 3 లక్షల రూపాయలు చందాలుగా పోగుచేసి వైకుంఠ రథాన్ని తయారు చేయించారు .ఇట్టి రథాన్ని గ్రామ పంచాయతీ వారికి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు 15 లక్షల రూపాయలను చందాలుగా తయారుచేసి గ్రామంలో వివిధ కార్యక్రమాలకు పంపించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ ఎఎస్పీ రిత్విక్ సాయి మాట్లాడుతూ…. పొట్టకూటి కోసం విదేశానికి వెళ్లి కొన్ని సందర్భాల్లో బిజి లైఫ్ లో ఉండి గ్రామాన్ని పట్టించుకునే పరిస్థితి లేకున్నా వారి కష్టార్జితం నుండి గ్రామాభివృద్ధికి సహాయం చేయాలన్న స్ఫూర్తితో వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి చందాలతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామానికి అందించిన గ్రామాభివృద్ధి కమిటీ- దుబాయ్ గ్రూపు సభ్యులను అభినందిస్తూ పుట్టినప్పుడు చాలా వేడుకలు ఏ విధంగా అయితే చేసుకుంటామో చనిపోయిన వారిని కూడా సకల మర్యాదలు చేయాలని సుప్రీంకోర్టు హక్కు కల్పించారని అన్నారు . గ్రామానికి అందించిన వైకుంఠ రథాన్ని గ్రామపంచాయతీ వారు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై జిల్లెల్ల రమేష్, గ్రామ సర్పంచ్ మందాల శారద, ఉపసర్పంచి అనపర్తి నరేష్ కుమార్ , హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర , గ్రామ వార్డు సభ్యులు పత్తిపాక లావణ్య, అర్షం అనూష ,ఈసరి శిల్ప, లింగాల శ్రీనివాస్,పాటి సుధాకర్, తూమ్ గణేష్, గుంటపల్లి నారాయణ, పిట్ల మనోహర్, లక్కే సుదర్శన్,దుబాయ్ గ్రూప్ సభ్యులు పులి భాస్కర్, కొట్టే ప్రసాద్, అర్సం లోహిత్, ద్యావనపెళ్లి లక్ష్మీనారాయణ, కోన నరేష్, కొడగంటి గంగాధర్, కొడగంటి దేవయ్య, ఎంజాల నరేష్, లింగంపల్లి మదు సూధన్, తోగరి గంగాధర్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, గ్రామస్తులు యువకులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు. అలాగే మల్యాల గ్రామానికి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు ఏఎన్ఎం పద్మ, ఎస్తార, కవిత, మంజుల, భాగ్య లను దుబాయ్ గ్రూపు వారు శాలువాతో సత్కరించి సన్మానించారు. వారితో పాటుగా గ్రామంలోని పలువురు పెద్దలను శాలువాలు కప్పి సన్మానించారు.

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు..

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు

క్లీనింగ్ పట్ల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డు వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి, మురికి నీరు ఒకే దగ్గర ఉండటం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో మురికి నీరు ఉండటం వలన దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్రమైన పడుతుంటే వాటిని శుద్ధి చేసేందుకు గాని 4 రోజుల నుండి మున్సిపాలిటీ జేసిబి అడుగుతుంటే, ఆయిల్ మార్పించాలని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిఅంటున్నారని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పని ఏం ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు అవసరైన పనులను నిర్లక్ష్యంగా వ్యవహరించకూడా పనులు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ లో గణపురం క్రీడాకారులు..

రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ లో గణపురం క్రీడాకారులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం సీఎం కప్ సెకండ్ ఎడిషన్ 2026 రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ క్రీడల లలో పాల్గొన్న గణపురం మండల కేంద్రానికి చెందిన క్రీడాకారులు. సీఎం కప్ 2026 లోభాగంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన బాల్ బ్యాట్మెంటన్ క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఖమ్మం లో నిర్వహించిన బాల్ బ్యాట్మెంటన్ రాష్ట్రస్థాయి క్రీడలలో పాల్గొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంమండల కేంద్రానికి చెందిన క్రీడాకారులు కల్లూరి రాజ్ కుమార్, కల్లూరి సాగర్, పసునూటి అభిరామ్ ,కోచ్ మామిడిశెట్టి రవి పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు కు ప్రజలు ఇబ్బందులు…

అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు కు ప్రజలు ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో మిషన్ భగీరథ అధికారుల సమన్వయ లోపం కారణంగా మిషన్ భగీరథ నీళ్లు జహీరాబాద్ నియోజకవర్గం ప్రజల కు సకాలంలో అందకపోవడంతో ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించాలని డి ఈ మరియు ఏ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలవక జహీరాబాద్ పట్టణం ప్రజలతోపాటు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి డి ఈ, మరియు ఏ ఈ మరియు కిందిస్థాయి సిబ్బంది కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు నీళ్లు అందించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. అధికారులు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎందుకంటే వారి ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోతుంది.

అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్

అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు.

తూర్పుగోదావరి, ఫిబ్రవరి 23: రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించామని వివరించారు. అలాగే పాల వ్యాపారికి చెందిన 42 గేదెల నుంచి పాలు సేకరించి.. ఆ శాంపిల్స్‌ను కూడా హైదరాబాద్ ల్యాబొరేటరీలకు పంపామన్నారు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న అనూరియా(మూత్రం నిలిచిపోవడం)పై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన అంశాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల తప్ప నాయకుల తప్ప..

ప్రజల తప్ప నాయకుల తప్ప..?

నాయకుల మీద ప్రజలకు పెరుగుతున్న అసంతృప్తి

టికెట్ వచ్చే వరకు ఒక పార్టీ…గెలిచాక ఇంకొక పార్టీ…

పరకాల,నేటిధాత్రి

 

రాజకీయాల్లో విలువలు ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్నలు రోజురోజుకీ బలంగా వినిపిస్తున్నాయి.ఎన్నికల ముందు ఒక పార్టీ జెండా ఎగరేస్తూ,ఆ పార్టీ సిద్ధాంతాలపై ప్రసంగాలు చేసే నాయకులు,టికెట్ రాకపోతే వెంటనే మరో పార్టీలో చేరడం సాధారణమైపోయింది.ప్రజల ముందర సేవాభావం అంటూ చెప్పుకునే నాయకులు,పదవి కోసం మాత్రం సిద్ధాంతాలను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది.ఎన్నికల సమయంలో “మా పార్టీ మా ప్రాణం”అంటూ హామీలు ఇస్తూ,ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన పార్టీలోకి చేరడం కొత్త సంస్కృతిగా మారుతోంది.ఇది ప్రజాస్వామ్యానికి మేలా?
లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటు వేసే సమయంలో ప్రజలు పార్టీ సిద్ధాంతాలను,
అభ్యర్థి నిబద్ధతను విశ్వసించి తమ తీర్పు ఇస్తారు.కానీ ఆ విశ్వాసం నిలబెట్టుకోవాల్సిన నాయకులే
పార్టీ మార్పులతో ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నారు.టికెట్ రాకపోతే అసంతృప్తి,టికెట్ రాగానే ఆనందోత్సాహాలు,
గెలిచాక మరో పార్టీ వైపు చూపు ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిందనే భావన ప్రజల్లో కలుగుతోంది.సాధారణ కార్యకర్తలు సంవత్సరాల పాటు కష్టపడితే,అంతిమంగా అవకాశాలు మాత్రం ఆఖరి నిమిషంలో చేరిన వారికే దక్కుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.పార్టీల్లో కష్టపడిన వారిని పక్కనబెట్టి,
వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రాధాన్యం ఇవ్వడం అసంతృప్తికి దారి తీస్తోంది.ప్రజలు మాత్రం అభివృద్ధి,పారదర్శకత,
స్థిరత్వం కోరుకుంటున్నారు.కానీ నాయకుల పార్టీ మార్పులు
ఆ ఆశలను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎన్నికల సమయంలో ఒక మాట,
ఎన్నికల తర్వాత మరో మాట ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమా అనే చర్చలు జరుగుతున్నాయి.ప్రజల ఓటు విలువను కాపాడాల్సిన బాధ్యత
ఎన్నికైన ప్రతినిధులపై ఉంది.
అయితే పదవుల కోసం పార్టీ మార్పులు
ఆ బాధ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.ప్రజలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.ఎవరు నిజంగా సేవాభావంతో ఉన్నారు?ఎవరు కేవలం అవకాశవాదులే? అన్నది గమనిజంచే పనిలో ఉంటున్నారు.రాజకీయాల్లో స్థిరత్వం,సిద్ధాంతాలకు కట్టుబాటు,ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం
ఇవే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులని చెప్పవచ్చు.ప్రజలు మారాలని కొందరు అంటున్నారు.
నాయకులు మారాలని మరికొందరు అంటున్నారు.అయితే నిజమైన మార్పు
నాయకుల నిబద్ధతలో కనిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.పార్టీ మార్పులు కాదు,ప్రజా సేవే ముఖ్యమని నిరూపించగలిగినప్పుడు మాత్రమే
నాయకులపై విశ్వాసం మరింత బలపడుతుంది.అంతవరకు ఈ ప్రశ్న మాత్రం వినిపిస్తూనే ఉంటుంది.

error: Content is protected !!
Exit mobile version