తిరుపతిలో అత్తలూరి ఆర్యవైశ్య సత్రంలో లాకర్ కు 400 ?

తిరుపతిలో అత్తలూరి ఆర్యవైశ్య సత్రంలో లాకర్ కు 400 ?

ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఏపీ అధికారులు
వనపర్తి నేటిధాత్రి:

 

 

 

తిరుపతి లో రైల్వే స్టేషన్ ఎదురుగా అత్తలూరి ఆర్యవైశ్య సత్రం లాకర్ ఇవ్వడానికి అత్తలూరు 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని పీడిస్తున్నారు . ఈ మేరకు భక్తులు కొందరు సోమవారం రాత్రి లాకర్ ఇవ్వాలని సత్రం దగ్గరికి వెళ్లి నిర్వాహకులను అడిగారు సత్రం నిర్వాహకులు ఒక లాకర్ ఇవ్వడానికి 400 రూపాయలు చెల్లిస్తేనే లాకర్ ఇస్తామని ఆగ్రహంగా ఆవేశంగా ప్రవర్తించారని భక్తులు తెలిపారు . ఈ మేరకు భక్తులు నేటి దాత్రి దినపత్రిక విలేకరులతో ఆవేదన వ్యక్తం చేస్తూ భక్తులను పీడించి వసూలు చేస్తున్న లాకర్లు రూముల కేటాయింపు ప్రభుత్వ నియమ నిబంధనలు జీఎస్టీ చెల్లించ కుండ రూల్స్ ను ఉల్లంఘించి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ భక్తులను పీడిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి లో అధికారులు ప్రేక్షక పాత్ర వహించిదముపై ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ తిరుపతి కలెక్టర్ తిరుపతి ఎంపీ ఎమ్మెల్యేకు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు సత్రం వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు

వనపర్తి లో త్వరలోనే ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు.

,వనపర్తి లో త్వరలోనే ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

 

ఓటర్ లిస్ట్ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి

 

రాష్ట్ర ఆర్యవైశ్య జిల్లా మహాసభ ఆదేశాలు పాటించాలి

 

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

వనపర్తి పట్టణంలో త్వరలో జరగబోయే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షు డి ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్యుల ఓటర్ లిస్ట్ ఆధారంగా పురుషులు స్త్రీలు 18 సంవత్సరాలు నిండినవారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఓటు హక్కు కల్పించాలని పలువురు ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా నియమించాలని కమిటీ ని వేరుగా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు .

ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడి ఎన్నికలు జరిగే ముందు వనపర్తి ఆర్యవైశ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు సంబంధించి చిట్యాల రొడ్డు లో షాపుల అద్దెలు ఆస్తులు ఆర్యవైశ్య సంగములో చిట్టీలు ఎత్తిన ఆర్యవైశ్యులు ఎంతమంది ఉన్నారు .

ఎంతమందికి చిట్టి డబ్బులు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వలేదు.

వాటి వివరాలు ఆర్యవైశ్య సంగం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య ల సమీక్షములో సమర్పించాలని పూరిబాల్ రాజ్ డిమాండ్ చేశారు.

అప్పులు ఆదాయం ఫంక్షన్ హాల్ అనగా అమ్మవారి దేవాలయంలో వివాహాలు ఇతర అద్దెలు నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం వాటి వివరాలు రెండున్నర సంవత్సరాలలో ఖర్చులు ఆదాయం అప్పులు అన్ని సమర్పించాలని వనపర్తి సీనియర్ ఆర్యవైశ్యులు మేధావులు న్యాయవాదులు ఉపాధ్యాయులు పట్టణ ఆర్య వైశ్యుల తరుపున కోరారు.

ప్రశాంతంగా ఓపికగా లెక్కలు సమర్పించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలని పూరి కోరారు వనపర్తి ఆర్యవైశ్యులు మేధావులు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగే వాటిని అన్ని గమనిస్తున్నారని.

అన్నారు ఈ విషయంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని వెంటనే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నికల నిర్వహించాలంటే

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు సంబంధించి లెక్కలు అప్పులు ఆదాయం అద్దెలు అన్ని సమర్పించి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలు పాటించి ఎన్నికలు ప్రశాంతంగా జేరుగు.

గుటకు కృషి చేయాలని 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు ఎన్నికలు అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా జరుగుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేతలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సీనియర్

ఆర్యవైశ్యులు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సహకరించాలని పూరి కోరారు ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాల్ రాజ్ మాట్లాడుతూ వాసవి అమ్మవారి గుడికి చెందిన

లెక్కలు జమ ఖర్చు లు గత కార్యవర్గ ము వెంటనే సమర్పించాలనిఆర్యవైశ్య ల తరుపున డిమాండ్ చేశారు వనపర్తి లో 2023 2024 లో పాలన చేసిన

ఆర్యవైశ్య కార్యవర్గ ము లెక్కలు ఇవ్వనoదు కు వనపర్తి ఆర్యవైశ్య లు వివిధ రకాలుగా చర్చి oచు కుంటున్నారని పూరి బాలరాజు శెట్టి సెల్ 9642139213 ఆవేదన వ్యక్తంచేశారు

వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం.

వనపర్తి ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరికి ఆర్థిక సహాయం ప్రకటించిన ఆర్యవైశ్యులు

వనపర్తి నెటిదాత్రి:

వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం ఆర్యవైశ్య కాంప్లెక్స్ దగ్గర వృధాగా ఉన్నది. బుధవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ గా పూరి బాలరాజ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మాజీ దహన కమిటీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు సమావేశంలో మాట్లాడుతూ వనపర్తి లో ఆర్యవైశ్య సంఘానికి చందాల రూపంలో ఇచ్చిన దాతలతో వైకుంఠ రథన్ని కొనుగోలు చేశారనిఅన్నారు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం రిపేరు ఉండడంతో నిరుపయోగంగా ఉందని చెప్పారు .వనపర్తి ప్రభుత్వ మున్సిపాలిటీ చెందిన వైకుంఠ రథం ఒకటి ఉన్నదని టైముకు అ వాహనం అందడలేదని అన్నారు ఈ మేరకు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం రిపేరు చేయించడానికి ప్రపంచ రాష్ట్ర జిల్లా పట్టణ ఆర్యవైశ్య అనుబంధ సంఘాల సమీక్షంలో ఆర్యవైశ్య సంఘం దహన కమిటీ మాజీ చైర్మన్ 10000 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. వనపర్తి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ వెంటనే స్పందించి 2000 రూపాయలు ఆర్యవైశ్యుల సమీక్షంలో ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టికి అందజేశారు .ఈ మేరకు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ పట్టణ బిజెపి మాజి అధ్యక్షులు బచ్చురాం మారం బాలీశ్వరయ్య జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు బాదం వెంకటేష్ వనపర్తి పట్టణ అ వో ప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు జర్నలిస్ట్ మారం గోవిందుగుప్తా వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా కంది కొండ సాయరాం చవ్వ పండరయ్య గోకారం రాజు పిన్నం నరేందర్ హర్షం వ్యక్తం చేశారు వైకుంఠ రథానికి రిపేర్ కొరకు ఆర్థిక సహాయం ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు పట్టణ ఆర్యవైశ్య సంఘం సీనియర్ మాజీ అధ్యక్షులు బాదం సుధాకర్ నేటిదాత్రి దినపత్రిక విలేకరితో మాట్లాడుతూ వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం రిపేరి చేయించడానికి తన వంతు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు .. ల్ వెంటనే వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకురి బుచ్చయ్య వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు వైకుంఠ రథాన్ని పట్టణ ప్రజలకు ఆర్యవైశ్యులకు వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య వైకుంఠ రథం ఎవరి స్వంత వాహనం కాదని ఆర్యవైశ్యుల చందాల రూపంలో వసూలు చేసి తెచ్చారని ఆయన గుర్తు చేశారు . ఆర్యవైశ్య వైకుంఠ రథము కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు వెంటనే విధి విధానాలు రూపొందించి వైకుంఠ రథాన్ని వినియోగంలోకి తీసుకు వస్తే వనపర్తి ఆర్యవైశ్యులు హర్షిస్తారని చేసిన సహాయాన్ని వనపర్తి ఆర్యవైశ్యులు మర్చిపోరని బాదం సుధాకర్ అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version