విధులు బహిష్కరించి ఆందోళన చేసిన న్యాయవాదులు….

విధులు బహిష్కరించి ఆందోళన చేసిన న్యాయవాదులు.

కోదాడ, నేటి ధాత్రి:

ఏపీలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను నిరసిస్తూ బుధవారం కోదాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని న్యాయవాది కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, కోశాధికారి కోడూరు వెంకటేశ్వరరావు, లైబ్రరీ సెక్రటరీ గాలి శ్రీనివాస్ నాయుడు, సీనియర్ న్యాయవాదులు నాగార్జున, సుధాకర్ రెడ్డి, రంగారావు, కాకర్ల వెంకటేశ్వర్లు, హేమలత, రంజాన్ పాషా, నాగుల్ పాషా,హనుమంతరావు, పెద్దబ్బాయి, అబ్దుల్ రహీం,ఉయ్యాల నరసయ్య, రియాజ్, తాటి మురళి, రమేష్ బాబు, శరత్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని,

నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని, అగ్రవర్ణ అహంకారం తో రజక కుటుంబం పైన దాడి చేసినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం రజక సంఘం సభ్యులు డిమాండ్ చేసారు.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో 18వ తేది నాడు నాగర్ కర్నూల్ జిల్లాలో రజక కుటుంబం పై జరిగిన హేయమైన చర్యను నిరసిస్తూ. రెండు నెలల పాప, ముక్కుల పచ్చలారని పసికందును చంపడం.గుడిళ్ళోకి వంద రూపాయల రుసుము చెల్లించే దర్శనం చేసుకొని పోవాలని ఒక నియమంని పాటించాల్సిందని రజక కులాస్తురాలైన మూడు నెలల పాపను మరియు ఆ కుటుంబాన్ని విపరితమైన పదజాలంతో తిడుతూ వాళ్లపై చేయి చేసుకున్న సందర్భంలో ఆ యొక్క పాపను కూడా కొట్టి చంపడం జరిగింది. దాని నిరసిస్తూ ఈరోజు చందుర్తి మండల సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే దోషులు ఉన్నారో ఆ రెడ్డిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఇటు పోలీస్ శాఖను అటు న్యాయ శాఖను మరియు హ్యూమన్ రైట్స్ ని ఈ రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క దుండగులను వెంటనే శిక్షించి జైల్లో పెట్టాలని చందుర్తి మండలం రజక సంఘం కోరుకుంటుంది అలాగే ఈ హేయమైన చర్య ఇకపై జరిగితే క్షమించమని తెలియజేస్తూ.
మండల శాఖ అధ్యక్షులు సుద్దాల నరసయ్య ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నరసయ్య సుద్దాల మరియు లింగంపల్లి వెంకటి మరియు శ్రీకాంత్ అలాగే గంగరాజు అలాగే మహేష్ శ్రీకాంత్ లింగంపల్లి రాము మరియు తదితరులు రజక సంఘ సభ్యులు ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version