జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటునని మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు

జమ్మికుంట ప్రతినిధి( నేటి ధాత్రి)

 

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ మరియు ఆయమ్మలతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని, కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, శౌచాలయాల నిర్వహణ, వంటగది పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు ఉంటే వెంటనే నివేదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చుంచు రమ చింతల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు కూడా అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.
పిల్లల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు పట్ల మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల అభివృద్ధికి పునాది వంటివని చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకువస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు చైర్మన్ ఈ పర్యటనను అభినందిస్తూ చిన్నారుల సంక్షేమం పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు…

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రంలో ని నాలుగవ ,ఐదవ కేంద్రం అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, జ్యోతి ఏర్పాటు చేసిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశమునకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ హాజరైనారు. ముందుగా ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని జయప్రద సూపర్వైజర్ హాజరై కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట,పాట, కథ ద్వారా క్రమశిక్షణతో కూడిన ఎల్కేజీ, యూకేజీ నర్సరీ సంబంధించిన విద్యను బోధించి ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడం, రుచిగా, వేడిగా, క్వాలిటీ, క్వాంటిటీ ప్రకారం తల్లులకు, పిల్లలకు భోజనం పెట్టడం పిల్లల బరువులు తీయడం, లోప పోషణ గుర్తించడం బాలమృతం, ఎగ్స్ పంపిణీ చేయడం, కిశోర బాలికలకు, పల్లి పట్టీలు ఇవ్వడం, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, దత్తత, అనాధ బాలబాలికలను గుర్తించి హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని వివరించారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అప్పుడే పిల్లలందరూ అన్ని రంగాలలో ముందంజలో ఉంటారని వివరించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉన్న, అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపినారు. వారి చేతుల మీదుగా ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పల్లి పట్టీలు, బాలమృతం పంపిణీ చేయనైనది. వార్డు మెంబర్స్ తౌటమ్ నవీన్ మైదం శ్రావ్య ఏఎన్ఎం సుమలత , ఆశ వర్కర్ అధిక సంఖ్యలో మహిళలు కిశోర బాలికలు హాజరైనారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version