మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలి సర్పంచ్…

మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలి సర్పంచ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం అప్పలపల్లి గ్రామంలో సర్పంచ్
ఎలుక పెళ్లి రమేష్ ఆధ్వర్యంలో
గ్రామంలోని స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందిస్తున్నారా అని రిజిస్టర్ చెక్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం సంబంధించి కూరగాయలు పప్పులు ఆయిల్ వంట సామాగ్రి చెక్ చేసి మెనూ ప్రకారం పిల్లలకు భోజనం గుడ్లు పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది స్థానిక కిరాణం షాపు లో క్వాలిటీ నాణ్యత ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్ముతున్నారా అని కాంట బాట్లను తనిఖీ చేయడం జరిగింది గ్రామ ప్రజలు పెద్దలకు హెల్త్ డిపార్ట్మెంట్ వారితో బీపీ షుగర్ టెస్టులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనపర్తి వినయ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొడారి రవీందర్ వార్డు సభ్యులకు కొప్పుల దేవేందర్ ఎలుక పెళ్లి నవీన్ నాయకులు దోమల రాజయ్య పిడిశెట్టి దేవేందర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం వినోద ఆశా వర్కర్ ఆడు సభ్యులు గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం…

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం

చీకటాయపాలెం సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శుభ్రత చర్యలు
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ..

పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి గ్రామంలోని పాఠశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శుభ్రపరిచే పనులను దగ్గరుండి చేయించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు అందించే ఆహారం, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించాలని సూచించారు.
అలాగే పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సర్పంచ్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
గ్రామంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటునని మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు

జమ్మికుంట ప్రతినిధి( నేటి ధాత్రి)

 

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ మరియు ఆయమ్మలతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని, కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, శౌచాలయాల నిర్వహణ, వంటగది పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు ఉంటే వెంటనే నివేదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చుంచు రమ చింతల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు కూడా అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.
పిల్లల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు పట్ల మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల అభివృద్ధికి పునాది వంటివని చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకువస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు చైర్మన్ ఈ పర్యటనను అభినందిస్తూ చిన్నారుల సంక్షేమం పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు…

అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి.

అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి.

ఆకస్మికతనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ ఊర్మిళ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గాంధీనగర్, నడిమి పల్లి అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసిన క్లస్టర్ స్పెషల్ఆఫీసర్ నైన్ పాక హై స్కూల్ హెచ్ఎం ఊర్మిళ రెడ్డి , జయప్రద సూపర్వైజర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల పరిశుభ్రత, పిల్లల హాజరు, మెనూ ప్రకారం భోజనం, ప్రీస్కూల్ కార్యక్రమాలు, పిల్లల బరువు ఎత్తులు, వ్యక్తిగత శుభ్రతలు గమనించి ,చూసి టీచర్స్ కు , ఆయాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒక పాపకు అక్షరాభ్యాసం చేసి ,రెండవ విడత కోడిగుడ్ల పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్స్ రమ, సాధన రాణి, వసంత, మమత ఆయా సుమలత హాజరైనారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ విజయలక్ష్మి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి రాంపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులతో అదనపు కలెక్టర్ మాట్లాడి ఇళ్ళ నిర్మాణ పనులు పురోగతిని, గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి అర్హుడికి సొంత గృహం అందించే కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయలక్ష్మి సూచించారు, అంతేకాక ప్రాథమిక పాఠశాల అంగన్వాడి సెంటర్లను కూడా తనిఖీ చేసి లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తరుణి ప్రసాద్ ఎంపీఓ నాగరాజు పంచాయతీ కార్యదర్శి దేవేందర్ ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version