జిల్లా కలెక్టర్ ను కలిసిన కౌన్సిలర్ రమాదేవి సదానందం…

జిల్లా కలెక్టర్ ను కలిసిన కౌన్సిలర్ రమాదేవి సదానందం

రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకై వినతి పత్రం

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు గణేష్ చౌక్ ప్రాంత పుసర్వైభవం కోసం ప్రభుత్వ కార్యాలయాలు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని
22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ అన్నారు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22వ వార్డులోని “గణేష్ చౌక్ ప్రాంతం” ఒకప్పుడు జిల్లాలోనే అత్యంత కీలకమైన అభివృద్ధి చెందిన. కేంద్రంగా ఉండేది. “గతంలో ఈ గణేష్ చౌక ప్రాంతంలో బస్టాండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారసంత, పోలీస్ స్టేషన్ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వంటి ముఖ్యమైన సంస్థలు ఉండటం వల్ల నిత్యం ప్రజల రాకపోకలతో ఎంతో సందడిగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఈ గణేష్ చౌక్ ఏరియా పూర్తిగా వెనుకబడిపోయింది.

కావున, వ్యాపార వర్గాల ఉపాధి కోసం సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలి

పాత గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించి, కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలి.

వారసంత చిన్న వ్యాపారుల జీవనోపాధి కోసం ప్రజల అవసరాల కోసం గతంలో ఉన్న వారసంతను” గణేష్ చౌక్ ప్రాంతంలోనే తక్షణమే పునరుద్ధరించాలి.

బస్టాండ్ / బస్ స్టాప్ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి గణేష్ చౌక్ మెయిన్ రోడ్ ప్రాంతంలో బస్సులు ఆగేలా ఒక అధికారిక “బస్టాండ్” లేదా బస్ స్టాప్ను ఏర్పాటు చేయాలి.
గణేష్ చౌక్ అభివృద్ధి కోసం ఆటోనగర్ ఏర్పాటు చేయాలి అని వారు అన్నారు

జహీరాబాద్ లో కొత్త సర్పంచ్ లకు తలనొప్పిగా మరీనా డి ఎల్ పి ఓ కార్యాలయం..

జహీరాబాద్ లో కొత్త సర్పంచ్ లకు తలనొప్పిగా మరీనా డి ఎల్ పి ఓ కార్యాలయం!!

◆-: ఆఫిస్ తెరువరు అధికారి ఉండరు!!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎంతో కస్టపడి గెలిచినా ఫలితం లేన్నట్టు గా ఉంది కొత్తగా గెలిచిన సర్పంచ్ ల పరిస్థితి.జహీరాబాద్ నియోజకవర్గం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. బీదర్ కు అనుకోని ఉన్న సరిహద్దు గ్రామాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాలలో అనునిత్యం సేవా చేయాలనీ ఆరాటపడి గెలిచినా నిరాశకంగా ఉన్నారు సర్పంచ్ లు ఏదైనా డౌట్ వచ్చి సంబందించిన అధికారికి అడుగుదాం అనుకోని జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారుకి కలుద్దాం అని వెళ్ళితే వారు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు. ఆఫీస్ కి తాళం తీయరు.. అధికారి అందుబాటులో ఉండరు.

తూ తూ మంత్రంగా బోర్డు లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డ్ లు వైకుంఠ దామలు నిరూపయోగంగా మారి మూలన పడ్డ సంబందించిన డివిజనల్ పంచాయతీ అధికారి కనీసం గ్రామాలలో తిరుగకపోవడం విడ్డురంగా ఉంది అని వాపోతున్నారు.జహీరాబాద్ నియోజకవర్గం కొందరు ప్రజాప్రతినిధులు మరియు నియోజకవర్గం శాసనసభ్యులు, పలుమార్లు హెచ్చరించిన అవేవే పట్టనట్టు డి ఎల్ పి ఓ వ్యవహరిస్తున్న తీరు అందరికి అసహనానికి గురించేస్తుంది అని సర్పంచ్ వాపోతున్నారు.ఇ ప్పటికైనా కార్యాలయం ఏర్పాటు చేసి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో తిరిగి సమస్యలు పరిష్కారం చేయాలనీ ప్రజలు కోరుతున్నారు. లేనిచో జిల్లా కలక్టర్ కు మరియు పంచాయతీ రాజ్ కమీషనర్ కు పిర్యాదు చేస్తామని ప్రజలు అంటున్నారు.

వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే…

వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

“జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్యను కలిసిన శాసనసభ్యుడు కొణింటి మాణిక్ రావు గురువారం ఒక వినతి లేఖను సమర్పించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను లబ్ధిదారులకు అప్పగించాలని ఆయన కోరారు. కొత్త సిసి రోడ్లు, డ్రెయిన్లు మరియు వాటి మరమ్మతులు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. మిషన్ భగీరథ పనుల మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో

జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటునని మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు

జమ్మికుంట ప్రతినిధి( నేటి ధాత్రి)

 

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్ మరియు ఆయమ్మలతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని, కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, శౌచాలయాల నిర్వహణ, వంటగది పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు ఉంటే వెంటనే నివేదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చుంచు రమ చింతల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు కూడా అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.
పిల్లల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు పట్ల మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల అభివృద్ధికి పునాది వంటివని చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకువస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు చైర్మన్ ఈ పర్యటనను అభినందిస్తూ చిన్నారుల సంక్షేమం పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు…

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..

◆-: మహిళా సర్పంచ్ స్థానంలో వారి కుటుంబ సభ్యుల పెత్తనం ఏంటి

◆-: ఎంపీడీఓ షగుప్త ఇర్ఫాత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ – నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండల్ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తదితర కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా ప్రోటోకాల్ ను పాటించాలని, ప్రోటోకాల్ ను ఉల్లంఘించి పనులు చేపడితే ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని న్యాల్కల్ మండల పరిషత్ అభివృ ద్ధి అధికారిణి షాగుప్త ఇర్ఫాత్ స్పష్టం చేశారు. ఓ ప్రకటన విడుదలaక్రమాలను చేపట్టాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానంలో వారి వారి కుటుంబ సభ్యులు, అధికార, విపక్ష పార్టీ శ్రేణులు, నాయకులు,తదితరులు తాజాగా ఎన్నికైన సర్పంచులకు బదులుగా ఇతరులు.. ప్రోటోకాల్ ను ఉల్లంఘించి ప్రారంభోత్సవాలు చేపడితే ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులపై శాఖా పరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయ తీరాజ్ శాఖాధికారులకు నివేదికలు పంపనట్లు పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రోటోకాల్ ను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల సర్పంచులు తప్పనిసరిగా నియమావళిని అనుసరించాలని ఆదేశించారుa

మల్లాపూర్‌లో పంచాయతీ కార్యదర్శుల జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

*మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్ ఆవిష్కరణ*

మల్లాపూర్ జనవరి 20 నేటి దాత్రి

ఎంపిడిఓ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
మండల కేంద్రంలో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి వంశీధర్ రెడ్డి, మండల్ అధ్యక్షులు మురళి, మండల్ ప్రధాన కార్యదర్శి రూథ అశోక్, సీనియర్ కార్యదర్శులు నారాయణరెడ్డి, రంజిత్ కుమార్, ముబీన్ మరియు ఇతర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version