చిన్నారిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్
భూపాలపల్లి నేటిధాత్రి
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కేవలం ప్రమాదం కాదని, ఇది అగ్రకుల దౌర్జన్యం, వ్యవస్థాపిత నిర్లక్ష్యం సామాజిక నేరమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ తీవ్రంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బాధితుడు దళిత కుటుంబానికి చెందినవారని తెలిసినా, కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా అధికారుల కనుసన్నల్లోనే అగ్రకులానికి చెందిన నేరస్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం వారు అన్నారు
