స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే.. ప్రతికూల శక్తులు పరార్.!
ఈ దీపావళికి మీ ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? దీపావళి నాడు లక్ష్మీ పూజతో పాటు దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూలత ఆకర్షిస్తుంది. కాబట్టి, ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దీపావళికి ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించడం మంచిదో మీకు తెలుసా? ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు, దీపాలు వెలిగించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. కాబట్టి, దీపావళి రోజున ఇంట్లో ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం శుభప్రదమో తెలుసుకుందాం..
సి.పి.ఎం ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
తెలంగాణ రాష్ట్ర బిసి రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా సిరిసిల్లలో బంద్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టడం జరిగినది. అనంతరం సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శన నిర్వహించడం జరిగినది.ఈరోజు బంద్ ను విజయవంతం చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు వాణిజ్య వ్యాపార విద్య సంస్థలకు ధన్యవాదాలు తెలుపడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో మద్దతు ఏసి కేంద్రంలో అడ్డుకుంటూ ద్వంద వైఖరి అవలంబిస్తుంది.బిజెపి పార్టీ రాష్ట్రపతి వద్ద గవర్నర్ వద్ద బీసీ బిల్లులు ఆమోదింప చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , అన్నదాస్ గణేష్. సిపిఎం పార్టీ నాయకులు మిట్టపల్లి రాజమల్లు , రాపల్లి రమేష్ , నక్క దేవదాస్ , ఉడుత రవి. సిరిమల్ల సత్యం , ఎలివేటి శ్రీనివాస్ , జిందం కమలాకర్ , తన్నీరు లక్ష్మీరాజం , బెజ్జిగం సురేష్.బింగి సంపత్,స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బందు పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీ జేఏసీ కి మద్దతు తెలుపుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, బీసీలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లలో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు. వివిధ పార్టీలు, వివిధ సంఘాలలో ఉన్న బీసీ లందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, తడుక సుధాకర్, శేఖర్ నాని, పాలకుర్తి మధు, తోట శ్రీనివాస్, అడ్డగట్ల శ్రీనివాస్, జగన్, క్యాతం వెంకటేశ్వర్లు తో పాటు తోటి జర్నలిస్టులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీసీ సంఘాల, మరియు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పట్టణ బీసీ సంఘాలు మరియు వ్యాపార సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగనది. అంతేకాకుండా నిత్యం సిరిసిల్ల రద్దీ జనం తో ఉన్న కూడళ్లు నిర్మానుషంగా మారడం తో అటు బస్ డిపో వద్ద బిసి సంఘాల ముఖ్య నేతలు బస్ లను ఆపివేయడం, ప్రయాణి కులకు ఇబ్బంది అయ్యే విధంగా ఏర్పడంతో, దీపావళి పండగ ముందు సమయన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇబ్బంది చెప్పడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని అన్ని పార్టీలు కూడా మరియు ప్రజలు కూడా ప్రశాంతంగా మద్దతు ప్రకటించాలని బీసీ సంఘాలు కోరడం జరిగినది.
కోహిర్ మండల పరిధిలోని కవేలి గ్రామ శివారులో గల నూతన డెక్కన్ హోటల్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్విర్ హాజరై రిబ్బన్ కతరించి హోటల్ ను ప్రారంభించారు. మాజీ చైర్మన్ మాట్లాడుతూ తక్కువ ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకోవాలని కోరారు హోటల్ యాజమాన్యం మాజీ చైర్మన్ గారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కే ప్రసాద్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ వాసిమ్, మీర్ ముజఫర్ అలీ, మహమ్మద్ హామీద్ తదితరులు పాల్గొన్నారు
ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. తమ స్థలానికి గోడ కట్టగా, దానిని కొంతమంది అన్యాయంగా కూల్చివేశారని భూ యజమాని చంద్రకళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకుండా, దౌర్జన్యం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తోట చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 189/బి మణికంఠ కాలనీ రోడ్డు 4లో తాము 2008 వ సంవత్సరంలో శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేశామని, ఇట్టి జాగపై వేరే వ్యక్తులతో తగాదా ఏర్పడటం వలన 2011వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.. కోర్టు తీర్పు 2018 లో తమకు అనుకూలంగా వచ్చిందని, వెంటనే చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు జాగా మీధకు రాగా, అప్పుడు ఉన్న సిఐ రాఘవేంద్రరావు ఇరువురి సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఆ భూమి తమదేనని నిర్ధారించినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం కొందరు భూ ఆక్రమణదారులు, ఓడిపోయిన వారి వద్ద నుండి అగ్రిమెంట్ పెట్టుకొని పది రోజుల క్రితం మా గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు అని అన్నారు. ఈ నెల 7వ తేదీన గోడను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని ఏనుమాముల పోలీసు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన కూడా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాదితులు ఈ వివాదంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జహీరాబాద్ కార్యకర్తల నిర్ణయం మేరకే డిసిసి అధ్యక్ష ఎన్నిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో AICC అబ్జర్వర్ జరిత మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయమే అంతిమమని తెలిపారు. అధ్యక్ష పదవి కోసం కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
ఝరాసంగం : బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో.9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పటికే ప్రారం భమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే రిజ ర్వేషన్ల అంశంపై అంశంపై సందిగ్ధత కొనసాతుండ గానే జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్ష లు అందజేస్తానని ప్రకటించడం స్థానికంగా ఆసక్తిని రేపింది. గ్రామ బిఆర్ఎస్ పార్టీ మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. గ్రామంలో 1500 ఓటర్లు ఉండగా ఇటీవల ప్రకటించిన హైకోర్టు స్టే ఇచ్చిన క్రమంలో మళ్లీ తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చి తనను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించినా ఈదులపల్లి బీసీ (మహిళ)కు రిజర్వ్ అయి ఉండటంతో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ప్రతి పాదనను ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.
“నేటిధాత్రి”, హుజూరాబాద్.
ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.
హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి
వరంగల్ జిల్లా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.శుక్రవారం హన్మకొండలోని డిసిసిబి భవన్ ఆడిటోరియంలో జెడ్పి సీఈఓ, ఇంచార్జి డిఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సహకార అధికారి నీరజలతో కలిసి వరంగల్ డివిజన్ లో వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక,శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025 -26 సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని,కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయకూడదని, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించేయంత్రాలు సమకూర్చడం జరుగుతుందని,సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేసి నిల్వ చేయాలని, కొనుగోలు సమయంలో ఎప్పటికప్పుడు ధాన్యం, రైతుల వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని, రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తూ రైతుల వివరాలు నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ, వైద్య వసతి తదితర మౌలిక వసతులు కల్పించాలని, తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గన్ని సంచులు రైతులకు అందించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని, కొనుగోలు ప్రక్రియలో భాగంగా తేమశాతం యంత్రాలు, టార్పాలిన్లు, త్రాగునీరు, నీడ తదితర విషయాలకు సంబంధించి పి.సి.ఎస్.ఎ.పి. యాప్, గన్ని సంచుల నిర్వహణ కోసం మేనేజ్మెంట్ యాప్, పట్టాదారు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆధార్, మొబైల్ నెంబర్ నిర్వహణపై ఓ.పి.ఎం.ఎస్. యాప్ లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
Efficient Rice Procurement in Warangal District
ప్రభుత్వం వరి ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు రూ .2 వేల 369 లుగా నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్ల కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, జిల్లాలో టాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయబడిన రైతుల పంట సాగు డేటా ప్రకారం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, హార్వెస్టర్ వినియోగ సమయంలో ఆర్ పి ఎం 18-20 ఉండేలా పర్యవేక్షించాలని, ఇలా నిర్దేశిత వేగంతో వినియోగించినట్లయితే తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుందని ,హార్వెస్టర్ యంత్రాల వినియోగ సమయంలో నిబంధనలను పాటించాలని, కోతకు వచ్చిన తర్వాత మాత్రమే పంట కోయాలని, బ్లోయర్ యాక్టివ్ మోడ్ లో ఉండాలని ,రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటలలో సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Efficient Rice Procurement in Warangal District
కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్యాడి క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు,సీఓలు, డిఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు మేరకు బందునువిజయవంతం చేద్దాం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల. కేంద్రంలో ఈరోజు మార్కండేయ భవన్లో. వివిధ రాజకీయ పార్టీల కుల సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు రేపు జరిగే బందును అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు బీసీ సంఘాలు కార్మిక సంఘాలు నేతలు సహకరించాలని బీసీ నేతలను కోరారు దేశంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే మరి ఉన్నత వర్గాల్లో కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టులో పిటిషన్ వేసి నిలుపుదల చేశారని వారికి తగిన గుణపాఠం చెబుతామని నేతలంతా. ముక్తకంఠంతో. హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాజ్యాంగంలో ని. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తర్వాత ఎన్నికలకు పోవాలని నాయకులను కోరారు ఈ సందర్భంగా. బీసీ సంఘాల నేతలు ఎగుర్ల కర్ణాకర్. కందుకూరి రామ గౌడ్. బి ఆర్ ఎస్. పార్టీ మండల అధ్యక్షులు రాజన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. బిజెపి నాయకులు గుగ్గిల ఆంజనేయులు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని ప్రసంగించారు ఇట్టి బందుకు వారి పార్టీల పక్షాన జేఏసీ. పిలుపుమేరకు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్ట రవి. శాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం. ఎగుర్ల ప్రశాంత్. నేరెళ్ల అనిల్. రంగు ప్రసాదు. గుర్రం తిరుపతి. గాద సత్తయ్య. వెంగళ రమేష్ పలువురు. జేఏసీ నాయకులు తదితరులు బందుకు మద్దతు ప్రకటించారు
బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్..
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్ విజయవంతం చేద్దామని బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్ కోరారు.గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను విద్య, రాజకీయపరంగా అణిచివేస్తూ రాజకీయంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ వచ్చేవరకు బీసీ విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు..నాడు మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీ దాకా తీసుకెళ్లి రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు.బిసి విద్యార్థులతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఇక బీసీల ముందు చెల్లవని..బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బంద్ కు మద్దతుగా పాల్గొంటున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణలోని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలు బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలపాలని హేమంత్ కోరారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి
పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పి.డి.ఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. వి.పి.ఓ లు ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు. ఈ యొక్క సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అన్నారు.బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 18న జరగనున్న బీసీజాక్ రాష్ట్ర బంద్‌కు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని రాష్ట్రంలో బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.42శాతం రిజర్వేషన్ల పరిరక్షణ అనేది కేవలం బీసీల సమస్య కాదని ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటమని రాజ్యాంగ పరిరక్షణ కోసం,సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి వర్గం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని,రిజర్వేషన్లను కాపాడుకోవడానికి చట్టపరమైన,న్యాయపరమైన వ్యూహంతో పాటు సమాజ ఐక్యత అత్యంత అవసరమని అన్నారు.ప్రభుత్వం బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయపరమైన వ్యూహం సిద్ధం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 243ఏ ప్రకారం సరైన జనాభా లెక్కలు,సామాజిక ఆర్థిక అధ్యయనం ఆధారంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీకీ చెందిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు తల్లి వల్లభు లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా నేడు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
వారితోపాటు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, దన్నసరి మాజీ ఉపసర్పంచ్ వెంకన్న,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్, సబ్ స్టేషన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిలియ, బాలు నాయక్,శ్రీను, ఇగే సత్తి,తదితరులు ఉన్నారు.
అరుణ ఫర్టిలైజర్ ను సందర్శించిన నేషనల్ ఫర్టిలైజర్స్ కంపెనీ ప్రతినిదులు
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన ప్రముఖ ఎరువుల దుకాణం అరుణ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్,షాపును ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల కంపెనీ ప్రతినిధులు ఆర్ఎం వంశీకృష్ణ మరియు సేల్స్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం రోజున అరుణ ఫర్టిలైజర్ ను సందర్శించిన నేపథ్యంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి యూరియాని సమృద్ధిగా సప్లై చేస్తున్న దయచేసి కంపెనీ ఎన్ ఎఫ్ ఎల్ గా భావించి పరకాల నియోజకవర్గ రైతులు నేషనల్ ఫర్టిలైజర్స్ ప్రతినిదులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ తమకు యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు.
సంఘటన్ శ్రీ జన్ అభియాన్ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఎస్ వి ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ నియోజకవర్గ సంఘటన్ శ్రీ జన్ అభియాన్ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రటరీ జరిత మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ సెట్విన్ ఛైర్మెన్ గ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు జి ఎంపిటిసిలు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటిపి లు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు.
హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని తెలిపారు.
సైబర్ మోసగాళ్ల విధానం:
నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.
వాట్సాప్, ఎస్ ఎం ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.
గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం జరుగుతుందని గుర్తు చేశారు.
జిల్లా ప్రజలకు సూచనలు:
ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా ఏపీకె ఫైల్స్ డౌన్‌లోడ్ చేయ వద్దని తెలిపారు.
ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటిపి లు యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని తెలిపారు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, “ క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు..
ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు. మోసపోకుండా జాగ్రత్త అవగాహనే రక్షణ.”
మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన రామ.రామకృష్ణ ని శాలువాతో స్వాగతం పలికి అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయ సిబ్బంది. ఈ కార్యక్రమంలో ఏఈ ఉదయ్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ సరోజన ఈసి రజినీకాంత్,పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, నర్సింగం,టిఎ లు కుసుమ, స్వప్న,రాధిక ఫీల్డ్ అసిస్టెంట్ నీరటి రాములు,మరియు కార్యాలయ సహాయకులు గోవింద్ నవీన్ కుమార్, దొంతుల రాజేందర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రకాష్, సాగర్,అభిరామ్,సాయి కృష్ణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.