ఏకగ్రీవం చేస్తే ₹ 10 లక్షలు
◆:- సర్పంచ్ ఆశావహుడి ఆఫర్
◆:- రిజర్వేషన్లపై సందిగ్ధత ఉన్నా తగ్గేదేలే..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో.9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పటికే ప్రారం భమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే రిజ ర్వేషన్ల అంశంపై అంశంపై సందిగ్ధత కొనసాతుండ గానే జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్ష లు అందజేస్తానని ప్రకటించడం స్థానికంగా ఆసక్తిని రేపింది. గ్రామ బిఆర్ఎస్ పార్టీ మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. గ్రామంలో 1500 ఓటర్లు ఉండగా ఇటీవల ప్రకటించిన హైకోర్టు స్టే ఇచ్చిన క్రమంలో మళ్లీ తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చి తనను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించినా ఈదులపల్లి బీసీ (మహిళ)కు రిజర్వ్ అయి ఉండటంతో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ప్రతి పాదనను ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
