బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ పోరాటం

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఐక్య పోరాటం

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అన్నారు.బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 18న జరగనున్న బీసీజాక్ రాష్ట్ర బంద్‌కు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని రాష్ట్రంలో బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.42శాతం రిజర్వేషన్ల పరిరక్షణ అనేది కేవలం బీసీల సమస్య కాదని ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటమని రాజ్యాంగ పరిరక్షణ కోసం,సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి వర్గం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని,రిజర్వేషన్లను కాపాడుకోవడానికి చట్టపరమైన,న్యాయపరమైన వ్యూహంతో పాటు సమాజ ఐక్యత అత్యంత అవసరమని అన్నారు.ప్రభుత్వం బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయపరమైన వ్యూహం సిద్ధం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 243ఏ ప్రకారం సరైన జనాభా లెక్కలు,సామాజిక ఆర్థిక అధ్యయనం ఆధారంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని
ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version