పట్నాకు చెందిన ప్రసిద్ధ ఆన్‌లైన్ ఉపాధ్యాయుడు ఖాన్ సర్, రక్షాబంధన్ 2025ను తన విద్యార్థులతో హృద్యంగా జరుపుకున్నారు. ఆగస్టు 9న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో, సుమారు 15 వేల మంది విద్యార్థినులు తనకు రాఖీ కట్టిన విషయాన్ని వెల్లడించారు.
తన మహిళా విద్యార్థులను సోదరీమణులుగా భావిస్తానని, వారి ప్రేమ, ఆప్యాయత తనను ఎంతగానో కదిలించిందని ఖాన్ సర్ తెలిపారు. రక్త సంబంధాలను మించి, గురువు-శిష్య బంధం మరియు స్నేహభావాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ హృద్యమైన వీడియో 24 గంటల్లోనే 80 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది.
ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల కానున్న వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న తెలుగు సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్, కియారా అద్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
హిందీ సినిమాల్లో అడుగుపెట్టే ప్రతి దక్షిణాది నటుడికి మొదట్లో సందేహాలు ఉంటాయని, తానూ అలాంటి అనుభవం ఎదుర్కొన్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఈ ప్రయాణంలో సహనటుడు హృతిక్ రోషన్ నుంచి లభించిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రం, రజనీకాంత్ కూలీ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీని ఎదుర్కోనుంది.
అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లింగసాన్ పల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 15 ఇసుక టిప్పర్లను ఆపి పోలీసులకు,తహసీల్దార్ కు సమాచారం ఇచ్చి 2 గంటలైనా ఇంతవరకు ఒక్కరుకూడా రాలేదని గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.కల్వకుర్తి మండలం దుందుభి వాగునుంచి అక్రమంగా రోజుకు వంద లారీలకు పైగా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నా చూసి చూడనట్లు ఆదికారులు వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారని, పర్మిషన్ ఉంటే రాత్రి పూట ఇసుకను ఎందుకు తరలిస్తారని, ఒకటి రెండు లారీల కు పర్మిషన్ తీసుకుని వంద లారీలు తరలిస్తున్నారని తెలియజేస్తున్నారు. సెలవు దినాల్లో మరీ ఎక్కువ టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో టిప్పర్ లు వరుసపెట్టి ఇసుకను తరలిస్తుంటే గ్రామ యువకులం కలిసి టిప్పర్ లను ఆపి పోలీసులకు,తహసీల్దార్ కు ఫోన్ చేసి రెండు గంటలకు పైగా అయినా స్పందించడం లేదని వాపోతున్నారు.విచ్చల విడిగా టిప్పర్ లు నడుస్తుండడం వల్ల రోడ్లు అధ్వాన్నంగా తయారైయ్యాయని, రాత్రిళ్ళు రోడ్డుపైకి రావాలంటే భయ మేస్తుందని అందుకే ఆదివారం అధికారులు స్పందించక పోవడంతో మీడియాకు సమాచారం ఇచ్చామని గ్రామస్తులు,యువకులు తెలిపారు.
పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్ మళ్లీ భారతదేశంపై అణు యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో తన గౌరవార్థం నిర్వహించిన బ్లాక్-టై విందులో మాట్లాడుతూ, “మేము అణ్వాయుధ దేశం. మేము కూలిపోతున్నామనుకుంటే, ప్రపంచంలో సగం దేశాలను మాతో పాటు నాశనం చేస్తాము” అని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో భారత్‌తో యుద్ధంలో పాకిస్తాన్ ప్రాణాపాయం ఎదుర్కొంటే, అణు దాడికి వెనుకాడబోమని మునీర్ స్పష్టం చేశారు. ఇది ఆయన రెండు నెలల్లో అమెరికా చేసిన రెండవ పర్యటనలో చేసిన వ్యాఖ్యలుగా తెలుస్తోంది. ఈ హెచ్చరిక ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూన్ 5వ తారీఖు లోపు కొత్తపట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 13 అని పేర్కొన్నారు.
దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మున్సిపల్ సంస్థ stray dogsను ఎనిమిది వారాల్లో పట్టుకుని, వాటిని శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని, ముందుగా వాటిని స్టెరిలైజ్ చేయాలని ఆదేశించింది.
రాజధానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ చర్యలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ప్రక్రియలో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డంకిగా మారితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్
చందుర్తి, నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని కిసాన్ మోర్చా చందుర్తి మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని వారు అన్నారు ఎకరానికి ఒక బస్తా అని చెబుతున్న ప్రభుత్వం దానికి సరిపడా కూడా చేయడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తా పై 2100 సబ్సిడీ రైతుల గురించి ఇస్తుందని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా ను తక్షణమే సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ కోరారు.
అమెరికా భూమిపై జరిగిన ఓ ప్రైవేట్ విందులో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. “మేము అణ్వాయుధ దేశం. మేము కూలిపోతున్నామనుకుంటే, ప్రపంచంలో సగం దేశాలను మాతో పాటు నాశనం చేస్తాము” అని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని, చైనా సహాయంతో మరిన్ని అభివృద్ధి చేస్తున్నారని అంచనా. ఈ ఆయుధాలను నిర్వహించడం, నియంత్రించడం పూర్తిగా సైన్యం ఆధీనంలోనే ఉంటుంది.
భారతదేశం పహల్గామ్ దాడి తరువాత ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంపై స్పందిస్తూ, ఆసిమ్ మునీర్ “భారతదేశం డ్యామ్ నిర్మిస్తే, దానిని 10 క్షిపణులతో ధ్వంసం చేస్తాము” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.
1) పసుపు:
▪️పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.
▪️నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు,గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.
▪️పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.
▪️ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
▪️పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.
▪️పసుపు పూయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు (రషేర్) తగ్గుతాయి.
▪️బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.
▪️వేడి పాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి.
▪️ 5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరకడుపున తీసుకుంటే మధుమేహం క్రమేణా తగ్గుతుంది.
▪️పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.
2) ధనియాలు:-
▪️కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి ధనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.
▪️దప్పిక, మంట పూర్తిగా పోతుంది. చెమట బాగా పడుతుంది.
▪️పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.
▪️కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి.
▪️పచ్చి ధనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.
▪️మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.
▪️మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.
3) సోంపు:
▪️సోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తరవాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గాస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.
▪️విరేచనం సాఫీగా అవుతుంది.
▪️నులిపురుగులు కూడా పడి పోతాయి.
▪️కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.
▪️అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.
▪️సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గుతుంది.
▪️మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.
kitchen remedies
4). అల్లం మరియూ శొంఠి:
▪️అజీర్ణ వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పుతో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.
▪️నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.
▪️తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
▪️నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి.
▪️ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులు రావు.
▪️అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.
▪️కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయు.
5). జీలకర్ర:
▪️జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.
▪️లివర్ పనిచేయడం మెరుగుపడుతుంది.
▪️నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.
▪️అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.
▪️బాలింతలకు పాలు బాగా పడుతాయి.
▪️మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.
▪️నిద్ర బాగా వస్తుంది.
▪️శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.
6). లవంగాలు:
▪️ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.
▪️చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడుతాయి.
▪️నోటి దుర్వాసన దూరం అవుతుంది.
▪️పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.
▪️వేడి నీళ్లలో నాలుగు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.
▪️అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూర్ణం (500mg) 10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.
7). యాలకులు:
▪️అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.
▪️యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావం కలిగి ఉంటుంది.
▪️ప్రతిరోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.
▪️గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుంది.
▪️మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.
9). దాల్చిని చెక్క:
▪️ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.
▪️దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.
▪️తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండా ఉంటాయి.
▪️టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది.
▪️సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది.
▪️రక్త స్రావం కాకుండా ఆపుతుంది.
▪️చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.
10). గసగసాలు:
▪️వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.
▪️అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.
▪️వీటి పొడి మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి.
▪️అరగ్రాము పొడి పాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.
▪️గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.
రోహిత్ శర్మ కొత్త కార్ నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా.. తెలిస్తే మైండ్ బ్లాంకే
ఆగస్టులో జరగాల్సిన బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి మొదలుకానుంది. ఆస్ట్రేలియాతో విదేశీ సిరీస్ ఆడనుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్, కోహ్లీ వన్డేలు ఆడతారా లేదా అనేది ఊహాజనిత విషయం. ఇద్దరు కలిపి 83 వన్డే సెంచరీలు, 25,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. అయితే, అక్టోబర్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగగలరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Rohit Sharma Buy New Lamborghini Urus: రోహిత్ చివరిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ముంబై ఇండియన్స్ తరఫున పోటీ క్రికెట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అతని చివరిది కావొచ్చు అని తెలుస్తోంది.
ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ ల వన్డే భవిష్యత్తు గురించి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ భారత క్రికెట్ బోర్డులోని నిర్ణయాధికారులను బట్టి చూస్తే, ఇద్దరు దిగ్గజాలపై వెంటనే నిర్ణయం తీసుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కార్ల కలెక్షన్‌లో కొత్తగా లంబోర్ఘిని ఊరుస్ ఎస్‌ఈని చేర్చారు. ఆరెంజ్ రంగులో ఉన్న ఈ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ‘3015’పైనే అందరి దృష్టి పడింది. గతంలో రోహిత్ శర్మ కారు నెంబర్ ‘264’. అది ఆయన వన్డేల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయితే, ఇప్పుడు ఈ కొత్త నెంబర్ వెనుక ఉన్న కథ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
ఘనంగా ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
◆:- వేడుకల్లో సిడిసి మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ గారి జన్మదిన వేడుకలు ఝరాసంగం మండల బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించి, శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి డి సి మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్,బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ విజేందర్ రెడ్డి ఎజాజ్ బాబా నాగన్న పటేల్,సంజీవ్, నర్సిములు మాజీ సొసైటీ చైర్మన్ బస్వరాజ్,విలాస్ బల్ రాజ్ సంగమేష్, గౌసోద్దీన్,సంజ్జు, గాలప్ప సామెల్, సద్దాం రాహుప్,తదితరులు పాల్గొన్నారు.
దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్ మొహియుద్దీన్ కు జహీరాబాద్ ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన
◆:- జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ,
◆:- దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, ఏఐఎంఐఎం క్రియాశీల నాయకుడు, జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ మరియు దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, హైదరాబాద్‌లోని దారుస్సలాంలో అధ్యక్షుడు మజ్లిస్-ఇ-వర్కర్ పార్లమెంట్ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అసెంబ్లీ సభ్యుడు మరియు మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ కౌసర్ మొహియుద్దీన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో జహీరాబాద్ రాజకీయ వాతావరణంలో కొత్త కదలిక వచ్చింది. ఈ సెషన్ కేవలం పరిచయ కార్యక్రమం కాదు. జహీరాబాద్‌లోని వివిధ మున్సిపల్ వార్డుల పరిస్థితి, ప్రజా సమస్యలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని చర్చించాల్సి ఉంది, అది జహీరాబాద్ అయినా లేదా కోహిర్ అయినా. వాజిద్ చర్చను లోతుగా చేస్తూ, ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల పనితీరుపై వెలుగునింపారు మరియు షేఖాపూర్, మాడ్గి, దగ్వాల్ మరియు ఝరాసంగం యొక్క సర్పంచ్‌లు మరియు ఎన్నికైన ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి మరియు అభివృద్ధిలో అందించిన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ జమాత్ ఈ అంశాలను తీవ్రంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో జమాత్ ప్రతినిధులకు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినట్లే, ఈసారి కూడా వ్యవస్థీకృత మరియు ఉత్సాహభరితమైన ప్రచారంతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు తమ ప్రసంగంలో చెప్పారు. రాబోయే రోజుల్లో జహీరాబాద్ మరియు కోహిర్ ఝరాసంగం లలో ఏఐఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయనే వాస్తవానికి ఈ సమావేశం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.
ఎంతటి తోపులకైనా కష్టమే.. క్రికెట్ హిస్టరీలో బద్దలవ్వని 10 రికార్డులు ఇవే..
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించబడ్డాయి. వాటిలో కొన్ని బద్దలు కొట్టడం సులభం, కానీ కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరవు. అలాంటి కొన్ని అద్భుతమైన రికార్డులు ఎన్నో కనిపిస్తాయి. వాటిలో ఓ 10 బ్రేక్ అవ్వని రికార్డులు ఇప్పుడు చూద్
Unbreakable Records: క్రికెట్ ప్రపంచంలో బ్రేక్ చేయలేని దాదాపు 10 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. క్రికెట్ చరిత్రను మార్చిన దిగ్గజ బ్యాటర్లు, బౌలర్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి దిగ్గజాలు ఇప్పటికే ఎన్నో అద్భుత రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రతీ బ్యాటర్ లేదా బౌలర్ ఇలాంటి ఓ రికార్డును తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, క్రికెట్ హిస్టరీలో బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం అయిన 10 ప్రపంచ రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
1. క్రికెట్‌లో 61760 పరుగులు: ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ సర్ జాక్ హాబ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 61760 పరుగులు చేశాడు. సర్ జాక్ హాబ్స్ ఈ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. జాక్ హాబ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 199 సెంచరీలు, 273 హాఫ్ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ కాలంలో, సగటు 50.70గా ఉంది. సర్ జాక్ హాబ్స్ 1908 జనవరి 1న ఆస్ట్రేలియాతో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సర్ జాక్ హాబ్స్ 61 టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 5,410 పరుగులు చేసి 15 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేశాడు.
2. బ్రాడ్‌మాన్ సగటు 99 పరుగులు: క్రికెట్ చరిత్రలో దిగ్గజ బ్యాటర్, ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ బ్రాడ్‌మాన్ తన జీవితంలో కేవలం 52 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, ప్రపంచం ఇప్పటికీ అతని బ్యాటింగ్‌ను చూసి ఆకట్టుకుంది. ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో అతని కంటే మెరుగైన బ్యాట్స్‌మన్ పుట్టలేదు. డొనాల్డ్ బ్రాడ్‌మాన్ తన కెరీర్‌లో టెస్ట్‌లలో 6996 పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతని బ్యాటింగ్ సగటు 99.94గా ఉంది. ఇది క్రికెట్ చరిత్రలో అత్యధికం. ప్రస్తుత కాలంలో ఏ బ్యాట్స్‌మన్ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టడం సాధ్యం కాదు. ఇది మాత్రమే కాదు, టెస్ట్‌లలో అత్యధికంగా 12 డబుల్ సెంచరీలు కూడా సర్ డాన్ బ్రాడ్‌మాన్ పేరు మీద ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా అతని వద్ద ఉంది. అతను ఇంగ్లాండ్‌పై 5028 పరుగులు చేశాడు.
ఝరాసంగం మండలంలోని రైతులు రైతు బీమా గురించి కేవలం 4 రోజులు సమయం ఉన్నది 05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారుల వివరాలు మరియు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి అందిన ROFR పట్టు హోల్డర్ల వివరాలు ఆధారంగా పాత/కొత్త అర్హులైన రైతుల బీమా పునరుద్ధరణ/నమోదు జరుగుతుంది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్నవారు మాత్రమే అర్హులు.నమోదు కోసం రైతు తప్పక ఈ పత్రాలు ఒరిజినల్ మరియు జీరోక్స్ కాపీలను తీసుకురావాలి 1. రైతు ఆధార్ కార్డు 2. భూమి పట్టా పాస్‌బుక్ 3. నామినీ ఆధార్ కార్డు 4. రైతు బీమా Enrollment ఫామ్ రైతు తప్పక హాజరు కావలెను.
Agriculture Officer Venkatesham
(వాట్సప్ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ పంపుతాము మేము చాలా దూరంలో ఉన్నాము ఇంత తక్కువ సమయంలో మేము రాలేము అని దయచేసి భీమ చేయండి అని అడగొద్దు రైతు తప్పక వొచ్చి సంతకం చేయాలి.) భూమి కలిగి ఇంకా రైతు బీమా నమోదు చేయని రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల రైతు వేదిక ఆఫీసర్ లో వద్ద అందుబాటులో ఉన్నాయి. దయచేసి సంప్రదించండి.
స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మిర్చీ గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది. కంట్లో కారం చల్లి దోపిడీలకు పాల్పడుతోంది. చుట్టూ జనాలు ఉన్నా ఏ మాత్రం భయపడకుండా పబ్లిక్‌గా దొంగతనాలు చేస్తోంది. తాజాగా, మిర్చీ గ్యాంగ్ ఓ షాపులో దోపిడీకి పాల్పడింది. షాపు యజమాని కంట్లో కారం చల్లి డబ్బులు దోచేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మిర్చీ గ్యాంగ్ స్కూటీలపై ఈ బ్లాక్‌లోకి వచ్చిం
ఆ ఏరియాలోకి వచ్చీ రాగానే మిర్చీ గ్యాంగ్ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు. దాన్ని బయటకు తీసి షాపు బయట ఉన్న వాళ్లకు అందించాడు. కంట్లో కారం పడ్డా షాపు యజమాని వెనక్కు తగ్గలేదు. మిర్చీ గ్యాంగును అడ్డుకోవడానికి చూశాడు. వృద్ధుడు కావటం, దానికి తోడు కంట్లో కారం పడ్డం వల్ల ఆయన మిర్చీ గ్యాంగ్ సభ్యులను అడ్డుకోలేకపోయాడు.
పైగా వాళ్లు కత్తులతో బెదిరించటంతో పట్టుకోలేకపోయాడు. ఆ గ్యాంగ్ అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. చుట్టూ జనం ఉన్నా కూడా ఆ గ్యాంగ్‌ను ఏమీ చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అక్కడ అంతమంది ఉన్నారు. ఒక్కరు కూడా ఆపడానికి రాలేదు. ఏం మనుషులో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో వివిధ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పలు రకాల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫోకస్ చేసింది. మొత్తం 29 మందిపై ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్లు ఉన్నారు
ఈడీ ముందుకు రానా
రానా ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరై, తన గత ఐదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గతంలో రానాకు జూలై 23న విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి.
కానీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. దీంతో ఈడీ మళ్లీ ఆగస్టు 11కి తాజా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రానాతో పాటు, ప్రకాశ్ రాజ్ (జూలై 30), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6) ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరుకానుంది.
మనీ లాండరింగ్ కోణం
ఈడీ ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా? సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఎలా చెల్లించారనే విషయాలపై ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ యాప్‌ల వల్ల అనేక మంది డబ్బు పోగొట్టుకోవడమే కాక, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడేం జరుగుతుంది?
తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్‌లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్‌లు యువతకు ఆకట్టుకునేలా ఆఫర్స్ ఇచ్చి, వాటి మాయలో పడేలా చేస్తున్నాయి. దీంతో అనేక మంది వీటి బారిన పడి ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంటున్నారు. ఈ యాప్స్ మీద సరైన నియంత్రణ లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విచారణల నేపథ్యంలో త్వరలో ఈ కేసు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
చిన్నగా ఉన్నాయని చింతపడొద్దు.. భోజనం తర్వాత ఇలా చేస్తే.. 48 గంటల్లోనే ఊహించని మార్పు..
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్‌ను నియంత్రించడానికి మందులు ఉన్నప్పటికీ, చాలా మంది ప్రజలు తమ బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడానికి సురక్షితమైన, సహజమైన గృహ చికిత్సల కోసం వెతుకుతుంటారు. అటువంటి చికిత్సలలో ఒకటి మన వంట ఇంటిలోనే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Control Blood Sugar: డయాబెటిస్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. రక్తంలో అధిక షుగర్ లెవల్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది దృష్టిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. సోంపు గింజలు డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
సోంపు గింజలు (fennel seeds) మన వంటగదిలో ఉండే ఒక సాధారణ పదార్ధం. వీటిని వంటలో రుచి కోసం, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిలో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించే శక్తివంతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సోంపులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, సోంపులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది.
సోంపు గింజల నీటిని తయారు చేయడం చాలా సులభం:
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలు వేయండి.
ఈ నీటిని రాత్రంతా నానబెట్టండి.
ఉదయం, ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగండి.
ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే, ఇది మధుమేహానికి పూర్తి పరిష్కారం కాదు, కేవలం ఒక సహాయక చికిత్స మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మీరు మధుమేహంతో బాధపడుతుంటే, తప్పనిసరిగా మీ డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన మందులను వాడాలి. సోంపు గింజల నీటిని ఒక అనుబంధ చికిత్సగా మాత్రమే ఉపయోగించాలి.
బంగారం ధరల్లో తగ్గుదల – తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు
కొన్నాళ్లుగా రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు చివరికి తగ్గాయి. ఇటీవల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1.03 లక్షలు దాటగా, ఆగస్టు 11, సోమవారం ఉదయం నాటికి గణనీయంగా తగ్గింది.
తాజా ధరలు (10 గ్రాముల బంగారం / 1 కిలో వెండి):
దేశీయ మార్కెట్:
24 క్యారెట్లు: ₹1,02,280 (↓ ₹760)
22 క్యారెట్లు: ₹93,750 (↓ ₹700)
వెండి: ₹1,17,000 (స్థిరం)
ప్రధాన నగరాల్లో ధరలు:
హైదరాబాద్ / విజయవాడ / విశాఖపట్నం:
24K: ₹1,02,280
22K: ₹93,750
వెండి: ₹1,27,000
ఢిల్లీ:
24K: ₹1,02,430
22K: ₹93,900
వెండి: ₹1,17,000
ముంబై:
24K: ₹1,02,280
22K: ₹93,750
వెండి: ₹1,17,000
చెన్నై:
24K: ₹1,02,280
22K: ₹93,750
వెండి: ₹1,27,000
బెంగళూరు:
24K: ₹1,02,280
22K: ₹93,750
వెండి: ₹1,17,000
గమనిక: బంగారం, వెండి ధరలు ప్రాంతాలవారీగా మారవచ్చు. తాజా రేట్లు తెలుసుకోవాలంటే 8955664433కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.
స్టార్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మాస్టర్స్ కేటగిరిలో తొలిరౌండ్ గెలిచి, రెండో రౌండ్‌ను డ్రాగా ముగించిన ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్.. శనివారం జరిగిన మూడో రౌండ్లో విజయం…
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్
చెన్నై: స్టార్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మాస్టర్స్ కేటగిరిలో తొలిరౌండ్ గెలిచి, రెండో రౌండ్‌ను డ్రాగా ముగించిన ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్.. శనివారం జరిగిన మూడో రౌండ్లో విజయం సాధించాడు. ఈ రౌండ్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ రే రాబ్సన్‌ను ఓడించాడు. మూడు రౌండ్ల అనంతరం అర్జున్ 2.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన జర్మనీ నెంబర్‌వన్ విన్సెంట్ కేమర్ 3 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. మిగతా ఆటగాళ్లలో అనీష్ గిరి (1.5)తో గేమ్‌ను ప్రణవ్ (1) డ్రా చేసుకోగా, నిహాల్ సరీన్ (0.5)పై విదిత్ గుజరాతీ (1.5) గెలిచాడు. చాలెంజర్స్ కేటగిరి మూడో రౌండ్లో అధిబన్‌తో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రాగా ముగించగా, ల్యూక్ మెన్‌డోన్సా చేతిలో వైశాలి ఓటమిపాలైంది. వైశాలి (1) ఏడు, హారిక (0.5) తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.