వార్ 2 తో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్..

ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల కానున్న వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న తెలుగు సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్, కియారా అద్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హిందీ సినిమాల్లో అడుగుపెట్టే ప్రతి దక్షిణాది నటుడికి మొదట్లో సందేహాలు ఉంటాయని, తానూ అలాంటి అనుభవం ఎదుర్కొన్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఈ ప్రయాణంలో సహనటుడు హృతిక్ రోషన్ నుంచి లభించిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రం, రజనీకాంత్ కూలీ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీని ఎదుర్కోనుంది.

బిడ్డ పుట్టిన మూడు రోజులకే కీలక ప్రకటన

బిడ్డ పుట్టిన మూడు రోజులకే కీలక ప్రకటన

బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 15న వారికి పండంటి ఆడబిడ్డ పుట్టినట్లు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వారి పాప ఫొటోలను షేర్ చేయాలని నిత్యం పలు మెసేజ్లు షేర్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ కీలక ప్రకటనను విడుదల చేసి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. “మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మా హృదయం ఉప్పొంగిపోతోంది.

తల్లిదండ్రులుగా మేం మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో గోప్యతను పాటించాలనుకుంటున్నాం. అందుకే ఫొటోలు పంచుకోవడం లేదు. మీరు కూడా దయచేసి మా పాపను ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. మీ అందరి సపోర్టు ధన్యవాదాలు తెలుపుతున్నాము” అని కీలక నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందరు సెలబ్రిటీల లాగానే వీరు కూడా తమ బిడ్డను చూపించరని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ

 

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani), హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తల్లిదండ్రులు అయ్యారు. కొద్దిసేపటి క్రితమే కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తరువాత వినయ విధేయ రామ సినిమాతో చరణ్ సరసన జతకట్టి ప్లాప్ ను మూటకట్టుకుంది.

 

ఇక ఈ ఏడాది మరోసారి చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లో నటించి ఇంకో ప్లాప్ ను అందుకుంది. టాలీవుడ్ లో ప్లాప్ లు అందుకున్నా.. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా కోనసాగుతోంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2023 లో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన కియారా గతేడాది చివర్లో ప్రెగ్నెంట్ అనిఅభిమానులకు తీపి కబురు చెప్పుకొచ్చింది. ఇక సిద్దార్థ్.. భార్యను కాలు కిందపెట్టకుండా చూసుకుంటూ ఆమెకు ఏది కావాలన్నా ఇట్టే అమర్చి .. మంచి భర్త అని అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ క్యూట్ కపుల్.. తల్లిదండ్రులుగా మారారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిద్ , కియారా కెరీర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం కియారా వార్ 2 లో నటిస్తోంది. సిద్.. పరమ సుందరి సినిమాతో బిజీగా ఉన్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version