మీ నిద్రలేమి సమస్యను ఇలా ఈజీగా పరిష్కరించుకోండి..

 మీ నిద్రలేమి సమస్యను ఇలా ఈజీగా పరిష్కరించుకోండి

మీరు ఎక్కువగా నిద్ర లేమితో బాధపడుతున్నారా? ఈ సమస్యను పరిష్కరించడానికి సహజ మందు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

మీరు కూడా నిద్ర లేమితో (Natural Remedy for Insomnia) బాధపడుతున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలా మందికి నిద్ర ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అశ్వ గంధ చూర్ణం ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ…

‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ

‘మహావతార్ నరసింహ’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరుసగా సెలవులు రావడంతో జనం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ Xలో తెలిపింది. ‘మహావతార్ నరసింహ’ చరిత్ర తిరగరాస్తోందని, గర్జన అన్‌స్టాపబుల్ అని పేర్కొంది. కాగా దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది.

మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

TG: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తుండటంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘KCR హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాం. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఈ లిస్టులో చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

 

బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

 

ఖమ్మం, ఆగస్ట్ 10: గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు మధ్యలో పనులను అర్ధాంతరంగా ముగించేసిందని విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో రూ. 630 కోట్లతో నిర్మించ తలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన ఆభివర్ణించారు.

10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా నిర్మించాడా? అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న బియ్యం పంపిణి చేశాడా? అంటూ ప్రజలను అడిగారు. రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉంటుందని.. అంతే కానీ ఓట్లపై ఉండదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అపర భగీరథుడని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు రైతులకు తొలిసారి నీరు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కంకణం కట్టుకున్నారని తెలిపారు. దశబ్ద కాలంగా జవహార్ ఎత్తిపోతల పథకాన్ని నిర్విరం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతోందని మండిపడ్డారు. నాగార్జునసాగర్ నీరు పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు అక్కడి నుంచి మధిర, ఎర్రిపాలెం మండలాలకు సాగునీరు.. తాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి ప్రణాళికలు రచించారని వివరించారు. అందుకు రూ.630. 30 కోట్లతో ఈ రోజు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. మాట ఇచ్చాం ఇల్లు పూర్తి చేస్తున్నాం.. అర్హులైన పేద ప్రజలు ఎవరూ కూడా ఇందిరమ్మ ఇళ్లు రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. తమ ప్రభుత్వంలో రైతులకు టింగు టింగు మంటూ వారి ఖాతాలో రైతు భరోసా పథకం కింద నగదు పంపిణీ జరిగిందన్నారు. భూ భారతితో రైతులకు అనుకూలమైన చట్టం చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవానికి సేవ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో రౌడీయిజం.. యువకుల బెదిరింపులు

 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో రౌడీయిజం.. యువకుల బెదిరింపులు

 

విజయవాడ నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు.

 

» రీల్స్, రౌడీయిజం.. నగరంలో రెచ్చిపోతున్న కొందరు యువకులు

 

‘..మీరంతా లం.. తెలుసురా. మీ వయసుకు గౌరవం ఇస్తున్నా. దాన్ని నిలబెట్టుకోండి. లేకపోతే పీక కోస్తా.’ ఇన్‌స్టాలో ఓ యువకుడి పోస్ట్ ఇది,

..ఒకటే కోత, టూటౌన్ పీఎస్‌కు వార్త. నా కొడ.. తెలుసుగా పీకలు కోసి లోపలికి వెళ్లిపోతాం.” సోషల్ మీడియాలో ఇద్దరు యువకులు చేసిన రీల్ ఇది.

నగరంలో కొందరు యువకులు రీల్స్ మోజులో రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకరిని హెచ్చరిస్తూ.. బూతులు తిడుతూ.. పీకలు కోస్తామని బెదిరిస్తూ చేస్తున్న రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఏకంగా గంజాయి సేవిస్తున్న ఫొటోలు కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ): నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో (Social Media Reels) తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో (Instagram) పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు. నగరంలో ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. ఎదుటి వారికి, ప్రత్యర్థులను హెచ్చరించేలా ఈ రీల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నగరంలో ఇద్దరు యువకులు చేసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రీల్స్ చేసిన ఇద్దరిలో ఒక యువకుడిపై కులు కేసులు ఉండటం గమనార్హం.

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

మెగా హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ సందర్భంగా జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘పెద్ది’తో చెర్రీ, ‘VT 15’తో వరుణ్, ‘SDT 18’తో సాయి ధరమ్ బిజీగా ఉన్నారు.

పులితో ఫేస్ టూ ఫేస్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

 పులితో ఫేస్ టూ ఫేస్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

 

కాపలాగా ఉన్న ఓ వ్యక్తికి రాత్రి వేళ షాకింగ్ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి కుక్కలు పదే పదే మొరుగుతుండడంతో అతను బయటికి వచ్చి.. ఏమైందో చూసేందుకు కాస్త దూరంగా వెళ్లాడు. అయితే..

అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి రావడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో అవి జనాలపై, జంతువులపై దాడి చేయడం కూడా జరుగుతుంటుంది. అయితే కొందరు అదృష్టవశాత్తు వాటి బారి నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పులికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పులికి హాయ్ చెప్పడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కాపలాగా ఉన్న ఓ వ్యక్తికి రాత్రి వేళ షాకింగ్ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి కుక్కలు పదే పదే మొరుగుతుండడంతో అతను బయటికి వచ్చి.. ఏమైందో చూసేందుకు కాస్త దూరంగా వెళ్లాడు. అయితే కాస్త ముందుకు వెళ్లి.. ఇంటి వద్ద నుంచి మలుపు తిరగ్గానే.. అదే సమయంలో పులి కూడా అతడికి ఎదురుగా వస్తుంది.

పులిని చూడగానే ఆ వ్యక్తి భయంతో కేకలు వేస్తూ ఇంట్లోకి పారిపోతాడు. పులి కూడా అంతే భయంతో (Tiger runs away after seeing man) అక్కడి నుంచి వెనక్కు తిరిగి పారిపోతుంది. అతన్ని చూడగానే దాడి చేయాల్సిన పులి.. అందుకు విరుద్ధంగా భయంతో పారిపోవడం చూసే వారికి వింతగా అనిపిస్తోంది. ఈ వీడియో ఇంతటిలో ముగుస్తుంది.

కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పులికి హాయ్ చెప్పి వచ్చాడుగా’.. అంటూ కొందరు, ‘పులికి ఇతడు ఎలా కనిపించాడో ఏమో’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.79 లక్షలకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోంది: రామ్‌చందర్ రావు..

బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోంది: రామ్‌చందర్ రావు

తెలంగాణలో బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు అన్నారు. బీజేపీకి సున్నా అని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ పనే ప్రస్తుతం సున్నా అయ్యిందని ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన సందర్భంగా రామ్‌చందర్ రావు మాట్లాడారు. ‘ఓట్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఓడిపోతారని తెలిసే ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

అరేబియా సముద్రంలో భారత్, పాక్ నేవీ డ్రిల్స్?

అరేబియా సముద్రంలో భారత్, పాక్ నేవీ డ్రిల్స్?

భారత్, పాకిస్థాన్ అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఒకే సమయంలో నౌకాదళ విన్యాసాలు చేపట్టనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ నెల 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఇరు దేశాల నేవీ డ్రిల్స్ జరగనున్నట్లు పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సమీపంలో భారత్ నేవీ డ్రిల్స్ చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ డ్రిల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.

దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం..

దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం

నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బోడుప్పల్‌, మేడిపల్లి, ఉప్పల్‌, రామాంతపూర్‌, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు

హైదారబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బోడుప్పల్‌, మేడిపల్లి, ఉప్పల్‌, రామాంతపూర్‌, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలాగే నగరంలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే..

చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్‌ను పవర్ హౌస్ అని అంటారు. దీనిని తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్ స్థాయులు, బరువు పెరుగుతారు. అలర్జీ, ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్..

సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ మహోత్సవం.శనివారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య గౌడ్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Former MPP Soujanya Goud

రాఖీ పండుగ సందర్భంగా సీఎం ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించిందని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మాజీ ఎంపిపి,టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భీమాగాని సౌజన్య గౌడ్ తెలిపారు.

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌తో (KTR) గ్యాప్‌పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్‌పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత.

సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు కార్మికుల‌ సమస్యలపై HMSతో కలసి అలయన్స్‌గా పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి..

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి రాబోయే భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు చేస్తూ అమరవీరుల స్తూపం నుండి పాకాల రోడ్డు లోని కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికతను నేర్పింది ఆదివాసీలేనన్నారు. ప్రకృతిని దైవంగా భావించే సాంస్కృతి ఆదివాసి గిరిజనులదని అన్నారు.గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు చేస్తున్న కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పక్కగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 13 మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు సందర్శించి పరిష్కార నిమిత్తం తన దృష్టికి తీసుకురావాలన్నారు.గిరిజనుల హక్కులను రక్షిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొకావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య,గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాక్‌తో సైన్యం చెస్ ఆడింది ఆర్మీ చీఫ్ ద్వివేది.

పాక్‌తో సైన్యం చెస్ ఆడింది: ఆర్మీ చీఫ్ ద్వివేది

ఆపరేషన్ సిందూర్ సమయంలో దాయాది పాక్‌తో భారత సైన్యం చెస్ ఆడిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. శత్రు కదలికలు తెలియనప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామన్నారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. కాగా పాక్‌కు చెందిన 5 ఫైటర్ జెట్లు, ఓ విమానాన్ని కూల్చేశామని IAF చీఫ్ <<17350664>>చెప్పిన<<>> విషయం తెలిసిందే.

18 ఏళ్లు దాటాయా? అయితే..

18 ఏళ్లు దాటాయా? అయితే..

ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు..

పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

రేపటి నుంచి షూటింగ్‌లు బంద్…

చర్చలు ఫలించకుంటే.. రేపటి నుంచి షూటింగ్‌లు బంద్: ఫిల్మ్ ఫెడరేషన్

TG: వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

 విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు.

విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది.

 

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. విజయ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతుంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కష్టపడుతూనే ఉన్నాడు. కింగ్డమ్ లాంటి పరాజయం తరువాత కూడా కుర్ర హీరో ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతూనే వస్తున్నాడు. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా హిట్

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ- విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే కింగ్డమ్ సినిమా వచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మరోసారి రీపీట్ కానుందని తెలుస్తోంది. సితారలోనే విజయ్ మరో సినిమాను ఓకే చేశాడట. డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని టాక్ నడుస్తోంది. కాంబో కొత్తగా ఉంది కదా. అవును.. ఈమధ్యనే హరీష్ శంకర్.. ఒక మంచి కథను విజయ్ కు చెప్పడం, అతనికి కూడా నచ్చడంతో ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.

ప్రస్తుతం హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. తమిళ్ మూవీ తేరికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. దీని తరువాత హరీష్. విజయ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా అయినా కొట్టాడా ..? లేక ఇంకేదైనా హిట్ సినిమాకు రీమేక్ నా అనేది తెలియాల్సి ఉంది.

ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే.

OTT: ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి.

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు పేరెన్నిక‌గ‌న్న అనేక డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే అయా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి.

సినిమా థియేటర్స్

అయితే.. చాలా మందికి వారి వారి భాష‌ల‌లో ఏ కంటెంట్ వ‌చ్చింద‌నే మీమాంస, కుతుహాలం ఉంటుంది. అలాంటి వారంద‌రి కోసం వారి లాంగ్వేజెస్‌లో వ‌చ్చిన కంటెంటు ఏంటో ఇక్క‌డ మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన భాష‌లో, మీకు న‌చ్చిన సినిమానో, సిరీస్‌ను చూసి ఆస్వాదించండి.

 

Malayalam

Nadikar (Mal, Tel,Tam, Kan, Hin) Saina Play

ManasaVacha (Malayalam) Manorama Max

Eth Nerathanavo (Malayalam) Manorama Max

 

Kannada

Timmana Mottegalu (Kannada) PrimeVideo

Hebbuli Cut (Kannada) Sunnxt

 

Hindi

Salakaar (Hin, Telu, Tam, Mal, Kan) [Series] JioHotstar

Bindiya Ke Bahubali Season 1 (Hindi) MxPlayer

Marathi

Jarann (Marathi)

 

Tamil

Maaman (Tamil) Zee5

Trending (Tamil) Sunnxt

ParanthuPo (Tam, Tel, Mal, Kan, Hin) JioHotstar

Oho Enthan Baby (Tam, Tel, Mal, Kan, Hin) Netflix

 

Telugu

Badmashulu (Telugu) PrimeVideo, ETv Win

Mothevari LoveStory (Telugu) [Series] Zee5

Mayasabha (Tel, Tam, Mal, Kan, Hin) [Series] Sony Liv

Arabia Kadali (Tel, Tam, Mal, Kan, Hin) [Series] PrimeVideo

 

English

 

Netflix

Lisa Frankenstein (English)

Stolen : Heist of the Century (English)

SEC Football: Any Given Saturday (English) [Series]

Wednesday: Season 2 Part 1 (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Blood Brothers: Bara Naga (Malaysian) Netflix

 

Prime Video

Sorry Baby (English) Rent

The Occupant (English) Rent

The Pickup (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Abrahams Boys: A Dracula Story (English) Rent

Jurassic World Rebirth   (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Rent

 

Jio Hotstar

Mickey17 (English)

Love Hurts (English, Hindi)

The Yogurt Shop Murders (English) [Documentry]

 

Pretty Thing (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Lions Gate Play

Harvest (English) MUBI

Freaky Tales (English) HBO Max

Bob Trevino Likes It (English) Hulu

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version