రెచ్చిపోయిన మిర్చీ గ్యాంగ్.. కంట్లో కారం చల్లి..

 

రెచ్చిపోయిన మిర్చీ గ్యాంగ్.. కంట్లో కారం చల్లి..

 

స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు.

 

దేశ రాజధాని ఢిల్లీలో మిర్చీ గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది. కంట్లో కారం చల్లి దోపిడీలకు పాల్పడుతోంది. చుట్టూ జనాలు ఉన్నా ఏ మాత్రం భయపడకుండా పబ్లిక్‌గా దొంగతనాలు చేస్తోంది. తాజాగా, మిర్చీ గ్యాంగ్ ఓ షాపులో దోపిడీకి పాల్పడింది. షాపు యజమాని కంట్లో కారం చల్లి డబ్బులు దోచేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మిర్చీ గ్యాంగ్ స్కూటీలపై ఈ బ్లాక్‌లోకి వచ్చిం

ఆ ఏరియాలోకి వచ్చీ రాగానే మిర్చీ గ్యాంగ్ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు. దాన్ని బయటకు తీసి షాపు బయట ఉన్న వాళ్లకు అందించాడు. కంట్లో కారం పడ్డా షాపు యజమాని వెనక్కు తగ్గలేదు. మిర్చీ గ్యాంగును అడ్డుకోవడానికి చూశాడు. వృద్ధుడు కావటం, దానికి తోడు కంట్లో కారం పడ్డం వల్ల ఆయన మిర్చీ గ్యాంగ్ సభ్యులను అడ్డుకోలేకపోయాడు.

పైగా వాళ్లు కత్తులతో బెదిరించటంతో పట్టుకోలేకపోయాడు. ఆ గ్యాంగ్ అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. చుట్టూ జనం ఉన్నా కూడా ఆ గ్యాంగ్‌ను ఏమీ చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అక్కడ అంతమంది ఉన్నారు. ఒక్కరు కూడా ఆపడానికి రాలేదు. ఏం మనుషులో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు.

నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు..

ఎస్సీల స్మశానవాటిక కబ్జా చేసిన వైనం

భూకబ్జాదారులను కఠినంగా శిక్షించాలి:ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్..

జాతీయ రోడ్డుపై దళితుల ధర్నా..రెండు కిలోమీటర్ల మేర స్థంబించిన ట్రాఫిక్..

న్యాయం చేస్తామన్న ఎస్సై హామీతో ధర్నా విరమణ

వరంగల్ నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నాగయ్యపల్లెలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూకబ్జాదారులుగా అవుతారమెత్తి రెచ్చిపోయారు.ఏకంగా ఎస్సీల స్మశాన వాటికనే కబ్జా చేశారు.సర్వే నెంబర్ 931లో దాదాపు రెండు ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు స్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని సమాధులు నిర్మించారు.ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన పోగుల మహేందర్ రెడ్డి,పోగుల బ్రహ్మయ్య,పోగుల కైలాసం,పోగుల సురేందర్ అను వ్యక్తులు మంగళవారం గుర్తుతెలియని రెండు జెసిబిలను తీసుకువచ్చి సమాధులను తొలగించి స్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారని :ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆరోపించారు.కబ్జా పట్ల పోలీసు అధికారులకు,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన స్మశానవాటిక భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకాలను శాంతింపజేసి కబ్జాదాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు బాగాజీ రజనీకాంత్,జినుక అశోక్,మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్ర సూరయ్య,మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య,మాదాసి సుధాకర్,సంగి యాకయ్య,గిన్నారపు భాస్కర్, మాదాసిరాజు,మాదాసి మల్లయ్య,మాదాసి రాహుల్ తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version