‘కూలీ’ ఫస్ట్ హాఫ్‌ సమీక్ష – లోకేష్ కథలో రజనీకాంత్ మాంత్రికం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-1.wav?_=1

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 

రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణానికి ఘనత చేకూర్చే ఈ చిత్రం, కేవలం ఫ్యాన్ సర్వీస్‌గానే కాక, స్నేహం, ద్రోహం, మోసం, నమ్మకం వంటి అంశాలతో కూడిన కథను చూపిస్తోంది.
కథ ప్రారంభంలో, పోర్ట్‌లో గ్యాంగ్ హెడ్మాన్ ధయ (సౌబిన్ సాహిర్) పోలీస్ ఇన్ఫార్మర్‌ను గుర్తించి హతమారుస్తాడు. ఇక్కడికి దూరంగా, మాన్షన్‌లో ప్రశాంతంగా జీవిస్తున్న దేవ (రజనీకాంత్) ప్రవేశిస్తాడు. అతని పరిచయం సింపుల్ డైలాగ్‌తోనే ఉండటం గమనార్హం.
సినిమాలో సత్యరాజ్‌తో రజనీకాంత్ స్నేహం, శృతి హాసన్‌తో అనుకోని బంధం, నాగార్జున పాత్రలో గ్రే షేడ్స్—all keep the intrigue alive. అనిరుధ్ స్వరపరచిన ‘మోనికా’, ‘పవర్‌హౌస్’ పాటలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్..

అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.

‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ…

‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ

‘మహావతార్ నరసింహ’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరుసగా సెలవులు రావడంతో జనం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ Xలో తెలిపింది. ‘మహావతార్ నరసింహ’ చరిత్ర తిరగరాస్తోందని, గర్జన అన్‌స్టాపబుల్ అని పేర్కొంది. కాగా దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది.

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

మెగా హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ సందర్భంగా జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘పెద్ది’తో చెర్రీ, ‘VT 15’తో వరుణ్, ‘SDT 18’తో సాయి ధరమ్ బిజీగా ఉన్నారు.

రేపటి నుంచి షూటింగ్‌లు బంద్…

చర్చలు ఫలించకుంటే.. రేపటి నుంచి షూటింగ్‌లు బంద్: ఫిల్మ్ ఫెడరేషన్

TG: వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

 విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు.

విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది.

 

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. విజయ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతుంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కష్టపడుతూనే ఉన్నాడు. కింగ్డమ్ లాంటి పరాజయం తరువాత కూడా కుర్ర హీరో ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతూనే వస్తున్నాడు. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా హిట్

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ- విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే కింగ్డమ్ సినిమా వచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మరోసారి రీపీట్ కానుందని తెలుస్తోంది. సితారలోనే విజయ్ మరో సినిమాను ఓకే చేశాడట. డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని టాక్ నడుస్తోంది. కాంబో కొత్తగా ఉంది కదా. అవును.. ఈమధ్యనే హరీష్ శంకర్.. ఒక మంచి కథను విజయ్ కు చెప్పడం, అతనికి కూడా నచ్చడంతో ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.

ప్రస్తుతం హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. తమిళ్ మూవీ తేరికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. దీని తరువాత హరీష్. విజయ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా అయినా కొట్టాడా ..? లేక ఇంకేదైనా హిట్ సినిమాకు రీమేక్ నా అనేది తెలియాల్సి ఉంది.

ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే.

OTT: ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి.

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు పేరెన్నిక‌గ‌న్న అనేక డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే అయా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి.

సినిమా థియేటర్స్

అయితే.. చాలా మందికి వారి వారి భాష‌ల‌లో ఏ కంటెంట్ వ‌చ్చింద‌నే మీమాంస, కుతుహాలం ఉంటుంది. అలాంటి వారంద‌రి కోసం వారి లాంగ్వేజెస్‌లో వ‌చ్చిన కంటెంటు ఏంటో ఇక్క‌డ మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన భాష‌లో, మీకు న‌చ్చిన సినిమానో, సిరీస్‌ను చూసి ఆస్వాదించండి.

 

Malayalam

Nadikar (Mal, Tel,Tam, Kan, Hin) Saina Play

ManasaVacha (Malayalam) Manorama Max

Eth Nerathanavo (Malayalam) Manorama Max

 

Kannada

Timmana Mottegalu (Kannada) PrimeVideo

Hebbuli Cut (Kannada) Sunnxt

 

Hindi

Salakaar (Hin, Telu, Tam, Mal, Kan) [Series] JioHotstar

Bindiya Ke Bahubali Season 1 (Hindi) MxPlayer

Marathi

Jarann (Marathi)

 

Tamil

Maaman (Tamil) Zee5

Trending (Tamil) Sunnxt

ParanthuPo (Tam, Tel, Mal, Kan, Hin) JioHotstar

Oho Enthan Baby (Tam, Tel, Mal, Kan, Hin) Netflix

 

Telugu

Badmashulu (Telugu) PrimeVideo, ETv Win

Mothevari LoveStory (Telugu) [Series] Zee5

Mayasabha (Tel, Tam, Mal, Kan, Hin) [Series] Sony Liv

Arabia Kadali (Tel, Tam, Mal, Kan, Hin) [Series] PrimeVideo

 

English

 

Netflix

Lisa Frankenstein (English)

Stolen : Heist of the Century (English)

SEC Football: Any Given Saturday (English) [Series]

Wednesday: Season 2 Part 1 (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Blood Brothers: Bara Naga (Malaysian) Netflix

 

Prime Video

Sorry Baby (English) Rent

The Occupant (English) Rent

The Pickup (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Abrahams Boys: A Dracula Story (English) Rent

Jurassic World Rebirth   (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Rent

 

Jio Hotstar

Mickey17 (English)

Love Hurts (English, Hindi)

The Yogurt Shop Murders (English) [Documentry]

 

Pretty Thing (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Lions Gate Play

Harvest (English) MUBI

Freaky Tales (English) HBO Max

Bob Trevino Likes It (English) Hulu

సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా..

సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా

స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా… నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’

కొన్నిసార్లు బాక్సాఫీస్‌ మేజిక్‌ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా… నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’ (Saiyaara). కుర్ర హీరోయిన్‌ అనీత్‌ పడ్డా ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్‌’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్‌ బ్యూటీ విశేషాలివి.

 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో… ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 22 ఏళ్ల అనీత్‌ పడ్డా (Aneet Padda)కు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. స్కూలింగ్‌ పూర్తయ్యాక ఢిల్లీకి వెళ్లిన అనీత్‌.. అక్కడి జీసస్‌ మేరీ కాలేజీలో డిగ్రీ (సోషియాలజీలో) పూర్తిచేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ అవకాశాల్ని అందిపుచ్చుకుంది. ‘సైయారా’ సినిమా చిత్రీకరణ సమయంలోనూ షూటింగ్‌కి హాజరవుతూనే, డిగ్రీ పరీక్షలు రాసింది. ‘ఆమె కమిట్‌మెంట్‌, అంకితభావం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు డైరెక్టర్‌ మోహిత్‌ సూరి (Mohit Suri). అనీత్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేయడానికి డైరెక్టర్‌ మోహిత్‌ సూరికి సుమారు 5 నెలలు సమయం పట్టిందట. ముఖం, శరీరానికి ఎలాంటి కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకోని 20-22 ఏళ్ల యువతి ఆ పాత్రకు కావాలని మోహిత్‌ పట్టుబట్టారట.

 

ఈ క్రమంలో వందలాది మందిని ఆడిషన్‌ చేశారు. అనీత్‌ తన ఆడిషన్‌ వీడియోని మొదట మొబైల్‌లో పంపిందట. అది నచ్చడంతో నేరుగా వచ్చి ఆడిషన్‌ ఇవ్వమన్నారట. తీరా ఆడిషన్‌ ఇచ్చాక, ఆమె నటన బాగాలేదని డైరెక్టర్‌ దాదాపుగా రిజెక్ట్‌ చేయాలనుకున్నాడు. కానీ అహాన్‌ పాండే (Ahaan Panday) (‘సైయారా’ హీరో) డైరెక్టర్‌ని ఒప్పించి, ఆమెకు మరో అవకాశం ఇవ్వమని కోరాడట. కట్‌చేస్తే.. డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యింది. అనీత్‌ ఆడిషన్‌కు వేసుకెళ్లిన డ్రెస్‌ లుక్‌నే సినిమాలో పెట్టారు.సినిమాల్లోకి రావాలని చిన్నతనం నుంచే కలలు కనేదట. తల్లి ప్రోత్సాహంతో తనకు ఇష్టమైన నటనా రంగాన్ని ఎంచుకుంది. మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టి నెస్‌ కెఫే, క్యాడ్‌బరీ, మ్యాగీ, పేటిఎం, అమెజాన్‌ లాంటి వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది.

 

మూడేళ్ల క్రితం రూపొందిన ‘క్యాడ్‌బరీ’ యాడ్‌తో బాగా పాపులరైంది. 2022లో కాజోల్‌ ప్రధానపాత్రగా వచ్చిన ‘సలామ్‌ వెంకీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. గతేడాది ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. బోర్డింగ్‌ స్కూల్‌ డ్రామాగా సాగే ఈ సిరీస్‌లో ‘రూహీ’ అనే పాత్రలో రెబల్‌ గాళ్‌గా కనిపించి, అందరినీ ఆకట్టుకుంది అనీత్‌. తాజాగా ‘సైయారా’ సక్సెస్‌ కావడంతో ఆ యాడ్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనీత్‌కు ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆ సమయంలో గిటారు వాయిస్తూ, తనలోని గాయనిని బయటకు తెస్తుంది. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ను తెగ ఇష్టపడుతుంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ అనీత్‌ దిట్టే. మంచి సింగర్‌ కూడా. గతేడాది ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ కోసం ‘మాసూమ్‌’ పాటను తనే రాసి, తనే కంపోజ్‌ చేసి పాడింది.

 

ఎప్పటికీ మర్చిపోలేని తన చిన్ననాటి జ్ఞాపకం గురించి ప్రస్తావిస్తూ… స్కూల్‌లో జరిగిన ఒక నాటకం కోసం తన కనుబొమలను, కనురెప్పలను కత్తిరించుకున్నట్లు తెలిపింది. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ సాహసంగానే అనిపిస్తుందట. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ సుందరి తన సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ పంచుకుంటుంది. ‘సైయారా’ సినిమాకు ముందు ఈ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేల మంది ఫాలో అయితే.. సినిమా విడుదలైన తర్వాత ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. వారిలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం.

సినిమా హిట్

 

కార్మికుల చెమట జుర్రుకుంటున్నారు?

`హీరోలను నెత్తిమీద.. కార్మికులను కాళ్ళ కింద

`నిర్మాతలు ఏళ్ల తరబడి కార్మికుల రక్తం తాగుతున్నారు.

`కనికరం లేకుండా కార్మికుల కష్టం దోచుకుంటున్నారు.

`అబద్దాల లెక్కలు చెబుతారు!

`సినిమాకు కోట్లు ఖర్చు పెడుతున్నామంటారు.

`కార్మికులకు వందలు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడతారు.

`రోజు వారీ కూలీ ఇచ్చేందుకు నెలల సమయం తీసుకుంటారు.

`కార్మికులను మర మషులకన్నా ఎక్కువ వాడుకుంటున్నారు.

`సమయపాలన లేకుండా గంటల తరబడి పని చేయించుకుంటారు.

`కార్మికుల సినిమా పిచ్చిని ఆసరా చేసుకుంటున్నారు.

`కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు.

`ఏడాదికి పది శాతం పెంచడానికి ఏడుస్తున్నారు?

`మూడేళ్లకు ముప్పై శాతానికి ముక్కుతున్నారు!

`కార్మికుల కష్టం దోచుకుంటున్నారు.

`వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.

`కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నారు.

`పని గంటలకు లెక్క లేకుండా పని చేయించుకుంటున్నారు.

`కార్మికులను వేధించుకు తింటున్నారు.

`మూడేళ్లు గడిచినా జీతాలు పెంచడానికి ముఖం చాటేస్తున్నారు.

`రాసుకున్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

`తుమ్మితే ఊడిపోయే ముక్కులుగా తీసిపడేస్తున్నారు.

`కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు.

`కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

`కార్మికులపైనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు.

`సమ్మె చేస్తే సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు.

`గుర్తింపు కార్డులు రద్దు చేస్తామంటున్నారు.

`బెదిరించి కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు.

`కార్మికులకు న్యాయం జరిగే వరకు ‘‘నేటిధాత్రి’’ అక్షర పోరాటం చేస్తుంది.

`కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతుంది.

`నిబంధనల ప్రకారం జీతాలు పెంచే దాక పోరు సాగిస్తుంది.

`హీరోలను నెత్తిమీద, కార్మికులను కాళ్ల కింద చూసే సంస్కృతి మారాలి.

`కార్మికులకు సినీ రంగంలో ఆత్మ గౌరవం పెరగాలి.

`కార్మికు చట్టాల ప్రకారం జీతాలు పెరగాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సినిమా ఒక కళావ్యాపారం. ఆ సినిమా అనేది ఎంతో మంది కలిసి చేసే కృషి. కొన్ని వందల మంది కలిసి పనిచేస్తే పూర్తయ్యే యజ్ఞం. తెర మీద కనిపించే నటులే కాదు, ఆ తెరమీద బొమ్మలు ఆడడానికి అవవసరమయ్యే వారు ఎంతో మంది కష్టం కలిసి వుంటుంది. కాని అవేవీ పైకి కనిపించవు. వాళ్లెవరో ప్రపంచానికి తెలియదు. కాని వారి కష్టంకూడా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా అనేది ఏ ఒక్కరో తయారు చేస్తే పూర్తయ్యే వంటకంకాదు. అందరూ కలిస్తేనే పూర్తవుతుంది. అలాంటి సినిమాకు 24 క్రాఫ్ట్స్‌ వర్స్‌ వుంటాయి. లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి మొదలు పెడితే, దర్శకుడి వరకు అందరూ శ్రమించాల్సిందే. ఏ పని విభాగాన్ని బట్టి వారి కష్టం ఆధారపడి వుంటుంది. కాని ఏం లాభం. హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్‌, హీరోయిన్లకు ఇవ్వరు. దర్శకుడికి ఇచ్చేంత సొమ్ము, ఇతర విభాగాలకు ఇవ్వరు. ఎవరికి ఇచ్చినా అది కేవలం పారితోషికం మాత్రమే. నిర్ధిష్టమైన, నిర్ధారిత సొమ్ము కాదు. నిర్మాతలు సినిమా నిర్మాణాన్ని బట్టి నిర్ణయం చేసేది. సినిమా నటుల విషయంలో బేర సారాలుంటాయి. ఎందుకంటే ఆ విలువ వేలల్లో, లక్షల్లో వుంటుంది. హీరోల విషయంలో కోట్లలో వుంటుంది. కాని లైబ్‌ బాయ్‌కి మాత్రం పారితోషికం వందల్లోనే వుంటుంది. వేలు దాటింది ఇప్పటి వరకు లేదు. బైట అడ్డాకూలీలకంటే అద్వాహ్నంగా వుంటుంది. ఆ వందల రూపాయల పారితోషికమైనా నిత్యం వుంటుందా? అంటే అదీ లేదు. సినిమా వాళ్లు పిలిచినప్పుడు మాత్రమే వుంటుంది. ఆ సినిమా పూర్తయ్యే వరకు మాత్రమే వుంటుంది. ఇక వీరిలో జూనియర్‌ ఆర్టిస్టుల పరిస్ధితి మరీ అద్వాహన్నం. టెక్నికల్‌ కార్మికులకు సినిమా నడిచినంత కాలం వుండొచ్చు. కాని జూనియర్‌ ఆర్టిస్టులైన కార్మికులకు మాత్రం సినిమాలో జూనియర్‌ ఆర్టిస్టులు అవసరం వున్నంత కాలం మాత్రమే వుంటుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమా వచ్చేదెప్పుడో తెలియదు. అంత వరకు ఖాళీగానే వుండాలి. ఇంత కష్టపడి సినిమాలోనే ఎందకు పనిచేయాలన్న ప్రశ్న కూడా ఉత్పన్నతమౌతుంది. సినిమా అనేది ఒక వ్యసనం. అదో రంగుల ప్రపంచం. కొందరు తమ టాటెంట్‌ను ప్రదర్శించే రోజు రాకపోతుందా? అప్పటి వరకు ఏదో పని చేసుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తుంటారు. అలా ఆ రంగంలోకి చేరిన వారు మళ్లీ బైటకు రాలేరు. జీవిత కాలం ఎదురుచూస్తూ ఆ పరిశ్రమలోనే కాలం కరిగిపోయిన వారు ఎంతో మంది వున్నారు. ఆకలి దహిస్తున్నా, సమస్యలు పరిగెత్తిస్తున్నా సినిమాను విడిచి వెళ్లలేరు. సినిమాను కాదనుకొని బతకలేరు. అది వారి బలహీనత. ఇదే నిర్మాతల పాలిట వరమైపోతోంది. ఇప్పుడే కాదు కొన్ని దశాబ్ధాలుగా ఈ దోపిడీ జరుగుతూనే వుంది. ఆ సినిమా ప్రపంచంలో జరుగుతున్న దోపిడీ ఏ హీరోకు కనిపించదు. కాని సినిమా పాత్రలతో మాత్రం ఏ పరిశ్రమలో నైనా కార్మికులకు ఇబ్బందులు ఎదరైతే హీరో వెళ్తాడు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తాడు. యాజమన్యాన్ని భయపెట్టిస్తాడు. వారి చేత కార్మికులను న్యాయం చేస్తాడు. కార్మికుల చేత జేజేలు కొట్టించుకుంటాడు. సినిమా అయిపోతుంది. కాని అదే సినీ పరిశ్రమలో నిత్యం కార్మికులు పడే కష్టాన్ని దగ్గరుండి చూస్తూనే వుంటారు. వారి చేతనే హీరోలు సేవలు చేయించుకుంటారు. మీకున్న కష్టమేమిటి? అని ఏ హీరో ఏ ఒక్క కార్మికుడిని అడిగిన సందర్భం వుండదు. అది ఎంత పెద్ద హీరో అయినా సరే కార్మికుల కోసం మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలా ఎవరికి వారు ప్రతి సినిమాకు మరమనుషులను వాడినట్లు కార్మికుల కష్టం దోచుకుంటుంటారు. కోట్లరూపాయలు పెట్టి సినిమా తీస్తున్నామంటారు. లెక్కలు మాత్రం కోట్లలో చెబుతుంటారు. సినిమా నిర్మాణ విలువల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదంటారు. హీరో ఎంత రెమ్యునరేషన్‌ అడిగితే అంత ఇస్తుంటారు. కాని కార్మికుల విషయానికి వచ్చే సరికి రూపాయి, రూపాయి లెక్కలు వేసుకుంటారు. పనిగంటలకన్నా, ఎక్కువ పనిచేసినా రూపాయి ఎక్కువ ఇచ్చేందుకు ఏ నిర్మాతకు చేతులు రావు. ఏ నిర్మాత ఎంత ఇస్తే అంతతీసుకునే రోజుల నుంచి కొంత డిమాండ్‌ చేసే వరకు కార్మికులు వచ్చారు. కాని వారి డిమాండ్‌ పెద్ద విలువైందేమీ కాదు. అయ్యా…ఓ పది రూపాయలు పెంచాలంటూ చేసుకున్న విన్నపాలే. అంతకు మించి కార్మికులు డిమాండ్‌ చేసిందెప్పుడూ లేదు. ఎందుకంటే అవన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పనులు. మొత్తం 24 క్రాఫ్ట్‌లలో సుమారు 24వేల మందికిపైగా కార్మికులు వున్నారు. ఏ ఒక్కరు నోరు తెరిచినా, వారిని పనికి పిలువరు. అందుకే కార్మికులు నోరు తెరిచేందుకు కూడా ధైర్యం చేయరు. ఇంత మంది వుండడంతో నిర్మాతలు వద్దను కుంటే ఆ మాత్రం ఉపాధి కూడా పోతుందేమో? అన్న భయం వారిని వెంటాడుతుంది. సరే ఒక సినిమాకు పనిచేసినా అది రోజూ వారి కూలీ పని అయినా ఏ రోజుకారోజు పారితోషికం ఇవ్వరు. కొన్ని సార్లు సినిమా పూర్తయ్యే వరకు కూడా ఇవ్వరు. ఆ సినిమా పూర్తి కాకముందే మరోసినిమా మొదలు పెట్టే నిర్మాతలు, ఆ సినిమా ఆశచూపి పనిచేయించుకుంటారు. రెండో సినిమా పూర్తయ్యే నాటికి మొదటిసినిమా పారితోషికం చేతుల్లో పెడుతుంటారు. ఇలా కూడా కార్మికులను వాడుకుంటారు. వారి శ్రమను దోచుకుంటారు. ఇక కార్మికులు ఎంత సమయం పనిచేయాలన్నదానిపై కార్మిక చట్టాలు స్పష్టంగా వున్నాయి. రోజుకు ఒక కార్మికుడి చేత 8 గంటలకన్నా ఎక్కువ పనిచేయించుకోకూడదు. కాని ఆ చట్టాలను సినీ వర్గాలు ఎప్పుడో తుంగలో తొక్కేశాయి. ఒక కార్మికుడు సినిమా షూటింగ్‌ స్పాట్‌కు ఉదయం 6 గంటల వరకు చేరుకోవాలి. అంటే ఆ కార్మికుడు రాత్రి 3 గంటలకు నిద్రలేవాలి. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం6 గంటలకు పనిచేయించుకుంటారు. నిజానికి ఉదయం 6 గంటలకు వచ్చిన కార్మికుడి చేత మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేయించుకోవాలి. కాని ఆ వ్యక్తి చేత సాయంత్రం 6 గంటలకు వరకు పనిచేయించుకుంటారు. అవసరమైతే రాత్రి పది గంటల వరకు పని చేయించుకుంటుంటారు. కాని పారితోషికమేమైనా అదనంగా ఇస్తారా? అంటే అదీ లేదు. ఇలా కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు. ఇలా నిత్యం విసిగి, విసిగి వేసారిన కార్మికులు కొంత మంది 2022లో సమ్మె బాట పట్టారు. దాంతో అప్పుడున్న పిల్మ్‌ చాంబర్‌ చైర్మన్‌ దిల్‌ రాజు వారి వేతనాలను ఏటా పది శాతం పెంచాలన్న నిర్ణయం చేశారు. కాని అది మూడేళ్లకోసారి అమలు చేయాలి. మూడేళ్లకు 30శాతం చొప్పున పెంచుతూ పోవాలన్నారు. ఇప్పుడు మూడేళ్లు దాటి పోయింది. కార్మికుల రెమ్యునరేషన్‌లో 30శాతం పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కాని ఫిల్మ్‌ చాంబర్‌ స్పందించడం లేదు. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. దాంతో కోపం వచ్చిన నిర్మాతలు, ఫిల్మ్‌ చాంబర్‌ పెద్దలు కార్మికుల మీద చర్యలు తీసుకోవాలంటూ కార్మిక శాఖకు పిర్యాధు చేసినట్లు సమాచారం. ఇది విచిత్రంగా వుంది. నిర్మాతలు తమ మాట తప్పితే, మూడేళ్ల వ్యవధి దాటినా రాసుకున్న బైలా ప్రకారం రేమ్యునరేషన్‌ చెల్లించడం లేదని కార్మికులు పిర్యాధు చేయాలి. కాని విచిత్రంగా నిర్మాతలే కార్మికుల మీద కేసులు నమోదు చేసే దాకా వెళ్లారని తెలుస్తోంది. ఇలా కార్మికులను అణిచి వేసి, భయపెట్టి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కార్మికులు కొంత మంది నేటిధాత్రిని ఆశ్రయించారు. కార్మికులకు ఇండ్ల విషయంలో నేటిధాత్రి పోరాటం వారికి తెలుసు. కార్మికుల పక్షాన నేటిదాత్రి పోరాటం, కార్మికుల విజయం చూస్తూనే వున్నారు. చిత్ర పురిపై నేటిధాత్రి కొన్ని సంవత్సరాలుగా పట్టువదలకుండా సాగిస్తున్న పోరాటంలో కార్మికులకు అనేక విజయాలు చేకూర్చిపెట్టింది. కార్మికులను నిలబెట్టింది. చిత్ర పురిలో ఎలాంటి సమస్యపైన అయినా సరే నేటిధాత్రి కార్మికుల అండగా సాగిస్తున్న పోరాటంతో 24 క్రాఫ్ట్‌ కార్మికులు కూడా ఆశ్రయించారు. తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. నిర్మాతలు చేస్తున్న అన్యాయాలను వివరించారు. తమ కష్టం నేటిదాత్రితో చెప్పుకున్నారు. తమకు న్యాయం జరగాలంటే నేటిధాత్రి వల్లనే సాద్యమౌతుందని గుర్తించారు. చిత్రపురి కార్మిక లోకమంతా నేటిధ్రాత్రికి ఎలా రుణపడి వుంటుందో, మాకు పారితోషకం విషయంలో అక్షర సాయం చేయాలని కోరుకున్నారు. దాంతో నేటిధాత్రి కార్మికుల పోరాటానికి అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నది. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేటిధాత్రి యాజమాన్యం కార్మికులకు హమీ ఇచ్చింది.

నెగెటివ్‌ పాత్రలకు సిద్ధమే..

నెగెటివ్‌ పాత్రలకు సిద్ధమే

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు త్రిప్తీ దిమ్రీ. ఇటీవలె ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌’ సినిమాలో…

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు త్రిప్తీ దిమ్రీ. ఇటీవలె ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌’ సినిమాలో అవకాశం కొట్టేసిన ఆమె, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ చేసే చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే, సిద్దార్థ్‌ చతుర్వేదితో ఆమె నటించిన ‘ధడక్‌ 2’ ఆగస్టు 1న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ఇందులో నేను కాలేజీ విద్యార్థిగా కనిపిస్తాను. నేనిప్పటివరకూ ఎన్నో కామెడీ, లవ్‌ చిత్రాల్లో నటించాను. కానీ యాక్షన్‌ జానర్‌లో రూపొందిన చిత్రాల్లో నటించలేదు. ఒకవేళ అటువంటి సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు వదులుకోను. యాక్షన్‌ పాత్రలు చేయడం ద్వారా నా నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించొచ్చని భావిస్తా. కంటెంట్‌ బాగుంటే నెగెటివ్‌ పాత్రలు చేయడానికైనా సిద్ధమే’’ అని పేరొన్నారు.

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో’ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మంగళవారం ఈ సినిమా ప్రీవ్యూ షోను వేశారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma maheswara ugra roopasya) చిత్రాల నిర్మాత పరుచూరి ప్రవీణ (Paruchuri Praveena) తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్తపల్లిలో…’ (Kothapalli lo). ఒకప్పుడు అనేది దాని ట్యాగ్ లైన్. 1980, 90లలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలను సినిమాగా దర్శకురాలు ప్రవీణ తెరకెక్కించింది.

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదలకు మూడు రోజుల ముందే మీడియాకు ప్రివ్యూ షో వేసి చూపించారు. గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాలను, వాటి పర్యవసానాలను తెలియచేస్తూ ఈ సినిమా సాగింది. రామకృష్ణ అనే యువకుడి జీవితం రాత్రికి రాత్రి ఎలా తల్లకిందులైందనేది ఇందులోని ప్రధాన కథాంశం. దీన్ని మూఢ విశ్వాసాలకు, అగ్రవర్ణాల అహంకారానికి, జలగల్లా పీడించే వడ్డీ వ్యాపారుల క్రూరత్వానికి లింక్ చేస్తూ ప్రవీణ పరుచూరి సినిమాగా తీశారు.

ఇటీవల ఓ ఇంటర్వూలో ఆర్టిస్టుల పట్ల తాను సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించానని, సన్నివేశం బాగా రావడం కోసం కొన్ని సందర్భాలలో వారిపై చెయ్యి చేసుకున్నానని, కోపంతో రాళ్లూ విసిరానని చెప్పుకోవచ్చారు. నిజానికి ఇవన్నీ సినిమా కథలో భాగంగానే ప్రవీణ పరుచూరి చేశారని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అర్థమౌతోంది.

ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో నాగమణి అనే డీ గ్లామరైజ్డ్ పాత్రను ప్రవీణ పోషించారు. ఓ మారుమూల పల్లెటూరిలో అట్లు వేసుకుని జీవితాన్ని గడిపే నిరుపేదరాలు పాత్రను ఆమె చేసింది. హీరో ప్రేమ విషయంలో జరిగే తగవులో అతని తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ పాత్ర… అవతలి పాత్రలతో ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగుతుంది. జుత్తు జుత్తు పట్టుకుని ఇద్దరు మహిళలు వీరంగం సృష్టిస్తారు. దర్శక, నిర్మాత కూడా అయిన ప్రవీణ ఆ సమయంలో కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి… అవతలి వాళ్ళను తన్ని తగలేసి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించింది. చిత్రం ఏమంటే… ‘కేరాఫ్ కంచరపాలెం’లో వేశ్యగా నటించడానికి వెనుకాడని ప్రవీణ… ఇందులోనూ తన పాత్రను కించపరిచే సంభాషణలను సైతం రాయించుకుంది. అక్కడ పాత్ర తప్పితే… మనకు నిర్మాతో, దర్శకురాలో కనిపించరు.

అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పరుచూరి ప్రవీణకు సినిమా అంటే ఎంత పిచ్చో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంతో కష్టపడి, ఇష్టపడి పరుచూరి ప్రవీణ తెరకెక్కించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

విక్ర‌మ్, 96 ప్రేమ్ కుమార్‌ వ‌య‌లెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..

విక్ర‌మ్, 96 ప్రేమ్ కుమార్‌.. వ‌య‌లెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

త‌మిళ‌నాట ఓ అస‌క్తిక‌ర కాంబినేష‌న్ సెట్ అయింది.

ఏడేండ్ల క్రితం 96 అనే చిత్రంతో సెన్షేష‌న్ అయిన ప్రేమ్ కుమార్ (Prem Kumar) ఆపై అచి తూచీ మాత్ర‌మే సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓప్ర‌త్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం కార్తి, అర‌వింద్ స్వామిల‌తో ‘మెయ్యళగన్‌’ (Meiyazhagan) అనే సినిమాతో ఇంటిల్లిపాదితో ఎమోష‌న‌ల్జ‌ర్నీ చేయించి త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నారు. ఆయ‌న త‌మిళంలో చేసిన 96 చిత్రం తెలుగులో జానుగా రీమేక్ కాగా, ‘మెయ్యళగన్‌’ స‌త్యం సుంద‌రంగా విడుద‌లై భారీ విజ‌యాల‌నే సొంతం చేసుకున్నాయి. అయితే ఈ చిత్రం త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్రేమ్ చేయ‌బోయే సినిమా ఏంటి, ఎలా ఉండ‌బోతుందో అనేది చాలామందికి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న చేయ‌బోయే సినిమా గురించి నెట్టింట అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రేం కుమార్ తన కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోండ‌గా అందులో చియాన్ విక్రమ్ (ChiyaanVikram) హీరో అని సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది, సినిమా వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న‌ట్లు వినికిడి. అయితే.. ఇప్ప‌టికే.. విక్రమ్ త‌న‌ కెరీర్‌లో ఎన్నో విభిన్న కాన్సెప్ట్ సినిమాలు చేసినప్పటికీ, 64వ చిత్రంగా వ‌స్తున్న ఈ మూవీ మాత్రం ఫ్యాన్స్‌కి మరో లెవల్ ట్రీట్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని. అన్నీ అనుకున్న‌ట్లుగా జరిగితే, వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విక్రమ్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సినిమాల‌తో బిజీగా ఉన్నప్పటికీ, ప్రేమ్ కుమార్ చెప్పిన క‌థ బాగా ఆక‌ట్టుకుంద‌ని అందుకే వెంట‌నే డేట్స్ కూడా అడ్జ‌స్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ముఖ త‌మిళ నిర్మాణ సంస్థ వేల్స్ పిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ (Vels Film International) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా ప్రేమ్ కుమార్ శైలికి పూర్తి భిన్నంగా వ‌య‌లెంట్‌, యాక్ష‌న్‌గా ఈ సినిమా ఉండ‌నుంది. కాగా ఈ చిత్రంపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది.

వ‌ణుకు పుట్టించే డార్క్ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌!

ఓటీటీకి.. వ‌ణుకు పుట్టించే డార్క్ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌! ఎందులో అంటే

చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ మండల మ‌ర్డ‌ర్స్ డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ మండల మ‌ర్డ‌ర్స్ (Mandala Murders) డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది. క్రైమ్‌, మ‌ర్ట‌ర్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సిరీస్ రాక కోసం చాలామంది సినీ లవ‌ర్స్ ఎదురు చూస్తున్నారు. గ‌తంలో హిందీ నుంచే వ‌చ్చి క‌ల్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న‌ అసుర్ త‌ర‌హా కాన్పెస్ట్‌తో ఈ సిరీస్ తెర‌కెక్కింది. య‌శ్ రాజ్ సంస్థ ఆస్థాన క‌థానాయిక‌ బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ (Vaani Kapoor) లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా సుర్వీన్ చావ్లా (Surveen Chawla), శ్రీయ పిగ్లోంక‌ర్ (Shriya Pilgaonkar), వైభ‌వ్ రాజ్ గుప్తా (Vaibhav Raj Gupta) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇదిలాఉంటే.. ఈ సిరీస్‌కు గోపి పుత్ర‌న్ (Gopi Puthran), మ‌న‌న్ రావ‌త్ (Manan Rawat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) వంటి ప్ర‌ఖ్యాత భారీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్ లోకి ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. చరందాస్పూర్ అనే గ్రామంలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు, దాని వెన‌క ఉన్న ఆధ్యాత్మిక ర‌హాస్య‌ల ప‌రిశోధ‌న నేప‌థ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. రియా థామస్ (Vaani Kapoor) మరియు విక్రమ్ సింగ్ (Vaibhav Raj Gupta) ఈ కేసును ఎలా విచారణ చేశారు, వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి, మ‌ర్డ‌ర్స్ వెనుక ఉన్న అనేక మిస్టరీలను ఎలా బ‌య‌ట‌కు తీసుకు రాగ‌లిగారు, చివ‌ర‌కు ఏమ‌యింద‌నేది క‌థ‌.

తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోవ‌డ‌మే వెంట‌నే చూసేయాలి అనే ఫీలింగ్‌ను తెప్పించేలా ఉంది. ముఖ్యంగా వ‌రుస హ‌త్య‌లు, వాటికి దైవానికి మ‌ధ్య లింకులు ఎపిసోడ్ ఎపిసోడ్‌కు వ‌చ్చే ట్విస్టులు మైండ్ బ్లాక్ చేసేలా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సిరీస్‌ జూలై 25 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు రానుంది. ఎంతో కాలంగా అసుర్ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ కంటెంట్ అశిస్తున్న వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్‌. సో సినీ, ఓటీటీ ల‌వ‌ర్స్ డోంట్ మిస్ మండ‌ల (Mandala Murders) మ‌ర్డ‌ర్స్‌.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం ర‌వితేజ తండ్రి క‌న్నుమూత‌..

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ర‌వితేజ తండ్రి క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగ‌ళ వారం రాత్రి కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) తండ్రి రాజగోపాల్ రాజు (90) (Bhupathiraju Rajagopal Raju) మంగ‌ళ వారం రాత్రి కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా వ‌యో భారం, అనారోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాదులోని రవితేజ నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఈ రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు వారి కుటుంబ స‌భ్యుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ సంతాపం తెలుపుతున్నారు.

రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఈ నేప‌థ్యంలో ఆయన పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు.

ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు రవితేజ, రఘు, భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని జగ్గంపేట.

మెగాస్టార్ చిరంజీవి స‌హా చాలా మంది ప్ర‌ముఖులు ర‌వితేజ తండ్రి మృతికి సంతాపం తెలియ జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా.. సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ సైతం పెట్టారు.

న్యూ హీరోయిన్స్ హవా.

న్యూ హీరోయిన్స్ హవా

 

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ జోరు మామూలుగా లేదు.

ఒక్కొక్కరూ ఒక్కో రకంగా దూసుకుపోతూ ఇండస్ట్రీలో తమ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.

ఈ అందాల తారల్లో ఎవరు ఏ రీతిలో దూసుకుపోతారో తెలుసుకుందాం…

 

 

ప్రతి ఏటా కొత్త ముద్దుగుమ్మలు వెండితెరపై సందడి చేస్తూనే ఉంటారు. టాలీవుడ్ లో కి ప్రెజెంట్ కొత్తగా చాలా మంది బ్యూటీస్ వచ్చి చేరారు.

తమ అందచందాలతో ఆడియెన్స్ అట్రాక్ట్ చేస్తూ..

అవకాశాలను కొల్లగొడుతున్నారు.

మమితా బైజు (Mamitha Baiju) పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్.

ఈ జూనియర్ బ్యూటీ సీనియర్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘డ్యూడ్‌’తో పాటు, సూర్య 46లో నటిస్తోంది.

అంతటితో ఆగకుండా దళపతి విజయ్‌ తో ‘జన నాయగన్’ లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.

స్టార్ కిడ్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్‌లో గట్టి మార్క్ వేస్తోంది.

‘దేవర’ సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన ఈ అమ్మడు, ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది.
క్రేజ్, గ్లామర్, నటన మిక్స్ చేసి టాలీవుడ్‌లో హాట్ ట్రెండ్‌గా మారుతోంది.
మరో బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) దూకుడు మామూలుగా లేదు.
పాన్ ఇండియా సినిమాలతో ఈ బ్యూటీ రచ్చ రేపుతోంది.
ప్రస్తుతం ‘ద రాజా సాబ్’ మూవీతో తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది.
‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ సినిమాతో గ్లామర్ డోస్ పెంచి అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).
ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’లో…
శివకార్తికేయన్‌ ‘మదరాసి’లో మెరవనుంది.
‘హిట్ 3’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాతో బిజీగా ఉంది.
ఈ మూవీ హిట్ అయితే ఈ వయ్యారికి మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు.
అలాగే ‘ఓం భూమ్ భుష్‌’లో నటించిన ప్రీతి ముకుందన్ (Prithi Mukundan) ‘కన్నప్ప’లో కథానాయికగా నటించింది.
ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో అదరగొట్టేసిందీ భామ. 

ఐశ్వర్య మీనన్ కూడా తన సినిమాల స్పీడ్‌ను పెంచేసింది.

‘స్పై, భజే వాయు వేగం’ సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’తో రాబోతోంది.

ఈ బ్యూటీ టాలెంట్, గ్లామర్ చూస్తే టాప్ లీగ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకో చిన్నది కాజల్ చౌదరి. ఆమె ‘అనగనగా’ సినిమాతో తన మార్క్ వేసింది.

ఇప్పుడు ‘కరాలి, అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ వంటి సినిమాలతో బిజీగా మారింది.

రితికా నాయక్ కూడా సైలెంట్‌గా వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది.

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ తర్వాత కొన్ని సినిమాలను లైన్ లో పెట్టింది.

ప్రెజెంట్ ‘మిరాయ్’, వరుణ్ తేజ్‌, ఆనంద్ దేవరకొండ ‘డ్యుయేట్’ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది.

ఇలా పలువురు నూతన తారలు తమ అందచందాలతోనూ, అభినయ పటిమతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

మరి వీరిలో జనం మదిలో పదికాలాల పాటు నిలిచే దెవరో చూడాలి.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది

 

 

 

 

వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర ) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు.

ఇటీవ‌ల‌ బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ వంటి వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర (Naveen Chandra) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’ (Show time) తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు. కామాక్షీ భాస్కర్ల (Kamakshi Bhaskarla), సీనియ‌ర్ న‌రేశ్ (VK Naresh), రాజా ర‌వీంద్ర (Raja Ravindra ) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్‌ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మదన్‌ దక్షిణామూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టీ వినోద్‌రాజా సినిమాటోగ్రఫీ, శేఖర్‌ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గ‌విరెడ్డి డైలాగ్స్‌ అందించారు.

ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై4 థియేట‌ర్‌లో విడుద‌లకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం ఓ ఈవెంట్ నిర్వ‌హించి రిలీజ్‌ చేశారు. ఈట్రైల‌ర్‌ను చూస్తుంటే ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. హీరో ఇంట్లో అల‌ని స్నేహితుడు అనుకోకుండా చ‌నిపోవ‌డం, దీంతో హీరో ప‌క్క‌నే ఉండ ఏ లాయ‌ర్‌ను పంప్ర‌దించ‌డం, ఆపై పోలీసుల రాక‌తో ఇంత‌కు హ‌త్య చేసింది ఎవ‌రు అనే పాయింట్‌తో సినిమాను రూపొందించిన‌ట్లు ఉండి ఇట్టే ఆక‌ట్టుకుంటుంది.

కొత్త తరహా చిత్రం.

కొత్త తరహా చిత్రం

 

 

 

 

అర్థనారి తెప్ప సముద్రం వెడ్డింగ్‌ డైరీస్‌ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం…

‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. నాగ శివ దర్శకత్వం వహించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్‌ నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్‌ అంబటి మాట్లాడుతూ ‘శివ నాకు ఈ కథను చెబుతున్నప్పుడు హీరో ఎలివేషన్స్‌ డైరెక్టర్‌ పూరి స్టయిల్లో అనిపించేవి’ అని అన్నారు. హీరోయిన్‌ జెన్నిఫర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్‌ ఆఫీసర్‌పాత్ర పోషించాను. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. చిత్రదర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ‘హీరో అర్జున్‌ యాక్షన్‌ సీన్స్‌లో, భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు’ అని తెలిపారు. నిర్మాత శివ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుందీ చిత్రం’ అని అన్నారు.

టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్.

టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్ కు సన్మానం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేసి విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన సూత్రపు లావణ్యను సన్మానించారు.పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు నుండి టీచర్ గా ఎంపికైన లావణ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం లో పని చేస్తూ టీచర్ గా ఉద్యోగం సాధించడం ఎంతో గొప్పతనమని మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా స్థానిక స్టేషన్లో విధులు నిర్వహించిన లావణ్య ఎంతో నమ్మకంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ అందరి మన్ననలు పొందడం అభినందియమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితోపాటు లావణ్య మిత్ర బృందం పాల్గొన్నారు.

మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి.!

మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి అక్రమంగా ముందస్తు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శివరాజ్ శ్రీకాంత్ రెడ్డిలను శుక్రవారం పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని అక్రమ నిర్బంధాలతో, అక్రమంగా హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీస్ సిబ్బంది ముందస్తు అరెస్టు చేసినారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమాన్ టెకిడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతలు పూలమాలలు వేశారు .

ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .

1982లో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 1983 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 0 2 అసెంబ్లీ సీట్లు ఎన్టీ రామారావు గెలిపించారని గుర్తు చేశారు పటేళ్లు పట్వార్లు ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన తెలిపారు .

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇల్లు కట్టించారని జూరాల ప్రాజెక్టు హయంలోనే నిర్మించాలని రెండు రూపాయల కిలో ప్రజలకు బియ్యం పథకం అమలు చేశారని మైనార్టీలకు బీసీలకు న్యాయం చేశారని ఆయన తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడానికి మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు .

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలు జెడ్పిటిసిలు ఎం పీ టీ సీ లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బి రాములు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ పోటీ చేస్తుందా అని విలేకరుల ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు ఉన్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని వారికి భవిష్యత్తు ఉంటుందని బి రాములు తెలిపారు .

ఈ విలేకరుల సమావేశంలో ఎండి దస్తగిరి కొత్త గొల్ల శంకర్ చిన్నయ్య ఆవుల శ్రీనివాసులు మాదయ్య న్యాయవాది షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం మేదరి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ దస్తగిరి అరుణ్ ర షీ ద్ బాబర్ ఫారూఖ్ కాగితాల లక్ష్మయ్య డి బాలరాజ్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version