అమెరికా భూమిపై జరిగిన ఓ ప్రైవేట్ విందులో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. “మేము అణ్వాయుధ దేశం. మేము కూలిపోతున్నామనుకుంటే, ప్రపంచంలో సగం దేశాలను మాతో పాటు నాశనం చేస్తాము” అని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని, చైనా సహాయంతో మరిన్ని అభివృద్ధి చేస్తున్నారని అంచనా. ఈ ఆయుధాలను నిర్వహించడం, నియంత్రించడం పూర్తిగా సైన్యం ఆధీనంలోనే ఉంటుంది.
భారతదేశం పహల్గామ్ దాడి తరువాత ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంపై స్పందిస్తూ, ఆసిమ్ మునీర్ “భారతదేశం డ్యామ్ నిర్మిస్తే, దానిని 10 క్షిపణులతో ధ్వంసం చేస్తాము” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.