రెచ్చిపోయిన మిర్చీ గ్యాంగ్.. కంట్లో కారం చల్లి..

 

రెచ్చిపోయిన మిర్చీ గ్యాంగ్.. కంట్లో కారం చల్లి..

 

స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు.

 

దేశ రాజధాని ఢిల్లీలో మిర్చీ గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది. కంట్లో కారం చల్లి దోపిడీలకు పాల్పడుతోంది. చుట్టూ జనాలు ఉన్నా ఏ మాత్రం భయపడకుండా పబ్లిక్‌గా దొంగతనాలు చేస్తోంది. తాజాగా, మిర్చీ గ్యాంగ్ ఓ షాపులో దోపిడీకి పాల్పడింది. షాపు యజమాని కంట్లో కారం చల్లి డబ్బులు దోచేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మిర్చీ గ్యాంగ్ స్కూటీలపై ఈ బ్లాక్‌లోకి వచ్చిం

ఆ ఏరియాలోకి వచ్చీ రాగానే మిర్చీ గ్యాంగ్ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. స్కూటీలపై నుంచి దిగిన వెంటనే ఓ షాపులోకి ప్రవేశించారు. ఆ వెంటనే ఓ సభ్యుడు షాపు యజమాని కంట్లో కారం చల్లాడు. డబ్బుల డ్రాయర్ దగ్గరకు వెళ్లాడు. దాన్ని బయటకు తీసి షాపు బయట ఉన్న వాళ్లకు అందించాడు. కంట్లో కారం పడ్డా షాపు యజమాని వెనక్కు తగ్గలేదు. మిర్చీ గ్యాంగును అడ్డుకోవడానికి చూశాడు. వృద్ధుడు కావటం, దానికి తోడు కంట్లో కారం పడ్డం వల్ల ఆయన మిర్చీ గ్యాంగ్ సభ్యులను అడ్డుకోలేకపోయాడు.

పైగా వాళ్లు కత్తులతో బెదిరించటంతో పట్టుకోలేకపోయాడు. ఆ గ్యాంగ్ అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. చుట్టూ జనం ఉన్నా కూడా ఆ గ్యాంగ్‌ను ఏమీ చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అక్కడ అంతమంది ఉన్నారు. ఒక్కరు కూడా ఆపడానికి రాలేదు. ఏం మనుషులో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: జిల్లాస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, అధికారులు ఆదేశాలు జారీచేసిన కింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా , టోప్యా నాయక్ తండాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. గురువారం పలు తండాలను పరిశీలించగా బోజ్యానాయక్ తండా లో సగం మందికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మరి కొంతమందికి నీటి సరఫరా కావడం లేదు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ గత మూడు నెలల నుంచి పనిచేయకపోవడంతో మూలన పడింది.పాఠశాల ఆవరణలో నర్సరీ పెంపకం నిర్లక్ష్యంగా కనిపించింది. రామ్ చందర్ నాయక్ తండా కు సరైన రోడ్డు మార్గం లేదు. పూర్యా నాయక్ తండా లో మినీ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉంది. మురికి కంపు కొడుతుంది. తండావాసులకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. టోప్యా నాయక్ తండాలలో ఇటీవలనే నూతనంగా మంచినీటి బోర్లు వేశారు. బోర్ నుంచి తండా వరకు పైప్ లైన్ వేయకపోవడంతో ఓ మహిళ రైతుకు చెందిన వ్యవసాయ పైపులను అమర్చి నీటిని అందిస్తున్నారు. సిసి రోడ్లు అసలుకే కనిపించలేదు. నాలుగు తండాలో కలిపి అనుసంధాన రోడ్లు లేక వైద్యం, ఇతర గ్రామాలకు వెళ్లే గిరిజనులు, బడికి వెళ్ళే విద్యార్థులు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే టోప్యా నాయక్ తండాకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందర్శించడం లేదని గిరిజన వాసులు వాపోయారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. ఎంపీడీవో సుధాకర్

బోజ్యానాయక్ తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ వివరణ కోరగా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పైప్ లైన్ విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version