మన ఆరోగ్యం…!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-2.wav?_=1

మన ఆరోగ్యం…!

వంటగదే ఒక ఔషధ నిలయం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.

1) పసుపు:

▪️పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.

▪️నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు,గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.

▪️పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.

▪️ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.

▪️పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.

▪️పసుపు పూయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు (రషేర్) తగ్గుతాయి.

▪️బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.

▪️వేడి పాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి.

▪️ 5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరకడుపున తీసుకుంటే మధుమేహం క్రమేణా తగ్గుతుంది.

▪️పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.

2) ధనియాలు:-

▪️కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి ధనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.

▪️దప్పిక, మంట పూర్తిగా పోతుంది. చెమట బాగా పడుతుంది.

▪️పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.

▪️కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి.

▪️పచ్చి ధనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.

▪️మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.

▪️మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.

3) సోంపు:

▪️సోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తరవాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గాస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.

▪️విరేచనం సాఫీగా అవుతుంది.

▪️నులిపురుగులు కూడా పడి పోతాయి.

▪️కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.

▪️అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.

▪️సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గుతుంది.

▪️మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.

kitchen remedies

 

4). అల్లం మరియూ శొంఠి:

▪️అజీర్ణ వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పుతో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.

▪️నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.

▪️తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

▪️నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి.

▪️ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులు రావు.

▪️అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.

▪️కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయు.

5). జీలకర్ర:

▪️జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.

▪️లివర్ పనిచేయడం మెరుగుపడుతుంది.

▪️నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.

▪️అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.

▪️బాలింతలకు పాలు బాగా పడుతాయి.

▪️మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.

▪️నిద్ర బాగా వస్తుంది.

▪️శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.

6). లవంగాలు:

▪️ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.

▪️చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడుతాయి.

▪️నోటి దుర్వాసన దూరం అవుతుంది.

▪️పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.

▪️వేడి నీళ్లలో నాలుగు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.

▪️అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూర్ణం (500mg) 10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.

7). యాలకులు:

▪️అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.

▪️యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావం కలిగి ఉంటుంది.

▪️ప్రతిరోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.

▪️గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుంది.

▪️మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.

9). దాల్చిని చెక్క:

▪️ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.

▪️దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.

▪️తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండా ఉంటాయి.

▪️టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది.

▪️సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది.

▪️రక్త స్రావం కాకుండా ఆపుతుంది.

▪️చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.

10). గసగసాలు:

▪️వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.

▪️అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.

▪️వీటి పొడి మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి.

▪️అరగ్రాము పొడి పాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.

▪️గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version