సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

భూపాలపల్లి నేటిధాత్రి:

సిపిఐ 18వ పట్టణ మహాసభలను పురస్కరించుకొని సిపిఐ ఎల్బీనగర్ శాఖ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సోత్కు ప్రవీణ్ కుమార్, గురిజాల సుధాకర్ రెడ్డి,మాతంగి రామచందర్, రాయ మల్లు, కత్తెర శాల, పత్తి వేణుగోపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు

సంకెళ్లు వేస్తున్న సెల్ ఫోన్.

సంకెళ్లు వేస్తున్న సెల్ ఫోన్…

వీడియో గేమ్స్ తో, యూట్యూబ్ లతో కాలం గడిపేస్తున్న యువత…

చాటింగ్, వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైనం…

సెల్ ఫోన్ తో సందడి కోల్పోతున్న ఉమ్మడి కుటుంబం…

యువత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న నిపుణులు…

నేటి ధాత్రి గార్ల:

నేటితరం యువతకు సెల్ ఫోన్ సంఖ్యలు వేస్తుంది యువతలో ఆధునికత అరుదైన రుగ్మతను తెచ్చిపెట్టింది. యువతరం పై స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. సమాచార మార్పిడి భావ ప్రకటన స్వేచ్ఛ తదితర అంశాలలో సామాజిక మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుంది. విజ్ఞానాన్ని పెంచడంతోపాటు అంతే అనర్ధాన్ని తెచ్చిపెడుతుంది. నేటి యువత సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్ చాట్ లకు బానిసలవుతున్నారు. కొంతమంది వాటిని మోసాలు బ్లాక్ మెయిల్ చేసేందుకు వినియోగిస్తున్నారు. ఈ తరం సోషల్ మీడియాలకు బానిసలుగా మారడంపై మానసిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సామాజిక సాధనాలకు బానిస అవుతున్న యువత రోజంతా భోజనం లేకున్నా భరించగలుగుతున్నారు. కానీ ఐదు నిమిషాలు ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే అసహనానికి గురవుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఓ చెయ్యి స్మార్ట్ ఫోన్ పైనే ఉంటుంది. షేరింగ్, లైక్, కామెంట్ ఈ క్షణం ఇదే ప్రపంచంగా యువత, పెద్దలు గడిపేస్తున్నారు. ఇందులో మంచి కంటే చెడు వైపు మొగ్గు చూపే వాటి సంఖ్య అధికంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. కొందరు సామాజిక మాధ్యమాల్లో ముందుకెళ్తుంటే మరికొందరు వీడియో గేమ్స్ తో, యూట్యూబ్ లతో కాలం గడిపేస్తున్నారు. గతంలో నెట్ దొరకాలంటే నానా అవస్థలు పడేవారు. ప్రస్తుత త్రిజి,ఫోర్ జి,ఫైజి సేవలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా ప్యాకేజీలు దొరకడంతో నెట్ వినియోగం పెరిగిపోయింది. యువత చాటింగ్, వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబం భారతీయుల ప్రత్యేకం. ఒకప్పుడు రాత్రి భోజనాలు అయ్యాక అంతా ఓ చోట కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు.ఇంట్లో నలుగురు ఉన్న ఇల్లంతా సందడిగా కనిపించేది. ఇప్పుడు నలుగురు ఉన్న చోట కూడా మౌనం రాజ్యమేలుతుంది. పిల్లలు నిత్యం ల్యాబ్ ట్యాబ్, సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. ఆ సమయంలో ఇబ్బంది కలిగిస్తే కోపంతో ఊగిపోతారు. చదువును సైతం నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు. చాలామంది విజ్ఞానం కోసం వినియోగించకుండా కొత్త పరిచయాలు, కొత్త స్నేహం కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారి పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్రేజ్ పెంచుతున్న చీనాబ్ వంతెన

Jammu-kashmir chenab నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికుల్లోనూ అత్యంత ఆసక్తిని నింపుతోంది. ఈనెల 6న ప్రధాని నరేంద్రమోదీ ప్రారం భించిన ఈ వంతెనను నింగిలోనుంచే క్లిక్ మనిపించేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. “ఇటీవల జమ్ము-కశ్మీర్లో ఆకర్షణీయమైన లోయల ఎగువన విహరించే ప్రతి విమానం… ఓ అద్భుతాన్ని వీక్షిస్తోంది. లోహ విహంగం చీనాబ్ లోయకు దగ్గరైనప్పుడు “మీ కింద ప్రపంచం లోనే అతిపెద్దదైన రైల్వే ఆర్చి వంతెన… chenab నది వంతెన’ అనే ప్రకటన వెలువడుతుంది. వెంటనే ప్రయాణికులు కిటికీల దగ్గరకు పరుగెడుతున్నారు. ఈ అద్భుత నిర్మాణాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటున్నారు. ఈ వంతెనను వారు గర్వకారణంగా భావిస్తున్నారు’ అని రైల్వే బోర్డు సమాచార, ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

దేశంలో వేగంగా శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు

బహుళ ప్రజామోదం పొందిన వందేభారత్‌ రైళ్లు

గత పదేళ్లలో విస్తృతంగా మౌలిక సదుపాయాల వృద్ధి

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 1300 స్టేషన్ల పునరభివృద్ధి

98 శాతం బ్రాడ్‌గేజ్‌ విద్యుదీకరణ పూర్తి

కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించిన చీనాబ్‌ వంతెన

రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు

డెస్క్‌,నేటిధాత్రి:
జార్ఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైలు అనుసంధానతను పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేందమ్రోదీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల మంత్రిమండలి కమిటి (సీసీఈఏ) రూ.6405 కోట్ల విలువైన రెండు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులు కొడెమా`బర్కాఖానా (133కి.మి)డబ్లింగ్‌ మరియు బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌ (185కి.మి).
కొడెమా`బర్కాఖానా డబ్లింగ్‌:
ఇది పాట్నారాంచీ మధ్య మరింత వేగంగా సమర్థవంతమైన రైల్‌ లింక్‌ను ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో రద్దీని తగ్గించడమే కాకుండా, సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రైళ్లు ఎటువంటి ఆలస్యం లేకుండా గమ్యాలను చేరుకోవడానికి ఈ లైన్‌ దోహదం చేస్తుంది.
బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌
ఈ రైల్వేలైన్‌ బళ్లారి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపు రం జిల్లాల మధ్య అనుసంధానతను పెంచుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు రaార్ఖండ్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఏడు జిల్లాలను కవర్‌ చేస్తాయి. అంతేకాదు భారతీయ రైల్వేలు మరో 318 కిలోమీటర్ల దూరం విస్తరించడమే కాదు, 1408 గ్రామాలకు రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మొత్తం గ్రామాల జనాభా 28.19లక్షలు! బగ్గు, ముడి ఇనుము, ఉక్కు, సిమెంట్‌, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత శీఘ్రంగా కొనసాగ గలదు. అంతేకాదు ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా మరో 49 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సాధ్యం కాగలదు. ఇదే సమయంలో తక్కువ ఖర్చు, పర్యావరణ హితంగా రవాణా కొనసాగడం ఈ ప్రాజెక్టులో ప్రధానాంశం. ఈ ప్రాజెక్టుల వల్ల 52కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగం రైల్వేలకు తగ్గడమే కాదు, 264 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను నిరోధించవచ్చు. అంటే ఇది 11కోట్ల మొక్కలను నాటినదానికి సమానం.
తిరుపతి` పాకాలాకాట్పాడి రైల్వేలైన్‌
104 కిలోమీటర్ల దూరం వుండే ఈ రైల్వే లైన్‌కు 2025, ఏప్రిల్‌ 9న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ లైన్‌ నిర్మాణానికి రూ.1332కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అయితే ఇదే నెల 4వ తేదీన కేంద్ర కేబినెట్‌, రూ.18,658 కోట్ల విలువైన మౌలిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన 15 జిల్లాలను కవర్‌ చేస్తాయి.
ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ కింద చేపడుతున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా బహుళ విధాల రవాణావ్యూహాలను అమలు పరచడం ద్వారా, నిరంతర అనుసంధాన కలిగించడం ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆత్మనిర్భర భారత్‌ను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా చేపడుతోంది.
గత పదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధి
గత పదేళ్ల కాలంలో భారత్‌లో మౌలిక సదుపాయాల వృద్ధి అద్భుతమైన రీతిలో కొనసాగిందనే చెప్పాలి. వీటివల్ల దేశంలో భౌతిక అనుసంధానత పెరగడంతో పాటు, తక్కువ ఖర్చు, పర్యావరణ హితమైన రీతిలో రవాణా సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రగతి, ప్రధానమంత్రి గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ, భారత్‌మాల, సాగరమాల మరియు ఉడాన్‌ వంటి ప్రాజెక్టులు దేశంలో అనుసంధానతను మరింతగా పెంచాయి. వీటిల్లో ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను 2021, అక్టోబర్‌ 13న కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ఆర్థిక జోన్లను బహుళ నమూనా మౌలికసదుపాయాల ద్వారా అనుసంధానత పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ సమీకృత వేదిక కింద ఇప్పటివరకు రూ.100 లక్షల కోట్లను సమర్థవంతంగా వినియోగించగలిగారు. ఈ పథకం కింద రైల్వేలు, రోడ్లు, పోర్టులు, నీటి ప్రయాణమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.
రైల్వేల్లో ఇటీవలి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి చీనాబ్‌ వంతెన. ఇది ప్రపంచంలోనే అతి ఎతైౖన వంతెన. ఇక రెండది అంజిఖడ్‌ బ్రిడ్జి. ఇది మొట్టమొదటి రైల్వే కేబుల్‌ వంతెన. ఈ రెండిరటిని జూన్‌ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. చీనాబ్‌ వంతెన ఎత్తు 359 మీటర్లు కాగా, దీనికోసం 1315 మీటర్ల పొడువున నిర్మించిన ఆర్క్‌ బ్రిడ్జిని ఉక్కుతో నిర్మించారు. ఇది పెనుగాలులను, పెద్ద విస్ఫోటాలను తట్టుకోగలదు. వీటి తర్వాత చె ప్పుకో దగింది కొత్త పంబన్‌ వంతెన. ఇది భారత్‌లో నిర్మించిన మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ కలిగిన సముద్ర రైలు వంతెన. ఇది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. చెప్పు కోవాల్సిన మరో పెద్ద రైలు ప్రాజెక్టు కోసి రైల్‌ మహాసేతు. 2020, సెప్టెంబర్‌ 18న ప్రధాని న రేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. ఇది భారత్‌`నేపాల్‌ సరిహద్దులో అత్యంత కీలకమైన వంతెన!
వందేభారత్‌ రైళ్లు
ఇవి అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెమీ హైస్పీడ్‌ రైళ్లు. ప్రస్తుతం ఇవి దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 333 జిల్లాలను అనుసంధానిస్తున్నాయి. ప్రస్తుతం దే శంలో 68 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు (136 సర్వీసులు) నడుస్తున్నాయి. మొత్తం 400 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తయారుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక నాన్‌`ఎసి కేటగిరీకి చెందిన అమృత్‌ భారత్‌ రైళ్ల నిర్మాణం ప్రస్తుతం చెన్నైలోని ఐ.సి.ఎఫ్‌.లో జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మూడు అమృత్‌భారత్‌ రైళ్లు (ఆరు సర్వీసులు) నడుస్తున్నాయి. నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు తక్కువ దూరాల్లో వుండే నగరాల మధ్య నడుపుతారు. వీటినే ఇంటర్‌`సిటీ నెట్‌వర్క్‌ కింద పరిగణిస్తా రు. ఇవి కపుర్తలాలోని ఆర్‌సీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రస్తుతం రెండు నమోభారత్‌ రైళ్లు (రెండు సర్వీసులు) నడుస్తున్నాయి. రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో 200 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, వంద ఆమృత్‌భారత్‌ రైళ్లు, 50 నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు, 17500 జనరల్‌ నాన్‌`ఏసీ కోచ్‌లు దేశవాసులకు అద్బుతమైన ప్రయాణానుభవాన్ని ఇవ్వనున్నాయి.
ఇప్పటివరకు దేశంలో 98శాతం బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయింది. రెండువేల రై ల్వే స్టేషన్లలో సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించారు. రైల్వే స్టేషన్లు, ఇతర భవనాల్లో వంద శాతం ఎల్‌ఇడీ బల్బులను వాడుతున్నారు. ఇక కోచ్‌ల విషయానికి వస్తే 2014 నుంచి ఇప్పటివరకు 37వేల ఎల్‌.హెచ్‌.బి. కోచ్‌ల నిర్మాణం జరిగింది. ఇవి ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తాయి. 2024`25 ఆర్థిక సంవత్సరంలో 7,134 కోచ్‌ల ఉత్పత్తి జరిగింది. గతంతో పోలిస్తే ఇది 9శాతం అధికం! రైళ్ల భద్రతకు ‘కవచ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశీయంగా తయారైన వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
దేశంలో వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది లాజిస్టిక్‌ ఖర్చులను తగ్గించడ మే కాకుండా, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు ఇది అనుకూలం. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశంలో 1300 స్టేషన్లను పునరభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 68 రైల్వేస్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో తక్కువ ధరకే మందులు అందుబాటులో వుంటాయి.

కొలువుకన్నా..విరమణ మిన్న! కొలువు వద్దు..విరమణ ముద్దు!

-ఐదేండ్ల బాండ్లైనా తీసుకుంటాం.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల మనోగతం.

-లంచాలు తీసుకోకుండా వుండలేం?

-రేవంత్‌ ఏసీబీ దాడులు తట్టుకోలేము.

-ఇరుక్కొని ఇబ్బందులు పడలేం.

-మొదటికే మోసం తెచ్చుకోలేం.

-బలవంతంగా కొలువు చేయలేం.

-రాజకీయాల ఒత్తిడి భరించలేం.

-చే జేతులా ముదిమి వయసులో కష్టాలు కొని తెచ్చుకోలేం.

-హాయిగా రిటైర్మెంట్‌ మెంటు కోరుకుంటున్నాం.

-రాజకీయ నాయకులు చెప్పినట్లు వినలేం

-కాదనుకొని ఈ వయసులో ట్రాన్స్‌ఫర్లకు బలి కాలేం.

-అనేక రకాల అనారోగ్యాల బారిన పడి వున్నాం.

-కుటుంబానికి దూరంగా వుండి బతకలేం.

-ట్రాన్స్‌ఫర్ల బారిన పడి ఈ వయసులో ఒంటరి జీవితాలు అనుభవించలేం.

-కనికరించండి..విముక్తి ప్రసాదించండి.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల వేడుకోలు.

-ఇప్పటికే చాలామంది నిజాయితీగల ఉద్యోగులు నిరవదిక సెలవల్లో ఉన్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి
ఈ కొలువులు మాకొద్దు మహా ప్రభో అని కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా వున్న ఉద్యోగులు కొందరు తమ ఆంతరంగికుల వద్ద చెప్పుకుంటున్నారు. రిటైర్‌ మెంటు దగ్గరగా వున్న ఉద్యోగులు చాల మందిది ఇదే అభిప్రాయం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు రిటైర్మెంట్‌వయసు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్త వారిలో కొంత కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం పెంచింది. అదే పెద్ద భారమనుకుంటే, మళ్లీ ఈ ప్రభుత్వం మరింత పెంచే ఆలోచనలు చేస్తుందన్న వార్తలు వారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆందోళణకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా మొదటికే మోసం వస్తుంది. పైగా ఇంత కాలం అదీ ఇదీ తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వారు కూడా వున్నారు. ఇప్పుడు కూడా ఏదీ లేకుండా పనిచేయలేకపోతున్నాం. మరో వైపు రాష్ట్ర సర్కారు ఏసిబి దాడుల నేపధ్యం కూడా తోడౌతుంది. మరో వైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పని చేసినా కష్టమే..చేయకపోయినా కష్టమే! చేస్తే ఊరికే చేయొద్దని అంటారు. చేస్తే తప్పంటారు. రాజకీయ నాయకులు తెచ్చే పనుల్లో ఎంత నిజాయితీ వుంటుందో అందరికీ తెలిసిందే. చేయకపోతే వారు ఊరుకోరు. చేయమని చెప్పే ధైర్యం మాకు లేదు. ఇచ్చింది తీసుకొని పనిచేయాలంటే భయమేస్తోంది. ఎక్కడ ఏసిబికి చిక్కి చిక్కుల్లో పడతామేమే అన్న భయం వెంటాడుతోంది. ఈ వయసులో లేని పోసి సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని పనులు చేయలేక, నాయకులకు ఎదురు చెప్పలేక ఓ వైపు సతమతమౌతున్నాం. ప్రతి వారు వచ్చిన పని చేయమని బెదిరించేవారు తయారయ్యారు. నీతిగా పనిచేయాలంటే కొన్ని పనులు కావు. అవినీతికి పాల్పడితే ఎప్పుడు పట్టుబడతామో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి మరింత పవర్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బందిని పెంచే కసరత్తు కూడా జరుగుతోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్దం కాకుండా వుంది. బాదితుల పక్షాన నిలిస్తే నాయకులు ఊరుకోరు. నాయకుల పక్షాన తప్పు చేస్తే బాధితులు సహించరు. ఇద్దరి మధ్య నలిగిపోతూ పనిచేయలేని పరిస్దితి ఎదురౌతోంది. నాయకులు చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ఫర్లు తప్పని సరి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ట్రాన్స్‌ఫర్లను ఆహ్వానించలేం. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే వెళ్లలేం. కుటుంబాన్ని వదిలేసుకొని వెళ్లే పరిస్దితి లేదు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వుంటున్నాయి. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అక్కడికి కుటుంబంతో వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు. ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లి వుండే అవకాశంలేదు. ఏ క్షణం ఎలా వుంటుందో ఆరోగ్య పరిస్దితులు అనే భయం కూడా వెంటాడుతోంది. దాంతో పనులు చేయలేకపోతున్నాం. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యభర్తల వయసు ఎలాగూ 55 దాటివుంటుంది. భర్త ఉద్యోగి అయితే అతని వెంట కుటుంబాన్ని వదిలేసి వెళ్లలేని పరిస్థితి. భర్త ఉద్యోగం చేసే స్ధలాలకు భార్య వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఎక్కడికో మారు మూల మండలాలకు ట్రాన్స్‌ఫర్‌ అయితే ఆ నరకం చెప్పనలవి కానిది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం అవసరమా? అనే పరిస్దితుల్లో వున్నామని చాల మంది ఉద్యోగులు తెలిసిన వారి ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిస్ధితులను బట్టి మెదులుకోవాలి. నాయకుల తీరును బట్టి మసలుకోవాలి. ఉద్యోగ వర్గాలపై రాజకీయ నాయకుల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. రియల్‌ వ్యాపారం పెరిగిన తర్వాత మా కష్టాలు మాకు వున్నాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు వుంటుంది. ఆ సమయంలో ఇచ్చే దాన్ని తీసుకోకుండా వుండలేం. నాయకులు వచ్చిన పుణ్యానికి చేయకు? అంటారు. తీసుకుంటే పుణ్యానికి చేస్తున్నావా? అని నిలదీస్తారు. బాధితులు వచ్చి నానా బూతులు తిడుతుంటారు. అన్యాయం చేస్తున్నారని కేసులు పెడుతుంటారు. వాటన్నింటినీ ఈ వయసులో ఎదుర్కొనే శక్తి లేదు. పొరపాటో, గ్రహపాటో ఎదురైతే, పుసుక్కున ఏసిబికి చిక్కితే జైలు జీవితం అనుభవించలేం. అలాగని బలవంతంగా కొలువులు చేయలేకపోతున్నాం. వయసు మీద పడుతోంది. ఒత్తిడితో మానసిక ఆందోళలకు గురయ్యే పరిస్తితి వుంటోంది. రాజకీయ నాయకులు తర్వాత ఆదుకోవడం అంటూ ఏమీ వుండదు. వాళ్ల పని వారు చేయించుకొని వెళ్తారు. చేతులు దులుపుకుంటారు. పొరపాట్లు చేయించి, మాకేం సంబందం అంటారు. ఉద్యోగులను ఇరికిస్తుంటారు. వారికి ఆ స్వేచ్చ వుంది. ఉద్యోగులకు ఆస్వేచ్చ లేదు. చేతులు దులుపేసుకుంటా? చట్టం వదిలిపెట్టదు. ఎరక్కొపోయి, ఈ వయసులో ఇరుక్కోవడం ఎందుకు? అన్న ప్రశ్నలే వారి మెదల్లోలో మెదులుతున్నాయి. రిటైర్‌ మెంటు ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు ప్రబుత్వ ఇవ్వాల్సిన నిదులు ఇవ్వకపోయినా బాండ్లు ఇచ్చినా తీసుకుంటాం. అది ఐదేళ్లకు ఇచ్చిన సరిపెట్టుకుంటాం. కాని ఈ ఉద్యోగాలు మేం చేయలేం. పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించండని కోరుతున్నారు. హాయిగా రిటైర్‌ మెంటు తీసుకొని ముదిమి వయసులో ఎంతో కొంత సంతోషంగా వుంటామంటున్నారు. నాయకులు చెప్పే ప్రతి పనిని చేయలేకపోతున్నాం. కనికరించండి. విముక్తి ప్రసాదించండి? అని కొంత మంది అదికారులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్దితులను తాళలేక చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవ్‌లు పెట్టుకొని ఇంటి వద్ద వుంటున్నారు. ఎప్పుడు రిటైర్‌ మెంటు ఇచ్చినా సంతోషమే అంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రకటించినా ఆనందంగా తప్పుకుంటామంటున్నారు. చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవుల్లో వుండడం వల్ల, చాలా కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు బాద్యతలు నిర్వహిస్తున్నారు. రెండు మూడేళ్ల సర్వీసు వున్న ఉద్యోగులు కొలువులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పదేళ్ల కాలంగా గత ప్రభుత్వ పార్టీ నాయకులు చెప్పినవి చేయాల్సి వచ్చింది. పదేళ్లుగా అదికారంలో లేకపోవడంతో ఈ పార్టీ నాయకుల పనులు మళ్లీ చేయాలంటే చేయలేకపోతున్నారు. గతంలో ఏమేం చేశారో మాకు తెలుసంటూ ఈ పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు చేసినప్పుడు మేం చెప్పినట్లు ఎందుకు చేయరంటూ కోపం ప్రదర్శిస్తున్నారు. కాదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోవడం కన్నా, నాలుగు రోజులు హాయిగా బతకాలంటే రిటైర్‌మెంటు ఒక్కటే దారి అని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది అందరి ఉద్యోగుల మనోగతం మాత్రం కాదు. కొంత మంది రిటైర్‌మెంటుకు అతి సమీపంలోవున్న ఉద్యోగుల ఆవేదన మాత్రమే. వారి ఆందోళనలో న్యాయం వుందా? లేదా? అనేది వారు తేల్చుకోవాలి. ఇంత కాలం పనిచేసి, ఇప్పుడు తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమో కూడా వాళ్లే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా వ్యవస్ధలను అందరూ కలిసి భ్రష్టు పట్టించారన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. తమ దాకా వస్తే ముఖం చాటేస్తారన్నది వాస్తవం. తప్పుకొని తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందన్నది మరింత నిజం.

మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌

`అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం

`ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం

`అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు

`ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు

`నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు

`అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది

`త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది

`అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి

`ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు

`తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు

`చిన్న మిల్లర్లు తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు

`తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చు

`మిల్లర్‌కు సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం

`మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందొచ్చు

`ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

`నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు

`రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రైతుల వడ్లను మాయం చేసినట్లు ఆరోపణలున్న హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలుంటాయని సివిల్‌ సప్లయ్‌ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఆయన మాట్లాడుతూ ఎప్పటికైనా రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. త్వరలోనే చర్యలుంటాయన్నారు. నీతిగా చేయాల్సిన వ్యాపారంలో కొంత మంది అక్రమాలకు పాల్పడుతుంటారన్నారు. గతంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో,పై స్థాయి దాక వివరాలు అందకపోవడంతో వారి ఆటలు సాగాయి. దురదృమేమంటే కొంత మంది అధికారుల ప్రోద్బలం కూడా అక్కడక్కడ తోడవ్వడంతో అక్రమాలకు అవకాశం కలిగింది. కాని పరిస్థితులు మారాయి. ఎప్పటిలాగే ఇప్పుడూ తమ ఆటలు చెల్లుతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు చేసిన తప్పులే కాదు, గతాన్ని కూడా తవ్వి తీసే పని మొదలౌతుంది. హన్మకొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతోందన్నారు. ఇకపై రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసే మిల్లర్‌ను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు. రైతులను మోసం చేయడం చిన్న తప్పు అనుకుంటున్నారు. కానీ పెద్ద నేరమని తెలియక చేసినా? తెలిసి చేసినా శిక్షార్హులౌతారు. రైతులను మోసం చేసిన జగన్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి అధికారులుంటే ఒక్క వడ్ల గింజ కూడా మోసం జరగదన్నారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సునిశిత పరిశీలనా జ్ఞానాన్ని కమీషనర్‌ చౌహాన్‌ అబ్బురపడిపోయారు. అధికారులకేం తెలుసు అని కొంత మంది అక్రమ మిల్లర్లు ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. కానీ ఉద్యోగ నిర్వహనలో శాఖల్లో మెలకువలు తెలుసుకొని ముందుకెళ్లే అధికారులు కూడా వుంటారని రుజువైంది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులందరినీ కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. అధికారులు సమిష్టిగా, నీతి వంతంగా, కార్యదక్షత చూపిస్తే ఎంతో బాగుంటుందన్నారు. ఖమ్మం జిల్లా అధికారుల టీం వర్క్‌ భేష్‌ అన్నారు. అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శమయ్యారని కొనియాడారు. ఏ శాఖ ఉద్యోగులైనా సరే తమ కర్తవ్య నిర్వహణ ముఖ్యమని సూచించారు. ఇకపై అధికారులెవరైనా సరే అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇక నీతి, నిజాయితీ వ్యాపారం చేసే మిల్లర్లను అధికారులు ఎవరైనా వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వానికి అలాంటి మిల్లర్‌ తోడే అవసరమన్నారు. రైతులను మోసం చేసే వారిని పక్కన పెట్టుకొని, నీతిగా వ్యాపారం చేసే మిల్లర్లను ఇబ్బందుల పాలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైతే అక్రమ మిల్లర్లు ముద్రపడ్డారో, వారికి సహకరిస్తున్నారో అలాంటి వారి చిట్టా అంతా నా దగ్గర వుందన్నారు. త్వరలోనే కార్యచరణ వుంటుందన్నారు. అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి అనే విషయాన్ని వెలులోకి తెచ్చిన నేటిధాత్రి దిన పత్రికను చౌహాన్‌ అభినందించారు. ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు అన్నారు. ఇకపై తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న మిల్లర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని నేటిధాత్రి దృష్టికి వచ్చినా వివరాలు అందించాలని కోరారు. అంతే కాకుండా నా వద్దకు నేరుగా రాలేక, ఇబ్బందులు పడుతున్న వారిని మీరు చొరవ తీసుకొచ్చినా సరే అని నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు ఇకపై తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు అని కూడా కమీషనర్‌ స్పష్టం చేశారు. తన కార్యాలయానికి తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణలో వున్న మిల్లర్లందరికీ సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందవచ్చని సూచించారు. అధికారులెవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు తెలిపారు.

కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు.

కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

 

పరకాల నేటిధాత్రి

 

 

శుక్రవారం రోజున మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సునుఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.రైతులు,ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,సర్వేయర్ విజయ్ కుమార్,రేవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం.

జైపూర్ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ అంగన్వాడి కేంద్రం1లో ఫ్రీ స్కూల్ పిల్లలకి స్వాగతం పలుకుతూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.అలాగే విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపించి అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని సూచించారు.అంగన్వాడి కేంద్రంలో ఉచిత భోజనం,ఉచిత విద్య,ఉచిత వసతులను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మనోరమ,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,సూపర్వైజర్ కవిత,అంగన్వాడి టీచర్స్ సరిత,ఉమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

యాదవ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సమ్మేళనం…

యాదవ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సమ్మేళనం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి యాదవ సంఘం అధ్యక్షుడికి ఆత్మీయ సత్కారం చేసిన మండల యాదవ సంఘం నేతలు. తంగళ్ళపల్లి మండలం పాపాయి పల్లి గ్రామానికి చెందిన చేన్న వేణి. తిరుపతి యాదవ్ పాపాయిపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం ఆధ్వర్యంలోఎన్నికైన చిన్న వేణి తిరుపతి యాదవ్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మండల యాదవ సంఘం నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ. యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడికి తిరుపతికి సూచించిన మండల యాదవ సంఘం నాయకులు. తద్వారా ఆత్మీయ సత్కారం చేసిన యాదవ సంఘం మండల నాయకులకుఈ oదుకుగాను మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో యాదవ సంఘం మండల నాయకులు. బోట్ల ఐలయ్య యాదవ్. బండి దేవేందర్ యాదవ్. మహేష్ యాదవ్. జక్కుల కొమురయ్య యాదవ్. శ్రీకాంత్ యాదవ్ యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

బల్దియా కమిషనర్ గా పదవీ బాద్యతలు చేపట్టిన.

బల్దియా కమిషనర్ గా పదవీ బాద్యతలు చేపట్టిన చాహాత్ బాజ్ పేయి…

▪కమీషనర్ కు
శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది….

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

 

బల్దియా నూతన కమిషనర్ గా చాహాత్ బాజ్ పయ్ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టంచేసిన కమిషనర్ సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు తోడ్పడడంతో పాటు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానాన్ని, శానిటేషన్ విభాగం లో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య చెత్త తరలింపు జరిపే వాహనాలకు జీ పి ఎస్ అనుసంధానం , తదితర అంశాలను సంబంధిత విభాగాల అధికారులకు అడిగి తెలుసుకున్నారు.

Baldia Commissioner.

 

 

అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగర అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. అనంతరం బల్దియా లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Baldia Commissioner.

 

 

కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్)రాజేశ్వర్ సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ ,సిటీ ప్లానర్ లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్
పి ఆర్ ఓ ఆయుబ్ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, ఈ ఈ లు డి ఈ లు, ఆర్ ఓ లు ఆర్ ఐ లు తదితరులు ఉన్నారు

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

 

నస్కల్ గ్రామంలో
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని దళిత బహుజన ఫ్రంట్(డిబీఎఫ్)జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో డిబీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా హక్కుల పరిరక్షణకై ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించి,విద్య హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠ్యపుస్తకాలలో మహనీయుల జీవిత చరిత్రను పొందపరచాలని ప్రభుత్వ కళాశాలలో కూడా చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విద్యారంగ సమస్యల సాధన కోసం డిబిఎఫ్ ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సత్యం రెడ్డి తో పాటు ఉపాధ్యాయ బృందము పిల్లలు పాల్గొన్నారు తదితరులు పాల్గోన్నారు.

వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడతామని కొండా దంపతుల హామీ


కొండా సురేఖను కలిసిన వరంగల్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్

వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడతామని కొండా దంపతుల హామీ:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

వరంగల్ నగరంలో అండర్ రైల్వే గేట్ ప్రాంతం మురికి కాలువలతో, ముంపుకు గురి అవుతుందని, శాశ్వత పరిష్కారానికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారు అన్ని చర్యలు తీసుకున్నారని, .శాఖరాశికుంఠ 39 డివిజన్ లో అభివృద్ధికి పాటుపతనని హామీనిచ్చారనీ అన్నారు.
ఈ కార్యక్రమం లో కతేరాశాల వేణు గోపాల్, బాసాని శ్రీనివాస్, ముత్యాల విజయ్, రుకాంగ్రెస్ లీగల్ సెల్ చెర్మెన్ శామంతుల శ్రీనివాస్ మహిళా నాయకురాలు, రావుల విజయరాంచందర్, రాధిక, కవిత, మెడిది రజిత, తదితరులు పాల్గొన్నా

నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ.

— నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండల పరిధిలోని కే. వెంకటాపూర్ నూతన పోలింగ్ కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 1200 కు పైగా ఓటర్లు ఉన్నారని స్థానిక అధికారుల నివేదిక మేరకు నూతన పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమద్ లు ఉన్నారు.

పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు.

పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామ పరిధిలోని కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న జియో పెట్రోల్ బంకును గురువారం అధికారులు సీజ్ చేశారు. టిజిబిపాస్ అనుమతి లేకుండా చాలా రోజుల నుండి బంకు నిర్మాణం జరుగుతుండగా నిర్మాణాన్ని ఆపాలని గ్రామపంచాయతీ మూడు సార్లు ఇచ్చిన నోటీసులను బంకు యజమానులు బేఖాతరు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీఓ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ముంజంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మలత పంచాయితీ సిబ్బందితో బంకును సీజ్ చేయించారు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల శ్రీనివాస్ పదివేలు విలువ గల నోట్ బుక్స్ అందజేశారు. అట్టి నోట్ బుక్స్ పంపిణీ చేసిన రామడుగు మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ ముఖ్యఅతిథిగా హాజరై నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మాగ్రామ ప్రభుత్వ పాఠశాలకు గత సంవత్సరం నోట్ పుస్తకాలతో పాటు వంట పాత్రలు అందజేశారు. మాపాఠశాలకు ఇంత సేవ చేస్తున్నందుకు మాగ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుంట ఓంప్రకాష్, గుత్తూరి శ్రీనివాస్, పొన్నాల అజయ్, రవీందర్, లక్ష్మయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిన్నారి ని ఆశీర్వదించిన నాగుర్ల.

చిన్నారి ని ఆశీర్వదించిన నాగుర్ల
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ సాయి ఫంక్షన్ హాల్లో రంగాపురం మాజీ సర్పంచ్ కత్తి రాజయ్య గౌడ్ – శ్రీలత గార్ల మనవరాలు, కత్తి అఖిల రామకృష్ణ గార్ల కూతురు అద్వైత మొదటి పుట్టినరోజు కార్యక్రమానికి హాజరై చిన్నారి ని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు .. ఆశీర్వదించారు. వారి తో పాటు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు, మాజీ మార్కెట్ చైర్మన్ కొడారి రమేష్, నాయకులు రవీందర్ రావు, రాజేశ్వరరావు,రాజయ్య, భాస్కర్,దానయ్య, నరేష్,ప్రభాకర్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం…

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం…

వీణవంక సెక్టర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో హుజురాబాద్ ప్రాజెక్టు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలవేసి పూజ కార్యక్రమం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెక్టర్ సూపర్వైజర్ జి రమాదేవి హాజరై మాట్లాడుతూ, ప్రీ ప్రైమరీ పిల్లలకు అక్షరాభ్యాసం తో చదువు నేర్చుకోవడం ఆరంభం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసినందని, అంగన్వాడి కేంద్రాలలో ప్రీ ప్రైమరీ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించడంలో అంగన్వాడీ టీచర్లు సంసిద్ధతతో ఉన్నారని, అంగన్వాడీ కేంద్రాలు ఆలనా- పాలనా కేంద్రాలుగా పేరుగాంచాయని అన్నారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఏరియా సమీపంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసాన్ని ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ టీచర్లు, అంగన్వాడి టీచర్లు, తల్లులు, ప్రీ ప్రైమరీ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం

 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన

★ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ మరియు డ్రైవర్ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మాట్లాడుతూ అరుహులైన ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది.ఈ పథకం పేద ప్రజలకు నీడగా నిలవనుంది అని వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,ఏయంసి.డైరెక్టర్ జఫ్ఫార్,మాజీ ఎంపీటీసీ అశోక్,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,శుక్లవర్ధన్ రెడ్డి,ఖాజా,తదితరులు పాల్గొన్నారు.

కేజీబివిలో అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం.

కేజీబివిలో అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం.

స్పెషల్ ఆఫీసర్, ఎంఈఓ ప్రకటన..

నర్సంపేట నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (ఎంఎల్టి ) గ్రూపులో
తాత్కాలిక పధతిలో విద్యా బోధన చేయడానికి మహిళా విద్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాలలో టిజిసిఆర్టి ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి లకు గాను దరఖాస్తు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పీజీసిఆర్టి పోస్ట్ కు గాను అభ్యర్థి విద్య అర్హత ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ అర్హత ఉండాలి, ఎంఎల్టి పోస్ట్ కు గాను
ఎండి పాతాలోజి, బీఫార్మసీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంబిబిఎస్, బిహెచ్ఎంఎస్, పిజిడి క్లినికల్ బయో కెమిస్ట్రీ అర్హతలు గల అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను పాఠశాలకు నేరుగా వచ్చి ఈనెల 14 నుండి 18 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస రెడ్డి, ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ ఖాదిర్ షరీఫ్ లు అన్నారు. జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో రాష్ట్ర స్థాయిలో 1446 ర్యాంక్ సాధించిన బానోత్ సోమన్న, డైట్ సెట్ లో ప్రతిభ కనబరిచిన పరమేశ్వరి ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీను, కవిరాజు, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, యాకన్న, సతీష్, అనిల్ కుమార్, సుభాష్ అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version