రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం
◆:- రైతు బీమా – నమోదుకు 13.08.2025 చివరి తేదీ
◆:- మండల వ్యవసాయ అధికారి వెంకటేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని రైతులు రైతు బీమా గురించి కేవలం 4 రోజులు సమయం ఉన్నది
05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారుల వివరాలు మరియు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి అందిన ROFR పట్టు హోల్డర్ల వివరాలు ఆధారంగా పాత/కొత్త అర్హులైన రైతుల బీమా పునరుద్ధరణ/నమోదు జరుగుతుంది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్నవారు మాత్రమే అర్హులు.నమోదు కోసం రైతు తప్పక ఈ పత్రాలు ఒరిజినల్ మరియు జీరోక్స్ కాపీలను తీసుకురావాలి
1. రైతు ఆధార్ కార్డు
2. భూమి పట్టా పాస్‌బుక్
3. నామినీ ఆధార్ కార్డు
4. రైతు బీమా Enrollment ఫామ్
రైతు తప్పక హాజరు కావలెను.
(వాట్సప్ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ పంపుతాము మేము చాలా దూరంలో ఉన్నాము ఇంత తక్కువ సమయంలో మేము రాలేము అని దయచేసి భీమ చేయండి అని అడగొద్దు రైతు తప్పక వొచ్చి సంతకం చేయాలి.)
భూమి కలిగి ఇంకా రైతు బీమా నమోదు చేయని రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల రైతు వేదిక ఆఫీసర్ లో వద్ద అందుబాటులో ఉన్నాయి. దయచేసి సంప్రదించండి.