వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత.

సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పశువులకు పాల దిగుబడి తగ్గకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అలాగే ఆసుపత్రులు అందుబాటులో లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే గర్భకోశ వ్యాధులు ఎక్కువగా ఎదురవుతున్నందున రైతులు ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో పశువులకు వైద్యం నిర్వహించాలని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నందున బొత్త వాపు గాని జబ్బ వాపు గాని రావడం జరుగుతుందని సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు పశువులపై ప్రత్యేక దృష్టి కేటాయించి ఇటువంటి వైద్య శిబిరాలకు తీసుకువచ్చి తగిన వైద్యం తీసుకోవాలని రైతులకు సూచించారు అలాగే గ్రామంలో రైతులందరికీ పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారుఇట్టి ఉచిత పశు వైద్య శిబిరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ డైరెక్టర్లు నక్క నరసయ్య దుబాల వెంకటేశం భరత్ గౌడ్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం.

తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం

 

మాల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 29:

 

మాల్కాజిగిరి నియోజికవర్గం, మౌలాలీ డివిజన్‌లో బత్తిని నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పాత సఫిల్‌గూడ దర్గా మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు రామ్ మోహన్పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని నరసింహ గౌడ్, చింతల నరేష్ ముదిరాజ్, ప్రణయ్ చంద్ర, వెంకటరమణ, బాలరాజ్ యాదవ్, అంజిరెడ్డి, డా. కృష్ణ, జీలా రాములు, రమణయ్య, పరమేశ్, మౌలాలీ, అన్వేష్, అవినాష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

శని అమావాస్య సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ లోని శనీశ్వర ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వర విగ్రహానికి తైలాభిషేకాలను చేశారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని 1008 అవధూత గిరి మహారాజ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల కోసం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష.

మందమర్రి మున్సిపల్ ఎన్నికల కోసం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష

 

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో,మందమర్రి మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించలని.

Elections

మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది.

Elections

అలాగే మందమర్రి లో పాలకవర్గం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, అలాగే పాలకవర్గం లేక ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని జేఏసీ నాయకులు తెలియ చేయడం జరిగింది, మున్సిపల్ ఎన్నికలు జరిగేంత వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ ఎన్నికలు సాధన కమిటీ సభ్యులు ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

ముందస్తుగా ఉగాది వేడుకలు.

ముందస్తుగా ఉగాది వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు బండి ఉపేందర్ ఉగాది పర్వదినమున సకల శుభాలకు నిలయం అలాగే ఉగాదినాడు అడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి మానవుని జీవిత గమనంలో కష్టసుఖాలన్ని మర్చిపోయి ఉగాది పచ్చడి లాగా అన్నిటిని సమానంగా స్వీకరించినప్పుడే మనం మోనగలుగుతామని తెలియజేశారు విద్యార్థుల భావి జీవితంలో గెలుపు ఓటములనుసమానంగా స్వీకరించి ముందడుగు వేయాలని. తెలియజేసి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం బూ ట్ల శ్రీనివాస్ పలుమార్ తిరుపతి గట్టు శ్రీకాంత్ ఆవదాల జ్యోతి రాణి ఎలిగేటి శ్రీనివాస్ రామ్ ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి.

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీ పూరికి వెళ్లే దారిలో. తంగళ్ళపల్లి లక్ష్మీపూర్ గ్రామాల మధ్య సండ్ర వాగుపై బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి పైనుండి నిత్యం సిరిసిల్ల నుండి ఇల్లంతకుంట వరకు వాహనాలు ఎక్కువ తిరుగుతుంటాయి అలాగే బ్రిడ్జి ప్రక్కన అటు ఇటు కంకర వల్ల వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ దారిలో వెళ్లే ద్విచక్ర వాహనాలకు నిత్యం పంచర్ అవ్వడం జరుగుతున్నందున దారిన పోయే వారికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని దయచేసి సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి కంకర తీసి వేయించి మట్టి అయినా లేదా దానిపై దాంబర్ రోడ్డు అయినా వేయగలరని ప్రజలు కోరుకుంటున్నారు దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ.

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

సిరిసిల్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘం తంగళ్ళపల్లి మండలరైతులకు అన్ని రకాలుగా వ్యవసాయ రుణాలు కానీ సంబంధిత పంటల అవసరాలకు రైతులకు సహకార సంఘం ఎంతో ఉపయోగపడుతుందని. మండలంలో ఉన్న రైతులందరూ సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇప్పటిదాకా జరిగిన వాటిని రైతులకు ప్రజలకు వాటి గురించి వివరంగా వివరించారు సహకార సంఘానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఖర్చయితున్నాయి తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడిపించడం జరుగుతుందని. దీనిలో వచ్చే ఆదాయం ఎంత దాని గురించి కూడా సంఘం అభివృద్ధిలో కలుపుతున్నామని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధిపై మండల రైతులు మీరు కూడా పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణ రెడ్డి డైరెక్టర్లు బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు రైతులు సహకార సంఘం సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం.

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపిటిసి రాము మాట్లాడుతూ. నేను పార్టీలు మారిన ప్రజల సంక్షేమం కోసం మారిన కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు .నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి చర్చకు సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందo పొందాలని కుట్రలు మానుకోవాలని నిజా నిజాలు తెలుసుకొని రుజువు చేయాలని ఆధారాలు ఉంటే చర్చకు రావాలని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదిక గా పోస్టులు పెట్టడం నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానని నా గురించి నా గ్రామ ప్రజలకు నా గురించి తెలుసు తెలుసు అని. మీ ప్రభుత్వ హాయంలో పేదలు ప్రజల భూములను అన్యాయం గుంజుకొని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా. మరోసారి నాపై అసత్య ఆరోపణ చేస్తే సహించేది లేదు ఇకనైనా నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి ఎక్కడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తమపై ఆరోపణలు చేసిన వారికి తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ భరత్ గౌడ్ జలంధర్ రెడ్డి చరణ్ యాదవ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దొంతికి మంత్రిపదవి రావాలని మోకాళ్ళ నడకతో దర్శనం.

దొంతికి మంత్రిపదవి రావాలని మోకాళ్ళ నడకతో దర్శనం.

 

కొమ్మాల దేవాలయం మెట్లపై కాంగ్రెస్ నాయకుల వినూత్న ప్రయాణం.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ దుగ్గొండి మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో
గీసుకొండ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గుట్టపైకి మెట్ల నుండి మోకాళ్ళ నడకతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

Congress

మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీలు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తెచ్చిన ఘనత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సాంస్కృతిక అధ్యక్షులు గుండెకారి సునీల్,నాచినపల్లి గ్రామ యూత్ అధ్యక్షులు ఇజ్జగిరి నరేష్,
మహ్మదాపురం గ్రామ యూత్ అధ్యక్షులు ఆడెపు అనిల్,మండల యూత్ నాయకులు బండారి ప్రకాష్ గారు,కూరతోట సురేష్ గారు,మునుకుంట్ల నాగరాజు,భూక్య గోపి,దండు రాజేందర్,మ్యాక అశోక్,గంగారపు శ్రీకాంత్,కొమాకుల రఘుపతి,బూర్గుల రాజబాబు,ఇజ్జగిరి యశ్వంత్ లు పాల్గొన్నారు.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజురమేష్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి మండల పరిసరప్రాంత ప్రజలకు విశ్వవసు నామ నూతన తెలుగుసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతమని ఇది హిందూ చాంద్రమాన పంచాంగ ప్రకారం సంవత్సరంలో తొలి రోజని ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంతో భక్తి,శ్రద్ధలతో జరుపుకుంటారని కొత్త ఆశయాలతో,కొత్త సంకల్పాలతో జీవన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేసి జీవితం లోని ఆరు రుచులను ఆస్వాదిస్తూ. బంధుమిత్రులతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలని ఈ పండుగ సందర్బంగా నూతన ఉత్సాహాన్ని,శుభ ఫలితాలను అందిస్తుందన్నారు.ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం ఆనవాయితీ. శుభ కార్యాలు ప్రారంభించేందుకు ఇది అత్యుత్తమమైన సమయమని ఉగాది సందేశం. కొత్త ఆరంభాలకు,పండుగ రోజు మనం చేసే ప్రతి పని మనకు సంతృప్తిని అందిస్తుందని ఈ ఉగాది మీ జీవితాన్ని ఆనందం,ఆరోగ్యం,శాంతితో నింపాలి కొత్త సంవత్సరం మీకు విజయాలు,సంతోషాన్ని తీసుకురావాలని కోరారు.

రామయంపేటకు చేరిన సన్న బియ్యం..

రామయంపేటకు చేరిన సన్న బియ్యం..

రామాయంపేట మార్చి 29 నేటి ధాత్రి (మెదక్)

 

సన్న బియ్యం రేషన్ షాపుల్లో ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా రామయంపేట మండలానికి సంబంధించి సన్న బియ్యం గోదాములకు రావడం జరిగింది. రామాయంపేట, నిజాంపేట, చిన్న శంకరంపేట మండలాల్లో 68 రేషన్ దుకాణాలు ఉండగా 6500 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రల వద్ద పటిష్ట బందోబస్తు..

పరీక్ష కేంద్రల వద్ద పటిష్ట బందోబస్తు..

 

రామాయంపేట మార్చి 29 నేటి ధాత్రి (మెదక్)

 

పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద రామాయంపేట పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కాకుండా ఎవరు వచ్చిన లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. మాస్కాపింగు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల మాస్ కా పింకు అవకాశం ఉండదని మంచి లక్ష్యంతో చదువుకొని ఉత్సాహంగా పరీక్షలు రాసే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ షాక్ తగిలి వృద్ధుడు మృతి..

విద్యుత్ షాక్ తగిలి వృద్ధుడు మృతి..

 

రామాయంపేట మార్చి 29 నేటి ధాత్రి(మెదక్)

 

 

రామయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద దేవాలయాన్ని శుభ్రం చేస్తుండగా పక్కన స్తంభానికి ఉన్న సపోర్ట్ వైర్ తగిలి గ్రామానికి చెందిన కిచ్చయ్య గారి మాధవరెడ్డి (73) మృతి చెందడం మాధవరెడ్డి తో పాటు అతని భార్య భారతమ్మ ప్రతిరోజు దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటారు.సుమారు 15 సంవత్సరాలుగా ఇద్దరు దంపతులు హనుమాన్ దేవాలయానికి సేవ చేస్తూ జీవనం గడుపుతుంటారని గ్రామస్తులు తెలిపారు. మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం.

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటికొండ వీరస్వామి

కమలాపూర్, నేటిధాత్రి :

 

రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని కమలాపూర్ మండలం భీంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ముందస్తుగా విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ వీరస్వామి మాట్లాడుతూ విద్యా సంవత్సరం చివర్లోనే తల్లిదండ్రులు,యువత, ప్రజాప్రతినిధులను కలవడం ద్వారా ముందుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తే,వచ్చే ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.అందుకే ఈ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టామన్నారు.పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను వివరించేందుకు,అలాగే ఉపాధ్యాయ బృందం విద్యార్హతలను తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని ముద్రించి మండల విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరించారు.గత వారం రోజులుగా ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు, యువతతో సమావేశమై, వారికి కరపత్రాలను అందజేస్తూ,తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు గట్టి పునాది వేస్తామనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నారు.తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయ బృందం సమావేశం నిర్వహించనుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు మార్గదర్శకమని మండల విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డారు.భీంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వాణి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ రెడ్డి,బి.జోత్స్న, కె.సుజాత అంగన్వాడీ టీచర్ ఏ.వరలక్ష్మి,ప్రీ ప్రైమరి టీచర్ కె.పూజిత,తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక.

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మండలం పెనుగొండ గ్రామపంచాయతీ లోని కట్టు గూడెం ఎం పి పి ఎస్ పాఠశాలలో శనివారం ముందస్తు విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షమీం, ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు సంప్రదాయ ప్రకారం తెలుగు సంవత్సరముగా మరియు కొత్త సంవత్సరం ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు ప్రజలు చాలా సాంప్రదాయ పద్ధతిలో మొదటి పండగగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ఉగాది పండగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అలాగే తెలుగు నూతన సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా పంచాంగం ప్రకారం నెలలను మాసాలతో తిధులతో మంచి రోజులను చూసుకుంటారని అలాగే శుభ ముహూర్తాలను ఈ పంచాంగం ద్వారానే నిర్ణయిస్తారని విద్యార్థులకు వివరించారు. అలాగే ఈ విశ్వా వసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం.

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం

 

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

సిరిసిల్ల జిల్లా లోని మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వా వసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం సినారే జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగినది. సభాధ్యక్షులుగా కందేపి రాణి ప్రసాద్ ముఖ్యఅతిథిగా నాగుల సత్యనారాయణ విశిష్ట అతిథిగా జూకంటి జగన్నాథం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మడూరి అనిత రచించిన కవితా సంపుటిని జూకంటి జగన్నాధం గారు ఆవిష్కరించారు. రచయితకు పలువురు అభినందనలు తెలిపారు.
జూకంటి జగన్నాథం గారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కవి ప్రతిస్పందన ఉండాలి. తద్వారా ప్రజాస్వా సమస్యల ఉనికిని చాటుతూ కవిత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని అన్నారు.

Ugadi

సభాధ్యక్షులు కందేపు రాణి ప్రసాద్ గారు మాట్లాడు ప్రజలు పర్యావరణాన్ని నష్టం చేయకుండా ఉండాలి.సామాజిక స్తాయి పురోగతి మరియు వ్యక్తిగత శాంతి సాధన కొరకు ప్రేరణ ఇవ్వాలి. సాహితీ రంగంలో మహిళలు రాణించాలని కోరారు. మారసం అధ్యక్షులు tv నారాయణ,కార్యనిర్వాక అధ్యక్షులు యేలగొండ రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్
మారసం సభ్యులు అంకారపు రవి,దూడం గణేష్, చిటికెన కిరణ్ కుమార్, మాడూరి అనిత, సభా నిర్వహణ శ్రీమతి, వందన సమర్పణ ఇడెపు సౌమ్య చేసారు. కవులు బూర దేవానందం, కామారపు శ్రీనివాస్, కరుణాకర్, పాలి, భాగ్యలక్ష్మి,,నరసింహులు,దేవయ్య, వెంకటరెడ్డి విద్యార్థులు లక్షణ అక్షిత సాయి సురేష్ సృజన్ కుమార్ అంగల శ్రీవాణి కవిత గానం చేశారు

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదల అండ.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదల అండ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

బొమ్మెర గ్రామానికి చెందిన బెల్లంకొండ సోమయ్య కరెంట్ షాక్ తో మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి, దాత కాటబత్తిని లలిత జన్మదినం సందర్భంగా 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు కూరగాయలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, సభ్యులు తాళ్లపల్లి రత్నాకర్, పెండ్లి భాస్కర్, మృతుడి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ సారంగపాణి సేవలు అభినందనీయం.

డాక్టర్ సారంగపాణి సేవలు అభినందనీయం

 

కరకగూడెం ఎంఈఓ గడ్డం మంజుల

 

20 వేల విలువచేసే ట్రాక్ సూట్ రేగళ్ల పాఠశాలకు అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

 

 

కరకగూడెం మండలం రేగళ్ల ఎంపీపీఎస్ స్కూల్ లో ఈరోజు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన కరకగూడెం మండల విద్యాధికారి గడ్డం మంజుల మాట్లాడుతూ విశ్రాంత ఆయుర్వేద కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సారంగపాణి 20వేల విలువ చేసే ట్రాక్ సూట్ ను విద్యార్థులకు అందజేయడం మారుమూల ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంత విద్యార్థుల మేధస్సును పెంచేలా వారి కృషి అభినందనీయం అన్నారు. బట్టుపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి. మోహన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ బడులని పరిరక్షించుకునే చర్యలలో భాగంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల కృషి , మరియు గ్రామస్తులకు కృషి ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందని, అందుకోసం ఇంకా దాతలు డాక్టర్ సారంగపాణి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరారు. జన విజ్ఞాన వేదిక స్టేట్ కల్చరల్ సెక్రటరీ డాక్టర్ లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ, ఒక్కసారిగా పిల్లలందరూ ట్రాక్ సూట్ వేసుకొని గ్రౌండ్లోకి రాగానే కళ్ళు చెమ్మగిల్లాయని , ఇలాంటి అవకాశము ఉపయోగించుకునీ విద్యార్థులు ముందుకు సాగాలని కోరారు. ఆయుష్ యోగా శిక్షకులు యోగి రాంబాబు విద్యార్థులకు గంటన్నర పాటు యోగా శిక్షణ అందించి, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం యోగా తరగతులు స్వచ్ఛందంగా పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరన్న, గ్రామ పెద్దలు పాయం నాగేశ్వరరావు , పాయం శ్రీనివాస్ , బాలకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి

 

పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యాలు ఇర్ప రాజేష్

 

గుండాల (భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

స్థానిక శెట్టిపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు సెంటర్లో భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ 94వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరప రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, బ్రిటిషన్ల పై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేశారని.ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం.
దేశ స్వాతంత్య్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది.భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారని తన తాత వల్ల భగత్ సింగ్ ఎంతో ప్రభావితం అయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పేనక సూర్యం, ఢిల్లీ రాంబాబు, ఏర్ప శ్రీను,ముచ్చ మధు, బండారి కోరమల్లు,మచ్చ శ్రీకాంత్, కల్తీ బుచ్చి రాములు, సీడం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,సిబ్బంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్నెపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు కాలమానం ప్రకారం 60 సంవత్సరాల క్యాలెండర్ ఉంటుందని అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరమని అన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి తెలుగు వారు షడృచులతో పచ్చడి తయారు చేస్తారు. భక్ష్యాలు అనే ప్రత్యేక పిండివంటలు తయారుచేసి కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకోవడం తెలుగు వారి ఆనవాయితి అని,ప్రతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునే గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version