మాదారంలో విప్లవ వీరులు భగత్ సింగ్ కు ఘన నివాళి. కొవ్వొత్తుల ప్రదర్శన.

మాదారంలో విప్లవ వీరులు భగత్ సింగ్ కు ఘన నివాళి. కొవ్వొత్తుల ప్రదర్శన.

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాటాల్లోకి రావాలి.

ఎన్ వి రాకేష్ పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు.

కారేపల్లి నేటిధాత్రి

భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవ కెరటాలు భగత్ సింగ్ రాజ్‌గురు సుఖ్‌దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంఘాలు పి వై ఎల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సింగరేణి మండలం మాదారం గ్రామంలో కొవ్వొత్తులతో భగత్ సింగ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ ఏఐయూకేఎస్ డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్ అరుణోదయ జిల్లా నాయకులు వేములపల్లి వీరన్న లు మాట్లాడుతూ.
దేశ విముక్తి కోసం అతి చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ రాజ్‌గురు సుఖ్‌దేవ్‌ల త్యాగాలు అజరామరమని కొనియాడారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నేటి యువత వారి ఆశయాలను అందిపుచ్చుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దోపిడీ లేని సమాజం కోసం పోరాడటమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ నాయకులు కోయిల ఉమామహేష్ కుమ్మరికుంట్ల నరేష్ కల్తి లక్ష్మీనారాయణ తాటి కృష్ణ వేములపల్లి రమేష్ తిరుమలగిరి ప్రసాదు పూనం శ్రీను ఈసం రాంబాబు కోయిల వెంకన్న సేవగాని నవీన్ తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ ఆశయ సాధనకై పోరాడాలి

భగత్ సింగ్ ఆశయ సాధనకై పోరాడాలి

నడికూడ,నేటిధాత్రి:

భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పోరాడాలని సిఐటియు నడికూడ మండల కన్వీనర్ పల్లె రామన్న పిలుపునిచ్చారు
ఈరోజు 95వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో బ్రిటిష్ వారి దాస్య శుంకాల నుండి విముక్తి కోసం భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవులు నవ్వుతూ ఉరికంబాలు ఎక్కారని ఆయన గుర్తు చేశారు.ఒక దేశం మరొక దేశాన్ని ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేయని సమాజం నిర్మాణం కావాలని ఆయన కాంక్షించాలని ఆశయ సాధనకు పోరాడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివ్వాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సుధాకర్, యుగేంధర్,మారబోయిన సురేందర్,కుమ్మరి సాంబయ్య,కడివెండి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి

 

పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యాలు ఇర్ప రాజేష్

 

గుండాల (భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

స్థానిక శెట్టిపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు సెంటర్లో భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ 94వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరప రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, బ్రిటిషన్ల పై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేశారని.ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం.
దేశ స్వాతంత్య్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది.భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారని తన తాత వల్ల భగత్ సింగ్ ఎంతో ప్రభావితం అయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పేనక సూర్యం, ఢిల్లీ రాంబాబు, ఏర్ప శ్రీను,ముచ్చ మధు, బండారి కోరమల్లు,మచ్చ శ్రీకాంత్, కల్తీ బుచ్చి రాములు, సీడం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version