బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మించిన భారీ డ్యామ్ ఇప్పుడు ఆసియా ఖండంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారత్‌లో ఈ ప్రాజెక్టును నీటి యుద్ధానికి పునాదిగా భావిస్తున్నారు.

తిబెట్‌లోని మెడోగ్ ప్రాంతంలో యర్లంగ్ జంగ్‌బో నదిపై చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ — భారత్‌లో బ్రహ్మపుత్రగా ప్రసరిస్తుంది — ప్రస్తుతం ప్రారంభ దశలోకి వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటిగా దీనిని చైనా ప్రకటిస్తోంది.

అసలు సమస్య ఏంటి?

ఈ డ్యామ్ నిర్మాణం భారతదేశానికి, ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆందోళనకరమైన పరిణామాలను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నది తిబెట్‌లో జన్మించి, భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చైనా ఎప్పుడు ఎంత నీటిని నిలుపుతుంది, ఎంత నీటిని విడుదల చేస్తుంది అన్న దాని గురించి భారత్‌కు ముందుగానే సమాచారం ఉండదు.

ఈ విషయం వరదలకూ, కరవులకూ కారణమవుతుంది. అనేక మంది విశ్లేషకులు చైనా ఉద్దేశపూర్వకంగా నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశాన్ని ఖండించడం లేదు. ఇది నీటి ఆధిపత్యానికి చైనా ప్రయత్నంగా చూస్తున్నారు.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ డ్యామ్ వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోని మానవ జీవితం, వ్యవసాయం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వరదల ముప్పు పెరగొచ్చు. మరోవైపు, కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది.

ముఖ్యంగా, చైనా ముందుగా సమాచారం ఇవ్వకుండా భారీగా నీటిని విడుదల చేస్తే, ఆ ప్రాంతాల్లో ప్రజలపై భారీ విపత్తుల ప్రభావం ఉంటుంది.

ప్రభుత్వ స్పందన:

భారత ప్రభుత్వం ఇప్పటికే చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య 2002లో “ట్రాన్స్ బౌండరీ రివర్స్” పై ఓ ఒప్పందం ఉన్నా, ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం, చైనా ఏదైనా చర్య తీసుకునే ముందు భారత్‌కు సమాచారం ఇవ్వాలి.

నిపుణుల హెచ్చరిక:

ఈ ప్రాజెక్ట్ ఒక సాధారణ విద్యుత్ ప్రాజెక్ట్ కాదని, ఇది భవిష్యత్తులో జల రాజకీయాల పేలుడు బిందువుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆధిపత్య ప్రయత్నాన్ని భారత్ నిర్లక్ష్యం చేయకూడదని, నీటి భద్రతపై భారత ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజురమేష్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి మండల పరిసరప్రాంత ప్రజలకు విశ్వవసు నామ నూతన తెలుగుసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతమని ఇది హిందూ చాంద్రమాన పంచాంగ ప్రకారం సంవత్సరంలో తొలి రోజని ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంతో భక్తి,శ్రద్ధలతో జరుపుకుంటారని కొత్త ఆశయాలతో,కొత్త సంకల్పాలతో జీవన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేసి జీవితం లోని ఆరు రుచులను ఆస్వాదిస్తూ. బంధుమిత్రులతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలని ఈ పండుగ సందర్బంగా నూతన ఉత్సాహాన్ని,శుభ ఫలితాలను అందిస్తుందన్నారు.ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం ఆనవాయితీ. శుభ కార్యాలు ప్రారంభించేందుకు ఇది అత్యుత్తమమైన సమయమని ఉగాది సందేశం. కొత్త ఆరంభాలకు,పండుగ రోజు మనం చేసే ప్రతి పని మనకు సంతృప్తిని అందిస్తుందని ఈ ఉగాది మీ జీవితాన్ని ఆనందం,ఆరోగ్యం,శాంతితో నింపాలి కొత్త సంవత్సరం మీకు విజయాలు,సంతోషాన్ని తీసుకురావాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version