భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి

 

పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యాలు ఇర్ప రాజేష్

 

గుండాల (భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

స్థానిక శెట్టిపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు సెంటర్లో భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ 94వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరప రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, బ్రిటిషన్ల పై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేశారని.ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం.
దేశ స్వాతంత్య్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది.భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారని తన తాత వల్ల భగత్ సింగ్ ఎంతో ప్రభావితం అయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పేనక సూర్యం, ఢిల్లీ రాంబాబు, ఏర్ప శ్రీను,ముచ్చ మధు, బండారి కోరమల్లు,మచ్చ శ్రీకాంత్, కల్తీ బుచ్చి రాములు, సీడం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయండి.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ*

నర్సంపేట,నేటిధాత్రి:

 

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితాడును ముద్దాడిన యువ కిశోరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.పిడిఎస్యు, పివైఎల్, సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు 94 వ వర్ధంతి వారోత్సవాలను జరపాలని పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి నిరుద్యోగులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఈపి 20-20 మరియు యుజిసి ముసాయిదాలను రద్దు కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన ఇతర కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేతకు పోరాడాలని కోరారు.నేడు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టి కృష్ణ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భోగి సారంగపాణి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు పూలక్క,గుగులోతు భద్రాజి భీమగాని మల్లయ్య,బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version