పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం మండలం పెనుగొండ గ్రామపంచాయతీ లోని కట్టు గూడెం ఎం పి పి ఎస్ పాఠశాలలో శనివారం ముందస్తు విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షమీం, ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు సంప్రదాయ ప్రకారం తెలుగు సంవత్సరముగా మరియు కొత్త సంవత్సరం ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు ప్రజలు చాలా సాంప్రదాయ పద్ధతిలో మొదటి పండగగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ఉగాది పండగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అలాగే తెలుగు నూతన సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా పంచాంగం ప్రకారం నెలలను మాసాలతో తిధులతో మంచి రోజులను చూసుకుంటారని అలాగే శుభ ముహూర్తాలను ఈ పంచాంగం ద్వారానే నిర్ణయిస్తారని విద్యార్థులకు వివరించారు. అలాగే ఈ విశ్వా వసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.